నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5
పోతనా మాత్యుడు
తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన పరవశం తో పెంచి రాసేయట మే .పోతన సహజ పాండిత్యం ఉన్న కవి అవట మూ నూతన విషయమే .తెలుగు లో ఎన్నో కావ్యాలున్నా పోతన భాగవతమే పండిత ,పామర రంజక మైంది .కరతలా మలకమూ అయింది .దీనికి కారణం భక్తీ ,ఆర్ద్రత .అంత్య ప్రాసలకు అన్నప్రాసన చేసింది పోతనే .వైష్ణవ భక్తీ సాంప్రదాయానికి ప్రతీక గా పోతన భాగవతం నిలిచింది .అన్నమయ్య మొదలైన తద నంతర వైష్ణవ భక్తులకు పోతన్నీ దారి చూపించాడు .మందార మకరంద తున్దిలం గా పద్యాలను చెప్ప టం తో తెలుగింట పోతన పద్యాలు అందరి నోట నినదించాయి .రుక్మిణీ కళ్యాణం ,గజేంద్ర మోక్షం ,నిత్య పారాయణీయ మయ్యాయి .ఇంత బాగా జనసామాన్యాన్ని అలరించిన కవి పోతన ఒక్కడే అవటం విశేషం .అంత వరకు భాగవతం జోలికి పోక పోవటమూ పోతన్నకు బాగా కలిసొచ్చింది .
అన్న మాచార్యులు
అన్నమయ్య గా తెలుగింట సుపరిచితుడు అన్నమా చార్యులు .జాన పదులు పాడు కొనే అనేక రకాల పదాలను భక్తీ వైభవం టో ఊరేగించిన వాడు తాళ్లపాక అన్నమాచార్యులు .శృంగారాన్ని భగవత్ ఉద్దేశం గా పరిణతి చెందించాడు .తిరుమలేశుని దివ్య సన్నీ దానం లో ఆస్థాన కవి అని పించు కొన్నాడు .పద కవితకు తెలుగు లో పితామహుడు అని పించు కొన్నాడు .సంకీర్తనలకు ఆచార్యుడే కాదు ,ప్రాగాచార్యుడు కూడా .జాన పదుడు కాని కవి రాసిన జానపద గీతాలు అన్నమయ్యవి .ఇదీ ఇక్కడ విశేషం .ముప్పై రెండు వేల పదాలను ఎంతో వైవిధ్య భరితం గా రాశాడు . వాటిలో దక్కింది పద్నాలుగు వేలు మాత్రమే .అందులో ఆధ్యాత్మికాలు ,శృంగార కీర్తనలూ ఉన్నాయి .’’జో అచ్యుతానంద ,జోజో ముకుందా ‘’అన్న జోల పాట పోతన్న గారి పద్యాల తర్వాతా బహుళ ప్రచారం పొందింది తెలుగు నేల మీద .జాన పద శైలితో భక్తిని ,మేళవించి ,వైష్ణవ సంప్రదాయానికి అద్భుత ప్రచారం కల్పించి ,కొత్త బాట వేసిన వాడు అన్నమయ్య .
జక్కన –అనంతామాత్యుడు
తెలుగు లో కేతన రాసిన ‘’దశ కుమారచరిత్ర ‘’,మంచన రాసిన ‘’కేయూర బాహు చరిత్ర ‘’కధా కావ్యాలకు సంస్కృతం లో దండి రాసిన ‘’దశ కుమారాచరిత్ర ‘’,రాజ శేఖరుడు రాసిన ‘’విద్ద సాల భంజిక ‘’ఆధారాలు .కాని స్వతంత్రం గాకదా కావ్యాలు రాసి తోలి ప్రయత్నం తోనే శిఖా రాగ్రాలు చేరిన వారుజక్కన ,అనంతయ్య.జక్కన ‘’విక్రమారక చరిత్ర ‘’,అనంతా మాత్యుని ‘’భోజ రాజీయం ‘’తోలి తెలుగు స్వతంత్ర కావ్యాలు .ఇలా ఇద్దరు ఒకే సారి కొత్త మార్గాలు చూపటం ఒక వింత .పశువులు ,పక్షులు ,క్రింది తరగతి మనుష్యులకు కావ్యం లో స్తానం కల్పించి ,పాత్రలను చేయటం కొత్త ఒరవడి .ఇంతే కాదు వీరిద్దరూ తమ కావ్యాలను’’నవ్య కావ్యాలు ‘’అని తామే చెప్పు కోవటం గుర్తుంచు కొదగిన విషయం .విక్రమార్కుని పేర ప్రచారం లో ఉన్న అనేక కధలను గుది గుచ్చి జక్కన రాస్తే ,చారిత్రిక పురుషుడు కాని భోజ రాజు ను ఆధారం గా చేసుకొని నీతి ,భక్తీ వగైరా సామాజికామ్శాలను కధలను రాశాడు అనంతయ్య .అనంతుడుఛందో దర్పణం కూడా రాశాడు .అది ఆయన పేర చలా మణిఅయింది .

