అసమాన జాతీయ కవి శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ
”అందారు పుట్టీరి హిందమ్మ తల్లికి -అందారు ఒక్కటై వుందారి సక్కంగా
ఎట్టాగు ఎక్కువా బ్యామ్మర్లు మాకంటే -ఎట్టాగు ఎక్కువా ఎవరైనా మాకంటే ”

అని 1910 లోనే కృష్ణా పత్రిక లో ”మాల వాన్ద్ర పాట ”పాట రాసిన మొదటి దళిత గీత కర్త శ్రీ మంగి పూడి వెంకటేశ్వర శర్మ .పితా పురం రాజా వారు సన్మానం చేస్తా నంటే ”నేనుబ్రాహ్మన్ని .బ్రాహ్మడు అత్యాశా పరుడు కారాదు ”అని తిరస్కరించిన అభిమాని .”మీరు ఏదైనా శాశ్వత ఉపకారం అంటే స్కాలర్ షిప్ పొందితే బాగుంటుంది కదా ”అని రాజు గారి దివాన్ అంటే ”ఈ అమాయకత్వాన్ని దూరం చేసుకొంటే కవి గా నేను చచ్చి పోతాను ”అని నిక్కచ్చి గా చెప్పిన మహా మనీషి .
శ్రీ మాడ పాటి హనుమంత రావు గారికి మంగి పూడి వారు రాసిన ”నిరుద్ధ భారతం ”అంకితం ఇస్తే ,మూడు వేల రూపాయలు కానుక గా ఇప్పిస్తాను” అన్నారు విశ్వ దాత శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు .దానికి శర్మ గారి సమాధానం ”ఇంత పెద్ద మొత్తం నేనెప్పుడు చూడ లేదు .ఆ డబ్బు నా దగ్గర నిలవదు .మనిషికి కృతి ఇచ్చాననే మచ్చ మాత్రం శాశ్వతం గా నిలిచి పోతుంది ”అని తిరస్కరించిన ఆధునిక పోతన .
మునగాల రాజా గారు ఇంటికి పిలిచి ,ఆతిధ్యం ఇచ్చి ,ఒక కవరు చేతిలో పెట్టి ,”రైలు ఎక్కినతరువాత అందులో ఏముందో చూడండి ”అన్నారు .అలాగే చూస్తె కవర్ లో 100 రూపాయల నోటు వుంది.తొమ్మిదేళ్ళ పాటు ,ఆ మహా రాజు గారి ముఖం చూడ లేదు వెంకటేశ్వర శర్మ గారు .అంతటి అభిమాని ,అన్న మాటకు కట్టు బడి వుండే మనిషి .మళ్ళీ ఒక సారి రాజా గారే బ్రతిమి లాడి ధనం ఇవ్వ బోతే ,”జీవితాంతం మీ ముఖం చూడను ”చూడ కుండా వుండాలి అంటే ఆపని చేయండి ”అని నిష్కర్ష గా చెప్పిన అపర భీష్ముడు .
మంగిపూడి వారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని ”పిప్పర ”గ్రామం .ఆ గ్రామ కరణం వీరి స్తితి చూసి గవర్న మెంట్ పోరంబోకు స్తలాన్ని ఇప్పిస్తాను అంటే ”ప్రభుత్వం ముందు చేతులు జాపి మీరు ఇచ్చేభూమి పట్టా తీసుకోవటం నాకు నిజం గా అవసరమే .కానీ నాలో వున్న కవి ఒప్పుకోడు ”అని నిజాయితీ గా చెప్పిన అసలైన దేశ భక్తుడు శర్మ గారు .
చరిత్ర ను మలుపు తిప్పే ఎన్నో గీతాలు రాశారు .18882 జనవరి తొమ్మిదిన జన్మించి అరవై తొమ్మిదేళ్ళు జీవించి 1951 లో మరణించారు .1907 లోనే ”వందేమాతరం ”అనే జాతీయ కావ్యం రాశారు .మాదిగ వారితో కలిసివున్నందుకు కులం నుంచి వెలి కూడా అయారు శర్మ గారు .1915 లో ”నిరుద్ధ భారతం ”అనే కావ్యం రాశారు .అందులో ”పంచమ కులం ”అనేది లేదని స్పష్టం గా చెప్పారు .దళిత కులాన్ని ,పై కులాల వారునిర్మూలించాలి అని ప్రబోధించారు .
1908 లో ”బాల వితంతు విలాపం ”రాశారు .వీరేశ లింగం గారి ఉద్యమాన్ని సమర్ధించే రచన ఇది .99 సీస పద్యాల్లోబాల వితంతువుల దుస్థితి ని కళ్ళకు కట్టి నట్లు రాశారు .శర్మ గారు 1910 నుంచి ,35 వరకు వందలాది రచనలు చేశారు .30 గ్రంధాలు రాసి ప్రచురించారు .
”స్త్రీ విద్యా పంచ రత్నాలు ”అనే పేరు తో వ్రాసిన అయిదు పద్యాలను ,ప్రతి ఉపన్యాసం లోను ,చదివి విని పించే వారు .అవి అంటే అంత అభిమానం .స్త్రీ విద్య కు అంత ప్రాధాన్యం ఇచ్చే వారు .ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ,తన స్వీయ వ్యక్తిత్వం తో ,ఎదురు నిలిచిన ధీరుడు మంగిన పూడి .ఉన్నతుడైన ఉత్తమ జాతీయ కవి .దేశ భక్తీ ని వివిధ సాహిత్య ప్రక్రియ ల ద్వారా జాతికి అంద జేసిన వైతాళికుడు వెంకటేశ్వర శర్మ గారు .
తాను నమ్మిన సిద్ధాంతాలను చివరి దాకా అనుసరించిన ఆదర్శ వ్య్కక్తి .ఎన్ని సభల్లో పాల్గొన్నా ఒక్క సన్మాన మైనా స్వీకరించని ఆదర్శ దేశ భక్తుడు .ఆత్మ గౌరవం నిలువెల్లా మూర్తీభ వించిన విశిష్ట వ్యక్తిత్వం వారిది .
ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని ఎద్దేవా చేస్తూ ”జోల పాట ”అనే గేయం కృష్ణా పత్రిక లో రాశారు .ఆ నాటి హేమా హేమేలైన ,పట్టాభి ,కొండా ,మొదలైన వారంతా చదివి గంగ వేర్రు లేత్తా రట . .ఆత్మాన్వేషణ లో పడేట్లు చేయ గలిగారన్న మాట శర్మ గారు .గురజాడ అప్పా రావు గారు ఆ గేయం చదివి ,”ఆంద్ర దేశం లో ఎవరో మహా కవి పుట్టి వుంటాడు ”అని కీర్తిన్చారట .చరిత్ర ను మలుపు తిప్పే ఎన్నో గేయాలు రాసి ప్రచురించారు .అచ్చ మైన ప్రజా కవిగా ,ఏ ప్రలోభాలకు లొంగని వ్యక్తీ గా ,జాతీయత మూర్తీభవించిన మనిషి గా సంఘ సంస్క్రరణను మాటల్లో నే కాదు చేతలోను ఆచా రించి చూపిన ఆదర్శ పురుషుడి గా ,వ్యక్తిత్వానికి ఒక హిమాలయ పర్వతం గా ,నిలిచిన సాహితీ విరాన్మూర్తి శ్రీ మంగి పూడి వెంకటేశ్వ ర శర్మ గారు .అవి నీతి ,ఆశ్రిత పక్ష పాతం కుంభకోణాలు ,మర్యాదాతిక్రమానాలు ,బాద్య రాహిత్యం విచ్చల విడి అయి విజ్రుమ్భిస్తున్న ఈ కాలమ్ లో ,శర్మ గారి చరిత్ర వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది .ప్రముఖ శాస్త్ర వేత్త ఐన్స్టీన్ గాంధీ గారి గురించి ”ఈ నెల మీద గాంధి లాంటి వ్యక్తీ నడయాడాడు అంటే భవిష్యత్తు తరాలు నమ్మ లేవేమో ?”అన్న మాట గాంధీజీ కంటే శర్మ గారికి ఇంకా ఎక్కువ గా అన్వయిస్తుందని పిస్తుంది .అందుకే మనం ఆ ఆదర్శ మూర్తుల్ని జయన్తులకో ,వర్ధన్తులకో జ్ఞాపకం చేసుకొని ,ఆ తర్వాత హాయిగా మరిచి పోతుంటాం .లాంగ్ లివ్ ఇండియా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com