అమెరికా డైరీ
సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్
మేము ఇక్కడికి వచ్చి పది రోజులు దాటింది .రోజూ ఎక్కడో ఒకరింట్లో సాయి భజన ,ఆహ్వానం అందు కొంటున్నాం . .వెళ్లి వస్తున్నాం .రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు .భక్తీ ,శ్రద్ధలతో ఇక్కడి భక్తులు నిర్వ హించటం ఆసక్తి కరం గా ఉంది .చిన్న పిల్లల తో సహా యువకులు ,వృద్ధులు పాల్గొనట మే కాదు, పాడుతూ తమ భక్తీ వైదుష్యాన్ని చాటు కొంటున్నారు .
నిన్న అంటే 21 వ తేదీ శని వారం మా ఇంటికి దగ్గర లో పది నిమిషాల ప్రయాణ దూరం లో ఉన్న ”ఆక్సా కమ్యూనిటి సెంటర్ ”
లో షార్లెట్ సాయి సేవా సంఘం వారు గ్రీన్ బరో మొదలైన ప్రాంతాలలో ఉన్న మిగిలిన సాయి సెంటర్ వాళ్ళను అందర్నీ ఆహ్వానించి ఉదయం పది గంటల నుండి రాత్రి ఏడు వరకు ఒక కార్య క్రమాన్ని నిర్వ హించారు .దాదాపు నూట యాభై మంది హాజ రైన పెద్ద సమా వేశం .ఉదయం అందరికి టిఫిన్, కాఫీ ఇచ్చారు .పది గంటలకు సభ ప్రారంభ మైంది ”.టెడ్ హెన్రి ” ఫ్లారిడా కు చెందిన అమెరికన్ సాయి భక్తుడు. సత్య సాయి తో తనకున్న పరిచయం ,అనుభవాలను గురించి సుమారు ముప్పావు గంట మాట్లాడారు .ఆయన మొన్న సత్యా వాళ్ళింట్లో పరిచయం అయారు .సుమారు అరవై ఏళ్ళుంటాయి .మంచి పర్స నాలిటి . ఆ తర్వాత కాలి ఫోర్నియ కు చెందిన శ్రీ మతి సీమా మిల్లర్ .ఆ తరువాత శ్రీ సునీల్ కస్తూరి తమ అనుభవాలను వర్ణించారు .వీరందరూ సాయి తో ప్రత్యక్ష పరిచయం ఉంది ఆయన అభిమానాన్ని పొందిన వారే .కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు అయింది .అప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు .పొంగల్ తో లంచ్ .
మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ సమా వేశం ప్రారంభం .చిన్న పిల్లలు సత్య సాయి, మదర్ తెరెసా ,కబీర్, మార్టిన్ లూధర్ కింగ్ ,మీరా, కృష్ణా,గాంధి మొదలైన వేష ధారణ లతో వారి సందేశాలను విని పించారు .అయితె ఎవరు వచ్చి ఏ పాత్ర పోషిస్తున్నారో వాళ్ళిచ్చే సందేశం ఏమిటో ఒకరిద్దరు పిల్లలతో చెప్పిస్తే ఇంకా నిండు గా ఉండేది .పిల్లలకు ప్రోత్సాహం గా ఉండేదని పించింది .ఇక్కడఅవగాహనా లోపం కని పించింది .
మూడు గంటల నుంచి మళ్ళీ మిల్లర్ ,కస్తూరి ల అనుభవ సందేశాలు .ఆ తర్వాత టీ బ్రేక్ .అయిదింటి నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన సాయి కేంద్రాల వారు ఆలాపించిన భజనల తో ఆధ్యాత్మిక వాతా వరణాన్ని కల్గించారు .
దీనికి ముందు అతిదులైన టెడ్ ,మిల్లర్ .కస్తూరి లకు జ్ఞాపికలు అందించారు .రేవతీ రామ చంద్రన్ గారి అమ్మాయి కి ,ఇంకొక అతను సైన్సు లో అవార్డ్ పొందినందుకు సత్యా వాళ్ళిద్దరిని పరిచయం చేసి జ్ఞాపికలను అంద జేశారు .వారిద్దరూ తమ కృషిని క్లుప్తం గా వివ రించారు . .
రాత్రి ఏడు గంటలకు డిన్నర్ .చపాతి ,రెండు కూరలు ,వెజిటబుల్ బిర్యాని ,పెరుగన్నం ,సేమ్యా పాయసం .తో విందు సుష్టు గా ఉంది .మా అమ్మాయి విజ్జి ,రాధ .సీతా, ఉషా ,మొదలైన వారంతా ఇంత మన్దికీ ఇన్ని రకాల అయిటంస్ ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొని వచ్చి ఆప్యాయం గా వడ్డించి అతిధి మర్యాదలు చేశారు .నాన్ స్టాప్ గా కాఫీ ,తేనీరు అందిస్తూనే ఉన్నారు .పిల్లలకు బిస్కట్లు .పీజా బర్గర్లు పెడు తూనే ఉన్నారు .భజన బృందం లో సత్య గొప్ప హార్మని విద్వాంసుడు .ఇంకో సత్య మంచి తబలా వాద్య కారుడు .కంజీర రవి బాగా వాయిస్తాడు .డాక్టర్ సదా శివ గారబ్బాయి పియానో కళా కారుడు .వీరందరినీ సమీకరించి నిర్వహణ చేయటం లో సుబ్బ రాజ్ కృత క్రుత్యుడయారు .ఈ భజన బృందం మంచి క్రమ శిక్షణ కలిగి అందరి అభి మానాన్ని పొందింది .
నాకు అని పించిన విషయాలు –ఒక హాలిడే రిసార్ట్ కు వచ్చిన భావం కలిగించేట్లుంది .కాని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చిన అనుభూతి కల్గించ లేక పోయారు .ఏ సమయం లో పడితే ఆసమయం లో కాఫీ టిఫిన్ తింటున్డటం సమావేశానికి ఇబ్బంది కరం అని పించింది . బహుశా ఇక్కడి పధ్ధతి ఇంతే నేమో ? కాని ఇళ్ళ దగ్గర ఎవరు ఇలా చేయటం నాకు ఈ పది రోజుల్లోనూ కని పించలేదు .నిర్ణీత సమయం లోనే వాటిని అంద జేయాలి .లేక పొతే అనుకున్న ఫలం రాదు .పిల్లలను ప్రభావితం చేసే అంశాలతో వారిని ఆకర్షించే ,వారి జీవితాలను ప్రభావితం చేసే విధానం గా కార్య క్రమాలున్డాలి .మంచి కధలను మానిటర్ ద్వారాతెలియ జేయాలి .వాళ్ళు నేర్చుకోన్నని ప్రదర్శించే వీలు కల్పించాలి .అలాగే అవధాని రావణ భుజంగ స్తోత్రం, నమక చమకాలు, ఉపనిషత్తులు స్వయం గా నేర్చు కొంటున్నాడు .ప్రోత్సాహకరం గా వారినిసభకు పరిచయం చేయాలి .ఇంకేదైనా విద్యలో ప్రావీణ్యం ఉన్న వారిని పరిచయం చేయాలి .ఉపన్యాసాలు సుదీర్ఘం అని పించ కుండా జాగ్రత్త పడుతూ మధ్య మధ్యలో బాగా పాడే వారితో మంచి పాటలను పాడిస్తే ఇంకా బాగా కార్య క్రమం రక్తి కట్టేది .వారికీ గొప్ప ప్రోత్సాహం లభించేది .మూస ప్రోగ్రామ్స్ వల్ల ఆశించిన ఫలితం రాదు .సృజనకు ఎక్కువ ఆదరణ నివ్వాలి .
సత్య సాయి ఉన్న కాలమ్ ”బంగారు యుగం ”అనే భావనతో నిర్వ హించిన కార్య క్రమం ఇది . ఆయన అందర్నీ ”బంగారు ”అని పిలవటం అందరికి తెలిసిన విషయమే .ఆ స్ఫూర్తి ని కల్గించటం లో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసు కొంటె బాగుండేదని పించింది .కార్య కర్తలు బాగా శ్రమించారు .ఖర్చూ పెట్టారు .ఆడ వాళ్ళు శ్రమ పడి కమ్మని వంటలు వండి, వడ్డించారు .దీనికి తగ్గ ప్రతిఫలం రావాలి .అందరు స్వచ్చందం గా సేవ చేయటం బాగా ఉంది .విరాళాల జోలికి పోకుండా ఎవరికి అప్ప గించిన పని వాళ్ళు చేసుకు పోతున్నారు .మెడికల్ కాంప్ లను .పేద జనులకు ఆహార సరఫరా ను నిర్వహించటం షార్లెట్ కేంద్రం సాధించిన విజయాలు .సమష్టి బాధ్యత తో అంతా నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని పొంద గలుగు తున్నందుకు అభి నంద నీయులు.సేవా భావం ,అంకిత భావం లతో నిర్వ హిస్తున్న కార్య క్రమాలివి . అందుకే ”సాయి సంకీర్తన షవర్ల తో పునీత మైంది షార్లెట్ ”అని పించింది .
అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్ -2
. మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -04 -12
కాంప్ –అమెరికా

