వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –1
కుంభ కోణం
తమిళ నాడు లోని కుంభ కోణం లోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది .ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం .
దక్షిణ దేశం లో ఇంకెక్కడా బ్రహ్మ కు గుడి లేదు .కుంభాలు అంటే కుండలు .కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట .ఇక్కడ మహా మాఘ ,బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి .
మొదటిది చాలా పవిత్ర మైంది .పన్నెండు ఏళ్ళ కొక సారి ”మహా మాఘ ”వస్తుంది .అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రం లో ప్రవేశిస్తాడు
.శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు .లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణి లో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు .అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట .అదీ విశేషం .
చిదంబర రహస్యం
పంచ తత్వ లింగాలలో ”ఆకాశ లింగం ”ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం.ఇక్కడి నట రాజా దేవాలయం నాట్య శాస్త్ర ప్రాముఖ్యత కలిగింది
.ఆలయం ఫర్లాంగు పొడవు ,ఫర్లాంగు వెడల్పు ఉంటుంది .చక్కని కను విందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి .శతాబ్దాలు గడ చినా రంగు మారని చిత్ర కళా రహశ్యం అబ్బుర పరుస్తుంది
.నట రాజా ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం .అంత రాలయం ,గర్భాలయం ఉంటాయి .మానవ రూపం లో శివుడు నృత్యం చేసే భంగిమ లో విగ్రహం దర్శన మిస్తుంది .ఇక్కడే శివ లింగం ఉంది .
అయినా పూజలన్ని నట రాజా స్వామికే జరగటం విశేషం .
గర్భ గుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది .గుడ్డ తెరలతో చీకటి గా ఉంటుంది .అర్చకుడు తెర తొల గించ గానే ,గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది /శివుడు ఆకాశ రూపం లో ఉన్నాడు అని చెప్పి పూజారి తెర ను మూసేస్తాడు ./అదే చిదంబర రహశ్యం .సృష్టి లో మొదటిది ఆకాశం .దాని నుంచే మిగిలినవి ఏర్పడి,చివరికి అన్నీ ఆకాశం లో అంటే శూన్యం లో చేరి పోతాయి .కనుక ,ఏ తాపత్రయము లేకుండా ,ఆకాశం లాగా మనసు ను నిర్మలం గా ఉంచు కోవాలి .చిత్ అంటే మనసు .అంబరం అంటే ఆకాశం.నిర్మల మైన మనసు ను కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం .
నట రాజా స్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి ,కుడి కాలు వైపుగా మడిచి ,నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు .దీన్ని ”భుజంగ త్రాస ”అభినయం అంటారు .ఆయన చేతి లో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని,అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని ,ఎడమ చేతి లోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని ,పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివ రిస్తారు
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -04 -12
camp-charlotte -n.c.-u.s.a. 248-212-0366
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

