ప్రజా స్వామ్య విజయ సూచి -సూకీ
కవిత
మాయా మేయ మయన్మార్ లో
నవ శకం ప్రారంభ మౌతోంది .
మిలిటరీ జుంటాను మట్టి కరిపించి
అబల సబలై ప్రజాస్వామ్య పతాకను ఎగుర వేసింది .
మిలిటరీ కోరల్లో నలిగి ,క్రుంగి కృశించిన
బర్మా జనుల పాలిటి ఆపద్బాన్ధవే అయింది .
ఆన్ సాన్ సూకీ సుదీర్ఘ పోరాటం ఫలించింది .
నెల్సన్ మండేలా అనే నల్ల సూర్యుని తర్వాత
ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన వీర వనిత
ఎప్పుడు జైలో ,ఎప్పుడు బెయిలో తెలీక
సుదీర్ఘ కాలమ్ చీకటి గుహలో మగ్గింది
మహాత్ముడు ,మండేలా తర్వాత అదే బాటలో
తాను నమ్మిన బౌద్ధ ధర్మ ప్రాతి పదిక మీద
మౌన ,అహింసా యుత రక్త రహిత శాంతి
పోరాటం చేసి విజయం సాధించింది ..
అస్తవ్యస్త మైన దేశాన్ని సరి దిద్దే సువర్ణావకాశాన్ని
మయన్మార్ ప్రజలు ఆమెకు అప్ప గించి ,విశ్వాసం ప్రకటించారు .
మానవ హక్కుల కోసం ,విశ్వ శాంతి కోసం
ఆమె పడే ఆరాటం , ,చేసే పోరాటం చిరస్మర ణీయం .
ఆమె ముందు ఏ నియంత్రుత్వము నిలవ లేక నీరు కారింది
ప్రపంచ నోబుల్ శాంతి బహుమతి గ్రహీత
వీర ,ధీర వనిత ఆన్ సాన్ సూకీ
,విశ్వ కుటుంబ భవనం పై
ఎగరేసిన శాంతి పతాక
బర్మా ప్రజల ఆశాజ్యోతి ఆన్ సాన్ సూకీ
నిజం గానే ప్రపంచ ప్రజాస్వామ్య విజయ సూచీ .

సూకీ –అత్యధిక మెజార్టి తో బర్మా పార్ల మెంట్ కు ఎన్నికైన శుభ సందర్భం గా
గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -04 -12 .