హిల్డా డూ లిటిల్
H.D.గా అని అందరికి సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్ ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి మాటల్లా ఉంటాయని ప్రశంస పొందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు పొందింది. ఇమేజిస్ట్ ల ప్రభావం నుంచి క్రమంగా దూర మైనా ,ఇంకా ఆమె ను అలాగే భావిస్తారు .
హిల్డా ,అమెరికా లోని పెన్సిల్వేనియా లో బెతేల్హాం లో 1886 సెప్టెంబర్ పది న జన్మించింది .తండ్రి ఆమె కు ఖగోళం ,గణితం బోధించాడు .పెన్సిల్వేనియా యూని వేర్సిటి లో ప్రొఫెసర్ గా ,ఫ్లవర్ అబ్సర్వేటరి డైరెక్టర్ గా పని చేసింది .తల్లి ప్రోతెస్తంట్ మతంలో అసమ్మతి వర్గానికి చెందినా మొరోవియన్ బ్రదర్హుడ్ లో సభ్యురాలు .దేవుని తో ప్రత్యక్ష అనుభవం ఉన్నట్లుగా తల్లి భావించేది .కూతురు కూడా తన కవితా ప్రతిభ దైవీ కృతం అన్నది .క్వేకర్ స్కూల్ లో ,బ్రియాన్ మార కాలేజి ల్లో విద్య నేర్చింది .మిరియాన్ మూర్ అనే ఆర్టిస్ట్ టో పరిచయం కలిగింది .ఎజ్రా పౌండ్ తో సరస సల్లా పాలు సాగించింది .తర్వాతా w.c.విలియమ్స్ కవితో క్లోజ్ గా ఉంది .కాలేజి లో కొద్ది కాలమే చదివింది .పౌండ్ ,గ్రెగ్ ల ప్రవర్త నతో మానసికం గా కుంగి పోయి,డిప్రెషన్ లో పడింది .ఈ విషయాన్ని స్వేయ చరిత్ర HERmione లో రాసుకోన్నది .గ్రెగ్ ,అతని తల్లి టో యూరప్ పర్యటనకు వెళ్ళింది .లండన్ లో పౌండ్ ఆమెను ప్రముఖులకు పరిచయం చేశాడు .అప్పటికి ఇంకా జేమ్స్ జాయిస్ వెలుగు లోకి రాలేదు .D.H. laarens తో H.D.స్నేహం చేసింది .ఈ విషయాన్ని portrait of a genius పుస్తకం లో ఆల్లిన్గ్తాన్ రాశాడు .పౌండ్ ఒంటెత్తు పోకడ లకు విసిగి పోతోంది .ఆలింగ్తాన్ ఆమెను ఫ్రెంచ్ సింబాలిజం అధ్యయనం చేయమని ప్రోత్స హించాడు .దాని పై ద్రుష్టి పెట్టింది
1913 లో ఆలింగ్తాన్ ను పెళ్ళాడింది .పౌండ్ ,భర్త ల సహకారం తో the egoist పత్రికా సంపాదకు రాలు అయింది . . 1917 లో భర్త’’ గ్రేట్ వార్’’ లో పని చేయటానికి వె డితే, సిసిలీ గ్రే అనే సంగీత కళా కారుడి తో వ్యవహారం నడిపింది . న్యు మోనియా వచ్చి బాధ పడింది .బ్రిహర్ అనే నవలా రచయిత టో పరిచయం పొంది ,చివరిదాకా కోన సాగించింది .అతడు ఇంకో అమ్మాయి మెక్ ఆల్మన్ తో ప్రేమాయణం సాగిస్తే వారితో పాటే పారిస్ చేరింది .ఆమె రచనలను సరి దిద్ది ప్రచురించింది .1921 లో hymen అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది హిల్డా .ఆ తర్వాతా hyppolitus timporizes ,the red roses for bronze కవితా సంకలనాలను విడుదల చేసింది .
బ్రిహర్ భార్య కు విడాకులిచ్చాడు .కెన్నెత్ ను కళ్యాణం ఆ డాడు .ఆమె సినీ నిర్మాత .భార్యా భర్తలు’’ క్లోజప్’’ అనే జర్నల్ నడిపారు ‘హెచ్ .డి .మూడు సినిమాల్లో కన్పించింది .ఫిలిం డైరెక్టర్లతో పరిచయం పెంచు కొంది .బ్రిహర్ ఆమె ను ఇటలి తీసుకొని వెళ్లి సిగ్మండ్ ఫ్రాయిడ్ కు పరిచయం చేశాడు .tributes to freud అనే విశ్లేషణాత్మక రచన 1956 లో చేసింది .అందులో ఫ్రాయిడ్ జబ్బులు కని పెట్టె విధానం తప్పు అని తేల్చింది .తర్వాతా బ్రిహర్ కుటుంబం టో స్విత్జేర్లాండ్ వెళ్ళింది .నాజీ ల ఘోర కృత్యాలకు బలి పోతున్నయూదులను , ,వామ పక్షీయులను తప్పించటానికి బ్రిహేర్ సరి హద్దు దాటి వారిని తప్పించు కోనేట్లు సాయం చేశాడు .
రెండవ ప్రపంచ యుద్ధం కాలం లో లండన్ నగరం లోని హైడ్ పార్క్ దగ్గర్లో కాపురం ఉండే వారు .అతను life and letters to day అనే మాగజైన్ ప్రచురించే వాడు .కొత్త వచనం కవిత్వం మీద డూ లిటిల్ శ్రద్ధ వహించింది .the walls do not fall అనే కవిత లో యుద్ధ సమయం లో లండన్ వణికి పోతున్న స్తితిని కళ్ళకు కట్టి నట్లు వర్ణించింది .ఆ తర్వాతా tribute to angels ,flowering of the rod కవితా సంకల నాలను తెచ్చింది .ఈ మూడిటిని triology అంటే త్రయం అంటారు .ఆ తర్వాతా ఆమె ఆధ్యాత్మిక భావన లో మునిగి పోయింది .తంత్ర శాస్త్రం ,ఖగోళ శాస్త్రం ,tarot cards వంటి వాటి మీద ద్రుష్టి ఎక్కువైంది .యుద్ధానంతరం నరాల బలహీనత బాధించింది .స్విస్ లో చికిత్స చేయించు కొన్నది .అయినా ఆమె లోని కవితా వేశంఆగ లేదు .నిత్య శ్రోతస్విని లా ప్రవహిస్తూనే ఉంది .1957 లో ‘’ సెలెక్టెడ్ పోయెమ్స్ ‘’ప్రచురించింది .1960 ,61 ల లో bid me to live ,,helen in egypt అనే నవల ల ను రాసింది .చివరి సారిగా 1960 లో అమెరికా వచ్చి వెళ్ళింది .అప్పుడామే కు American academy of arts and letters మెడల బహూక రించారు .1961 లో జూరిచ్ వెళ్ళింది .అక్కడే తీవ్ర మైన గుండె పోతూ వచ్చి మరణించింది .
ఆమె మరణించిన తర్వాతా ఆమె కవిత్వాన్ని అధ్యయనం చేయటం ఎక్కు వైంది .సాహిత్య చరిత్ర కారులు దృష్టిని కేంద్రీకరించారు .Her self Defined ane aame jeevitha charitra raashaaru .the poet HD.and her world 1984 లో వచ్చింది .ప్రముఖ విమర్శకులందరూ ఆమె సాహిత్యం పై పరిశోధనలు చేస్తూ గ్రంధాలు రాస్తూనే ఉన్నారు .ఆమె పేరు ’’ Doo Litil ‘’అయినా ‘’Did a great job ‘’అని పించుకోన్నది హిల్డా డూ లిటిల్ .
walls do not fall
an incident here and there –and rails gone (for guns )—from your (and my )old town square
must and must gray not colour –still the luxor bee –chick and hare –pursue un alterable purple
for i know how the lord god —is about to manifest when I –the industrious worm –spin my own shroud ‘
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —9-5-12.
కాంప్—అమెరికా


