అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్
అమెరికా వచ్చి అప్పుడే నెల దాటింది . వచ్చిన ఇరవై ఐదు రోజులకు కాని లైబ్రరీకి వెళ్ళ లేక పోయాను .అయిదవ తేదీ charlotte mecklen burg లైబ్రరి కి వెళ్ళాం .అక్కడ ఇరవై పుస్తకాలు తీసుకొన్నాను .ఇక్కడి పధ్ధతి వేరుగా ఉంది .మనమే పుస్తకాలను చేకౌట్ చేసు కోవాలి .అంతా అయిన తర్వాత లిస్టు వస్తుంది .నేను ,మా అమ్మాయి విజ్జి చెరో పది పుస్తకాలను పట్టు కొని కారులో పెట్ట టానికి వెళ్తుంటే అందరు విజ్జిని ‘’is all this stuff for you ?అని నవ్వుతు అడిగితే ‘’no -it is my father’s stuff ‘’అని వెనక ఉన్న నన్ను చూపించింది .వాళ్ళు నవ్వుతు’’ ఓహ్ వెరీ గుడ్ ‘’ అని అభి నందించారు .దానర్ధం ఈ మొహం అన్ని పుస్తకాలు చదివేదేనా అని కాని, అమ్మో ముసలాడు చాలా చదువు తున్నాడే అని మెచ్చి కోలు కావచ్చు. నాకు రెండోదే అని పించింది నిశ్చయం గా .అమెరికా కాంగ్రెస్ కు, కౌంటీ మాజిస్త్రేట్ మొదలైన వాటికి ఎన్నికలు జరుగు తున్నాయి .ఎక్కడా హంగూ ,ఆర్భాటం లేదు అరుపులు గోలలూ లేవు .నినాదాలు లేవు .లైబ్రరి లో పోలింగ్ జరుగుతోంది .మనకైతే సెలవ ప్రకటిస్తారు .ఇక్కడ ఎవరి పని వారిదే .ఒక పక్క పోలింగ్ ఇంకో వైపు యదా ప్రకారం లైబ్రరి కార్య క్రమాలు .లైబ్రరీ లలో పిల్లలకు ట్యూషన్ చెబుతారు టీచర్స్ .రెండు గంటలు .శని వారం రోజున .డబ్బు తీసుకొంటారు .ఎన్నిక చాలా పధ్ధతి లో జరగటం నాకు ముచ్చటేసింది .ప్లే కార్డ్స్ పట్టు కొని లైబ్రరి బయటి గేటు కు అవతలే ఏజెంట్స్ నుంచుని ఉంటారు .నవ్వుతు అందర్ని పలకరిస్తారు .లోపల ఎన్నికల బూత్ ను కూడా చూశా.ఎవరి గోల వారిదే .చక్కగా ఓటేసి వెళ్లి పోతున్నారు .సీక్రేసి మైంటైన్ చేస్తున్నారు .బాలెట్ షీట్ చాలా పెద్ద గా కని పించింది .రెండు పార్టీల అభ్యర్ధుల పేర్లు కని పించాయి రెండు వరుసలలో .బహుశా నేను చూసింది నమూనా పేపర్ అయి ఉండ వచ్చు .లైబ్రరి లో ఎలుగు బంటి అంత నల్లని కుక్కను చూశా . .దంపతులిద్దరూ దాన్ని తెచ్చి చిన్న పిల్లలకు చూ పిస్తున్నారు .అన్ని రకాల గేమ్స్ ఆడు కోవా టానికి వీలుంది .నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది ఎప్పుడు .నేను తెచ్చిన ఇరవై పుస్తకాలలో పద్నాలుగు నిన్నటి తో చదివేశా .అందు లో ఒకటి రెండు అంత గా బాగా ఏక పోతే తిరగేశాను అక్కడదక్కడ చదువుతూ .చదివిన పుస్తకాల లిస్టు రాస్తా చివర్లో .ఈ వారం లో వర్షం పడింది రెండు మూడు సార్లు .శామ్స్ ,వాల్మార్ట్ ,జి మార్ట్ లకు వెళ్లి పాలు ,పళ్ళు కూరలు తెచ్చు కోవటం తప్ప బయటికి పెద్ద గా వెళ్ళ లేదు .పన్నెండవ తేది శని వారం మదర్స్ డే కోసం ఒకరింటికి వెళ్ళాం . ఈ వారం లో ఇంటి చుట్టూ రాళ్ళు పెట్టించి మట్టి పోయించి పూల మొక్కలు కూర గాయల మొక్కలు పెట్టింది విజ్జి .శ్రీ కెత్ కరాటే క్లాస్ కు వెళ్ళాం శుక్రవారం .
ఈ నెలలో దాదాపు సరస భారతి కి నలభై అయిదు కు పైగా ఆర్టికల్స్ రాసినట్లు గుర్తు .’’చినుకు మాస పత్రిక’’ లో నేను రాసిన ‘’అన్నం పెట్టిన చేతుల తోనే—‘’అనే ఆర్తికల్ మే సంచిక లో పడింది . ఇదిsynthetic అమోనియా తయారు చేసి సస్యవిప్లవానికి నాంది పలికిన హేబర్ అనే శాస్త్రజ్ఞుడి గురించి .స్టేట్ లీడర్ ,సన్ఫ్లవర్ మాగజైన్లలో నేను రాసినవి వస్తున్నాయి .ఆధునిక స్త్రీ కవుల గురించి ఆర్టికల్స్ రాశాను .ఇంకా కొన్ని నోట్స్ రూపం లో ఉన్నాయి .వాటిని డెవలప్ చేయాలి .ఏ బయటి ప్రోగ్రాములు లేక పోవటం టో ఈ వారాన్ని ‘’weak గా గడచిన week’’ అన్నానంటే రైం బాగుందని.
కళ తప్పిన మదర్
మే పన్నెండు శని వారం మదర్స్ డే.ప్రపంచం అంతా గొప్పగా జరుపుకుంటుంది ,జరుపు కొన్నది .ఇక్కడికి అరగంట ప్రయాణ దూరం లో మా అల్లుడు అవధాని మేనత్త గారి ఊరుకు చెందిన కుటుంబ స్నేహితులు మదర్స్ డే కార్యక్రమం వారింట్లో జరుపుతున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళాం .మేనత్త కుటుంబానికి వీరికి నలభై ఏళ్ళ కు పైగా స్నేహం .తరచు ఆ రెండు కుటుంబాలు కలుసు కొంతాయట . .స్నేహాన్ని ఇంత బంధం గా ,పదిలంగా భద్ర పరచు కొంటున్న వారిద్దరి కుటుంబాలకు అభి నందనాలు .దాదాపు ఇరవై తెలుగు కుటుంబాల వారు చేరారు .మా అమ్మాయి వాళ్లకు ఈ కుటుంబం తప్ప మిగిలిన వారితో పరిచయమే లేదట .అయితే ఆ దంపతులు మమ్మల్ని చక్కగా మర్యాదగా ఆహ్వానించారు .కుశల ప్రశ్నలు వేశారు సంగతు లన్నీ తెలుసు కొన్నారు .ఇంటి ఆవిడ తాను తెచ్చిన గిఫ్ట్ లను పిల్లలతో వారి తల్లులకు ఇప్పించి హాపీ మదర్స్ డే చెప్పించింది .మా అమ్మాయితో వాళ్ళ అమ్మకు అంటే మా శ్రీమతికి ,మా మనవడి తో మా అమ్మాయికి గిఫ్ట్ లు ఇప్పించారావిడ.మేము అక్కడికి రాత్రి ఏడు గంటలకు చేరాం .ముందుగా అందరికి” ముంత కింద పప్పు” లాంటి దాన్ని కప్పుల్లో పెట్టి అందించారు .పిల్లలకు బిస్కట్లు జ్యూసులు .మదర్స్ డే సందడి ఏదైనా ఉంటుందేమో నని ఎదురు చూశాను .ఆ జాడ కని పించలేదు .మగ వాళ్ళందరూ ఒక గది లో హాయిగా పేకాట లో మునిగి పోయారు .ఆడ వాళ్ళందరూ షరా మామూలుగా చీరలు ,నగలు ,పిల్లల గొప్పతనాల ముచ్చట్లలో లో మునిగి పోయారు .మా ఇద్దరికీ ఏ మ్బరాసింగ్ గ ఉంది .కనీసం అక్కడ చేరిన స్త్రీలు తమ తల్లుల గురించి తలో అయిదు నిమిషాలు గుర్తు చేసుకొంటే సార్ధకం గా ఉండేది .తాము సమస్యల్లో వున్నప్పుడు తమ తల్లులు ఎలా మార్గ దర్శనం చేశారో వాళ్ళు మాట్లాడు కొంటె నా కంటే సంత సించె వాడు ఇంకోడు ఉండే వాడు కాదు .అదే చాలా బాధ కల్గించింది .అయితే ఒక గొప్ప విషయం ఏమి టంటే అక్కడికి వచ్చిన వారందరూ దశాబ్దాల పాటు అమెరికా లో ఉంటున్నా చక్కని తెలుగు లో మాట్లాడు కొన్నారు మాట్లాడారు .మగ వారు ,ఆడ వారు ,పిల్లలతో సహా .ఇది మహత్తరం అని పించింది .ఆడవారు సంప్రాదాయ చీర లతో వచ్చారు .అదీ ముచ్చటేసింది .వీరందరి సంస్కారానికి ,పోషిస్తున్న సంస్కృతికి జేజేలే
రాత్రి ఎనిమిదన్నరకు విందు మొదలైంది .రసమలాయి స్వీట్ ,–చపాతి -బంగాళా దుంప కూర ,బీన్స్ కూర ,కాప్సికం కూర ,ఇంకో రక మైన చికిడీ ,.పప్పు, కొబ్బరి చట్ని ,మామిడి కాయ ఆవకాయ ,టమేటో పచ్చడి అన్నం ,రసం , గడ్డ పెరుగు .అందరు చక్కగా మాట్లాడు కొంటూ తిన్నారు .అడిగి అడిగి ఆడవాళ్ళు వడ్డించారు .మదర్ ను జ్ఞాపకం చేసుకోక పోయినా , మదర్ వంట లాంటి వంట తిన్నాం .అన్నీ ఇంటి ఇల్లాలే చేశారట .మదర్లీ ఎఫెక్షన్ తో చేశారేమో .అందరు లొట్ట లేసుకొంటు ,ఆమె ను అభినందిస్తూ తిన్నారు .కృతజ్ఞతలను చెప్పి అందరం పదింటికి బయల్దేరి రాత్రి పదిన్నరకు ఇంటికి చేరాం .మదర్ పై ఒక చిన్న పద్యం లాంటి కవిత ఆంగ్లం లో –
m –merciful ,majestic ,memorable ,magnana mous
o- –omni present ,omni potent ,occcupational
t—talented ,tactful ,terribly inspiring
h—honest ,honourable ,humble ,homely
e—enduring ,ever helpful ,energetic
r—resourceful ,rewarding and with,right judje ment .
is mother – I adore you the mother for all .
నేనీ వారం లో చదివిన పద్నాలుగు పుస్తకాలు –canary capers ,charles lind bergh ,buddhists hindus ,sikhs in americaa ,lindon johnson ,ice maiden of the andies ,hundred modern poems ,are you happy ?,making modernism –and picasso ,mrs lincoln ,lenok’s journey ,charlotte then and now ,the abolition of marriage in americaa ,god and the evolving universe ,how shakespere become shakespere .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —14-5-12.
కాంప్—అమెరికా


Nice
🙂
m –merciful ,majestic ,memorable ,magnana mous
o- –omni present ,omni potent ,occcupational
t—talented ,tactful ,terribly inspiring
h—honest ,honourable ,humble ,homely
e—enduring ,ever helpful ,energetic
r—resourceful ,rewarding and with,right judje ment .
is mother – I adore you the mother for all .
Thanks
Shiva
endukoemo.blogspot.in
LikeLike