కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్
ది హాబిట్ ,ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే రెండు రచనల తో ప్రపంచం లో లక్షలాది మందిని ని ఆకర్షించిన బ్రిటీష రచయిత ,ఇంగ్లీష ప్రోఫెస్సర్ ,భాషా ధ్యన వేత్త , కవి జే.ఆర్.ఆర్.టో ల్కిన్
.జర్మన్ భాష లో ఆయన పేరు కు అర్ధం –తెలివి తక్కువ ధైర్యశాలి అని ,బుద్ధిలేని తెలివి గలవాడని అర్ధం ..చిన్నప్పుడే గ్రీక్ ,లాటిన్ భాషల్లో అసమాన పాండిత్యం చూపాడు .గోతిక్ ఫిన్నిష్ ,మొదలైన మరుగున పడ్డ భాషలను అధ్యనం చేశాడు .తన స్వంత భాషల్లో వాటిని మళ్ళీ జీవింప జేశాడు .ఇది సరదా కోసమే మొదట చేశాడు .కాని తర్వాతా అదే ధ్యాస ,శ్వాస గా జీవించాడు .క్లాసిక్స్ అని పిలువ్ బడే లాటిన్ ,గ్రీకు భాషల్లోనూ ,భాషా శాస్త్రాల లోను తగి నన్ని మార్కులు సంపాదించ లేక పోయాడు .దీనితో లాభం లేదని ఇంగ్లీష భాషా సాహిత్యాల పై దృష్టి నిలిపాడు .1915 డిగ్రీ పొందాడు .ఫిన్నిష్ భాషా ప్రభావం తో ‘’quenya’’భాషను సృష్టించాడు .సైనికుడు గా చేరి లంకా షిర్ లో సెకండ్ లెఫ్టినెంట్ అయాడు .తరువాత్ ఏడాది లో ఎదిత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .వేస్త్రెన్ ఫ్రంట్ లో యుద్ధానికి వెళ్లాడు .ట్రెంచ్ లలో ఉండి యుద్ధం చేయటం తో ‘’ట్రెంచ్ ఫీవర్ ‘’తో బాధ పడి తిరిగి వచ్చే శాడు .యుద్ద్ధ అనుభవాలు ,చూసిన భీభాత్సాలపై రాయాలనే సంకల్పం కలిగింది అవే ఆ తర్వాతా‘’book of lost tales ‘’గా వచ్చింది
ఒక సారి భార్య అతని కోసం హేమ్లాక్ అడవుల్లో డాన్స్ చేసింది .ఇది మనసు లో పడి berene and luthern తమ కు మారు పేరుగా సృష్టించాడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష నిఘంటువు నిర్మాణం లో సహాయ లేక్సికోగ్రాఫర్ గా నియమింప బడ్డాడు ..ఎక్కువ కాలం ఉండలేక లీడ్స్ వర్సిటి లో రీడర్ గా చేరాడు ..ఆ తర్వాతా ఆక్స్ఫర్డ్ లో ఇంగ్లీష ప్రొఫెసర్ అయాడు .అప్పుడే మైత లాజికల్ కధలెన్నో రాశాడు .హాబిట , ,ది లార్డ్ అఫ్ రింగ్స్ అప్పుడే రాశాడు .1959 లో రిటైర్ అయాడు .
గ్రీక్ సాహస వీరుల ,పురాణ నాయకుల అద్భుత వీరోచిత కధలను ,ఆ నాటి సంస్కృతి ల పై తీవ్ర పరిశోధనలు చేశాడు ‘’.మిడిల్ ఎర్త్ ‘’అనే కొత్త లోకాన్ని సృష్టించి ,పాత్రలను తయారు చేసి ఆ నాటి భాష లో వాళ్ళు మాట్లాడి నట్లు కొత్త భాషలను సృష్టించిన మేధావి టోల్కీన్ .అతను సృష్టించిన పాత్ర లన్నీ చెడు పై పోరాటం చేసేవే .చివరికి మంచే చెడు పై విజయం సాధిస్తుందని సందేశం ఉంటుంది ఆయన ఏది రాసినా .
ఓల్డ్ ఇంగ్లీష అని పిలువ బడే ఆంగ్లో సాక్సన్ ఇసిలాన్దిక్ ,భాషలను బోధించాడు .గ్రీక్ ,వెల్ష్ ,ఫిన్నిష్ ,స్కాండినేవియా ,భాషలకు వ్యాకరణం ,పద జాలాన్ని సృష్టించాడు .ఆంగ్లో సాక్సన్ క్రానికల్ ఆధారం గా ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు .భాషా శాస్త్రం అంటే ఆరో ప్రాణం .మిడిల్ ఇంగ్లీష నాటి sir gowain and the green knight ‘’అనే దీర్ఘ కవిత ను ఎడిట్ చేసి ప్రచురించాడు .దాన్నే ఆధునిక ఇంగ్లీష భాష లో కవిత్వం గా మార్చి ప్రచురించాడు .తోక్లీన్ రాసిన ‘’the monster and the critic ‘’వ్యాసానికి చాలా పెద్ద పేరు వచ్చింది .అలాగే పాత ఇంగ్లీష కవిత ‘’beowulf’’లో వీర ధీర శూరులు చాలా మంది వ్యక్తులను చంపుతారు .ఆ కవిత ఆంగ్ల భాషా ధ్య య నానికి ,ఆవిర్భావానికి తోడ్పడు తుందని భావించాడు .ఇప్పటికీ అతని sir gawain ‘’యునివేర్సిటి లో బోధనా విషయం గా ఉంది .ఆర్దూరియాన్ ,ఎల్ష్ ,నార్స్ ,ఐస్లాండ్ భాషల్లోని పూర్వ కధలన్నీ అతను రాసిన కధలకు ప్రేరణ .టోల్కీన్ కు ఫిన్నిష్ భాష అంటే మహా ఇష్టం .దాని లోని kalevala ‘’అనే అతి ప్రాచీన కవిత అంటే మహా ప్రాణం .ఇలాంటి భాషలను ఎన్నిటి నో కనుక్కొని ,వాటిల్లో కవితలు రాసి తన ప్రతిభ ను చాటి చెప్పాడు .’’కలేవల’’ కవితకు సాటి కవిత ఆంగ్ల సాహిత్యం లో లేనే లేదు అని ఆయన నిశ్చితాభిప్రాయం .అతను సృష్టించిన చిన పాత్రలు elves ,drowrves ,trolls ,gobins hobbit.విమర్శకులు అతని రచనలను కాలానికి తగ్గట్లు లేవు అని విమర్శించినా అసంఖ్యాకం గా ప్రపంచ వ్యాప్తం గా ప్రజలు చదివి ఆదరించటం విశేషం .
1960 లో జీవావరాన ,పర్యావరణం పై దృష్టి పెట్టాడు .1997 లో టి.వి.ల సర్వే లో టోల్కీన్ నంబర్ వన్ స్థానం పొందాడు .అతని రచనల్లో పక్షులు ,వృక్షాలు కూడా మాట్లాడుతాయి .చెట్లు కూడా మానవులతోసమానం అన్నాడు .ప్రజలకు ,ప్రకృతి కి మధ్య మంచి అవగాహన ,సంబంధాలు ఉండాలని తన రచన లలో తెలిపాడు .మానవ అభివృద్ధి కృత్రిమం గా కాక స్వాభావికం గా ఉండాలన్న ప్రోబోధం ఆయనది .జీవావరణ ,లాండ్ స్కేప్ లకు ప్రాధాన్యం ఇచ్చాడు .జీవావరణం మీద ఆలోచించిన మొదటి తరం రచయిత టోల్కీన్ .ఆయన వాషింగ్ మషీన్ ,టి.వి .లు కూడా అసలు వాడ లేదు .పల్లెల్లో నివ సించాలని బోధించినా పట్నాల సరి హద్దు లో నివ శించాడు .
టోల్కీన్ రచన లో హాబిట్ కధ ఒక ఆస మర్ధుని జీవిత యాత్ర .చివరికి రింగ్ ఆఫ్ పవర్ సంపాదిస్తాడు .దుష్ట సంహారం జరిగి మంచికి పట్టాభి షేకం జరగట మే కధ సారాంశం .the silma rillion అనే నవల ఆయన చని పోయిన తర్వాతా ప్రచురిత మైంది .దానిలో చాందస మధ్య యుగ ఆవిర్భావం ,ఉంది .మిడిల్ ఎర్త్ లోని మొదటి యుగం తో ప్రారంభించి తర్వాతా రెండు యుగాల కధ ఇందులో ఉంది .ఇది చాలా సంక్లిష్టం గా ఉంది ఎక్కువ మందిని ఆకర్షించ లేదు .
టోల్కీన్ పాత ,కొత్త తరాలకు చెందిన రచయిత గా ఇంగ్లాండ్ లో గుర్తింప బడ లేదు .భాషా విషయ పరి శోధకుని గా గౌరవించారు .మిడిల్ ఎర్త్ లో మగాళ్ళ దాస్తీకానికి బలి పోయే అమాయిక స్త్రీలు ,పిల్లల దయ నీయ గాధ ఉంది .అదంతా నేటి మన ఆధునిక కాలానికి చెందిందే నని విశ్లేషకుల అభి ప్రాయం .మగాళ్ళు హింసా ,తీవ్ర వాదం వల్ల అధికారాలు సాధిస్తారు .వారి మధ్య ఆడ వారు ,,పిల్లలు నలిగి పోతారు .ఒక రకం గా నవీన ప్రపంచానికి అది దర్పణమే .లార్డ్ ఆఫ్ రింగ్స్ ను’’peaceful political anarchy’’అన్నారు .అరణ్య సంరక్షణ అవసరాన్ని గట్టిగా చెప్పాడు .’’ప్రపంచాన్ని మార్చక పోయినా ఫరవా లేదు కాని ఉన్నదాన్ని చెడ గొట్ట వద్దు ‘’అని ఆయన అందరికి సందేశం ఇచ్చాడు
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-5-12.—కాంప్—అమెరికా

