దశోపనిషత్ సారం –5

దశోపనిషత్ సారం –5

                                                  తైత్తిరీయ ఉపనిషత్ -2 –ఆనంద వల్లి 
బ్రహ్మ -సత్యం ,జ్ఞానం అనంతం .జ్ఞానం అంటే జ్ఞాన స్వరూపమే .ఒకటవ అను వాకం లో అన్నమయ కోశ విచారణ చేశారు .అన్నమయ కోశం పంచ భూతాలతో ఏర్పడింది .ఆకాశం ముందు పుట్టింది .తర్వాత వాయువు ,అగ్ని జలం ,పృథ్వి రూపాలు దాల్చింది .పృథ్వి లో ఓషధులు ,దాని నుంచి అన్నం ,అన్నం  నుంచి పురుషుడు పుట్టారు .అన్నమే సృష్టి  స్తితి లయాలకు కారణం .భూతాలలో జ్యేష్టం .అన్నమే బ్రహ్మ .అన్నం అంటే తిన బడేది ,తినేది .                   రెండ వ అను వాకం లో ప్రాణ మయ కోశ విచారణ జరిగింది .వీనిలో సద్రుప ,చిద్రుపాలు లేవు .కనుక నిజ మైన బ్రహ్మ కాదు .ప్రాణమే శిరస్సు .వ్యాన ,అపానాలు బాహువులు .సమానం దేహం .ప్రాణమే ఆయుస్వరుపం .ప్రాణమే బ్రహ్మ .మూడవ అను వాకం లో మనోమయ కోశ విచారణ చేశారు .ఇదీ అనిత్యమే .యజుర్వేదమే శిరస్సు .రుక్ ,సామాలు కుడి ,ఎడమ చేతులు .ఆదేశమే దేహ భాగం అధర్వనం ఆధారం .సర్వ విద్య లకు ఈ కోశమే ఆధారం .గురు ముఖం గా అధ్యయనం సాగాలి .మంత్రాదిస్తానం వల్ల మనసు స్వాధీన మవుతుంది .దీని వల్లనే బ్రహ్మ పదం వస్తుంది .
నాలుగవ అనువాకం లో విజ్ఞాన మయ కోశం గురించి వివరణ ఉంది .శ్రద్ధ ఏ శిరస్సు .రుతం కుడి చేయి .సత్యం ఎడమ చేయి .యోగమే శరీరం .మహస్సు ఆధారం .విజ్ఞానం అంటే వేదార్ధ నిశ్చయ జ్ఞానం .శ్రద్ధా ,మానసిక ,వాచిక సత్యత ,యోగం చాలా అవసరం .అయిదవ అనువాకం ఆనంద మయ ,జీవ బ్రహ్మిక్యాన్ని వివరించింది .శిరస్సు ప్రియ మైంది .మోదం దక్షిణ బాహువు .ఆనందం దేహం .బ్రహ్మ ఆధారం .ప్రతి జీవుడు బ్రహ్మమే .బ్రహ్మం లేదు అంటే తానె లేనట్లు .ఇదే జీవ బ్రహ్మైక్యం .అది పొందిన వాడు పూజ్యుడు .బ్రహ్మ వేత్త ,బ్రహ్మ సాయుజ్యాన్ని పొందుతాడు .ఆరవ అనువాకం సృష్టి అంతా బ్రహ్మ స్వరూపమే నని చెప్పింది .సృష్టికి పూర్వం అవ్యాకృత నామ రూపాత్మకం .సృష్టి అయినపుడు వ్యాకృత నామ రుపాత్మకం .భగ వంతుడు సృష్టి రూపం గావ్యక్త మౌతాడు .తనను తానె సృష్టి గా చేసుకొంటాడు .కనుక సృష్టి ”సుకృతం ”.ఏడవ అను వాకం భగ వంతుడు  ఆనంద స్వరూపుడు ,ఆభయమే మోక్షం అని తెలిపింది .జడ రూప మైన సృష్టి లో ”రస స్వరూపుడు ”గా భగ వంతుడున్నాడు .అవాగ్మానస గోచర మైన బ్రహ్మమే తాను అని ”అపరోక్ష జ్ఞానం ”కలిగి నప్పుడు ”అభయ ప్రతిష్ట ‘కలుగు తుంది .ఆస్తితినే మోక్షం అన్నారు .వేరు ,వేరు గ భావిస్తే ‘భయం ”.కలుగు తుంది .భయమే సంసారానికి కారణం . యెనిమిద వ అనువాకం లో ”బ్రహ్మానంద మీమాంస ”వుంది .యువకుడు సాధువై ,విద్యా ,చురుకు దనం , దనం ,మనోబలం ,ఈ ప్రుద్వికి ప్రభువై ఉన్న వారికి ఆనందం మానుషా నందం .తొమ్మిద వ అను వాకం లో పర బ్రహ్మానందం కల వాడు భయ రహితుడు అని చెప్పారు .కార్య రూప భయం ,కారణ రూప జగత్తు భయం అని భయం రెండు రూపాలు .నాల్గవ అను వాకం ద్వారా కార్య రూప భయం లేదు .దీనిలో కారణ రూప భయం లేదు .జగత్తు కార్యం .దానికి కారణం మాయ .లేక అవిద్య ,ప్రకృతి .కార్య రూప మాయను దాటాడు కనుక నిత్య బ్రహ్మానంద అనుభవమే . .భయమే ఉండదు .ఆత్మ జ్ఞానికి పరితాపం లేదు .పుణ్య ,పాపాలు ఆత్మ కంటే వేరు కావు .అంటే అంతా ఆత్మా లోనే కన్పిస్తాయి .
  భ్రుగు వల్లి
ఒకటవ అనువాకం బ్రహ్మ జ్ఞాన బోధ .పంచ కోశ విచారణ జరిగింది .ఇదంతా పితా ,పుత్రా ఆఖ్యాయిక .వరుణుని కుమారుడు భ్రుగువు తండ్రిని బ్రహ్మ విద్య బోధించమని కోరుతాడు .రెండు నుంచి ఆరు అనువాకాలలో భ్రుగువు తపస్సు చేసి అన్నం ,సృష్టి పుట్టుక ,స్తితి లయాలకు కారణం అని అన్నమే బ్రహ్మ అని తెలుసు కొన్నాను అంటాడు .మళ్ళీ తపస్సు చేసి ప్రాణమే బ్రహ్మ అని గ్రహిస్తాడు .తండ్రి కాదు అంటే మళ్ళీ తపస్సు చేసి మనస్సు బ్రహ్మం అంటాడు .విజ్ఞానం బ్రహ్మ నని ,,ఆ తర్వాత ఆనందమే బ్రహ్మమని తెలుసు కొంటాడు .అదే సరైనదని తండ్రి చెబుతాడు .”దీనినే భార్గవీ -వారుణీ విద్య ”అన్నారు .
ఏడవ అను వాకం లో బ్రహ్మ జ్ఞానానికి మొదటి సాధనం అన్నం అని తెలుస్తుంది . అన్నాన్ని నినదించ రాదు   .శరీరం అన్నాద స్వరూపం .ప్రాణం లో శరీరం ఉంది .శరీరం లో ప్రాణం ఉంది .ఇది తెలిస్తే బ్రహ్మ వర్చస్సు లభిస్తుంది .ఎనిమిదవ అనువాకం అన్నాన్ని  పరి హరిన్చరాదని ,జలమే అన్నమని ,.జ్యోతిస్సు అని చెప్పారు .ఉదకం లో జ్యోతిస్సు ప్రతిష్టితం .జ్యోతిస్సు లో ఉదకం ఉంది .ఇది తెలిసిన వారికి అన్న ,పశు ,సంతాన ,కీర్తి వృద్ధి ,బ్రహ్మ వర్చస్సు కల్గుతాయి .తొమ్మిదవ అనువాకం లో అన్నాన్ని  వృద్ధి చేయాలని వుంది .పూజించాలి .పృథ్వి ఏ అన్నం .ఆకాశం అన్నం . .పృథ్వి లో ఆకాశం ఆకాశం లో పృథ్వి ప్రతిస్టితం .ఇది తెలిస్తే కీర్తి వర్చస్సు కలుగు తాయి .
పదవ అనువాకం -ఇంటికి వస్తే విశ్రమించ టానికి వసతి చూపాలి .దీన్ని వ్రతం గా ఆచరించాలి .అతిధి పూజ శ్రేష్టం .వాక్కు లో క్షేమ స్వరుపు డైన భగ వంతుని ,ప్రాణా అపానాలలో యోగ క్షేమ భగ వానుని ,హస్తం లో కర్మ రూప భగ వానుని ,పాదం లో గమన రూప భగ వానుని ,పాయువు లో విసర్జక రూప భగ వానుని ,ఉపాశిస్తే ,అవన్నీ సక్రమంగా పనిచేసి ఆధ్యాత్మిక జీవ నానికి తోడ్పడు తాయి .ఇవన్నీ వ్యవ హారం లో బ్రహ్మోపాసనా విధానాలు .దేవతా స్వరూప బ్రహ్మో పాసన అంటే -వర్షం లో తృప్తి రూప భగ వానుని ,మెరుపు లో బల రూప భగ వానుని ,పశువు లో యశో రూప పర మాత్మను ,నక్షత్రం లో జ్యోతి రూప పర మాత్మను ,ఉపస్థ లో ప్రజా పతిని ,ఆనంద రూపాన్ని ఉపాశించాలి .ఆకాశం లో స్వస్వరుప పరమాత్మను ఉపాసించాలి .గొప్ప వాణ్ని గా ఉపాసిస్తే ,గొప్ప వాడు అవుతాడు .మనసు అని ఉప్పాసిస్తే ,గౌరవం లభిస్తుంది .నమస్కారం గా భావిస్తే ,కోరిక తీరు తుంది .బ్రహ్మ గా ఉపాసిస్తే ,బ్రహ్మయే ఆవు తాడు .లయ రూపుని గా భావిస్తే సర్వ శత్రు సంహారం జరుగు తుంది .
మానవుని లోని తేజస్సు సూర్యుని లో వుంది .తేజస్సు లో భేదం లేదు కనుక జీవ బ్రహ్మైక్యం చెప్ప బడింది .ఇలా జీవ బ్రహ్మైక్య అపరోక్ష జ్ఞానం కల వారు అన్నమయ ,ప్రాణ మయ ,మనోమయ ,విజ్ఞాన మయ ,ఆనంద మయ  పంచ కోశాలు దాటి పరి పూర్ణ బ్రహ్మాండా కారం పొంది ,సర్వ కామ రూపులై సకల విధ ఆనందాలను అనుభ విస్తు ,తమ స్వస్వరుపం ,అత్యాశ్చర్య కరం గా ఉందని ఆశ్చర్యం తో ”హా హా,హా”అని గానం చేస్తారు .తిన బడే అన్నం ,తినే వాడు ,ఏక స్వరూపం గా కన్పించటం చేత ఆశ్చర్యం కలిగిందన్న మాట .సర్వ పూజ్యం ,స్తుత్యం అయిన పర మాత్మ తానే నని దేవతలకు అమృత స్వరూపుడు తానే నని ,సాక్షాత్కారం పొందుతాడు .అన్నార్తునికి అన్నం పెట్టని స్వార్ధుని భగ వంతుడు నశింప జేస్తాడు .అతిధి ,అభ్యాగతులను ఆదరించే వారిని రక్షిస్తాడు .భగ వంతుడు తన స్వర్ణ మయ ప్రకాశం తో విశ్వ మంతా నిండి ,ప్రకాశిస్తాడు అని తెలిస్తే మోక్షమే అంటుంది తైత్తిరీయ ఉపనిషత్ లోని భ్రుగు వల్లి .
దీని తరువాత ఐతరేయ ఉపనిషత్ గురించి తెలియ జేస్తాను .
సశేషం –31 -03 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.