సాహితీ బంధువులకు శుభా కాంక్షలు –
దాదాపు పది రోజుల తరువాత మిమ్మల్ని పల్కరిస్తున్నాను .మేమిప్పుడు అమెరికా లో ఉన్నాం .నేను నా భార్య ఇద్దరం ఈ నెల నాల్గవ తేది రాత్రి ఉయ్యూరు లో బయల్దేరి అయిదు ఉదయం హైదరాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చేరాం .మర్నాడు ఉదయం మా క్కయ్య ,బావ లను బోయినపల్లి లో వాళ్ళింట్లో కలిశాము .అంతకు ముందు మా కుటుంబ డాక్టర్ ఛి యాజీ ని విజయ నగర్ కాలని లో క్లినిక్ లో కలిసి మామూలు హెల్త్ చెకప్ చేయిన్చుకోన్న్నాం .ఆ తర్వాత ,ఉయ్యూరు గ్రామస్తులు ,ప్రతుత అమెరికా నివాసి ,35 ఏళ్ళకు పైగా ప్రపంచ బాంక్ లో అత్యున్నత స్తాయి లో పని చేసి ,రిటైర్ అయి ,ప్రతి సంవత్సరం ఇండియా వస్తు ,జన్మ భూమి పై ఉన్న అభిమానాన్ని కాపాడు కొంటు ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ గారిని దర్గా కు దగ్గరలో ఉన్న విస్పర్ వాలీ లో ,ముందు అనుమతితో కలిసాము .నేను నా భార్య ,పెద్ద కోడలు ,మనవడు భువన వారినీ వారి సతీమణి గారిని సందర్శించం .చాలా ఆదర పూర్వక స్వాగతం పలికారు .మేము అమెరికా వెళ్తున్న సంగతి అంతకు ముందే వారికి తెలియ జేశాను .వారు చాలా ఆనందించారు .ఒక అరగంట వారింట్లో గడిపి ,బాచుపల్లి లో ఉన్న మా రేదో అబ్బాయి శర్మ వాళ్ళింటికి వెళ్లి భోజనం చేశాం .సాయంత్రం వోల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న మా అక్కయ్య బావలను కలిసి ఆశీర్వాదం తీసుకొని రాత్రి మా శాస్త్రి వాళ్ళింటికి చేరాం .
తొమ్మిది తెల్ల వారు ఝామున నాలుగు గంటల కతార్ ఫ్లైట్ లో బయల్దేరి దోహా న్యూయార్క్ ల మీదుగా పదవ తేది మంగళ వారం రాత్రి నార్త్ కరోలిన లో ని చార్లోట్టే కు అంటే మా అమ్మాయి వాళ్ళింటికి రాత్రి తొమ్మిది గంటలకు కులాసా గా చేరాం .ప్రయాణం హాయిగా జరిగింది .మా ఆవిడకు వీల్ చైర్ ఏర్పాటు ఉండబట్టి ,ఎక్కడి కక్కడ వేగం గా పనులు పూర్తి అయాయి .చాలా శ్రద్ధ వహించారు అన్ని చోట్లా.వారందరికీ ప్రత్యెక ధన్య వాదాలు తెలియ జేయాల్సిందేమా ఆవిడ వి .సి .అయితె (వీల్ చైర్ )నేను వి.సి.కి ఫాలోయర్ అయాను ..ఎయిర్ పోర్ట్ కు మా అమ్మాయివిజయ లక్ష్మి అల్లుడు అవధాని మనుమలు శ్రీ కెత్ ,అసుతోష్ ,పియూష్ లు వచ్చారు ..రాత్రి నిద్ర బానే పోయాం ..
ఇవ్వాళ ఇక్కడికి ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎళ్ళా వెంకటేశ్వర రావు గారు
వస్తున్నారు .మా అమ్మాయి గారింట్లోనే మధ్యాహ్న భోజనం .సాయంత్రం ఆరు గంటలకు పబ్లిక్ మీటింగ్ .రావటం తోనే మంచి కార్య క్రమం తో ఇక్కడి జీవితం పారంభం అవుతున్నందుకు ఆనందం గా ఉంది .మన సరస భారతి ఇక నుంచి రోజూ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11 -04 -12
camp- -షార్లెట్ –నార్త్ కరోలిన –అమెరికా .–001-248-212-03-66
వీక్షకులు
- 1,107,526 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


సంతోషం. షికాగో వైపు వస్తే నాకు చెప్పండి.
LikeLike