దశోప నిషత్ సారం –4

దశోప నిషత్ సారం –4

                              o6– మాండుక్య  ఉపనిషత్  
   అధర్వణ వేదానికి చెందింది .ముక్తికి ఈ ఉపనిషత్ ఒక్కటే చాలు అనే అభిప్రాయం వుంది .ఇందులో జాగ్రత్ స్వప్న సుషుప్తి వ్యవస్థ ల వర్ణన ఉంది .ఓంకారమే సర్వం .భూత భవిష్యత్ ,వర్తమానా లన్ని అదే .ఈ మూడిన్తికన్నా అధిక మైన దేదో ,అదీ ఓంకారమే .బ్రహ్మమే ఓంకారం .సగుణ ,నిర్గుణ బ్రహ్మ లను ఓంకారం ద్వారా నే తెలియాలి .ఆత్మ కు నాలుగు పాదాలున్నాయి .విశ్వ ,తైజస ,ప్రాజ్న ,తురీయ అనే నాలుగు పాదాలు వీటి ఆత్మ పరబ్రహ్మమే .”అయమాత్మా బ్రహ్మ ”విశ్వ అంటే విశ్వా నరుడు .జాగ్రదవస్త ..బాహ్య విషయాలను తెలుసు కొనే కోరిక కల వాడు .శిరస్సు ,నేత్రాలు ,దేహం ,మూత్ర స్తానం ,పాదాలు ముఖం అవయవాలు కల వాడు .అయిదు జ్ఞాన ,అయిదు కర్మేంద్రియాలు ,ప్రాణ ,మనో ,బుద్ధి ,చిత్త ,అహంకారం ,అనే 19 అతని ముఖాలు .వీటి వల్ల శబ్దాది విషయాలు అనుభ విస్తాడు .తైజసుడికి స్వప్నం స్తానం .స్వప్నాను భవం మనస్సు చేస్తుంది .కనుక వీటిని అనుభావిన్వ్చే జీవుడు అంతః ప్రజ్ఞుడు .మానసిక  వాసన లన్ని తేజస్సు వచే ఉద్దీప్తాలై అనుభవింప బడటం చేత తైజసుడయాడు .శుశుప్తి లో స్వప్నాలుండవు .కోరిక లుండవు .అప్పుడే ప్రజ్ఞాన ఘన మాత్రుడు .శుశుప్తి నుంచి జాగ్రద వస్త కు వస్తే ఘనీ భూతాలైన వాసన లన్ని అంకురిస్తాయి .ప్రాజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు ,సర్వాంతర్యామి  .అయి సకల ప్రానోత్పత్తి ,స్తితి లయాలకు కారణం అవుతున్నాడు .అంటే ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక భేద విశిష్ట మైన ప్రపంచానికి కారణం అతడే .
   తురీయావాస్త లో ఆకారం లేదు .జ్ఞానేంద్రియాలకు అగోచరుడు .కనుక ”అదృష్టం ”.అను మానాదులచే తెలియ బడని వాడు .అచిన్త్యుడు .శివ స్వరూపుడు .ఓంకారానికి ,ఆత్మ కు భేదం లేదు .తురీయాత్మ ఓంకారమే .ఆత్మకు నాలుగు పాదాలే .ఓంకారానికీ నాలుగు అక్షరాలే (మాత్రలే )విశ్వ ,తైజస ,ప్రాజ్న లనే మూడు పాదాలే  అ+ఉ+మ్ కారాలు .ఓంకారం తురీయ మాత్రమైన ఆత్మయే.ఓంకారం ఉపశమనాన్ని స్తుంది .పరమానందాన్నిస్తుంది .ద్వైత రహిత మైనది .ఓంకారం తెలిస్తే ఆత్మ స్వరూపం తెలిసి నట్లే .ఇదీ మాండుక్య ఉపనిషత్ లోని సారం .
  07 –  తైత్తిరీయ ఉపనిషత్ 
               కృష్ణ యజుర్వేదం లో తైత్తిరీయ శాఖ కు చెందింది .దీనిలో మూడు ”వల్లులు ”ఉన్నాయి .బ్రహ్మ విద్యకు అవసర మైన ఉపాసనలు శిక్షావల్లి లో,తపస్సు గురించి భ్రుగు వల్లి లో ,బ్రహ్మ నిర్వచనం బ్రహ్మ వల్లి లో చెప్పారు .
   శిక్షా వల్లి 
  మొదటి అనువాకం లో శాంతి మంత్రం చెప్పారు .రెండవ దానిలో ఉచ్చారణ ,మూడు లో సంహితో పాసన .వుంది .మోక్షానికి పూర్వం చిత్త ఏకాగ్రత ,సత్ ప్రవర్తన ,అవసరం .దానికి ఉపాసనలు తెలిపారు .అక్ష రాలు కూడి అంటే కలిసి వేద రూపం పొందటం సంహిత .ఇవి అయిదు .లోకాలు ,జ్యోతిస్వరుపం ,విద్య ,సంతానం ,దేహం .
ఇకారం లో పృథ్వి ,శే కారం లో ద్యులోక ద్రుష్టి ,,ఆకాశ సంధి ,వాయువు అను సంధానం గా ఉపాశించాలి .మొదటి అక్షరం అగ్ని .రెండవది సూర్య స్వరూపం .ఉదకం సంధి ,మెరుపు అనుసంధానం .గురువు మొదటి అక్షరం .శిష్యుడు రెండ వ అక్షరం .విద్య సంధి విధానమే సంధానం ..తండ్రిమొదటి   అక్షరం ,తల్లి రెండవ అక్షరం .సంతానం సంధి .సంసార ప్రవ్రుత్తి సంధానం .కింది దవడ మొదటి అక్షరం పైది రెండవ అక్షరం .వాక్ సంధి జిహ్వ సంధానం .ఈ అయిదు రకాల ఉపాసనా ప్రక్రియలకు ”మహా సంహిత ”అని పేరు .ఇది చేస్తే ప్రజాభి వృద్ధి ,పశు వృద్ధి ,బ్రహ్మ వర్చస్సు ,స్వర్గ ప్రాప్తి కల్గుతుంది .
                        నాలుగవ అనువాకం లో బ్రహ్మ ,వేదాన్ని విమర్శించి వేద సార మైన ఓంకారాన్ని గ్రహించాడు .అది శరీ రాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది .పరమాత్మ ఉప లబ్ధికి  స్తానం .మనన ,శ్రవణాలతో అనుభవం లోకి తెచ్చుకోవాలి .మేధా సంపత్తి ,దాని తరువాత సంపద కలుగు తాయి .అయిదవ అనువాకం ”వ్యాహృత్ ఉపాసన ”-bhooh ,భువః,సువః ,తో పాటు మహః అనేది నాల్గవ వ్యావ్రుత్తి .bhooh అంటే భూలోకం .భువః అంటే అంత రిక్షం .సువః అంటే స్వర్గం .మహః -సూర్యుడు .సూర్యుడే బ్రహ్మ .bhooh అంటే అగ్ని .భువః అంటే వాయువు సువః అంటే సూర్యుడు .మహః -చంద్రుడు .జ్యోతి స్వరుపాలన్ని చంద్రుని అమృత కళలను పొందుతాయి .bhooh అంటే ఋగ్వేదం ,భువః సామం ,సువః యజుర్వేదం మహః పర బ్రహ్మ .bhooh -రానం ,భువః-అపానం ,సువః -వ్యానం ,మహః-అన్నం ,అన్నం వల్ల అన్నీ అభివృద్ధి చెందు తాయి కనుక అన్నం  పర బ్రహ్మ .ఇలా వ్యాహృతులను 16 రకాలుగా ఉపాశించిన వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది .చక్ర వర్తి కి లోబడిన సామంత రాజుల్లాగా ఇంద్రియాలన్నీ అతని స్వాధీనం లో ఉంటాయి . 
  ఆరవ అను వాకం లో ”వ్యాహృత్ ఉపాసనా ఫలం ”చెప్పారు .హృదయం లో చిదాకాశం ఉంది .సుషుమ్న మార్గం లో ”వ్రుత్తి ”పవహించి కొండ నాలుక ద్వారా ,బ్రహ్మ రంధ్రాన్ని చేర్తుంది .శిరస్సు ,కపాలం కలిసే చోటే ”బ్రహ్మ రంధ్రం ”.చని పోయేటప్పుడు భోహ్ వలన అగ్ని లోకం ,భువః వల్ల వాయులోకం ,సువః వల్ల సూర్య లోకం ,మహః వల్ల బ్రహ్మత్వం ఒండుతాడు .ఇవి బ్రహ్మ రంధ్రం ద్వారా నిష్కర మిస్తే బ్రహ్మ లోకా వాప్తి మాత్రమే కాక ,స్వస్వరూపానుభావం ,సర్వ మానవ నియంతృత్వం ,దూర శ్రవణం ,దూర దర్శనం ,సమస్త బుద్ధి వ్రుత్తి నియంతృత్వం ,పర బ్రహ్మ భావన ,సర్వ వ్యాప కత్వం ,మనశ్శాంతి పొంది చిన్మాత్ర లో విశ్రాంతి  పొందు తాడు .
   ఏడవ అనువాకం లో ”పాన్క్తో  పాసన ”వుంది .పాన్క్తం అయిదు పాదాలది .పృధివి ,అంతరిక్షం ,ద్యులోకం ,దిక్కులు ,అవాంతర దిక్కులు కలిసి ఒక పాన్క్తం .అగ్ని ,వాయువు ,సూర్యుడు ,చంద్రుడు, నక్షత్రాలు ఒక పాన్క్తం .ఉదకం ,ఓషధులు ,వనస్పతులు ,ఆకాశం ,శరీరం ఒక పాన్క్తం .ప్రాణ ,అపాన ,వ్యాన ఉ ,దాన ,సమానాలు   ఒక పాన్క్తం .చక్షు ,శ్రోత్ర ,మనో ,వాక్ ,త్వక్ లు ఒక పాన్క్తం .చర్మ ,మాంస నరాలు ,ఎముకలు ,మజ్జ ఒక పాన్క్తం .ఇవన్ని స్తూల సూక్ష్మ శరీరాలకు చెంది నవి .ప్రపంచాన్ని ఈ విధం గా అయిదు భాగాలు చేసి ఉపాశించాతమే పాన్క్తో పాసన.
                 యెనిమిద వ అను వాకం లో ఓంకారం విశిష్టత తెలిపారు .యజ్ఞాదులు అన్ని ఓంకార పురస్సరం గా నే జరుగు తాయి .బ్రహ్మ ఓంకారం తోనే ఆమోదిస్తాడు .మంత్రాలన్నీ ఓంకార పురస్సరాలే .వేదాధ్యయనం ,ముగింపు ఓంకారం తోటే .ఓంకారమే ప్రణవం .దాని ఉపాసనే బ్రహ్మత్వం .
  తొమ్మిదవ అను వాకం లో ”స్వాధ్యాయ ప్రవచన విశిష్టత ”వుంది .మానసిక సత్యం తోనే వేదాధ్యయనం చేయాలి .తపస్సు ,దమం ,శమం కలిగి స్వాధ్యాయ ప్రవచనం చేయాలి .సత్యమే గొప్పదని ,”రాదేతరుడు ”తపస్సే అని” ,పౌరుశిస్టి ”స్వాధ్యాయనమే అని మౌద్గల్యుడు చెప్పాడు .త్రేతాగ్ని ఉపాసన ,అతిధి పూజ ,సంసారం అన్ని ,స్వాధ్యాయ ప్రవచనం తోనే చేయాలి .వేదం కూడా వీటికే ప్రాధాన్యత నిచ్చింది .సత్య ,తపస్సు ఫలాలు స్వాధ్యాయ ప్రవచనం లోనే ఉన్నాయి .
                       పదవ అనువాకం లో బ్రహ్మ విద్య విశిష్టత చెప్పారు .అహంకార వృక్షానికి మూలాధారం పర మాత్మే .బ్రహ్మ విద్యా సంపన్నుల కీర్తి అన్ని లోకాలకు వ్యాపిస్తుంది అని ”త్రిశంకు ”చెప్పాడు .పదకొండవ అను వాకం లో ”హితోప దేశాలు ఉన్నాయి .సత్య ,ధర్మాల నుండి ప్రమాదం రాకూడదు .తన ,ఇతర ,సర్వ భూత క్షేమం ,తో ప్రవర్తించాలి .తల్లి ,తండ్రి ,గురువు ,అతిధులను దేవతలు గా పూజించాలి .శ్రద్ధ  తో దానం చేయాలి .భయం తో చేయాలి .యోగ్యత ,పాండిత్యం ,తెలిసి దానం చేయాలి .సంశయాలు తీర్చు కోవాలి .రాగ ద్వేషాలతో ప్రవర్తించ రాదు .ఇదే వేద ఉపదేశం .,ఆదేశం శాసనం కూడా .
 ఈ ఉపనిషత్ లోని ”ఆనంద వల్లి ”ని గురించి  తరువాత తెలియ జేస్తాను .
సశేషం –మీ –గబిత దుర్గా ప్రసాద్ –31 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.