ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

  ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

        ‘’నేను బాగా ఉపయోగ పడే దానిని అని నా నిశ్చితాభి ప్రాయం .యూని వేర్సిటి  లకు మాత్రమే కవిత్వం పరిమిత మై పోయి ,సామాన్యులకు సంబంధం లేకుండా పోయిన కాలం లో ,నేను నా కవిత్వం వల్ల లక్షలాది  చదువరు లకు   చేరు వైనాను .కవిత్వ ద్వారాలు తెరిచి ,గొప్ప కవిత్వం వైపుకు మార్గ దర్శకత్వం చేసి ,వారిని నడ పించాను ‘ ‘ అని సగర్వం గా ప్రఖ్యాత టైం మేగజైన్ కు ఇంటర్వ్యూ లో చెప్పిన ప్రముఖ  అమెరికన్ ఆధునిక కవ యిత్రి ‘’ఫిలిస్ మెక్ గిన్లి ‘’ ‘

    ఆధునిక అమెరికాసాహిత్య చరిత్ర లో నలభై ఏళ్ళ కు పైగా లలిత కవిత్వాన్ని (light verse ) రాసి ప్రజాభి మానాన్ని పొందిన కవయిత్రి ఆమె .రెండవ ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందే కవిత్వ రచన ప్రారంభించి ,ఆ తర్వాతా మూడు దశాబ్దాలు పాటు అప్రతి హతం గా రాసి,విజయ బావుటా ను ఎగా రెసిన గొప్ప రచయిత్రి .సమకాలీన కవులందరి కంటే ముందుకు దూసుకు పోయింది .హాస్యం ,వ్యంగ్యం జోడించి సమకాలీన విషయాలను వెలుగు లోకి తెచ్చింది .ప్రజా జీవితానికి అద్దం  పట్టింది . మేటి పత్రిక లైన’’ న్యూయార్కర్’’ ‘’,సాట ర్ డే ఈవెనింగ్ పోస్ట్’’ పత్రికల లో ఆమె రచనల చోటు చేసుకోన్నాయంటే ఎంత గొప్ప రచనలు చేసిందో తెలుస్తుంది ..

                                  బాల్యం విద్య

       1905 మార్చ్ 11 ణ గిన్లి అమెరికా లోని ఓరిగాన్ రాష్ట్రం ఒంటారియా లో జన్మించింది .తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసి నష్ట పోతూ తరచుగా వూళ్ళు మారుస్తుందే వాడు అందుకని ఆమె బాల్యం ఒక ఊరికే పరిమితం కాలేదు .చివరికి కొలరేడా లోని ఐలిఫ్ అనే మారు మూల ప్రాంతానికి కుటుంబాన్ని మార్చాడు .అక్కడ తమ్ముడి టో వంటరి గా ఉండాల్సి వచ్చింది .పన్నెండవ ఏటే తండ్రి మరణం .తల్లి ఊతా కు వీరిని తీసుకొని వెళ్లి ఉంది .అక్కడి యునివేర్సిటి లో చేరింది కాని తానేమీ పెద్దగా నేర్చు కొన్నదేమీ లేదని చెప్పింది .కవిత్వం ,కధ ,వ్యాస రచన పోటీల్లో పాల్గొని రెండు సార్లు నగదు బహుమతి సాధించింది .ఆపాటికే ప్రసిద్ధ పత్రికల కు రాసేది .న్యూయార్కర్ పత్రిక వాటిని స్వీకరిస్తూనే ‘’మీ స్త్రీలందరూ రాసే ఏడుపు గొట్టు కవిత్వాన్నే నువ్వూ ఎందుకు  రాసి ఏడి  పిస్తావు ?ఏదైనా కొత్త గా రాయటానికి ప్రయత్నించు ‘’అని సున్నితం గా సలహా కూడా ఇచ్చాడు సంపాదకుడు .అది మనసు లో పడి ,నచ్చి కొత్తగా రాయటం ప్రారంభించింది .

           గిన్లి న్యూయార్క్ చేరింది .రాయటం ,ప్రచురించటం ప్రారంభించి కోన సాగించింది .హాస్యం ,వ్యంగ్యం కలిపి జోడించి మనసులకు చేరు వై నది. జూనియర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగమూ చేసింది .ఆమె హాస్యం ఆ ప్రిన్సిపాల్ వంటికి పడ .లేదు .మానేసి’’ టౌన్ అండ్ కంట్రి ;; పత్రిక లో చేరింది .బెల టెలిఫోన్ లో పని చేస్తున్న చార్లెస్ హేదేన్స్ కు చేరువై  పెళ్లి చేసుకొన్నది .ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .చిన్న ప్పటి  నుంచి స్వంత ఇల్లు ఉండాలని కల లు కనేది .ఆ కల ను భర్త సాఫల్యం చేశాడు న్యూయార్క్ దగ్గర్లో ఇల్లు కొని సంతోషం కలిగించాడు అక్కడ రచనా వ్యాసంగాన్ని అప్రతి హతం గా సాగించింది .

                     పేరు ప్రఖ్యాతులు

     అప్పుడు ప్రపంచాన్ని ఆర్ధిక డిప్రెషన్ కుంగదీస్తున్న కాలం అది .ఆమె తెలివిగా ,తమాషాగా నిత్య జీవిత విషయాలను హాస్యం తో  రంగరించి రాసింది .ఆ టెన్షన్ నుంచి తట్టు కోవ టానికి అవి బాగా ఉప యోగ పడ్డాయి .పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి .ఎగ బడి చదివారు జనం .కుటుంబ బంధాలు ,కష్ట సహిష్ణుత ,సాధారణ తెలివి తేటలు మొదలైన వాటి పై రచనలు చేసి మెప్పించింది .1934 లో మొదటి కవితా సంకలనం ‘ఆం ది కాంట్ర రి’’తెచ్చింది ఆ తర్వాతా మూడు సంకలనాలు ప్రచురించింది .ఇల్లాలి ముచ్చట్లు ,ఇంటి గుస గుసలు లాంటి గృహ సంబంధ విషయాలు రాసి అందరికి చేరువయింది .వ్యంగ్యం ఆలంబన గా ఆమె కవిత్వం ఉండటం టో జన హృదయాలను పట్టు కొన్నాయి ఆనంద సంతోషాలను కల్గించాయి .

       కుటుంబ వ్యవహారాలే కాదు సాంఘిక కార్య క్రమాలలోను పాల్గొంది .ఆనాడు bright young అని పించుకొన్నా ఆడెన్ వంటి యువా కవులు యుద్ధ నినాన్దాలతో లేక్చర్లతో రాజకీయాలను చెరిగి పారేస్తున్నారు .వారంతా హాయిగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ,కుర్చీలకే పరి మిత మైన వారు .వారి పై ’stones from the glaas house ‘’,small wonder ‘’వంటి మ్యూజికల్ లిరిక్స్ రాసి ప్రచు రించింది .ఆమె ప్రతిభకు తగ్గ పురస్కారాలు లభించాయి .గౌ రవాలు దక్కాయి .national academy of arts and letters కు ఎన్నిక అయింది .లైట్ వేర్స్ లో పులిట్జర్ బహుమతి పొందిణ మొదటి మహిళా గా గుర్తింపు పొందింది .బాలల కోసం డజను కు పైగా పుస్తకాలు రాసింది .అమెరికా ,అమెరికన్ స్కాలర్ ,రీడర్స్ డైజెస్ట్ వంటి పేరున్న పత్రికలలో ఆమె రచనలు చోటు చేసుకొని ఆమె కు గౌరవాన్ని కల్గించాయి .ఆనాటి ప్రసిద్ధ చర్చి బిషప్పు లతో ప్రముఖ రచయితలైనా జాన్ అప్డైక్ వంటి వారితో ,మాకార్దీ ,రాక్ ఫెల్లర్ వంటి రాజ కీయ నాయకులతో థియేటర్ ఆర్టిస్ట్ లతో ఆమె ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది ..1968లో వచ్చిన న్యూయార్క్ అబార్షన్ యాక్ట్ పానెల్ కమిటీ లో సభ్యురాలైంది .

       1965  జూన్ 18  టైం మేగజైన్ ఫిలిస్ మెక్ గిన్లి  ముఖ చిత్రం వేసి ప్రచు రించి ఆమె ఖ్యాతి కి  నీరాజనం పట్టింది .గృహానికే పరిమిత మైనా .ఆమె తన పై విమర్శలు చేసిన వారి ని దృష్టి లో ఉంచు కొని సమాధానం గా ‘’సిక్స్ పెన్స్ ఇన్ హర్ షో ‘’, లో’’ ఎంత చదువు కొన్న వారి కైనా సుఖ సంతోషాలు ఇంటి లోనే సాధ్యం అని చెప్పింది .ఆడ వారు ఇంట్లోనే ఉండటం వారికే కాక సమాజానికీ మంచిది అని తెలియ జేసింది .గృహిణి మిగిలిన వారి కంటే విచక్షణ జ్ఞానం ఎక్కువ గా కలిగి ఉంటుందని ,రాజకీయాలకు చక్కని భాష్యం చెప్ప గలదని ,పేపర్లో వచ్చే విషయాలను బాగా విశ్లేషించ గలదని,భర్తల వ్యాపార లావా దేవీలలో స్పష్టమైన సలహా ఇవ్వగలరని ,వారికి సహాయ కారి గా ఉండగలరని స్పష్టం చేసింది .పిల్లలకు వినోదాన్ని గృహిణి మాత్రమే పంచ గలదని ఆమె నిశ్చితాభి ప్రాయం .ఇప్పటికే పుస్తకాలు ,సంగీతం ,నాటకం ,చిత్ర లేఖనం మొదలైన రంగాలలో స్త్రీలు గొప్ప సాంస్కృతిక విని యోగా దారు లు గా చేలా మణి లో ఉన్నారని కుండా బద్దలు కొట్టింది .’’మహిళలు గా ,ఇల్లాండ్రు గా మేము రాబోయే తరాలను ప్రభావితం చేయ గల శక్తి సంపన్నులం .ఆడ ,మగ తమ పరిధుల్లో తాము పని చేసుకొని పోతూ ఉంటె ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు .గృహ ధర్మానికి భంగం కలుగ నంత వరకు ఇంటికి బయట సాంఘిక సేవ చేయటం మంచిదే .’’అని తన సిక్స్ పెన్స్  రచన ముగించింది .ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడటం చెప్పటం రాయటం గిన్లి ప్రత్యేకత .అందుకే ఆమె కు అందరు అభిమానులున్నారు .ఆ పుస్తకం ఒక లక్ష కాపీలు అమ్ముడు పోయింది అంటే ఆమె పాప్యులారిటి ఎంత గొప్పదో ,ఆమె ప్రభావం ఎందరి మీద ఉందొ అర్ధం అవుతుంది .

              గిన్లి రాసిన వచన రచనలు province of the heart ‘’,wonderful time ‘’,saint watching ‘’పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి .1972 లో భర్త చని పోయే వరకు రాస్తూనే ఉంది .1978 ఫిబ్రవరి 22 న గిన్లి ఇహ జీవితాన్ని చాలించింది .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-5-12.

        కాంప్ –అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.