మంగళ వారం రాత్రి అమెరికా చేరాం .బుధ వారం అంతా శ్రీ ఎల్లా వారి రేడియో ప్రోగ్రాం
,సాయంత్రం పరిచయ వేదిక తో సరి పోయింది .నిన్న గురు వారం మూడవ రోజూ .ఉదయం ఎల్లా వారు ఫోన్ చేసి మ్-బుధవారం కార్యక్రమం బాగా జరిగిందని ,సంతృప్తి చెందానని నేనిచ్చిన పుస్తకాలు చదివానని చాలా బాగా ఉన్నాయని .తనను రేడియోకు చాలా గొప్పగా పరిచయం చేసినందుకు క్రుతజ్ఞాతలని చెప్పారు .నిన్న మధ్యాహ్నం ఫ్లైట్ లో వారు ఇండియ వెళ్ళారు ..ఈరేడియో ప్రోగ్రాం టి.వి. .ద్వారా అన్ని దేశాలకు ప్రసార మవుతుందట .మొదటి సారిగా అంతర్జాతీయ వేదిక పై నేను మాట్లాడటం మహదానందం గా వుంది .
మధ్యాహ్నం మంచి నిద్ర పోయాం .రాత్రి ఏడున్నరకు మా అమ్మాయి విజ్జి, దగ్గరలో వున్న మంజులత ,రమేష్ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది .అక్కడ శ్రీ సత్య సాయి బాబా భజన కార్యక్రమం గంటకు పైగా జరిగింది .అంతా యువకులే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లె .దాదాపు ఇరవై మంది యువతీ యువకులు ,ఇద్దరు పెద్ద వాళ్ళు పాల్గొన్నారు .అందరు సామూహిక భజన చేశారు .అంతా బాగా భక్తితో పాడారు .అందరు గొంతు కలిపి పాడటం విశేషం .డోలక్ తప్పెట లతో ఇద్దరు పాటలకు అనుగుణం గా వాయించి ఆనందా ను భూతి ని కలిగించారు .
కంప్యూటరే దైవం గా భావించి జీవించే యువత ,దానికి మించి ఒక అపూర్వ శక్తి ఈ విశ్వాన్ని నడి పిస్తోందని నమ్మి ,ఆ శక్తిని సాయి బాబా లో దర్శించి ప్రేరణ పొందటం ఆశ్చర్య మేసింది .వారి మనో భావనకు అభినందించాను .
నాలుగైదు ప్రసాదాలను నైవేద్యం పెట్టి అందరికి అంద జేశారు .ఇద్దరు చిన్న పిల్లలు కమ్మగా భజన గీతాలను పాడి ఆకట్టు కోవటం విశేషం .ఇది చూస్తె నా మనసు దాదాపు అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .మా చిన్నప్పుడు ఉయ్యూరు లో మా గురువు గారుమహన్కాలి సుబ్బరామయ్య గారు ,నరసింహా రావు గారు ముళ్ళ పూడి ఆయన ,ఇత్తడి కొట్టు చంద్రయ్య గారు మా గుడి దగ్గర ఉండే వెంకటేశ్వర రావు జగన్నాధ దాసు గారు నా మిత్రుడు ఆదినారాయణ ప్రతి గురు వారం చేసే భజనలు జ్ఞాపకం వచ్చాయి .ప్రసాదాలు తిన్నంత పెట్టె వారు .మధ్య మధ్యలో కాఫీ టీ లు ఇచ్చ్చేవారు .అప్పుడు ఆది నారాయణ మమ్మల్ని తీసుకొని వెళ్ళే వాడు .మాకు భజన మీద కన్నా ప్రసాదాల మీదే భక్తీ ఎక్కువ గా ఉండేది .భజన ఎప్పుడవుతుందా ?ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసే వాళ్ళం .ఇన్నేళ్ళకు మళ్ళీ భజన కార్యక్రమం లో అదీ ఒకరింట్లో పాల్గొనటం ఇదే .మా ఆంజనేయ స్వామి దేవాలయం లో భజన్ లలో పాల్గొనటం మామూలే .ఒక్క సారి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి .ఇక్కడ భజనకు ఆహ్వానించిన మంజులత ,రమేష్ దంపతులుయువకులే .వారి భక్తీ భావానికి ఆనందం గా వుంది .
ఈ నెల ఇరవై ఆరవ తేది శ్రీ సత్య సాయి 86 వ జయంతి అట .అందుకని ఈ లోపు 86 చోట్ల భజనలు నిర్వహించాలనే తలంపుతో ఉత్సాహం గా వీరంతా రోజూ కొకరింట్లో చేస్తుండటం విశేషం .రాత్రి ఇంటికి వచ్చే సరికి తొమ్మిదిన్నర అయింది .ఇలా గురు వారం గడిచింది
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -13 -04 -12
camp -charlotte -n.c-.u.s.a.—248-212-03-66
వీక్షకులు
- 1,107,639 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

