ట్రాయ్ పై కొత్త కోణం
ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్ పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం మొద లైనవి అసలు ఉండేవా /లేక హోమర్ కల్పించి రాశాడా /ఉంటె ఆ అమూల్య ధన రాసులేమైనాయి ?అసలు ట్రాయ్ నగరం కంచు యుగానికి చెందితే దాని అవసేషా లేక్కడ కన్పిస్తాయి?గ్రీకులు లక్ష మంది సైనికులతో వెయ్యి నౌకలతో ట్రాయ్ మీద దండెత్తారని హోమర్ రాసింది ఎంత వరకు నిజం /అనే ప్రశ్నలు రెండు శతాబ్దాలుగా పరిశోధకులను వేధిస్తున్నాయి .వాటి పై సమగ్ర విశ్లేషణం చేయాలని చాలా మంది ప్రయత్నించారు .వారు ఇటీవలి కాలం వరకు కొత్త కోణం లో వెలిబుచ్చిన విశేషాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .ఆనాటి ట్రాయ్ నే నేడు టర్కీ అంటున్నారు
ట్రోజన్ వార్ అయిన నాల్గుగు వందల సంవత్సరాలకు హోమర్ రాశాడు గ్రీక్ పురాణాలను .హోమర్ రాసి అప్పుడే 2800సంవత్స రాలైంది ఒకప్పుడు బాబిలోనియా ప్రముఖ వర్తక కేంద్రం .ఇదే ఇవాల్టి ఇరాక్ .మధ్య ప్రాచ్యం లో గొప్ప సామ్రాజ్యం .రెండు వేళ ఏళ్లు వర్తకానినికి కేంద్రం గా ఉంది .ఆ నాడు మెసపొటేమియా అనే ప్రాంతం నుండి ట్రాయ్ కు చేరే వారు .మెసపొటేమియా అంటే రెండు నదుల మధ్య భూమి వర్తకానికి హిత్తిట్టేతెస్ మీదుగా వెళ్ళేవారు .ఈ జాతి వాళ్ళు రహస్యాలను బాగా జ్జాగ్రత్త గ కాపాడే వారుగా ప్రసిద్ధి .ఇక్కడి దేవతలు బాబి లోనియా దేవతల కంటే భిన్నం గా ఉంటారు .’’ తుఫాను దేవత ‘’ను ఎక్కువగా పూజించే వారు .ఇక్కడి ప్రజల్ని విలూసా ప్రజలంటారు .అయితే వీరే ట్రో జన్లు అనే అభిప్రాయం కూడా ఉంది .విలూసా యే ట్రాయ్ అని .వైన్ డార్క్ సి అని హోమర్ పిలిచిన ఆజియాన్ సముద్రం లో మూడు వేళ ఏళ్ళ కిందటి సముద్రం లో మునిగి .లేక ముక్కలైన నావలు కని పించాయి .అందులో సారాయి నిలవ చేసే సా ధనాలు దొరికాయి .ఇవి గ్రీకులవి ,త్రోజన్లవి కావచ్చు .ఇద్దరు సారా సరసులే మర్మరా సముద్రం పక్కన ఉన్ననగరమెబాష్పోరస్ నే ఇస్తాంబుల్ అని ఇప్పుడు అంటున్నారు ..
క్రీ.పూ.1627 లో పెద్ద అగ్ని పర్వతం బ్రద్దలైంది .అప్పుడు తెర అనే చోట కొన్నికుడ్య చిత్రాలు బయల్పడ్డాయి .అవి చెక్కు చెదర లేదు .అందులోని స్త్రీలు కంచు యుగానికి చెందిన వారు గా గుర్తించారు .ఇవాల్టి ఆధునిక దుస్తులు ఆనాడే ఆడవాళ్ళూ ధరించిన దాఖలాలు కని పించాయి .గ్రీకులకు చేపలు పట్టే పని ఎక్కువగా ఉండేదని అంటారు .’’hali carnassus అనే పట్టణం లో హోమర్ జన్మించి నట్లు భావన .అతడు క్రీ.ప్పూ.850 కాలం వాడు .వైన్ డార్క్ సి కి ఇరువైపులా గ్రీకుల పట్టనాలున్దేవి .ఆసియా మైనర్ లో వారికి కావాల్సిన ముడి పదార్దాలున్దేవి .వాటిని సాధించటమే ధ్యేయం గా ఉండే వారు .వాణిజ్య సామ్రాజ్యానికి ఆద్యులని పించుకొన్నారు .హిట్టితే సామ్రాజ్యం క్రీ.పూ.1150 కే కూలి పోయింది .క్రీ.పూ..480 లో అశేష సేనా వాహినితో పర్షియా నుంచి xerxes దండెత్తి వచ్చాడు .అతని చూపు ట్రాయ్ మీద పడింది .అక్కడ వెయ్యి నల్ల ఎద్దులను బలి ఇచ్చాడు .ఒకప్పుడు గ్రీకుల స్వాధీనం లో ఉన్న ట్రాయ్ ను వశ పరచుకొన్నాడు .అతని పేరుకు అర్ధమే ‘’రాజాది రాజు ‘’అని .అప్పుడు సముద్రాలు దాటటానికి పడవల బ్రిడ్జి లుండేవి .
ట్రాయ్ గురించి త్రావ్వాకాలు జరపాలనని Heinrich Schliemannఅనే పరిశోధకుడు వ్యాపారం లో డబ్బు బాగా సంపాదించి ,భార్య తో సహా 1873 లో హోమర్ రాసిన దాని ఆధారం గా ట్రాయ్ చేరి హిస్సార్లిక్ అనే చోట తవ్వకం మొదలు పెట్టాడు .అంతులేని ధన రాసులు కిరీటం బంగారు నగలు దొరికాయి .వాటిని జర్మని కి తరలించాడు .ఆ తర్వాతా అవి రష్యా చేరి సెయింట్ పీటర్ బర్ఘ్ మ్యూజియం కు చేరాయి .అతనికి అగమినన్ ముఖానికి తోడుక్కొనే బంగారు మాస్క్ దొరికింది మైసీనియా లో కూడా తవ్వకం సాగించి సమాదుల్ని కను గోన్నాడు ..ఆర్ధర్ ఇవాన్స్ అనే అతను క్రీట్ లో చేసిన తవ్వకాలలో బాగా అలంకరించ బడిన ఒక గది అందులో గోడలక రంగుల చిత్రాలు వ్రాత ఫలకాలు కనిపించాయి .బెల్జేన్ అనే పరిశొధకునికి ట్రాయ్ లో మట్టి ,రాతి ఫలకాలు లభించాయి .1963 లో ఎట్ట కేలకు బెల్జేన్ పురాతన ట్రాయ్ నగరాన్ని ,అందులోని సౌధాలను కనుక్కొన్నాడు .కోర్ఫ్మాన్ అనే పరిశోధకుడు కూడా తవ్వకాలు సాగించి కంచు యుగం నాటి ట్రాయ్ బెల్జిన్ కనుక్కొన్న దానికంటే పది హేను రెట్లు పెద్దదిగా ఉంటుందని తేల్చాడు .అప్పుడు జనాభా ట్రాయ్ లో ఏడు వేల మంది మాత్రమే ఉండ వచ్చు నని ,హోమర్ కవి చెప్పి నట్లుగా లక్ష మంది గ్రీకులు ట్రాయ్ మీదకు దండెత్తి వచ్చే అవకాశం లేదని వెయ్యి నౌకలతో వచ్చారని చెప్పటం కూడా అతిశయోక్తి అని చెప్పాడు .కంచు యుగం లోని ట్రాయ్ పైన ఎనిమిది సార్లు నిర్మాణం జరిగి మొత్తం తొమ్మిది ట్రాయ్ నగరాలు భూమి లో ఉన్నాయని చెప్పారు అందరు .ప్రియాం రాజు సంపద అంతా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా రష్యా చేరింది .ఎలా చేరింది అన్నది మిస్టరీ గానే ఉంది .


ఇలాంటి చారిత్రక కథనాన్ని TV 9 ” రహస్యం ” అనే కార్యక్రమం లో దృశ్య రూపకంగా చూడటం జరిగింది, సామ్యం ఉన్నది కాని, అప్పట్లో నేను చూసింది, ఇప్పుడు చదివినది రెండు ఒకే అంశానికి చెందినవా లేదా అని సందియము,
వారు దానికి తోడు మీకు ఈ విధమైన ఆసక్తి ఎలా జనియిన్చేన్? తెలుసుకోవలె నని కుతూహలము తోడ నున్నాడను, ఆధ్యాత్మిక భావనలు చేసెడి వారు గత చరిత్రల యందు రంజిల్లరు కదా! పరస్పర భిన్న మైన ఈ ధ్రువాలను ఎలా జతపరచ గలిగు చున్నారు? నిజమైన ఆసక్తి తోనే అడుగుతున్నాను కాలక్షేపానికి కాదు! నా ప్రశ్న అర్థం లేనిదైతే మన్నించ గలరు
?!
LikeLike