అధర్వ వేదం లో ”వ్రాత్య ”
అధర్వ వేదం
అధర్వ వేదం గురించి ఒక అపప్రధ వుంది .ప్రకృతి శక్తులకు భయ పడ్డమానవుడు ,వాటి బారి నుంచి రక్షించు కోవటానికి ,లేక పొతే ,వాటిని కొంత వరకైనా నియంత్రించ టానికి ఉపయోగించిన మంత్రాలు అని భావించటం .ఆ శక్తులు -రోగాలు ,రోస్టులు కలిగించే వట .ఈ భావాలు ఆ నాటి అన్ని వర్గాల ప్రజల్లో వ్యాపించి ఉండేవి .అధర్వ వేదం లో ,ఈ రోగాల నుండి విముక్తి కల్గించమని ,చేసే ప్రార్ధనలు వున్న మాట నిజమే .దీనితో బాటు శరీరం లోపలి ,బయటకు వాడే చికిత్చావిధానం కూడా వుంది .అనేక మూలికల వివరాలు ,వాటిని వైద్యం లో వాడే విధానాలూ వున్నాయి .అంధ కారం లో వుండే ”యాతులు ”మొదలైన భూతాలు ,దెయ్యాల్ విషయాలూ అందులో వున్నాయి .అంత మాత్రం చేత ,అధర్వ వేదం అంటే ,ఇవి మాత్రమే అనుకొంటే పొర బాటు .ఆ మాట కొస్తే ఋగ్వేదం లోనూ ,ఈ భావనలు వున్నాయి .ఋగ్వేదం లోని చివరి మండలం లో వున్న 30 శ్లోకాలు,అధర్వ వేదం లో వున్న వాటి లాంటివే .వీటిలో ,సామాన్య మానవుల ఆశయాలు ,ఆశలు ,భయాలు వున్నాయి .ఏ వేదం లో నైనా ,తనకు ,తన కుటుంబానికి ,సమాజానికి ఉన్నతిని కలిగించే ప్రయత్నాలు వున్నాయి అని మరచి పోవద్దు .
ఋగ్వేద సమాజం కంటే ,అధర్వ వేద సమాజం లో ,భయాందోళనలు ఎక్కువ .వాటిని పోగొట్టు కొనే ప్రయత్నాలు కన్పిస్తాయి .అందుకనే ,కొంత న్యూనత ,తక్కువ స్థాయి కన్పిస్తుంది .అయితే ఇవి మిగిలిన వేదాలకు పరస్పర పూరకాలు గా అని పిస్తాయి .పాశ్చాత్త తత్వ వేత్త” గ్రిఫిత్” అధర్వ వేదం అంటే ,మంత్రాలు ,తంత్రాలు అని మాత్రమే భావించాడు .వీటికి ”చేత బడులు ”అని ముద్ర కూడా వేశాడు .అయితే ఇది పాక్షిక మైన ద్రుష్టి మాత్రమే .అధర్వ వేదం చాలా సంపూర్ణ మైనదే.అందులో ఆధ్యాత్మ భావ సంపద అనంతం గా నే వుంది .అంతే కాదు ,యోగం ,వేదాంతం లోని ఉత్కృష్ట భావ పరంపర వుంది .రుక్ ,యజుర్ వేదాలలో ఏ ప్రామాణిక విషయాలు వున్నాయో ,ఇందులోనూ అవే వున్నాయి .పాశ్చాత్యులకు అధర్వ వేదం లోని ”పృధ్వీ శూక్తం ”కని పించలేదు లేక పోతే వాళ్ల కళ్ళకు ఆని వుండదు .నిజంగా ”పృధ్వీ శూక్తం ”భారత జాతీయ గీతం .అంతటి మహత్తర మైనది ,మహిమాన్విత మైనది వేరేది లేదు .దేశం పై ప్రేమ ,ఆరాధనా ఆనాడే కన్పించింది .దేశభక్తి అధర్వ వెద కాలమ్ లోనే సుప్రతిస్టిత మైంది కనుకే పృధ్వీ శూక్తం చెప్పారు .ఈ సూత్రాన్ని గ్రిఫిత్ పండితుడు పట్టించుకోలేదు .చాలా తేలిగ్గా తీసుకొన్నాడు .అసలు పాశ్చాత్య భావన లో అధర్వ వేదం వేదమే కాదు .ఇది మరీ దారుణం .
పేరు లోని పెన్నిధి
”త్రయి ”అంటే ,రుగ్ ,యజ్ర్ సామ వేదాలు అనే భావం మనందరిలో ను వుంది .ఉదాహరణకు ”పురుష సూక్తం ”ను తీసుకొంటే ,అందులో అధర్వ వేద ప్రశక్తే కని పించదు .అంతే కాదు ,అధర్వాన్ని ”అధర్వాంగీరస ”అని పిలిచారు .అంటే అధర్వ ను ,ఆంగీరసులు కను గోన్నారని అర్ధం .అతి ప్రాచీన కాలమ్ లోని రుషి పరంపర లోని వారే అధర్వ ,ఆంగీరస మహర్షులు .నిజం చెప్పాలంటే ,దేవతాగ్ని ని భూలోకాగ్ని గా (లౌకికాగ్ని )గా ,స్థాపించిన వారే అధర్వులు .పార్శీల అగ్ని హోత్ర మంత్రాలలో ,”అత్రిపాన్ ”అనే మాట కని పిస్తుంది .కనుక దీని ప్రాచీనతకు ఈ ఒక్క నిదర్శనం చాలు .ఈ అధర్వాన్గీరసమే అధర్వ వేదం గా రూపొందింది .ఈ రుషి పరంపర ,వారి గోత్రీకుల వల్ల వ్యాపించిన వేదమే అధర్వ వేదం .”కొన్ని శతాబ్దాల సంఘర్షణ జరిగి ,ఈ వెద మంత్రాలు స్థిరత్వం పొందాయి”అన్న పాశ్చాత్య భావనకు విలువే లేదు .అది పూర్తి అసత్యమైన మాటే.
అధర్వ వేదానికి ”బ్రహ్మాంగీరస ”అనే పేరు కూడా వుంది .దీనినే ”బ్రహ్మ వేదం ”అంటారు .శూక్ష్మం గా ”బ్రహ్మ” అంటారు .ఆ మంత్రాలన్నీ ,బ్రహ్మ తో ,అనుసందింప బడటమే ”బ్రహ్మ”అనే పేరు రావటానికి కారణం అయింది .యజ్ఞం లో హోత ,అధ్వర్యుడు ,ఉద్గాత ,బ్రహ్మ అనే నలుగురు తప్పక వుంటారు. వీరినే ”చతుర్ముఖీయం ”అంటారు .రుగ్ ,యజు ,సామాలు మిగిలిన వారు పలికేవి .అందుకనేఈ కాండ లో ”బ్రహ్మ ”అనే పదాన్ని ,ఆ అర్ధం తో వాడారు .ఈ పేరు సార్ధకం కావటానికి కారణం –క్రమ పధ్ధతి లో ,బ్రహ్మ విద్య పై ,విషయ వివరణ తో కూడిన విధానం ఉండటమే .ఇంత విజ్ఞాన పరం గా ,ఏ వేదం లోను ,వ్యక్తం చేయ బడ లేదు .మిగిలిన మూడు వేదాల లోని మంత్రాలతో ,ఈ వెద మంత్రాలు కలిసి పోయాయి .
అయితె వేద వ్యాస మహర్షి వేద విభజన చేసి దీనిని అధర్వ వేదం గా పేర్కొన్నాడు .అందుకే అధర్వ ,ఆంగీరస మంత్రాలు ఒక ప్రత్యెక ఉనికి కలిగి ,మార్గ దర్శనం చేస్తాయి .కొన్ని మంత్రాలు ,శతాబ్దాల చరిత్ర లో మిగిలిన వేదాల్లో కలిసి పోయాయి .వ్యాసుల వారు వాటి నన్నిటిని కలిపి ఒక భాగం గా చూపించారు .అప్పటికే ఆ మంత్రాలు అధిక ప్రాముఖ్యత ,ఆధిక్యత పొంది వున్నాయి .వేద ప్రాన్యతను ,సంత రించు కొన్నాయి .అందుకే అది నాల్గవ వేదం అయింది .
ఛందో మయ వచనం
రుక్ ,యజు ,సామ వేదాలను దర్శించిన రుషులున్నారు .వారి పేర్ల తోనే ఆ మంత్రాలు పేర్కొన బడ్డాయి .ఆ రుషి పేరు ,ఛందస్సు ,వినియోగం ఆ మంత్రాలలో కని పిస్తాయి .అయితే అధర్వ వేదం లో అ వివరణ లేదు .ఇందులో ద్రష్ట అయిన ఋషిని దర్శించటం కష్టం .ఆ సంప్రదాయం అప్పటికే నశించి పోవటమే కారణం అయి వుంటుంది .కానీ ,దీనికి ఒక ”అనుక్రమణిక ”వుంది .అదే మన భాషలో” కేట లాగు ”అంటాం .లోపలి వెళ్లి పరిశీలిస్తే నమ్మ తగినది గా అని పించదు .అందు లోని అధర్వ ,అంగీరస ,బ్రహ్మ పేర్లు ఊహాత్మకాలే కాని నిజమైన ద్రష్టల పేర్లు అని నమ్మకం కలుగదు .యజుర్వేదం వచనం అయినా ,లయాన్విత వచనం అది .దీన్ని ”అయనితాక్షరం ”అంటారు .అంటే ఇన్ని అక్షరాలూ వుండాలి అనే నియమం లేదు అని అర్ధం .అలాగే అధర్వ వేదం లోను ,వచనమే వుంది .కాని ఇది ఛందో మయ వచనం .అంత మాత్రం చేత వైదిక ఛందస్సు ను పూర్తి గా పాటించ లేదు .మంత్రం అని గట్టి గా అనటానికి వీలు లేని పరిస్థితి కొన్ని చోట్ల కని పిస్తుంది .మంత్రానికి 40 అక్షరాలు వుంటే ”పంక్తి ”అంటారు .అధర్వం లో ఈ నియమం కూడా పాటింప బడ లేదు .దీనికి కారణం -ఇటీవలి కాలమ్ లోనే దానికి అ స్థితి కలగటం .దీనితో పాటు ”వినియోగం ”కూడా చాలా దారుణం గా కని పిస్తుంది .ప్రతిమంత్రానికి ఒక ప్రత్యెక వినియోగం వుంటుంది .అంటే ,ఏ స్థానం లో ఎప్పుడు ఉపయోగించాలో తెలియ జేస్తారు .సాధారణం గా ,యజ్ఞం లో వినియోగించేవి మంత్రాలు .అయితే అధర్వ మంత్రాలు యజ్ఞం లో విని యోగింప బడేవి కావు .అంటే ,సోమయాగం లో కాని ,వాజిపేయం లో కాని ,అశ్వ మేధం లో కని వీటికి విని యోగం లేదు .శాంతులలో ఇవి వ్యతిరేక భావం లో వాడ బడ తాయి .అంటే ,అడ్డంకుల్ని ,అదిగా మించ టానికే విని యోగిస్తారు .మొదట్లో యజ్ఞాలలో వీటి విని యోగం లేదు .కాని తర్వాత తర్వాత ,చివర్లలో వీటిని జాగ్రత్త కోసం అను సంధించారు .అధర్వం లో పేర్కొన బడ్డ దేవతలు,మిగిలిన మూడు వేదాల్లోనూ పేర్కొన బడిన దేవతలే .అంటే -ఇంద్ర ,అగ్ని ,యమ ,మొదలైన వారు .మిగిలిన దేవతలకు మాత్రం చాలా ప్రత్యెక మైన పేర్లు వున్నాయి .ఉదాహరణకు ”-వ్రాత్య ”.ఇది చాలా ప్రత్యెక మైన పేరు .దీన్ని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -01 –12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com