వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7
కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని తట్టే కధలు అవి .గాంభీర్యాన్ని సంత రించు కొంటాయి .వీరికి మార్కెట్ విలువ బాగా తెలుసు .విదేశాలలో ఉద్యోగాలు దాదాపు వీరివే .కనుక తాపీగా జీవితం సాగి పోతుంది .కధల్లో విలువలను ఆశిస్తారు .మానవ సంబంధాలను కాపాడు కొంటారు .అభ్యుదయం వైపుకు నడక సాగిస్తారు .ఆ తరహా కధలే రాస్తారు .ఇక్కడ ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది .పోలా ప్రగడ ,పెద్ది భోట్ల ,విహారి ,సి.రా .అన బడే సింగ రాజు రామ చంద్ర మూర్తి ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ ,బి.వి.ఎస్.రామా రావు ,జానకీ జాని అని పిలువ బడే సామ వేదం జానకి రామ శాస్త్రి ,భ.రా.గో.జరుక్ శాస్త్రి అయిన జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి ,మాలతీ చందూర్ ,శంకర మంచి సత్యం ,సోమంచి రామం ,దొండ పాటి దేవదాస్ ,మొదలైన వారంతా జీవితపు విలువలకు అద్దం పట్టే కధా ముత్యాలను అందించారు .మనసుకు ఊరట కల్గిస్తూ ,హాస్య ,వ్యంగ్యాలను సమ పాళంగా మేళ విస్తు కధా రచన చేశారు .ప్రగతి ఫలాలను ,ప్రభుత్వం ఇచ్చే తీరును వివ రించారు .స్త్రీ సమస్యలకు సాంత్వన కల్గించారు .గోదావరి ,అమరా వతీ కధల్లో మనిషి లోని సత్తాను ,అతను ఎదగ గల ఎత్తుల్ని ,దిగ జారే లోతుల్ని ,చీకటి లోనూ మిణుకు మిణుకు మంటున్న ఆశా జ్యోతి ని గోదావరి సోగసుల్ని ,కృష్ణమ్మా అంద చందాలను సామాజిక న్యాయాలను ,అంతఃకరణ లను ,వైరుధ్యాలను కాసేపయినా అన్నీ మరచి ఆనందాన్ని అనుభవింప జేస్తాయి .
ఇక ఉత్త రాంధ్ర కు వస్తే ముప్ఫై ఏళ్ళ క్రితమే పోరాటం సాహిత్య స్థాయి పొందింది .గిరిజనుడే కధా నాయకుడైనాడు .వి .ర .సం. ప్రభావం ఎక్కువ .ఇక్కడి ప్రజల జీవన పోరాటాని ఆర్నాద్ ,రామానుజం లు కధలుగా మలిచారు .అయితే రచయితలూ నిర్బంధాలకు గురై నారు .ఇక్కడ రాచరికం చాయలు కమ్ము కున్నాయి .వాటిపై పతంజలి స్పందన కలిగించే కధలు రాశాడు .గత వైభవాన్ని తలచు కొని మురిసి పోయే వారి కధలూ వచ్చాయి .చిద్రమైన పల్లె బతుకుల్ని పంతుల జోగా రావు ,రాసి గుండెల్ని పిండాడు .1985 వరకు ఇక్కడి కధలన్నీ విప్లవానికి పెద్ద పీట వేశాయి .తరువాత వచ్చింది గిరిజనాభి వృద్ధి పధకం .అందులో వారికి చేరేది స్వల్పం .మధ్య మింగేది అనల్పం .రగిలిన గిరిజనులు సామూహక శక్తి తో పోరాటం చేశారు .ఈ కదలని గౌరు నాయుడు అద్భ్తం గా చిత్రించాడు .ఆధునిక వ్యవసాయం ,నకిలీ విత్తనాలు ,పరుగు మందులు రైతుల్ని ముంచే శాయి .పేరుకే ప్రాజెక్టులు కాని నిలిచే నీరే లేదు .ఈ విషయాలపై బమ్మిడి జగదీశ్వర రావు ,గౌరు నాయుడు ,’’గతుకులు ‘’,’’తిరుగుడు గుమ్మి ‘’కధల్లో చక్కగా ప్రతి ఫలింప జేశారు .ఇక్కడి నదులైన నాగావళి ,వంశధార ,జన్జ్హావతి పేరా కధా సంకలనాలు వచ్చాయి .ఆ జన జీవితాన్ని కళ్ళకు కట్టించాయి .పని చేయని పరిశ్రమలు ,సమ్మెలూ ,వృత్తుల సంక్షోభం పై మంచి కధలే వచ్చాయి .ఆది వాసి జీవితాల్లో నాగరకత తెచ్చిన మార్పుల్ని వాళ్ళ సంస్కృతి పొందు తున్న పరి ణామాలు పై ‘’సుక్కి’’ ‘’,గోరపిట్ట ‘’కధల్లో జగదీశ్ చిత్రించాడు .అటవీ సంపదను అందించే ఇక్కడి భూమి పుత్రులజీవితం లో వచ్చిన మార్పులను ,వాటికి కారణాలను అన్వేషిస్తూ కాళీ పట్నం రామా రావు ,’’అన్నేమ్మ నాయురాలు ‘’అన్న కధను అత్యద్భుతం గా చిత్రించారు .సృజనాత్మక కధ కు ఉత్త రాంధ్ర ప్రాముఖ్యం పొందింది .కమల కుమారి ,కూర్మనాద్ ల కధలు చైతన్యానికీ ,సామాజికంశాలకు ప్రాధాన్యత నిచ్చాయి.
ఇంతటి సామాజిక స్పృహ తో ,సంఘర్షణ లతో అన్ని ప్రాంతాల నుండి కధలు వచ్చి చేరు తున్నాయి .వీటన్నిటికీ అతీతం గా గత రెండు దశాబ్దాలలో ఒక గొప్ప కధ వచ్చింది .అదే శ్రీ రమణ రచించిన ‘’మిధునం ‘’.ముసలి దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని ఎగతాళి లోని సోగసుల్ని గుండె లోతుల్లో నిండి ఉక్కిరి బిక్కిరి చేసిన అనురాగాన్ని ప్రేమ, ఆత్మీయతల్ని స్వతంత్ర జీవ నాన్ని భార్యా భర్తలకు ఒకరి పై ఒకరికి ఉండాల్సిన అనురాగాన్ని అద్భుతం గా ఆవిష్కరించిన కధ మిధునం .మనో ధైర్యాన్ని గుండె దిటవు ను , ,సమస్యలను అధిగమించటం లో చూపే నేర్పును ,ప్రక్రుతి ఓడి లో జీవించే సోబగును ఈ కధ అద్దం పట్టింది .కధా మాణిక్యం గా విమర్శకులు మెచ్చిన అచ్చ తెలుగు కధ ఇది .శ్రీ బాపు ఈ కధను స్వహస్తాలతో రాస్తే ముద్రణ భాగ్యం పొందిన అరుదైన మా మంచి తెలుగు కధ .మంచి కధకు నిర్వచన మైన కధ .కధా శిల్పానికి మచ్చు .చుక్కల్లో చంద్రుడు లాంటి తెలుగు కధ .ఏ ఇజం లేదు మానవిజమే తప్ప.ఈ కధ రాసి శ్రీ రమణ కధా శ్రీ రమణుడు అయ్యాడు . .ధన్యత చెంది ఆంద్ర చదువరులను ధన్యం చేశాడు .
గ్లోబలైజేషన్ పరిణామాలను చిత్రించే కధలూ కొ కొల్లలు గా నే వచ్చాయి . ఆర్ధిక సంబంధాలు తప్ప దంపతుల్లో మమతాను రాగాలు కరువై పోతున్నాయి .’’భవ బంధాలు ‘’కధ లో పేగు సంబంధానికి దూర మై పోతున్న వృద్ధాశ్రమ జీవుల దయనీయ గాధ కని పిస్తుంది .పిల్లలు వారికి నచ్చిన వారిని చేసుకొనే పరిస్తితి ,భాగస్వామిని ఎన్ను కొనే ఛాయిస్ ,స్థిర జీవితాన్ని పొందే హక్కు ఉందని భమిడి పాటి జగన్నాధ రావు ‘’మంటల్లో జాబిల్లి ‘’కధ రాశారు .కోస్టల్ కారిడార్ ,హైటెక్ రోడ్లు వల్లధ్వంస మైన పేద నడిమి రైతుల కుటుంబాల కధలను ఖదీర్ బాబు రాస్తే ,గోదావరి తీరం లో ఏమీ చేయ టానికి ఏమీ లేక బతుకీడుస్తున్న బక్క జీవుల గురించి పతంజలి శాస్త్రి రాశాడు . పుస్తకం చదివే అలవాటు లేని వాడు జీవితాన్ని ఏమి అర్ధం చేసుకొంటాడు .అన్న ప్రశ్న వేశారు తన కధలో చోర గుడి జాన్సన్.బంధనాలు బలహీన మైనా ,తెగితే తప్ప కొత్త ముడి పడదని జాన్సన్ విశ్వాసం .ఆపదలో ఉన్న వారిని ఆదు కోవ టానికి పెద్ద వాళ్ళ మైన మనకు సందేహం,బిడియం ,ఎవరేమను కొంటారో నన్నభయం .పసి హృదయాలకు సాయం చేయాలన్న ఆరాటం ఎక్కువ .అది చూసి సిగ్గు పడుతుంది తల్లి .మల్లీశ్వరి రాసిన ‘’శిశు వాదం ‘’ కధలో . ఎదుగు తున్న పిల్లలు తలిదండ్రుల సంరక్షణ లో ఉండటం అదృష్టం అని కేసిరాజు ఫణి ప్రసాద్ ‘’నిన్నటి వెన్నెల ‘’కధలో చెప్పారు .
సశేషం —మీ –గబ్బిట durgaa ప్రసాద్ —-30-04-12.
క్యాంపు-అమెరికా

