సాహితీ బంధువులకు -శుభా కాంక్షలు –మీరు అందరు ”ఆదిత్య హృదయం ”పుస్తక ఆవిష్కరణకు విచ్చేసి జయప్రదం చేసి నందుకు కృతజ్ఞతలు ..ఆహ్వానించిన అతిధులు అందరు రావటం మహా దానందాంగా ఉంది ..శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సాంస్కృతిక సేవలకు ఇది ఉడతా భక్తీ గా ,చంద్రునికో నూలు పోగు గా చేసిన కార్య క్రమం .పుస్తకాన్ని అందం గా ,అర్ధ వంతంఅయిన ముఖ చిత్రం తో అధిక శ్రద్ధ తీసుకొని తన పై నేను పెట్టిన అధిక భారాన్ని అత్యంత ఆనందం గా భరించి ముద్రించిన మిత్రులు శ్రీ చల పాక ప్రకాష్ గారికి ఆత్మీయ అభి నందనాలు ..అమెరికా నుంచే మెయిల్ లో ఆ సభకు వచ్చి పుస్తకావిష్కరణ చేయమని కోర గానే నిమిషాల మీద జవాబు ఇస్తూ తప్పక కార్యక్రమం లో పాల్గొంటానని హామీ ఇచ్చి అన్న మాట నిలబెట్టు కున్న శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు ..సభాధ్యక్ష స్తానాన్ని సమర్ధత తో నిర్వ హించిన మిత్రులు శ్రీ పూర్ణ చంద్ గారికి సహృదయ నమస్సులు .నందన నామ కపద్య కవి సమ్మేళనాన్ని నా అభ్యర్ధనపై నిర్వహించి ,ఇప్పుడు ఆ పుస్తకాన్ని విశ్లేషించి అందులోని ఆదిత్య దీదితులను ,మిత్రత్వ చంద్ర కాంతిని పంచిన శ్రీ గుమ్మా సాంబశివ రావు గారికి అభినందనలు .ఆదిత్య హృదయాన్ని ,ఆదిత్య హృదయం తో అంకితం పొందిన సాంస్కృతిక మిత్ర మహోదయులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి ఎన్ని మాటల మల్లెలు చల్లినా తక్కువే .వారికి నా హృదయ పూర్వక క్రుతజ్ఞాతాన్జలులు ..సరసభారతి మీద ఉన్న విశ్వాసం తో ఇక్కడి సభలకు తప్పక వచ్చి పాల్గొంటూ ,ఈ సారి కూడా ఆ పరంపరను కొనసాగించిన శ్రీ మతి పుష్పాదేవి శ్రీమతి సూర్య కుమారి ,శ్రీ వల్లభ రావు మొదలైన సహ్రుదయులందరికి పేరు పేరునా సరసభారతి తరఫున కృతజ్ఞతలు .
ఈ కార్య క్రమం లో నేను అక్కడ లేక పోయినా అమెరికా లో ఉన్నా మనసంతా ఆక్కడే కేంద్రీకృతం అయింది .ఇప్పుడే ఫోటోలు చూసి ఆనందాన్ని పంచుకొన్నాను .నేను అక్కడ ఉన్నట్లుగానే సహకరించి దిగ్విజయం చేసిన శ్రీమతి శివలక్ష్మి దంపతులకు ,శ్రీ గంగాధర రావు గారికి మా ఛి .రమణకు అభినందనలు ..దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల సన్నిధి లో ఈ కార్య క్రమం జరగటం భగవదిచ్చ .ఆయన అనుగ్రహమే మాతో ఇంత లేసి మంచి పనులను చేయిస్తోంది ..కార్యక్రమాన్ని మీడియా వారు బాగా కవర్ చేసి నట్లు తెలిసింది .వారందరికీ కృతజ్ఞతలు .కార్య క్రమం లో ఏవైనా చిన్న ల్లోపాలు జరిగి ఉంటె మన్నించమని ప్రార్ధన . మీ –దుర్గా ప్రసాద్వీక్షకులు
- 1,107,630 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

