వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )
ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను తెలియ జేశారు .వివిధ కోణాల్లో విశ్లేషించి నిగ్గూ తేల్చారు ..విషయం ఒక్కటే అయినా ఎవరి చూపు వారిది .అస్త్ర సన్యాసం చేసిన కధకుల్ని మళ్ళీ ప్రోత్స హించి ,తానూ రాస్తూ చాలా మందిని మళ్ళీ లైన్ లో నిల బెట్టారు శ్రీ వేదగిరి రాంబాబు .కధా సరిత్సాగరం లో ఆయన ఒక ఉద్ధృత తరంగం .కధా రచయితలను సంఘటిత పరిచారు. కధా సదస్సు లను నిర్వ హించి ప్రేరణ కల్గించారు . వందేళ్ళ తెలుగు కధా పండుగ కోసం ,రెండేళ్ళ నుంచే అన్ని ప్రాంతాలలో కధా సదస్సులను నిర్వ హించి చైతన్యం తెస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాం బాబు గారికి ఇదే పని .తాను నిద్ర పోలేదు .కధకుల్ని , చదువరు లను నిద్ర పోనీయ లేదు .కధే ఊపిరిగా జీవిస్తున్నారు .మాధ్యమాలు కూడా మంచి ఊతం ఇచ్చాయి .చట్రం లో బిగించినా విస్తృత పరచటానికి దోహదం చేశాయి .పెద్ద కధ నుంచి ,చిన్న కధ ,పేజీ కధ ,కాలం కధ ,కార్డు కధ ల పరిణామం మనం అందరం చూశాం .గొలుసు కదల విన్యాసం చూశాం .నేల విడిచి సాము చేసిన కధలేవీ మిగల్లేదు .తాత్కాలికోద్రేకం నిలబడదు. .శాశ్వత విలువలున్న కధలు వేలాదిగా రాక పోయినా పదుల సంఖ్య లో నైనా వచ్చి ఆణిముత్యాలని పించు కొన్నాయి .రేడియో ,దూర దర్శనులు తెలుగు కధకు వెన్ను దన్ను గా నిల బడ్డాయి .మంచి కధలను విని పించినాయి . బుల్లి తెరకు ఎక్కించాయి .. .ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆ రెండు మాధ్యమాలకు తెలుగు కధా ప్రియులు జేజేలు పలుకు తున్నారు .ఉత్తమ కధలకు పత్రికలూ గొప్ప పురస్కారాలను అంద జేస్తున్నాయి .ప్రత్యెక కధా సంచికలనూ ప్రచురించటం విశేషం .మూస కధలు మూల పడుతున్నాయి .కధా ,కదన బలం ఉన్నవి హృదయాలను చేరుతున్నాయి .మువ్వన్నె కధలు రెక్కలు తోడుక్కున్తున్నాయి .ఇది శుభ పరిణామమే అయితే ఇంకా విస్తృత పరిధి లో కధలు రావాలి .
ఇప్పటికీ కధకు ,కధానిక కు తేడా ఏమిటో సంతృప్త కరం గా నిర్వచింప బడ లేడు .’’ముడి వజ్రం కధ ,సాన బెడితే కధానిక ‘’అన్నది అందరికి నచ్చింది .రెండు పేర్ల తోనూ పిలుస్తున్నాం .ఇబ్బందేమీ లేదు కని పించదు.అమెరికా .యూరప్ దేశాలకుమేధోవలస ఎక్కు వై పోయింది .తొలి తరం వారికి తెలుగు భాషా సాహిత్య సాంప్రదాయాలతో పరిచయాలు ఇంకా ఉన్నాయి .రెండో తరం వారిలో బాగా తగ్గు ముఖం పడితే తర్వాతి తరాలకు ఆ వాసనే తెలీటం లేడు .ఇది ఒక పెద్ద సమస్య గా వారే బాగా బాధ పడుతున్నారు .వీటిని ఆధారం చేసుకొని ఇప్పుడు కధలు రావాల్సిన అవసరం ఉంది .కార్పోరేట్ సంస్థలు దివాలా తీస్తున్నాయి .వీటి ప్రభావం జన జీవితం మీద ఎలా ఉందొ కొన్ని కధలు వచ్చినా వైవిధ్యం గా రావాలి .సైన్స్ ,సాంకేతికత తెచ్చిన మార్పులను కవన శర్మ ,వంటి వారు కొద్దిగా రాసినా ఇంకా అనుభవ పూర్వక కధా స్రవంతి రావాలి .అంత రిక్ష పరిశోధన ,,గ్రీన్ హౌస్ విషవాయువులు ,తెచ్చే ఇబ్బందులు ,ఇప్పుడు కధల్లో జీవం పోసుకోవాలి .ఇది తక్షణ కర్తవ్యమే .అత్యాధునిక ‘’గూగుల్ ఎర్త్ ‘’ల ప్రయోజనం ఎంతో ,వాటి చేటు ఏమిటో దేశాల అంతరంగిక భద్రత కు అవి ఎలా పెను సవాళ్లు గా మారుతున్నాయో ఆలోచింప జేసే కధలు రావాలి .రాయమని ప్రోత్స హించాలి కూడా .మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం కల ల ప్రయోజనం, అవి భవిష్యత్ తరాలకిచ్చే సందేశం ,గురించి విస్తృత మైన కధా రచన జర గాలి .అమ్మ కానికి ఇక ఉన్న భూములన్నీ అయి పోయాయి .మిగిలింది నదులు ,సముద్రాలే .ఈ ప్రమాద ఘంటిక లను కధల్లో మోగించాలి యువ రచయిత లంతా .
గీసుకొని కూర్చున్న వలయాలను దాటి చూపు ఊర్ధ్వం గా, ఉన్నతం గ సాగే బావాల వ్యాప్తి రావాలి ..ఏది రాసినా మానవీయ కోణాలను మరిచి పోరాదు .ఆర్ద్రత శిఖరా రోహణం చేయాలి .మేధ కు పదును పెట్టినా ,గుండెను హత్తు కోవాలి .అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ ,మూలాలను జ్ఞప్తికి తెస్తూ భావ పరిధి ని పెంచే కధలు రారావాలి .పదేళ్ళ కోసారి కధా మూల్యాంకనం జరగాలి .మనం పోతున్న దారి ఎటో సమీక్షించు కోవాలి .ఉత్తమ సంస్కారాన్ని బోదించి ,ఇరుకు గదుల భావ ఆవరణాలు దాటి విశాల హృదయ గవాక్షాలు తెరిచి సంస్కారాన్ని అందించాలి కధకులు .ఇది బాధ్య త గా వారంతా భావించాలి .అప్పుడే కధలు సీమాంతర ప్రస్తానం చేసి ధ్రువ తారలు గా నిలిచి పోతాయి .సమాజ జీవన చిత్రణ చేస్తూ సమకాలీనం నుండి ,సార్వ కాలీనం వరకు భవిష్యత్ కధా ప్రస్తానం సాగాలి ‘’.సంస్కృతి జీవన విధానమే .పరి పూర్ణత కోసం చేసే ప్రయత్నమే సంస్కృతి .’’ అన్నాడు పండితుడు ఆర్నోల్డ్ .’’ఈశ్వరుని పిత్రుత్వాన్ని ,మానవుల సోదరాత్వాన్ని ,ఉత్తమ సాహిత్యం ప్రబోధించాలి ‘’అన్న టాల్స్టాయ్ తాత మాటలు ముత్యాల మూటలే.దీన్ని మరచి పోకుండా కధా రచన సాగితే అవి సార్వ కాలీనం గా నిలుస్తాయి .
వాస్తవ చిత్రణ మంచిదే .కాని ఆదర్శ ప్రకాశం ఉండాలి .మళ్ళీ తెలుగు కధ ఒక వెలుగు వెలగాలి .రాసి కంటే వాసి కి ప్రాధాన్యమివ్వాలి .మన కధకుల కధా రచన’’ శత ధార ‘’.వారు తలచు కుంటే విశ్వ కధా వీధి లో తెలుగు కధ వెన్నెల వెలుగులు నింపి జగజ్జేగీయ మానం గా నిల బడుతుంది .శిల్పం అనల్పం గా ఉంటె కధకు స్థాయి వస్తుంది .’’the greatest writer is not who does the best ,but who sujjests the most ‘’అన్న ఫ్రెంచ్ రచయిత అభిప్రాయం అందరు గుర్తించాలి ‘’.మంటి నుండి మింటికి ప్రయాణించే మానవుడిని ఉద్ధరించ గల ఉత్తమ శక్తి సాహిత్యానికే ఉంది ‘’. ‘’time past ,and time future are perhaps present in time present ‘’అన్నాడు ప్రముఖ ఆంగ్ల కవి ,రచయిత ,విమర్శకుడు ఇలియట్ .’’ప్రాత కొత్తల కౌగిలింతల ప్రసవ మగు బంగారు కాంతులు ‘’రావాలని దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి ఆశయం మనందరిది .తెలుగు కధ ‘’శతమానం భవతి దాటింది .సహస్ర మానం లో అడుగు పెట్టింది’’.అభ్యుదయ మగు గాక .శుభం భూయాత్ .
సమాప్తం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —3-5-12
కాంప్-అమెరికా

