అమెరికా డైరీ అమెరికా లో అహోబిలం


                                        అమెరికా డైరీ

                                                             అమెరికా లో అహోబిలం

           నిన్న శనివారం ,ఈ రోజు ఆదివారం అంటే అయిదు ఆరు తేదీలులు సరదాగా గడిచి పోయాయి .నిన్న అంటే మే అయిదవ తేది శని వారం సాయంత్రం అందరం సౌత్ కెరొలినా లో ట్రూహోమ్స్  లో ఉంటున్న రాంకీ ఉషా దంపతుల ఇంటికి అందరం కలిసి వెళ్ళాం .ఇక్కడి నుంచి పావు గంట ప్రయాణం .రాంకీ ఉషా ఇద్దరు ఉద్యోగులే .ఇక్కడికి వచ్చి నప్పటి నుండి బాగా పరిచయం అయినవాళ్ళు .మంచి వాళ్ళు .అంకుల్ ,అంటి అని మా ఇద్దర్ని ఆప్యాయం గా పిలుస్తుంటారు .ఏరి కోరి వాస్తు బాగా ఉందని వీళ్ళందరికీ దూరమైనా అక్కడ  ఇల్లు కట్టించు కొన్నాడు .మూడంతస్తుల ఇల్లు .మూడు గర జులు .విశేషం ఏమిటంటే వాళ్ళింట్లో ఈశనివారం భజన నిర్వహించారు .మామూలుగా వచ్చే సుబ్బు సత్యాలు ,రాహుల్ ,మేము డాక్టర్ సర్వేష్ కుటుంబాలు పవన్ కుటుంబం  ఇంకా వాళ్ళ కు తెలిసిన వారందరూ వచ్చారు .సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిది వరకు భజన బాగా జరిగింది విజ్జి రెండు ,శ్రీ కెత్ రెండు భజనలు బాగా పాడారు .డాక్టర్ గారి భార్య ,కొడుకు, సౌమ్య, సుబ్బు కూతురు ,ఉషా రాంకీ భార్య ఉషా ,పిల్లలు అందరు పాడారు .ఆ తారు వాత అందరికి మంచి డిన్నర్ .పూరీ ,రెండు కూరలు ,ఆవకాయ ,గులాబ్ జాం పులిహోర ,పరవాన్నం  మామిడి పండ్ల ముక్కలు ,పుచ్చ కాయ ముక్కలు ,సాంబారు పెరుగు వగైరాలతో విందు భోజనం .నేను దాన్ని ‘’భారద్వాజ విందు ‘’అన్నాను .అందరు మెచ్చారు .దంపతులిద్దరూ చాలా మర్యాదగా అందర్ని కనుక్కొంటు కోసరి వడ్డించి తిని పించారు .మంచి స్నేహ ,మర్యాద పూర్వక ఆతిధ్యం .

              నిన్న వైశాఖ శుద్ధ చతుర్దశి ‘’శ్రీ నృసింహ జయంతి ‘’.అను కోకుండా నృసింహ జయంతి భోజనం చేశాం .నిన్న చంద్రుడు భూమికి చాలా దగ్గర గా రావటం వల్ల చంద్ర ప్రకాశం మామూలు కంటే సుమారుపది హేను శాతం ఎక్కువ గా ఉంది .ఇంటికి వచ్చేటప్పుడు ఆ వైభవం చూశాం .’’వేయి పడగలు ‘’నవలలో విశ్వనాధ వెన్నెల రేయిని  సుమారు నాలుగు పేజీల్లో అత్యద్భుతం గా వర్ణించాడు .దాన్ని పూర్తిగా  బట్టీ పట్టాను .కాని ఇప్పుడేమీ జ్ఞాపకం లేదు .అంత గొప్పగా వర్ణించాడు మహాను భావుడు అ.అది జ్ఞాపకం వచ్చింది .దాని తో పాటు ఉయ్యూరు లో నరసింహ జయంతి చేసే విధానం ఒక సారి స్మృతి పధం లోకి వచ్చింది .మా మేన మామ గంగయ్య గారింట్లో నరసింహ జయంతి నాడు ఇంటిల్లి పాదీ కటిక ఉప వాసం చేసే  వారు .ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకం ,నృసింహ స్వామికి సహస్ర నామ పూజ .మామయ్య అతి శ్రద్ధ గా చేసే వాడు .మా తాతయ్య నరసింహం గారు కూడా అలానే చేసే వాడు .అంతా మడి  తో ఉండే వాళ్ళు .పూజ అయినతర్వాత అంతకు ముందు రోజున ఆహ్వానించిన వారందరికి పానకం ,వడ పప్పు మామిడి పండు ,తాటాకు విసన కర్ర, తాంబూలం లో పెట్టి ఇచ్చే వారు .వేసవి కాలం కనుక దాహానికి పానకం .,విసన కర్ర తాపోప శమనం .అప్పుడు అందరు వెళ్ళిన తరువాత వండుకొన్న పిండి ని అందరు భోజనం చేసే వారు .దాని లోకి వంకాయ పులుసు పచ్చడి ,లేక కంది పచ్చడి నంజు కొని ,పెరుగు పోసుకొని తినే వారు .అదే భోజనం .మర్నాడు ఊరిలో కొందరిని పిలిచి భోజనం పెట్టె వారు .మేము ఎలాగూ తప్పదుకదా .ఉదయం పద కొండు గంట లకే భోజనాలు .వాళ్ళందరూ నరా సింహ స్వామి ఉపాసకులు .మంగళ గిరి తరచు వెళ్లి వస్తుండే వాడు మామయ్య .అలాగే ఉయ్యూరు పుల్లేరు కాలువ చివర ఉన్న చెరుకు పల్లి శాస్త్రులు గారు అసలు పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రులు గారు ముందు రోజే అందరి ఇళ్లకు వెళ్లి నరసింహ జయంతి ప్రసాదం తీసు కోవటానికి రమ్మని పిలిచే వారు .వారు వృద్ధులైతే వారబ్బాయి శ్రీ రామ మూర్తి ,భార్యా వచ్చి పిలిచే వారు .వారింటి లోను సాయంత్రం దాకా ఉపవాసం ,పూజా అభిషేకం జరిగేవి .తర్వాతా అందరికి పానకం వడ పప్పు మామిడి పండు విసన కర్ర, తాంబూలం ఇచ్చే వారు .మర్నాడు దాదాపు ఊరి లోని బ్రాహ్మణు లందరికి భోజనం .షడ్ర సోపెతం గా పెట్టె వారు .మరీ మరీ వడ్డించే వారు .నృసింహ జయంతి అంటే ఆ రెండు రోజులు ,ఆ రెండిళ్ళు మనసు లో మెదలక తప్పవు .ఆ అనుభవం ఇక్కడ రాంకీ వాళ్ళ ఇంట్లో దక్కిందని ఆనందించాం .అమెరికా లో ని మెక్సి కన్లు మే అయిదు ను గొప్ప పండుగ గా చేసు కొంన్టారు .చాలా వైభవం గా నిర్వహించు కొంటారు. బంధు మిత్రులను ఆహ్వానించుకొని విందు చేసు కొంటారట .ఈ విషయం రాంకీ భార్య ఉష తెలియ జేసింది .రాంకీ కుటుంబానికి సరస భారతి ప్రచురించిన ‘’శ్రీ హనుమ కధా నిది ‘’,’’మా అక్కయ్య కవితా సంపుటి ‘’,శృంగేరి వారి పంచాంగం ఇచ్చాం .మేమిద్దరు వచ్చి నందుకు చాలా సంబర పడ్డారు .

                           ఈ రోజు వైశాఖ పూర్ణిమ ఆది వారం .బుద్ధ పౌర్ణమి గా అన్న మా చార్య జయంతి గా జరుపు కొంటాము .ఇవాళ ఉదయం జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఆహ్వానం పై మేము వాళ్ళింటికి వెళ్ళాం .శ్రీ హనుమ కధా సంపుటి ‘’వారికి ఇచ్చాను .ఈ రోజు వారింట్లో ‘’అహోబిలమఠంస్వాములు’’ తిరు మంజనం ‘’జరి పారు .ఆ పీఠానికి చెందిన ఇక్కడి స్వాములు రాత్రే వాళ్ళింటి కి వచ్చి నిద్రించి మూర్తులను తెచ్చి ఉదయం స్నానం ,సంధ్య లను మడి  తో నిర్వహించి శ్రీ కృష్ణుడి కి అభిషేకం చేశారు .నలుగురు స్వాములు వచ్చారు .వారంతా ఇక్కడ పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారే .జహోబిల జియ్యర్ మతావ లంబులు .అంటే విశిష్టాద్వైత మతావలంబులు .భగవద్రామానుజుల శిష్య పరం పర వారు .అసలు విషయం ఒకటి ఉంది . శ్రీ శంకర జయంతి నాడే శ్రీ  రామానుజ జయంతి కూడా .పంచె లను  గోచీ పోసు కొని కట్టు కొని ఊర్ధ్వ పుండ్రాలు ధరించి శుచి ,శుభ్రం లతో వారే వంట చేసి .ప్రసాదాలనూ చేశారు .ఇంత పధ్ధతి తో అమెరికా లో అహోబిల స్వాములు అంత నియమ నిష్టలతో ఈ కార్య క్రమాన్ని జరిపించటం చాలా ఆశ్చర్యం గా ఉంది . .జగదీశ్ కూడా గోచీ పోసి పట్టు బట్ట కట్టి నడుముకు అన్గోస్త్రం బిగించారు .భార్య లక్ష్మి కూడా తమిళ దేశం లో పెద్ద ముత్తైదువులు కట్టినట్లు గా పట్టు బట్ట కట్టింది .పిల్లలు సాంప్రదాయ వేష ధారణ లో ఉన్నారు ..వచ్చిన పాతిక కుటుంబాలలో ఇరవై కుటుంబాలు తెలుగు వారే .అందరు చక్క గా తెలుగు మాట్లాడుతున్నారు .ఆనందం వేసింది ఆడ పిల్లలు  కూడా కీర్తనలను శ్రావ్యం గా పాడి ముగ్ధుల్ని చేశారు .విష్ణు సహస్ర నామ పారాయణం సామూహికం గా స్త్రీలు చేశారు .స్వాములు లోపల పూజ చేశారు .తెర అడ్డం గా ఉంచారు .ఆ తర్వాత శ్రీ కృష్ణ అష్టోత్తర పూజ చేశారు .తిరుప్పావై చది వారు .హారతి ఇచ్చి ‘’పల్లాండు పల్లాండు పలు వావిరి ‘’అన్నది చది వారు .అందరికి తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు .వెన్న ను నైవేద్యం పెట్టి ప్రసాదం గా అంద జేశారు . వారు మళ్ళీ తమ దేవుళ్ళను జాగ్రత్త గా వెండి భరిణ లలో దాచు కొని అన్నీ సర్దు కొన్న తర వాత అందరికి భోజనాలు వడ్డించారు దేవుళ్ళను తాక కుండా దగ్గర గా చూసే వీలు .ఫోటోలు తీసే సౌకర్యం కల్పించారు .అందరికి పంక్తి లో వడ్డన చేశారు ..అంటే అందరం కిందే కూర్చుని భోజనం చేశాం .అలా సాంప్ర దాయాన్ని తు .చ .తప్పకుండా పాటిస్తూ చేసింది అహోబిల మఠానికి సంబంధించిన స్వాములు .అంటే ఆహోబిలాన్ని ,అక్కడి వారికి  అర్చా ,కైంకర్య .,అభిషేక పూజా వైభవాన్ని ఇక్కడ నార్హ్ కరోలినా లో సంప్రదాయ బద్ధం గా కన్నుల పండువు గా చేసి తరింప జేశారు .జగదీశ్ దంపతులు చాలా భక్తీ శ్రద్ధల తో నిర్వ హించారు .ఆడ వాళ్ళు అందరికి వడ్డించారు .చక్ర పొంగలి ,పులిహోర రెండు రకాలు కూరలు , బీన్స్ కూర ,దోస కాయ పచ్చడి ,అన్ని రకాల పండ్ల ముక్కలు ,అన్నం కీరుపాయసం  సాంబారు ,పెరుగన్నం ,వడియాలు పొంగలి లల తో మంచి భోజనం పెట్టారు .అందరు అది మహా ప్రసాదం గా భావించి కళ్ళకద్దు కొని తిన్నారు .అందరి లోను ఒక పవిత్ర లోకం లో విహరించిన అను భూతి పొందారు. దాదాపు నలభై మంది విందు లో పాల్గొన్నారు .అందరికి మర్యాద పూర్వకం గా ,గౌరవ పురస్సరం గా లక్ష్మి దంపతులు ఆదరించారు .వీరిద్దరిని  మేము వచ్చి నప్పటి నుంచి తరచూ కలుస్తూనే ఉన్నాం .నేను కూడా పంచె ను గోచీ పోసికట్టి తెల్ల చొక్కా వేసుకొని వెళ్లాను .చాలా మంది కొత్త వాళ్ళు ఇక్కడ పరిచయం అయారు .అందరు ఇంత కలుపు గోలు తనం గా  ఆప్యాయం గా  కలిసి మాట్లాడుకోవటం భోజనాలు చేయటం గొప్ప అను భూతినిచ్చింది .దేశం కాని దేశం లో భాషా భేదాలను విడిచి సోదర భావం తో అందరు చేరటం అభిలష నీయ విషయం .పీఠం వారు నెలాఖరుకు ఇంకో చోట ఇంకో రాష్ట్రం లో కార్య క్రమం నిర్వ హిస్తారాట.ఇలా అమెరికా అంతా పర్య టించి ప్రజల వద్దకు తమ ఇష్ట దైవాన్ని తీసుకొని వచ్చి తరింప జేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు .అందుకే అహోబిలం వారు చేస్తున్న ఈ కార్య క్రమం ‘’అహో !ఓహో !’’అన్నట్లుంది .వచ్చిన ముత్తైదువు లందరికి జాకెట్ పళ్ళు చేతి నిండా ఇచ్చి పంపారు .మా ఇద్దరికీ నమస్కారం చేయాలని భావించి కుర్చీల్లో కూర్చో బెట్టి లక్ష్మి ,జగదీశ్ దంపతులు నమస్కరించి అక్షింతలు వ్వేయిన్చుకొన్నారు .పిల్లలతో కూడా  చేయించి మాతో గ్రూప్ ఫోటో తీయిన్చుకొన్నారు మమ్మల్ని అమ్మా నాన్న ల్లా గా గౌరవించటం వారి సంస్కారం .. .

                   ఇంటికి వస్తుంటే దారి లో ఒక పొలం లో ‘’పిక్ యువర్ స్త్రా బెర్రీస్’’అనే బోర్డు ఉంది .మేమందరం ఆ పొలం లో దిగి ఆ తాజా పండిన పళ్ళను కోసుకొని డబ్బు ఇచ్చి తెచ్చు కొన్నాం .పిల్లలు ముఖ్యం గా పీయుష్ పండిన పండ్లను కోయటం లో దిట్ట అని పించాడు .నాకు చెప్పి, పండిన వాటినీ కోయించాడు .మొత్తం మీద వీకెండ్ బాగా గడిచింది .,రాంకీ ఇంట్లోను ,జగదీశ్ వాళ్ళ ఇంట్లోవిందు లతో  అహోబిల  సందర్శన తో నూ.

                     మీ —గబ్బిట.దుర్గా ప్రసాద్ —6-5-12

                      కాంప్ –అమెరికా  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా డైరీ అమెరికా లో అహోబిలం

  1. vijayamohan's avatar vijayamohan says:

    ఏప్రిల్ 26న శంకరభగవత్పాదులజయంతి,27న భగవద్రామానుజ జయంతి

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.