నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2
దేశి కవిత్వం
నన్నే చోడ మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా ఛందస్సు దీనికి ముఖ్యం .’’జాను తెనుగు ‘’అన్నాడు నన్నే చోడుడు .ఇదే అచ్చ తెలుగు ,అందమైన తెలుగు అని భావం .ఈ రకమైన కవిత్వాన్ని శివ కవులు బాగా ప్రచారం చేశారు .కవిత్వం తన ‘’మార్గం ‘’వదిలి దేశీయమైంది ఇక్కడి నుంచే .మల్లికార్జున పండితా రాధ్యుడు శివ తత్వ సారం అనే గ్రంధాన్ని దేశీ ఛందస్సు లో రాశాడు .ఆశువు గా చెప్పిన వైన వన్నీ గ్రంధస్తం అయాయి .ఇదే వేమన కూ ఆదర్శ మైంది ‘’.కంద’’ను పద్యాల్లో చక్కగా వండి వడ్డించాడుపండితుడు శైవ మత ప్రచారానికి ఈ కవిత్వం ఆలంబన మైంది ఇక్కడి నుంచే .ఇదో వరవడి .
తర్వాత వచ్చిన వాడు పాల్కురికి సోమ నాధుడు .శైవ మతం పై దీర్ఘ నిష్ఠ ,ప్రత్యెక వ్యక్తిత్వం ,అద్భుత పాండిత్యం తో ,అనన్య కవితా శక్తి తో ,ఒక ‘’స్రష్ట ‘’గా నిలిచి పోయాడు .మొదట్లో నన్నయ గారి మార్గం లో ప్రయాణం సాగించినా ,తర్వాతా ఆ దారి వదలి ,’’ద్విపద ‘’తో సంప్రదాయ కవిగా నిలిచి గెలిచాడు .ఎనిమిది భాషలు ,అనేక శాస్త్రాలు నేర్చిన మహావిద్వాం సు డు పాల్కురికి .కవిత్వం కూడా ఉరుకులూ ,పరుగులే .’’ఉదాహరణ ‘’కావ్యానికి నాంది పలికాడు .ఇది ‘’విభక్తి విధానం ‘’పై సాగే రచన .ఎనిమిది విభాక్తులతో రచన ఉండటం దీని ప్రత్యేకత .ఒక్కో విభక్తి కి మూడేసి పద్యాలు,ఆది లోను ,అంతం లోను ,ప్రాస .మొదటిది వృత్త పద్యం .తరువాత రగడ అనే కలిక .మూడోది ఉత్కలిక .అన్ని విభక్తు లతో ఇరవై నాలుగు పద్యాలు .చివరగా ఇరవై అయిదవ పద్యం సర్వ విభక్తులతో ఒక వృత్తం .చివరికి అన్కితాంత పద్యం లో కవి పేరు ఉండటం దీని లక్షణం .మొదట తెలుగు లోను .తర్వాతా సంస్కృతం లోను బసవేశ్వరుని గురించి ,ఉదాహరణ కావ్యాలు రాసి చరిత్ర సృష్టించాడుసోమన .దీని రహస్యాన్ని విప్పి చెప్పుతూ కవి సామ్రాట్ విశ్వ నాద ,’’ప్రపంచం అంతా క్రియా రూపం ,అన్ని క్రియలు పరమేశ్వరుడిని చేరతాయి .ధాతువు విభక్తి ని ఆశ్ర యించే ఎప్పుడూ ఉంటున్ది.విభక్తి తో సంబంధం లేని క్రియ లేదు .అన్ని విభక్తు లతో పరమేశ్వరుడిని గురించి చెబితే ఆయన సర్వ క్రియలకు ఆధార భూతుడు అని చెప్పినట్లే ‘’అని గొప్ప విశ్లేషణ చేషారు .ఇదో కావ్య తత్త్వం . సాహిత్యం లో ఇదొక నూతన పరికల్పన .తరువాత వర్ధిల్లిన ఉదాహరణ కావ్యాలకు మార్గ దర్శనాన్ని దేశీయం గా చేసినది సోమన ‘’బసవ ఉదాహరణ ‘’ కావ్యమే .సోమ నాధుడే ‘’బసవా ! బసవా ! బసవా !వ్రుషాదిపా!’’అన్న తోలి శతకాన్ని కూడా రాసి తెలుగు లో శతక సాహిత్యానికి ఆద్యుడు అయాడు .
అచ్చ తెలుగు ఛందస్సు ‘’ద్విపద ‘’ను ఎన్ను కొని ‘’బసవ పురాణం’’ రాశాడు .ద్విపద ఐహికానికి ,ఆముష్మికానికి కారణం అన్నాడు .పాట లాగా పాడు కొనేందుకు వీలుగా ఉండటం వల్ల జనసామాన్యానికి తన భావనలు అందుతాయని భావించాడు .నన్నయ మొదలు పెట్టిన ‘’చంపూ ‘’పద్ధతికి పోటీగా ఒకే పద్య పద్ధతిని అంటే ద్విపద పద్ధతినిప్రవేశ పెట్టి ,సేహబాస్ అని పించుకొన్నాడు .స్వాభావిక మైన రచనకుప్రాణం పోశాడు .భక్తిని ,ఆవేశాన్ని కవిత్వం లో పాదు కోల్పాడు .చారిత్రాత్మక మైన విషయాలనువిషయాలను వస్తువు గా తీసుకొన్న మొదటి కవి పాల్కురికి సోమనార్యుడే .బసవడు ,పండితా రాధ్యుడు చారిత్రాత్మక మహా పురుషులు .వారికి కావ్య గౌరవం కల్పించిన చారిత్రిక కవి . అంతే కాదు – క్రింది కులాల వారికి అగ్రాసనం కల్పించిన మొదటి కవిగా ,నూతన మార్గానికి దేశికునిగా నిలిచి పోయాడు . ఈయన తర్వాతా చాలా మంది కవులు భక్తుల చరిత్రలను కావ్యాలుగా రాశారు .శైవ మతానికి అధిక ప్రచారాన్ని కల్పించిన వాడు కూడా సోమనే .పలుకు బడు లకు ,జాతీయాలకు ,సామెత లకు ఆయన కవిత్వం నెలవు .,,కొలువు .లాక్షి ణి కులతో భేదించి ,స్వంత ప్రయోగాలు చేశాడు .కిన్నెర బ్రహ్మయ్య మరణం తో బసవేశ్వరుడు పొందిన తీవ్ర దుఖాన్ని అద్భుతం గా 14 పాదాలలో రాసి ,జాన పదులకు ఇష్టమైన ‘’బుర్ర కధ ‘’కు బీజం వేశాడు .ఆయన కవితా ధార మహావేగం .సుళ్ళు తిరుగుతూ ప్రవహించి మనల్ని లాక్కు పోతుంది .ఏమి చెప్పాడన్నా ఆలోచన కంటే ఎలా గొప్పగా చెప్పాడా అని ఆశ్చర్య పోతు ఆయన కవిత్వం వెంట పరుగో పరుగు .అందులో కొట్టు కు పోవాల్స్సిందే .ముంచి తేలుస్తాడు .అడ్డూ ఆపు లేని ఉధృత ధృతి ఆ కవిత్వం .ఇదే పాల్కురికి సోమన ప్రత్యేకత .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-5-12.—కాంప్—అమెరికా .

