మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

     

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

కవి ,రచయిత సమాజ సేవకురాలు ,సాంస్కృతిక చరిత్ర కారిణి ,పత్రికా సంపాదకురాలు ,బాల సాహిత్య సృష్టి కర్త,అన్నిటికి మించి మంచి అధ్యాపకు రాలు మార్గరేట్ అట్ వుడ్ .సృజనాత్మక సాహిత్య రచన లో నలభై ఏళ్ళు ప్రజలను ప్రభావితం చేసి సమకాలీన రచయితల్లో అన్నిటా అగ్రగామి గా నిలి చింది అట్ వుడ్ . .అన్ని సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసింది .మేటి విమర్శకుల మెప్పు పొందిన విదుషీ మణి. మహిలో ద్యమ నాయకు రాలు ..పర్యావరణ రక్షకు రాలు .మానవ హక్కుల పోరాటం లో అగ్రగామి గా నిలిచినా ధీర వనిత .ఆమె జీవితం లో అధికారం ఆమెకు గొప్ప వరమే అయింది .జీవన పోరాటం లో ఎదుర్కొంటున్న అనేక సమస్య ల పై కవిత్వము ,రచనలు చేసి తరాలను ప్రభావితం చేసిన మాన నీయు రాలు .బహుముఖ ప్రజ్ఞా శాలి .

ఫిక్షన్ లో పేరు పొందినా ఆమె సాహితీ జీవితం కవిత్వం తో ఆరంభమైంది .అద్భుత కవిత్వాన్ని వర్షించింది .నవలలు ,కధలు ,మానవ జీవిత చరిత్ర (anthro pology ),అనేక సాహిత్యేతర అంశాలు ,విమర్శ రాసి పుంఖాను పున్ఖం గా పుస్తకాలను విడుదల చేసింది .ఆమె రచనలు చాలా భాగం ప్రజా పక్షమే అయినా ,కవిత్వం మాత్రం ఆమె స్వంతమే .సాంద్రం గా ,భావ స్పోరకం గా ,సూటిగా ఆమె కవిత్వం ఉండటం తో మనసును ఇట్టే ఆకర్షిస్తాయి .వాటిల్లో మానవులు ప్రకృతికి దూర మై పోవటం ,మనుష్యుల మధ్య సంబంధాలు దృశ్యమాన మవుతాయి .మంచి తెలివి తేటలతో చాతుర్యమైన వాదాలతో ,వివేకం టో ,ఆలోచనా ధోరణి టో ,ఇతిహాసాల కధలను ఆధారం గా చేసుకొని ఆమె రచనలు చేసింది .నాటకీయ ముగింపులు ,మాటల్లో అమిత శక్తి ఆమె కు పెద్ద వరాలైనాయి .

బాల్యం –విద్యాభ్యాసం

అసలు పేరు మార్గరేట్ ఎలినార్ అట్ వుడ్ . ..అమెరికా లో ఒంటారియా రాష్ట్రం లో అట్టావా లో 1939 నవంబర్ పది న జన్మించింది .తండ్రి జంతు శాస్త్ర వేత్త .అరణ్య ప్రాణుల పై పరిశోధన కోసం ఉత్తర క్యుబెక్ అడవులకు తరచూ గా వెళ్ళే వాడు .కుటుంబం ఆయనతో నే ఉండటం వల్ల ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగింది .అయితేనేం అందిన ప్రతి పుస్తకం చది వింది .క్లాసిక్స్ నుంచి కామిక్స్ దాకా దేన్నీ వదల్లకుండా చదివేసింది .కెనడా దేశం మీద అభిమానం పెరిగింది .wildernes tips and other stories లో తన అనుభావాలన్నిటిని రాసే సింది .కుటుంబం తత్వాత కెనడా లోని torento కు చేరింది .అక్కడి యునివేర్సిటి లోని విక్టోరియా కాలేజి లో చదివింది . .అక్కడి అధ్యాపకులు సాహిత్య కారులు ,సాహితీ విమర్శకులు అయిన ఫెయిర్ ,మాక్ ఫెర్సన్ ల దృష్టిని ఆకర్షించింది .వారి ప్రభావం ఆమె పై గాడ్హం గా పడింది .మొదటి పుస్తకం’’ ”డబల్ పెర్స ఫోన్ ‘’స్వంతం గా ప్రచురించింది .ఇది గ్రీకు మైథాలజీ లోని స్త్రీలను ఉద్దేశించి రాసిన కవితలు .దీనికి E.J.Pratt మెడల్ ను మొదటి సారిగా అందు కొంది .ఉడ్రో విల్సన్ ఫెలోషిప్ తో హార్వర్డ్ ఉమెన్స్ కాలేజి లో ,చదివి ,ఆ తర్వాతా విక్టోరియన్ సాహిత్య పరిశోధన కోసం పి.హెచ్.డి..కోర్సుకు చేరి పూర్తీ కాకుండా నే ఆ డిగ్రీ పొందకుండానే మానె సింది .కాని ఆ తర్వాతా డజన్ల కొద్దీ గౌరవ డాక్టరేట్లను అందుకొన్న విద్యా రాణి

ఉద్యోగం –రచనా వ్యాసంగం

టోరంటో లో ‘’అనంసి ప్రెస్ ‘’లో ఎడిటర్ గా చేరి ‘’survival –A thematic guide to canadiyan literatureరచన చేసి జాతీయ స్తాయి గుర్తింపు పొందింది .కెనడా స్వాతంత్ర పోరాటం ,జాతీయ అస్తిత్వం ,శతాబ్దాల బ్రిటీష పాలకుల అకృత్యాలు ,అన్యాయాలు దాష్టీకం ,అణచి వేత లను అద్భుతం గా చిత్రించిన రచన అది .దీనితో కెనడా సాహిత్య స్వతంత్ర రచనా వార సత్వానికి ఆద్యురాలు అని పించు కొంది .తాను ఆక్స్ ఫర్డ్ లో చేసిన ఉపన్యాసాలను ఆధారం గా ‘’the strange thing –the melovelent North in Canadian literature ‘’ పుస్తకాన్ని రాసి జన జాగృతి చేసింది .

తర్వాత రెండు చిన్న కవితా సంకలనాలు మొదటి నవల మొత్తం అయిదింటిని అతి తక్కువ కాలం లో రాసి ప్రచురించింది .తన తరం ప్రసిద్ధ రచయిత గా గుర్తింపు లభించింది .’’the animals of that country ‘’,the journals of susannaa ‘’,moodee ‘’రచనలు ఆమెకు గొప్ప పేరు తెచ్చాయి .రెండోది కెనెడియన్ పయనీర్ చరిత్ర .అంటే ఆ దేశాన్ని మలుపు తిప్పిన మహనీయుల చరిత్ర .తరువాత నవలలు రాసి మెప్పు పొంది నవలా రచయిత గా చిరస్తాయి పొందింది .వాటిలో ముఖ్యమైనవి –procedures for under ground ,power politics ,you are happy ,lady oracle ,suffering ,Edith women .ఆమె రాసిన the handa maid’s tale ఆర్ధర్ సి.క్లార్క్ అవార్డ్ పొందింది .అది సినెమా గా కూడా తీశారు .ఇప్పటికే లబ్ధ ప్రతిష్టు రాలిన నవలా రచయిత అని గుర్తింపు వచ్చింది .కవిత్వం వెనకడుగు వేసింది ..ఆమె కవిత రాసినా ,నవల రాసినా జీవన పోరాటం అందు లో ఉంటుంది .అంటే సర్వైవల్ ను ద్దృష్టి లో పెట్టు కొనే ఏదైనా రాసింది .ఆమె నవలలో ని నవలా మణులు అధికార పోరాటం లో నలిగి పోవటం సర్వ సాధారణం .వ్యంగ్యాన్ని మేళవించి రచనకు జీవం పోస్తుంది .

మార్గరేట్ బ్రిటీష కొలంబియా ,మాంట్రియల్ ,ఆల్బెర్తా లలో బోధనా చేసింది .టోరంటో లో ని న్యూయార్క్ వర్సిటి లో అధ్యాపకురాలైంది .న్యూయార్క్ ,ఆస్ట్రేలియా,అలబామా లలో” రైటర్ ఇన్ రెసిడెన్స్” గా పని చేసింది .గ్రీన్ గిబ్సన్ అనే నవలా రచయిత ను పెళ్ళాడింది .1982లో’’ సెకండ్ వర్డ్స్’’ ,-‘’సెలెక్టెడ్ క్రిటికల్ ప్రోస్ ‘’రాసింది ‘’.ది న్యు ఆక్స్ ఫర్డ్ ఆన్తాలజి ఆఫ్ కెనెడియన్ వేర్స్ ‘’ కు ప్రధాన సంపాదకు రాలి గౌరవం పొందింది .ప్రతిభకు తగ ప్రతి ఫలం లభించింది .

ఎనభై వ దశకం లో అట్ వుడ్ రాసిన నవల లన్ని కెనడా ,బ్రిటన్ దేశాల బహుమతులను సాధించి నవే. ‘’.కాట్స్ ఐ ‘’ అన్నది 1988 లో రాసింది .ఇదీ బహుమతి పొందింది .1970 –2006 మధ్య కాలం లో తొమ్మిది సంపుటాల షార్ట్ స్టోరి ఫిక్షన్ ,మూడు ఆంత్రో పాలజిలు , ఎడిట్ చేసింది .అందులో రెండు ఆక్స్ ఫర్డ్ కోసం చేసినవి ఉన్నాయి .అరడజన్ కు పైగా బాల సాహిత్య పుస్తకాలు రాసింది .negotiating with dead ,a writer on writingwith intent ,essays ,reviews ,personal prose వంటివి ఓహ్ ఎన్నో రాసింది .రాసినవన్నీ వన్నె ,వాసి గలవే .నవల మీద ద్రుష్టి ఎక్కువ అవటం టో కవిత్వం పలచ బడింది .అయితేనేం -2007లో’’ ది డోర్ ‘’ కవితా సంకలనం టో తానేమీ వెనక పడి లేనని సామర్ధ్యాన్ని రుజువు చేసుకొంది. .అభిమానం కూడా పెంచు కొంది . కవి గా తన స్థానం ఎప్పుడు అగ్రభాగమే అని రుజువు చేసింది .

” రైటర్స్ యునియన్ ఆఫ్ కెనడా” కు ఆఫీసర్ అయింది .’’P.E.N. ‘’ కు ప్రెసిడెంట్ అయి రాజ కీయ ఖైదీలుగా బందీలైన రచయిత లను విడి పించే అవకాశాన్ని పొందింది .వారి తరఫున తీవ్ర పోరాటమే చేసింది .మార్గరేట్ రాసిన ‘’బ్లైండ్ అస్సాసిన్ ‘’ అనే నవలకు 2000 సంవత్సరం లో’’ బుకర్ ప్రైజ్ ‘’వస్తే ,వారు అంద జేసిన 50,000 డాలర్ల భారీ నగదు పారి పారితోషిక ధనాన్ని’’environmental group ‘’కు ఉదారం గా ఇచ్చిన త్యాగ మూర్తి ఆమె .మాటల్లోనే కాదు చేతల్లో ను తనకు సాటి లేరని నిరూపించు కొంది .గత పాతిక ఏళ్లుగా ఆమె సాహిత్యం పై నిరంతర అధ్యనం జరుగు తూనే ఉంది .ఎన్నో పరిశోధనాత్మక గ్రంధాలను వెలువ రించారు .వేలువరిస్తూనే ఉన్నారు .అందులో ముఖ్యమైనది ‘’the cambridge companion to M.Atwood అనేది రెండు వేల సంవత్సరం లో ప్రచురిత మైనది .ఇంకో పుస్తకం ‘’అట్ వుడ్ ఎ .క్రిటికల్ కంపానియన్ ‘’

మార్గరేట్ కవితా సంకలనాలన్ని నిత్య నూతనం గా ఉంటాయి .ఆమె లోని ధైర్యం ,నిబ్బరం గా చెప్పే భావాలు ,ఎంచుకొన్న భాషా ,పద జాలం అందర్ని ఆకర్షిస్తాయి .పురాతన విషయ మైనా ,ఆధునిక విషయ మైనా ఒక” లాండ్ స్కేప్” గా మన ముందు చిత్రించి నిల బెట్టటం ఆమె ప్రత్యేకత .హింసాత్మక సంఘటనలను రాయాల్సిన అవసరం వచ్చినా ఎక్కడా బాలన్స్ తప్పక పోవటం ఆమె కున్న గొప్ప రచనా లక్షణం .కోపాన్ని ,ద్వేషాన్ని చాలా అదుపు లో ఉంచు కొని రాసి, ఆ భావాలను నిండుగా ఆవిష్కరించే నేర్పు ఆమెది .అందుకే అట్ వుడ్ అన్నిటా అగ్రగామి అంటారు .మార్గ దర్శి మార్గ రేట్ అని గౌరవిస్తారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —12-5-12

కాంప్—అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.