ప్రియ మైన చిరంజీవులకు శుభాశీ స్సులు .మీరందరూ కలిసి ఒక చారిత్రాత్మక మైన పూర్వ విద్యార్ధుల సమా వేశాన్ని నిర్వహించటం చాలా ఆనందం గా ఉంది .సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం వత్సవాయి ఉన్నత పాటశాలను వదిలిన మీరు మళ్ళీ ఆత్మీయత ,అనురాగాలను మేళవించుకొని మాత్రు సంస్థ ఆవరణ లో కలుసుకొని ,మీ అనుభూతులను నెమరు వేసుకొని ,మీరు ఆ విద్యాలయానికి ఏరూపం గా మీ సేవలు అందించి దాన్ని అన్ని విధాలా అభివృద్ధి పధం లోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలో అని ఆలోచించ టానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావిస్తాను .మీ ఆశయానికి నా మనస్పూర్తి అభినందనలు ,మీ అందరికి శుభా కాంక్షలు .నేను మొదటి సారిగా ఆ విద్యాలయం లో పదోన్నతి ని పొంది ,ప్రదానో పాద్యాయునిగా 1987 -88 .లో పని చేశాను .అన్ని వసతులు ఉన్నా విద్యలో వెనుక బడి ఉండటం బాధ వేసింది .మీరందరినిఉత్సాహ పరచి ,ప్రత్యెక తరగతులను నిర్వ హించి ,హాస్టల్ విద్యార్దులకు కూడా ప్రత్యెక క్లాసులు నిర్వ హించి మీలో ప్రేరణ కల్గించాను .దీనికి నాకు విద్యాలయం లో అందరు ఉపాధ్యాయుల సహకారం మీ సహకారం లభించింది అక్కడ ఏమైనా మంచి జరిగితే అది ఆ విద్యా కుటుంబం యొక్క గొప్పతనమే .వ్యక్తిది కాదు .సమర్ధులైన ఉపాధ్యాయులు నేను పని చేసిన కాలమ్ ఉండటం నా అదృష్టం .విద్యాలయం చేసుకొన్న అదృష్టం ..అది మరువలేని విషయం .విద్యార్దులుగా మీరు ఆ నాడు కొంచెం అలసత్వం చూపినా మంచి ని చెప్పే వారిని గౌరవించటం మరువ లేనిది .మీరందరూ జీవితం లో ఏదో ఒక సంతృప్తి కరమైన వ్రుత్తి లో స్థిర పడి ఉంటారని ఆశిస్తున్నాను .మాతృదేశం ,మాత్రు సంస్థ లతో మన అనుబంధం శాశ్వత మైనవి .వాటిని కంటికి రెప్ప లాగా కాపాడు కోవాలి .వాటి అభివృద్ధి లో మనం పాలు పంచుకోవాలి.గురువులను గౌరవించటం అందు లో ఒక భాగం .ఈ శుభ సందర్భం లో మీరు మీ గురువులను సత్కరిస్తున్నారని తెలిసి ఆనందం గా ఉంది .
ఇటీవలే ప్రారంభమైన ”బాక్ టు స్కూల్
” కార్య క్రమాన్ని పూర్వ విద్యార్ధులందరూ తమ గ్రామాల్లో తాము చదువు కొన్న విద్యాలయాలలో జరుపు కొంటు ,ఆ విద్యాలయ అభి వృద్ధికి తమ వంతు సేవ లందించటం చాల శుభ పరిణామం..ఈ ప్రేరణ నిలవాలి .మీరు భవిష్యత్ తరాలకు ఆదర్శం అవాలి .వీలైనప్పుడల్లా కలుసు కొంటు ,,స్పూర్తిని పొందుతూ ,మీ తరువాతి తరానికి ప్రేరణ నిస్తూ ముందుకు కదలాలని ఆకాంక్షిస్తున్నాను .నాకోసం మీరు పనిగట్టు కోని వచ్చి ఆహ్వానాన్ని మా ఇంట్లో అందించటం నాకు మహదానందం గా ఉంది .ఉయ్యూరు లో ఉంటె తప్పక వచ్చి మీ ఆనందం లో భాగస్వామిని ఆయె వాడిని .సుదూరం లో ఉండటం వల్ల మీకు నా శుభాకాంక్షలను మెయిల్ ద్వారా పంప వలసి వచ్చింది .నేను తప్పక రాసి పంపాలని మీరందరూ కోరటం మీ సహృదయతకు నిదర్శనం .మీ అందరికి మరో సారి అభి నందనాలు .కార్య క్రమం అందరి సహకారం తో వైభవో పేతం గా ,ఉత్సాహ భరితం గా విజయ వంతం గా జరగాలని మనస్పూర్తి గా కోరు కుంటు, జరుగు తుందని నమ్ముతున్నాను ..—మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -05 -12 .
కాంప్–షార్లెట్ -నార్త్ కెరొలినా –యు.ఎస్..ఏ.
వీక్షకులు
- 1,107,750 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


