వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7
                                                        నడుం లోతు నీటి లో శివ లింగం
—           నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పం లో ”పాను గల్లు ”గ్రామం ఉంది .అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది .ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న మండపాలున్డటం ప్రత్యేకత .వీటి మధ్యలో మూడు గర్భ గుడులు ఉన్న దేవాలయం ఉండటం విశేషం .దీన్నే ”త్రికూటాలయం ”అంటారు .గర్భాలయం లో నడుము లోతు జలం లో శివలింగం ఉండటం ప్రత్యేకత .ఈ జలం అన్ని కాలాల్లో అదే లోతు లో ఉండటం విచిత్రం .ఈ జల లింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారం లో నీడ పడటం మరో వింత .సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకం గా పడటం వింతల్లో వింత .ఇదే ”ఛాయా సోమేశ్వరం ”ఈ రహశ్యం ఇప్పటికీ దుర్భేద్యం  గానే ఉంది .ఇంకో వింత కూడా ఉందండోయ్ .సింహ ద్వారానికి ఎదురుగా ,గర్భాలయం ద్వారం లో నిల బడితే ,మన నీడ ఒకటి మూడు చాయాల్లో ,అయిదు చాయాల్లో ఎదుటి గోడ మీద పడుతుందట .ఈ కాంతి రహశ్యం తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి మప్పి దాలు .
అంతే కాదండోయ్ .ఈ ఊరి దగ్గరే ”పచ్చల సోమేశ్వరాలయం ”ఉందట .నల్ల రాతి స్థంభ నిర్మాణం అది .ఆ స్తంభాలపై మన ప్రతి బింబాన్ని చూసు కో వచ్చు నట .అంటే అంత నున్నగా చేక్కారన్న మాట .అద్దం లాగా ఉంటుందన్న మాట .లింగం లో ”ఒక పచ్చ ”ను శిల్పి పోదిగాడట .పచ్చల హారం నిత్యం స్వామికి ధరింప జేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయాడు . 

                                           కొలను పాక కోటి లింగం
.            నల్గొండ జిల్లా భువన గిరికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ”కొలను పాక”ఉంది .ఇక్కడి 
కాశీ బుగ్గ అనే బావి లో ని నీరు ”గంగా జలం ”గా భావిస్తారు .దీని ప్రక్కనే  శివాలయం ఉంది .అందులోని స్వామి ని ”అపర కాశీ  విశ్వ నాధుడు ”గా పూజిస్తారు .దీనికి దాదాపు ఎనిమిది వందల సంవత్స రాల చరిత్ర ఉంది .ఈ వూరికి నైరుతి భాగం లో ఒక చిన్న దేవాలయం లో ఒక శివ లింగం ఉంది .దీన్నే ”కోటి లింగం ”అంటారు .లింగం చుట్టూ గొలుసు లాగా అనేక లింగాలున్డటం ప్రత్యేకత .అందుకే ఆపేరు వచ్చింది .

      యజ్ఞోప వీతం ఉన్న కాళింగ  దేవి
   కరీం నగర్ జిల్లా లో మందెన గ్రామం ప్రసిద్ధి చెందినదే .మంత్ర కూటం అనే పేరు దానికి ఉండేది .నేపాల్ లోని పశు పతేశ్వర దేవాలయం లోని పూజారులు మందెన గ్రామ వాసు లేనట .ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేశాడట .ఇక్కడి శివాలయాన్ని అందుకే ”గౌతమేశ్వర ఆలయం ”అంటారు .ఇక్కడ భూమిని తవ్వితే బయట పడ్డ ఇటుకలను నీటి పై వేస్తె తేలి పోతాయట .ఇదీ ఇక్కడి వింత .అమ్మ వారు కాళిందీ దేవి .నల్ల రాతి విగ్రహం .ఆమెకు యజ్ఞోప వీతం ఉండటం విశేషం .అంతే కాదు గోదావరి నది మధ్యలో ఒక దిబ్బ మీద పాను వట్టం లో పద కొండు శివ లింగాలున్డటం వింతల్లో వింత అయితె నందీశ్వర విగ్రహం లో పద కొండు నందులున్డటం మరీ విడ్డూరం అని పిస్తుంది .మందెన గోదావరి తీర గ్రామం .వేద పండితులకు నిలయం .మన పూర్వ ముఖ్యమంత్రి మాజీ ప్రధాని బహు భాషా వేత్త పీ.వి.నర సింహా రావు గారిది కూడా ఈ గ్రామం కావటం మరో విశేషం .
                                                            మన వైపే చూసే నందీశ్వరుడు
        వరంగల్ జిల్లా హనుమ కొండ  కు 70 కి.మీ.దూరం లోఉన్న ”పాలం పేట ”చిన్న గ్రామం .గ్రామానికి ,చెరువుకు మధ్య రామప్ప దేవాలయం ఉంది .కాకతి చక్ర వర్తిన్గన పతి దేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం ఇకడే ఉంది .నక్షత్ర ఆకారం గా ఉండే వేదిక పై ఆలయం నిర్మించారు .పన్నెండు నల్ల రాతి యక్షినీ విగ్ర హాలు,ఆలయ పై భాగాన్ని మోస్తున్నట్లు గా శిల్పాలుంటాయి .అనీ కదులు తున్న బొమ్మల్లాగా కని పించటం విశేషం .ఆ శిల్ప శోభ అనన్య సదృశం .ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద సైజు ఇటుకలను ఉపయోగించారు .అవి తేలికగా ఉండటమే కాదు ,నీటి పై తేలటం విచిత్రం గా వుంటుంది .రుద్రేశ్వర స్వామి భారీ శివ లింగం .నాగిని అనే నగ్న స్త్రీ శిల్పం అందర్నీ యిట్టె ఆకర్షిస్తుంది .ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టూ కొన్నట్లుగా నిర్మించి ,అబ్బుర పరుస్తాడు శిల్పా చార్యుడు .ఆ శిల్ప సోయగం ఆనందపు అంచుల్ని చేరుస్తుంది .ఇక్కడి రుద్ర స్వామికి అభి ముఖం గా ఉండే నందీశ్వర విగ్రహం వింత గోలు పు తుంది .నందీశ్వరుని కళ్ళు మన వైపే చూస్తున్నట్లు గా ఉంటాయి .ఏ వైపు నుంచి చూసినా ,మనల్నే ఆయన చూస్తున్నట్లు గా చెక్కటం పరమాద్భుతం అని పిస్తుంది .నల్ల రాతి విగ్రహం లో అనంత మైన శిల్ప విన్నానాన్ని దర్శింప జేసిన ఆ శిల్ప బ్రహ్మ ..సృష్టికే ప్రతి సృష్టి చేశాడని పిస్తుంది .
                                                                  భారీ శిలా ధ్వజ స్తంభం
చిత్తూరు జిల్లా మదన పల్లి కి దగ్గర లో ”సోమ పాలెం ”శివాలయం లో 45 మీటర్ల ఎత్తు ఉన్ననాల్గు పలకల రాతి తో చేయ బడిన ధ్వజ స్తంభం చూపరులను విప రీతం గా ఆకర్షిస్తుంది .ఆనందం తో పాటు విప రీత మైన ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది .ఇంత భారీ రాతి ధ్వజ స్తంభం ఇంకెక్కడా లేదని చెబుతారు .ఈ స్వామికి రాతి రధం కూడా ఉండటం మరో విశేషం .ఈ భారీఆలయాన్ని విజయ నగర రాజులు నిర్మించారట .వారి కళా పోషణకు ,భక్తీ వైభవానికి ఇది మచ్చు తునక .
             సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -04 -12 .
                            కాంప్–అమెరి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7

  1. .మందెన గోదావరి తీర గ్రామం .వేద పండితులకు నిలయం .మన పూర్వ ముఖ్యమంత్రి మాజీ ప్రధాని బహు భాషా వేత్త పీ.వి.నర సింహా రావు గారిది కూడా ఈ గ్రామం కావటం మరో విశేషం -అన్నారు మీరు.ఈ విషయంలో కొంత వివరణ అవసరం.గోదావరీ తీర గ్రామం మందెన కాదు మంథని. అదలా ఉంచి 1921 జూన్ 28 న ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట
    సమీపంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు.మూడేళ్ళ వయస్సులో కరీం నగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయన్ని దత్తత స్వీకరించారు.
    అలా ఆయన స్వస్థలం వంగర అయింది. మరోసారి పరిశీలించ గోరతాను.
    – ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఎ. నుంచి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.