వందేళ్ళ తెలుగు కధ –8
పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా భావం వస్తుంది .అనీ దామ్పత్యమే అయితే ,గట్టి బంధం అనీ సుంకోజీ దేవేందరా చారి కధ ‘’తను –నేను ‘’లో తెలియ జేశారు. టీనేజి లో కాలు జారితే ఎంత ప్రమాదమో ఒక పెద్దాయన చెబితే విని ,ఆకర్షణకు లోను కాకుండా తన జీవితాన్ని కాపాడు కొని ,ఇతరులను ఆ ప్రమాదం నుండి బయట పడేస్తుంది సుందరి మాచి రాజు కామేశ్వర రావు రాసిన కధ ‘’ఆ అమ్మాయి ‘’. లో.మంచి చేసిన వారు ఎంత చిన్న వారైనా గౌరవించాలి ,అభినందించాలి .ఇది సామాజికం గా మన బాధ్యత .అని చెప్పే కధ వరలక్ష్మీ మురళీ కృష్ణ రాసిన ‘’నమ్మకం ‘’.భార్యా భర్తలు అంటే ,పరస్పర నమ్మకం ,గౌరవం కలిగి ఉండటం .భార్య మంచి సలహా చెబితే ఆచరించాలి కాని జెండర్ భేదానికి తావు ఈయ రాదు .ఆమె చదువు కున్నదీ, ఉద్యోగినీ అయితే ఆమె మాటకు విలువ ఎక్కువే .తమ స్వంత ఊరిని అమెరికా లో సంపాదించిన డబ్బుతో బాగు చేసిన దంపతుల కధ రామా చంద్ర మౌళి రాసిన ‘’గుగులోత్ రమణి ‘’.’’ఊరంతా ఒక కుటుంబం .ఒక అవిభాజ్య వ్యవస్థ .నైతిక విలువలకు కట్టు బడి ,ప్రేమ వాత్సల్యాలతో బంధింప బడ్డ ఒక మానవ సమాజం ‘’అన్న రమణి మాటలు శిరో దార్యమే .అదీ మనం కోరుకొనే సామాజిక స్పృహ .రావలసిన మార్పు ఆలోచనలో ,ఆచరణలో .సాహితీ సేవ చేస్తూ ,అయిన వాళ్ళ తో అనుబంధాలు ,ఆత్మీయతలు పంచు కోవాలని రఘు నందన్ రాసిన ‘’ఇంకా ఉంది జీవితం ‘’కధ తెలియ జేస్తుంది .
లారీ డ్రైవర్ ఇంటిని వదిలి ,ఎన్నో రోజులు బయటి ఊళ్లలో ఉండాల్సి వస్తుంది .చీకటి తప్పు చేస్తాడు .ఎయిడ్స్ వచ్చి ,కుటుంబానికి దూరమై పోతాడు .మానవ బలహీనత కు అద్దం పట్టిన ఈ కధ ‘’ఈ పాపం ఎవరిది’’ ?నిజం ను ,బ్రిటీష వాళ్ళను మించి దాష్టీకం చేస్తూ ,పోలవరం డాం వల్ల ముంపుకు గురి అవుతున్న జన ఘోష వినని బది రాన్ధక ప్రభుత్వాన్ని ఏది రించ టానికి నిర్వాసితులు ‘’పోటెత్తిన జన సంద్రం ‘’లా గర్జించే సంఘటనే నరసింహా రావు కధ.ఉద్యమ కారుడు కాల క్రమం లో పెట్టుబడి దారు అవటం లోకం లో జరుగుతున్నా తీరే ‘’ఏళ్ళ లన్నీ తుడిచే సీ ‘’కధ .ఇలా సామాజిక స్పృహ ,కర్తవ్యం ,నిబద్ధతా బోధించే కధలే ఇవన్నీ .కావలసినవి అన్నవస్త్రాలు కాని అణ్వాయుధాలు కాదు అని స్పృహ కల్గించే కధలు ఈ మధ్య చాలా వచ్చాయి .సామాజిక స్పృహ ,న్యాయం ప్రజలకు కూడా ఉండాలి .లేక పొతే కాకుల్ని కొట్టి గద్ద లకు పెడతారు .భర్తకు నయం కాని వ్యాధి .చూసే పిల్లలు లేరు .అయినా ఆమె అతన్ని కంటికి రెప్ప లా చూడాలని నిర్ణయించు కొంది .అతను చేసిన తప్పు తెలియ జెప్పి ,క్షమించింది .ఇలాంటి అవగాహన్ ఉండాలని చెప్పిన కధ లు బానే వచ్చాయి .ఏదో చూసి చూడనట్లుగా పోవటం నాక గా బతకటం అందరికి చేత నయ్యె పని కాదు .కాని దాని వల్ల అతను పొందింది నష్టమే .మంచి వాళ్లకు కాలం కాదు ఆపద సమయం లో గ్రామాలను దత్తత తీసుకొని ,ఏదో సాయం చేస్తున్నట్లు నటించే వారినీ ,దళారీలను నిలదీసి ఆహార సామగ్రి కోసం ఎలుగెత్తిన జన ఘోష విని పిస్తాడు జ్వాలా ముఖి ‘’పంజరం యెగిరి పోయింది ‘’కధ లో .ఇది 1977 దివి ఉప్పెన నాటి కధ .
ప్రజా చైతన్యం రోజు రోజుకూ పెరిగి పోతోంది .సెజ్ ల పేర పేద వారి భూముల్ని లాక్కొని ,ఏదో చిత్తం వచ్చి నంత వాళ్ళ మొహాన కొట్టి ,బలవంతం గా తీసుకొనే పరిస్తితి పోయింది .భూమికి భూమి కావాలని పట్టు బడుతున్నారు బాధితులు .సాధించు కొంటున్నారు కూడా .ఐకమత్యమే వారికి సాధనం గా ఉంది .భూముల్ని నిల బెట్టు కోవాలంటే ,సునామీలను ,తుఫాన్లను ఎదుర్కొనే దాని కన్నా బలం గా నిలబడాలని .లేకుంటే మట్టి రేణువు కూడా మిగలదు అన్న సత్యాన్ని కాట్రగడ్డ దయానంద్ ‘’మనిషి –మట్టి ‘’కధలో చూపించారు మనుషులు సంఘటితం కాక పోతే కూలి పోవటం ఖాయం .చేసిన అప్పులు తీర్చ లేక రైతు పడే వ్యధ ,కూలి పోయే కుల వృత్తుల గురించి ,’’కంచి మేకలు ‘’కధ లో సిరం శెట్టి కాంతా రావు వర్ణించారు .విత్తనాల మాయా జాలం ,దళారీ మోసాలు ,రైతులకు ,కుల వృత్తులు చేసుకొనే వారికి ఉన్న సంబంధాలను అవి మ్రుగ్యమావు తున్న తీరు ను ప్రసంశాత్మకం గా రాశారు .అక్షర చిత్రీకరణమే చేశారు .ఇవన్నీ మాన వీయ కోణాలను ఆవిష్కరించిన కధలే .’’వ్యవసాయం అంటే రైతు నిరంతరం ప్రక్రుతి తో చేసే సంభాషణ ‘’అన్నాడు ఉదయమిత్ర అనే కధకుడు తను రాసిన ‘’గుప్పెడు మట్టి ‘’కధ లో .ఎట్టి పోతల పధకాలలో ‘’వాన్పిక్ ‘’సమస్య వస్తుంది .కళకళ లాడే పొలాలు కాలుష్యపు మేఘాలై ,రోగాల నిలయాలై ,జన జీవితం ఆస్తవ్యస్త మై పోతుంది .అనే సామాజికామ్శాన్ని జి.వి.క్రిష్నయ్య ‘’పాలరేవు వంతెన ‘’కధ లో తెలియ జెప్పాడు .వెయ్యి గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వాన కు కూలి పోతుందనే సామాజిక సత్యాన్ని తెలియ జేశాడు .
దళారీల కోరల్లో మచ్యకారులూ నలిగి పోతున్నారు .రైతుల దగ్గర నుంచి కావలసిన వన్నీ తెచ్చు కొనే వారు .ఇప్పుడు ఆ సంబంధాలన్నీ తెగి పోయాయి .ఎక్కడో ఉన్న గుజరాత్ కు వెళ్లి బాగా సంపాదించు కొని వస్తాడని కొడుకుని పంపితే అక్కడ అతను ఉన్న బోటు పాకిస్తాన్ వాళ్ళ తుపాకి గుళ్ళకు గురైంది .ఉన్నాడో ,పోయాడో తెలీని స్తితి .దీన్ని అద్భుతం గా వర్ణించాడు గురుపాక శివ రావు ‘’కోర్లయ్య’’కధ లో .ఇందులో మచ్యకారుల దీన గాధ కళ్ళకు కడుతుంది .కరువు కోరల్లో చిక్కిన జంతువులూ తిరగ బడుతాయి’’ .స్పెషల్ గ్రాస్ జోన్లు ‘’వద్దు అంటాయి .సరదా గా శాంతి కుమార్ రాసిన కధ ‘’కరువు ‘’లో వ్యంగ్యం ఇదే .’’కరువు గల దేశాన పరువు కే కరువు –పరువు గల దేశాన కరువు కే కరువు ‘’
ఇక మద్యం సెలఎరుల్లా పారిస్తున్న బెల్ట్ షాపు కధలెన్నో చెప్పలేం ఎన్ని జీవ నదుల కైనా ఆన కట్టలు కట్ట వచ్చు .కాని పారుతున్న మద్యపు నదికి అదే మన అన్న రామా రసో గారి ‘’వరుణ వాహిని ‘’కి మాత్రం ఎవ్వడూ ఆనకట్ట కట్ట లేదు .కనీసం మట్టి కట్ట కూడా కట్టలేం .ఎన్నికలలో ధన ప్రవాహం ,మద్యం జోరు జంట పాయలు గా ప్రవహించి ఓటట్లను ముంచి ఎత్తేస్తాయ్ .విలువలన్నీ డ్రైనేజి పాలవుతాయి .ప్రభుత్వం తన చేతి లో ఉన్న అత్యంత సమర్ధం గా నిర్వహింప బడు తున్న రవాణా సంస్థను ప్రైవేటు పరం చేయాలనే నక్క జిత్తులు చేస్తుంది .దివాలా కూడా తీయిస్తుంది .ప్రైవేట్ రవాణా బస్సులు లేని మంత్రి లేడు .పెట్రోలు సబ్సిడీ కోసం కోటాను కోట్లు అప్పు తెస్తుంది .ఆ సబ్సిడీ విదేశీ కంపెనీల పరమౌతుంది .ఆ సంస్థ లో పని చేసే ఉద్యోగస్తుల ఉద్యోగాలు దిన దిన గండం .కొత్త ఉద్యోగాలు హుళక్కి .దీన్నంతటినీ ఒక విష వలయం గా మార్చింది ప్రభుత్వం . కావాలనే ఇలా చేస్తోంది .సామాన్య వ్యాపారాలను కూడా మల్టీ చైన్ షాపుల వాళ్ళే చేస్తూ వీరి నడ్డి విరగ గోడుతున్నారు .చిరు వ్యాపారులు చేతులు ఎత్తేస్తున్నారు . .తన షాపును మల్టీ వాడికి అమ్మి ,అందు లోనే ఉద్యోగం చేసే వాడి కర్మ కాలిన కధే ‘’ఆరోహణ లో ఆవ రోహరణం ‘’.దీన్ని శీలా సుభద్రా దేవి మంచి కధనం తో కొత్త సామాజికామ్శాన్ని చక్కగా చిత్రీకరించింది .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —1-5-12
కాంప్- అమెరికా

