సత్య కధా సుధ –7
ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ గద్దించాడు .అన్నని మొండి కేశాడాయన .కోపం వచ్చి తిట్టి కొట్టి తరిమేశాడు . .భయ పడి అతిధి పారి పోయాడు .ఆ కోపం తోనే భోజనం ముగించాడు గృహస్తు .భార్య కూడా భోజనం చేసి భర్త అలా చేయటం బాగా లేదని నెమ్మదిగా చెప్పింది .అతన్ని కొట్టటం తప్పు అని చెప్పింది .భార్య మాటలు విన్న తర్వాతతాను తప్పు చేశానేమో నని బాధ పడ్డాడు .రాత్రి కి ఏమీ తిన కుండానే నిద్ర పోయాడు .ఆ రాత్రి దేవుడు కలలో కన్పించి ‘’అంత ఆవేశం పడ్డావెం నాయనా !’’అని లాలన గా పలకరించాడు .’’ఆ మూర్ఖుణ్ణి అరవై ఏళ్ళు గా నేను భరిస్తున్నాను .ఒక్క అర్ధ గంట నువ్వు భరించ లేక పోయావా ?’’అని గృహస్తు ను మంద లించాడు .అన్దుకె భగవానుడు గీత లో
‘’క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమః –స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః –బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ‘’అని చెప్పాడు .అందరం గమనించ వలసిన విషయమే ఇది .
మరణ సమయం లో భగవన్నామ స్మరణ చేయ మని చెబుతారు .కాని బుద్ధి గడ్డి మేస్తే ఆ పని చేయలేడు జీవుడు .దీనికి శ్రీ విద్యా ప్రకాశానంద స్వామీ జీ ఒక కధ చెప్పారు .కన్నడ దేశం లో ఒక గృహస్తు సంసారాన్ని జాగ్రత్త గా పోషిస్తూ ,సంపదలతో ఆనందం సుఖం అను భావిస్తున్నాడట .మరణం సమీ పించింది .పిల్లలు భార్య చుట్టూ చేరి ‘’రామా .కృష్ణా ‘’అనమని గోల చేస్తున్నారు .బ్రతికి ఉన్నప్పుడు ఎలాగూ దేవుణ్ణి గురించి ఆలోచించ లేక పోయాడు .ఇప్పుడన్నా స్మరిస్తే ఉత్తమ గతులు కలుగు తాయని వారందరి విశ్వాసం కాని ఆ వృద్ధుడు ‘’క.క.క.కా’’అంటున్నాడు .ఎవరికి అర్ధం కావటం ఏమంటున్నాడో .వైద్యున్ని పిలి పించి ఇంజేక్షన్ ఇప్పించారు .కొంత శక్తి వచ్చింది ఆయనకు .ఇప్పుడు మళ్ళీ అడిగారు ‘’నాన్నా ! గంట నుంచి కకకకా ‘’అంటున్నారు .అర్ధం ఏమిటి అని .దాని అకి వృద్ధుడు ‘’క రు కస బరికి యన్న కాడి యుత్తదే ‘’అని కన్ను మూశాడు .దాని అర్ధం ‘’చీపురు కట్టను దూడ మేస్తోంది .జాగ్రత్త చేయండి . మన వాళ్ళు ఒక కద చెప్పే వారు .చావు సమయం లో ఒకడిని నారాయణ అనమంటే అనలేదు .కనీసం నార ను చూపిస్తే నన్నా అంటాడేమో నని ఎదురుగా పెట్టి కనీసం ‘’నారా ,నారా ‘’అంటాడని ఎదురు చూశారట .వాడు దాన్ని ‘’పీచు ,పీచు ‘’అంటూ చచ్చాడట .అంటే నారా అనే ఇంగితం కూడా వాడికి లేకపోయిందని అర్ధం .
భాగ వంతుడు ఎక్కడ ఉంటాడని అందరికి సందేహం .దానికి ఆయనే సమాధానం చెప్పాడు ‘’సుజను లందు తరచు చొచ్చి యుందు ‘’అని భాగవతం లో చెప్పాడు .మరి సజ్జనులు అంటే ,సత్ ప్రవర్తన అంటే ?
‘’తను హృద్భాషల సత్యమున్ శ్రవణమున్ ,దాసత్వమున్ ,వందనా
ర్చనముల్ ,సేవయు ,ఆత్మలో నేరుకయున్ ,సంకీర్తనల్ ,చింతనం
బను ఈ తొమ్మిది భక్తీ మార్గ మ ల సర్వాత్మున్ –హరిన్నమ్మి ,స
జ్జనుడై యుండుట భద్ర మంచు దలతున్సత్యంబు దైత్యోత్తమా ‘’
నవ విధభక్తి మార్గాలతో పాటు సజ్జనత్వం తప్పదు .ప్రవర్త నాలో ఆధ్యాత్మిక లక్షణాలు అలవాటు చేసు కొన్న వారి ణని దగ్గరకు పరమాత్మ చేర్చు కొంటాడు .
హృదయాన్ని వికసింప జేసుకొన్న పుష్ప పూజ నే పరా భక్తీ పూజ అన్నారు
‘’అహింసా ప్రధమం పుష్పం ,పుష్ప మింద్రియ నిగ్రహహ –సర్వ భూత దయా పుష్పం ,క్షమా పుష్పం విశేతః
శాంతి పుష్పం ,తపః పుష్పం ,ధ్యాన పుష్పం తధైవచ –సత్యం అష్ట విధ పుష్పం విష్నోహ్ ప్రీతి కరం భవేత్
ఈ లక్షణాలు లేక పోతే ఎంత భక్తీ ఉన్నా నిష్ప్రయోజనమే .ముప్ఫై అయిదు సజ్జన లక్షణాలను పరమాత్మ వివరించిన సంగతి మనకు తెలిసిందే .
జ్ఞాని ,కర్మ యోగి ఇద్దరు కూడా ఎంత సిద్ధూ లైనా సత్కరాల్ని ,భక్తిని విడి ఛి పెట్ట రాదు అని తెలిపే ఒక కధ తెలుసు కొందాం –
ఒక సద్గ్రువు గారి ఆశ్రమం శ్రావణ ,మనన ,నిది ధ్యానాలతో కర్మ ,,భక్తీ జ్ఞాన మార్గాలమార్గాలను శిష్యులకు నిత్యం బోధిస్తూ అనుష్టింప జేస్తూ ఉన్నారు .అది కార్తీక మాసం .పగలు నదీ స్నాన్నం జపతపాలు అభిషేకాలు పగలంతా ఉపవాసం రాత్రికే భోజనం గా గురుశిష్యులందరూ పాటిస్తున్నారు .అంతకు ముందు రాత్రి ఒక స్వామీజీ కొత్తగా ఆశ్రమం లోకి వచ్చి గురువు అనుమతి టో నిద్రించాడు .మర్నాడు తెల్ల వారు ఝామున శిష్యులు స్నానానికి వెళ్తుంటే కొత్త అతిధి స్వామిని కూడా లేపి తెసుకు వెళ్ళండి అని గురువు చెప్పారు .ఎన్ని సార్లు లేపినా చలిగా ఉందని లేస్తాను ,లేస్తాను అంటూ తాత్సారం చేస్తున్నాదాయన .ఇక తప్పదురా బాబూ ఈ చలిలో స్నానం అను కొని శిష్యులతో ‘’నాయన లారా ౧ గంగా ,యమునా ,సరస్వతి నదులు నాలోనే ఉన్నాయి .నేను వాటిలో ఉన్నాను .’’అని చెప్పి ముసుగు తనని పడుకొన్నాడు .విషయం గురువు గారికి చేరింది . అందరు ‘’నక్తం ‘’కనుక వారెవరు భోజనం చేయలేదు .కాని గుర్వాజ్న పై అతిధి కి మంచి భోజనం ఏర్పాటు చేశారు .సుష్టుగా భోజనం చేసి త్రేనుస్తూ ఒక గదిలో పగలు హాయిగా నిద్ర పోయాడు అతిధి .గదికి బయట గొళ్ళెం పెట్టించారు గురూజీ .లోపల ఆయనకు కొంత సేపటికి మెలకువ వచ్చి ‘’దాహం దాహం ‘’అని అరుస్తున్నాడు .ఎవరు తలుపు తీయ వద్దని ఆజ్ఞ.మంచిన నీళ్ళు కావాలని తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు .ఇంతలో గురుజీ వచ్చి ‘’గంగా కావేరి గోదావరి మొదలైన నదులు అన్నీ నీ దగ్గరే ఉంటె ,నీకు నీళ్ళు కరువయ్యాయా నాయనా !’’అన్నాడు .అందరికి అర్ధం అయింది .తలుపు తీయించి మంచి నీళ్ళు ఇప్పించాడు గురువు గారు .సిగ్గుతో తల వంచు బుద్ధి తెచ్చు కొని వెళ్లి పోయాడు ఆగంత అతిధి .అప్పుడు గురువు గారు శిష్యులతో ‘’నాయన లారా !కర్మా ,భక్తీ మార్గాలలో జ్ఞాన శిఖ రాన్ని ఎక్కినా ,లోకాన్ని అనుసరించాలి .జ్ఞానినే అందరు అనుసరిస్తారు .జ్ఞాని అజ్ఞానిగా ప్రవర్తిస్తే అందరికి నష్టం ‘’జ్ఞాని కి కర్మా భక్తీ అవసరం లేక పోయినా లోక రీతి ని అనుసరించాలి .మార్గ దర్శకం చేయాలి .’’ అని హిత బోధ చేశాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-5-12
కాంప్ –అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

