మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్
ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే ఇంగ్లాండ్ కు చెందిన అలాన్ టూరింగ్ అనే గణిత శాస్త్ర వేత్త .ఈ సంవత్సరం ఆయన శత జయంతి గా ప్రపంచం అంతా జరుపుకొంటోంది .అలాంటి వాడిని గురించి మనం తెలుసు కొని తలచు కొందాం .
రక్షిత వార్తా సమాచారాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు .అంటే పంపిన వాడికి ,పంపబడే వాడికి తప్ప ఆ కోడ్ఇంకెవరికి తెలీదు .దాన్ని అవతలి వాడు డీ కోడ్ చేసుకొని తెలుసు కొంటాడు .ఇది యుద్ధాలలో చాలా ప్రయోజన కరం .దానికి ఎంతో బుర్ర ఉండాలి .అలాంటి అరుదైన మేధావి టూరింగ్ .1912 జూన్ 23 న ఇంగ్లాండ్ లో ని లండన్ లో జన్మించాడు .తల్లి వైపు ,తండ్రి వైపు వారందరూ మహా తెలివి గల వారే .ఇతను చిన్నప్పటి నుండి స్వతంత్రమైన ఆలోచనలున్నవాడు .పదేళ్ళ వయసు లో హాజేల్ హర్స్ట్ స్కూల్ లో చేరాడు .అతను మేధావి అని టీచర్స్ గ్రహించారు .బేసిక్స్ గురించి ఎక్కువ గా ఆలోచించే వాడు .తర్వాతా శేర్బార్న్ స్కూల్ లో చేరాడు .అక్కడ క్లాసిక్స్ అని పిలువ బడే గ్రీక్ ,లాటిన్ చదివాడు.పద్నాలుగు ఏళ్ళ కే చేమిస్త్రి లో మహా ప్రతిభా వంతుదని పించుకొన్నాడు .అతని లోని గణిత మేధావి కవిత్వం రూపం లో బయట పడ్డాడు ‘’the maths brain liesawake in his bed –doing logs to ten places and trig in his head .అని కవిత రాశాడు .అతని ముఖ్య స్నేహితుడు ,సహాధ్యాయిమార్కాం అకస్మాత్తుగా చని పోతే తల్లడిల్లి పోయాడు .
కేంబ్రిడ్జి లోని కింగ్స్ కాలేజి లో స్కాలర్షిప్ తో చేరాడు .హిట్లర్ జర్మనీ నియంత గా అధికారం లో నిలబడ్డాడు .మాస్టర్ డిగ్రీని గణితం లో సాధించాడు 1934 లో .తరువాతి ఏడు కింగ్స్ కాలేజికి ఫెలోషిప్ పొందాడు on computable numbers అనే పేపర్ ప్రకటించాడు .కొన్ని గణిత భావాలను రుజువు చేయలేము అని తెలియ జేశాడు .దీంతో యూని వేర్సాల్ కంప్యుటర్ ‘’భావనకు బీజం పడింది .తర్వాతా ప్రీస్టన్ యూని వర్సిటి లో అడ్వాన్సెడ్ స్టుడి కి చేరాడు ..గణితం లో పి.హెచ్.డి.సాధించాడు .మళ్ళీ కింగ్స్ కాలేజి లో ‘’ కోడ్ అండ్ సైఫెర్ స్కూల్ లో ‘’చేరాడు . mathematical logic అంటే మహా ఇష్టం .దాన్ని mathematics of mathematics అంటారు .ప్రాబబిలిటి అనేది గణితం ప్రకారం కంప్యూట బిలిటి కి సమానం .
క్రీ.పూ.4000 లకే ఆరకాల జిస్టులు లెక్కలు తేలిగ్గా చేసే’’ అబాకస్’’ అనేది ఉందని గుర్తించారు .అదొక డిజిటల్ కంప్యూటర్ వంటిది .టూరింగ్ దృష్టి అలాంటిది తయారు చేయాలని యునివేర్సాల్ మషీన్ కోసం ప్రయత్నాలు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధం లో జర్మన్లు’’high security top secret communications వ్యవస్థ రూపొందించారు .అదే’’cipher machine ‘’ దాన్ని వాళ్ళు’’ ఎనిగ్మా’’ అని పేరు పెట్టారు .cipher అంటే వార్తను కోడ్ మెసేజెస్ గా ప్రతి అక్షరానికి వివిధ అక్షరాలను సమ కూర్చిపంపటం .దీన్ని తెలుసు కోవటం బ్రహ్మ ప్రళయమే అవుతుంది .1938 లో డీ కోడ్ చేయటానికి అతి కష్టమైనా కోడ్ ను జర్మన్లు కని పెట్టారు . 1939 లో జర్మని పోలాండ్ మీద దాడి చేసింది .బ్రిటన్ ,ఫ్రాన్స్ లు నాజీ వ్యతిరేక పోరాటం చేయాలని నిర్ణయించారు .బ్లేత్చారి పార్క్ లో ని పరిశోధనా సంస్థ లో టూరింగ్ యుద్ద్ధ కాలం అంతా పని చేశాడు .అతని పరిశోధన సఫలమైంది .నాజీ ల ఎనిగ్మా కోడ్ ను డీ కోడ్ చేసి వాళ్ల యుద్ధ తంత్రాన్ని పసిగట్టి బ్రిటీష ప్రభుత్వానికి తెలియ జేశాడు .దీంతో కొత్త కోడ్ బ్రేకింగ్ టెక్నిక్ ప్రారంభమైంది .దీన్ని సాధించిన మేదావే టూరింగ్ .అదే జర్మని పతనానికి దారి చూపింది .యుద్ధం లో తుడిచి పెట్టుకు పోయింది .ప్రపంచాన్ని నాజీ భూతం నుండి కాపాడిన మేధావి గా టూ రింగ్ గుర్తింపు పొందాదు ,1942 లో అమెరికా వెళ్లి అక్కడి నావికా దళం తో పని చేసి కోడ్ బ్రేకింగ్ లో సలహాలనిచ్చాడు .అక్కడి ఒహాయో లో ఉన్న గ్రాహం బెల్ లాబ్ లో ఎంక్రిప్తింగ్ స్పీచ్ పరికరాలను తయారు చేయటం లో సాయం చేశాడు .colossas’’అనే కొత్త మెషీన్ తయారు చేశాడు .1945 లో’’ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష ఎంపైర్’’ పురస్కారం అందుకొన్నాడు కంప్యుటర్ కు ఆద్యుడై ,మానవ మెదడు ను కృత్రిమం గా తయారు చేసే ఆలోచన లో పడ్డాడు .యంత్రానికి ఉన్న అన్ని సామర్ధ్యాలను వాడి ఆలోచన ,తెలివి తేటలు తో పనిచేసే సాధనాన్ని తయారు చేసే ఆలోచన కు వచ్చాడు దీన్నే ‘’ బిల్డింగ్ ది బ్రెయిన్ ‘’అంటారు .’’కంప్యూటర్లకు విషయ జ్ఞానం ,అనుభవం ఉండదన్న భావన తప్పు అని చెప్పాడు .అది కూడా మానవుడి లాగే అన్ని రకాల ప్రజ్ఞా ,జ్ఞానం అనుభవాలను చూపుతుంది అని తెలియ జేశాడు .ఇదేartificial intelligence ‘’ కు దారి చూపింది .
‘’ సెల్ఫ్ ఆర్గ నైజింగ్ సిస్టం’’ తయారు చేశాడు దాన్నే’’ సెల్యులర్ ఆటోమా ‘’ అని గణితజ్ఞులు పిలిచారు .తర్వాతనేషనల్ ఫిజికల్ లాబ్ కు వెళ్లి’’ pilot aautomaatic computing engine ‘’‘’(a.c.e.)కోసం పని చేశాడు ఆ నాటి కంప్యూటర్స్ కు అవసర మైన సెట్స్ ,ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ,రోటీ న్స్ ను తయారు చేశాడు ..అయితే అక్కడ పని చాలా నెమ్మదిగా జరుగుతుంటే మాంచెస్టర్ యుని వేర్సిటి కి వెళ్లి అక్కడ వారు తయారు చేస్తున్న కంప్యుటర్ కు సాయం చేశాడు ‘’.కంప్యుటర్ చేస్’’ కు ప్రోగ్రాములు రాశాడు .’ 1950 లో ‘’computing machinery and intelligence’’ అనే దాని మీద అతి విలువైన పత్రాన్ని రూపొందించాడు .ఇదే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు మార్గం చూపింది .అవతల మాట్లాడేది మనిషా కంప్యుటారా అనే దాన్ని గుర్తించే test తయారు చేశాడు .దాన్ని అతని పేర పిలుస్తున్నారు .1951 లో’’బ్రిటన్ రాయల సొసైటీ ఫెలో ‘’ గా అత్యున్నత గౌరవం ప్రభుత్వం ఇచ్చింది .1952 లో the chemical basis for morphogenesis ‘’అనేపేపర్ ప్రెసెంట్ చేశాడు .మానవ శరీర భాగాల్లో అభివృద్ధి కారక మైన తేడాల వివరణ దీనితో సాధ్యం అయింది
కంప్యుటర్ మా నవుని లా ఎదిగే అతి ఉత్కృష్ట సమయం లో అతని చావు ను ప్రపంచ దేశాలు జీర్ణించుకో లేక పోయాయి .అతని మరణం తర్వాత యాభై ఏళ్ళ కు జనం చైతన్యులయారు 2009 లో ప్రజలు అతని విలువను అర్ధం చేసుకొని .ప్రభుత్వ అసమర్ధతను దుయ్య బడుతూ భారీ ప్రదర్శనలు చేశారు .ప్రధాని గార్డన్ బ్రౌన్ వారిని సముదాయిస్తూ ‘’టూరింగ్ పట్ల అతి దారుణం గా ప్రభుత్వం ప్రవర్తిన్చిందన్న మాట నిజమేనని ,అది తప్పే నని ,ఆయన్ను అనవసరం గా ఫిమేల్ ఇంజేక్షన్లను చేయించుకొనే పరిస్తితి కల్పించటం విషాద కరం అనీ ,అతను ఫాసిజాన్ని అంతం చేయ టానికి చేసిన కృషి మాన వాళి మరచి పోలేదని ,అందుకే తాను ప్రధాన మంత్రిగా ,జాతికి క్షమాపణ చెబుతున్నానని మహా మేధావి టూరింగ్ సేవలు చిరస్మరణీయం గొప్పగా శ్లా ఘించాడు .
ఇవాళ టూరింగ్ పై అనేక నాటికలు ,కవితలు వ్యాసాలూ వస్తున్నాయి .అతన్ని జాతీయ నాయకుడని కీర్తిస్తున్నారు .2002 లో అతని పై ఒక జాతీయ సదస్సు నిర్వ హించారు ఆరోజు ను ‘’టూరింగ్ డే ‘’ అన్నారు ‘’.యుని వరసల్ మషిన్’’ లో ఇవాళ మనం అందరం భాగా స్వామ్యులం అవటానికి ఆనాడు అలాన్ టూరింగ్ చేసిన ,అందించిన సేవలే కారణం .ఇప్పుడు2012 సంవత్సరం అలాన్ టూరింగ్ శత జయంతి సంవత్సరం .మనం మరచి పోయిన మేధావిని మళ్ళీ గుర్తు చేసుకొని భావి తరాలకు ప్రేరణను అందిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-5-12 —కాంప్—అమెరికా

