నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు
ఇటలి నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను నియమించాడు .రోమన్ ఎక్స్ప్రెస్ ఒక సారి పద్నాలుగు నిమిషాలు ఆలస్యం గా చేర్చి నందుకు డ్రైవర్ ను వెంటనే తొలగించాడు ..రైల్వే లలో దోపిడీలు ,దౌర్జన్యాలను అరి కట్ట టానికి స్పెషల్ రైల్వే పోర్స్ శాఖ ను ఏర్పాటు చేశాడు .అధికార గణం అనే చేంబర్ కాదు ప్రజల్ని పాలించేది ప్రభుత్వమే ప్రజల్ని పరి పాలిస్తుందని ప్రజలకు తెలియ జెప్పాడు .ప్రజా పాలన చేయటం ప్రారంభించాడు .1922 నవంబర్ పదహారున ప్రధానిగా బాధ్యతలు చేబట్టాడు .1926 అధికారాలనాన్ని హస్తగతం చేసుకొని అధికార కేంద్రం గా ,నియంత గా మారాడు .
అతని పార్టి ఫాసిస్ట్ పార్టి .ఫాసిస్ట్ ఇటలి ని గ్రేట్ పవర్స్ లో ఒకటి గా చేయాలన్నదే ముసోలిని మనోగతం ..ప్రజలందరికి ‘’ఐడెంటిటి కార్డ్ లు ‘’ఇచ్చిన ఘనత ముస్సోలినీదే .1930 లో వచ్చిన ప్రపంచ వ్యాప్త డిప్రెషన్ నుండి ఇటలీని ఒడ్డుకు చేర్చేందుకు ,సంక్షోభ నివారణకు the battle of the lire ‘’కార్యక్రమాన్ని చె బట్టాడు .లైర్అనేది ఇటాలి నాణెం .దీనితో ఇటలి లీరా విలువ తగ్గ కుండా కాపాడాడు ..వస్తువుల ధరలను తగ్గించాడు .సబ్సిడీలను పెంచాడు .అందువల్ల మద్య ,పేద తరగతుల వారు బతికే అవకాశం బాగా కలిగింది .ముసోలిని పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగింది .
ఆర్ధిక సంక్షోభం దిగుమతులపై ప్రభావం చూపిస్తుంది .దీనికి విరుగుడు గా ‘’the battle of wheat ‘’కార్యక్రమం మొదలు పెట్టాడు .అధికోత్పత్తి దీని ధ్యేయం .తాను కూడా రైతు వేషం వేసుకొని పోలాల లోకి వెళ్లి రైతుల్ని ప్రోత్సహించి కష్ట పడి పని చేయించి దిగుబడి అధికం చేయించాడు .దున్నాడు ,విత్తనం వేశాడు కోతలు కూడా కోశాడు .ప్రపంచం అంతా ఆర్ధిక సంక్షోభం లో కొట్టు మిట్టాడు తుంటే ఇటలి ప్రజలు హాయిగా నిమ్మకు నీరెత్తి నట్లు ఉన్నారు .పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండాయి .ప్రపంచ దేశా లన్నీ ఇటలి వైపు కు ఆశ్చర్యం గా చూశాయి .ఈ గోధుమ యుద్ధం అత్యంత విజయ వంతమయింది .1933నాటికి దిగుమతులు రెండు లక్షల ఇరవై వేలనుండి ఒక్క సారిగా పదిహేను వందల టన్నులకు చేరింది .ఇంత గొప్ప మార్పు ఆ కాలం లో యే దేశం లోను రాలేదు .ఇటలీ హీరో అయాడు ముసోలిని .
చిత్తడి నే లలు ఎందుకు పనికి రాకుండా ఉండేవి .వాటికి నీటి సౌకర్యం కల్గించాడు .తొమ్మిది మిలియన్ల ఎకరాలను అదనం గా సాగు లోకి తెచ్చిన ఘనత ముస్సోలినిదే .రొమ్ కు తెర్రసినామధ్య ఉన్న మలేరియా వ్యాధి విపరీతం గా వ్యాపించి ఉండే ఒక లక్ష యాభై వేల ఎకరాల చిత్తడి నే లల్ని పంట పొలాలుగా మార్చి మలేరియా ను నిర్మూలించట మే కాక ,సాగు భూమి విస్తీర్ణాన్ని పెంచటం సాహసో పెత మైన చర్య .వాటిల్లో దేశం మొత్తం మీద ఉన్న దేబ్భై వేల కుటుంబాలకు నివాసం కల్పించాడు .ఆరు కొత్త పట్టణాలను నిర్మించాడు ‘’.il duce’’అంటే ‘’మహానాయకుడు’’అని పించు కొన్నాడు .
ఇటాలి జనాభా పెంచాలి అనే ఉద్దేశ్యం తో ‘’battle of the people ‘’ అనే జనాభా పెంచే కార్య క్రమం చేబట్టాడు .ఇటాలి జనాభాను నాలుగు కోట్ల నుండి ఆరు కోట్లకు పెంచగాలిగాడు ..ఇలా చేస్తే తప్ప పురాతన రోమన్ సామ్రాజ్యానికి ఉన్న ఘనత సాధించలేమని అతని ఉద్దేశ్యం .అదే అతని కల కూడా .ఉన్న జనం లో సగమైనా పెరగాలని భావించాడు .ఖచ్చితం గా అలానే జరిగింది .మహిళలకు పిల్లల్ని కన టానికి ప్రోత్సాహాలు ఇచ్చాడు .పెళ్లి చేసుకొని బ్రహ్మ చారులకు పన్ను విధించాడు .ఎక్కువ సంతానం కన్నా సంతాన లక్ష్ములు కు బహుమతులు అంద జేశాడు .93 మంది మహిళలు 1300 మంది పిల్లల్ని కన్నారు .వారందరినీ పిలిచి ఘన సత్కారం చేశాడు .ఆరోగ్యం ,మాత్రు సంరక్షణ ,పసి పిల్లల మరణాలను తగ్గించటం వంటి ఎన్నో పనులు చేశాడు ..దీనికి కొంత రాజకీయ కారణం కూడా ఉంది .ఇటాలి లో రాజ కీయ సంక్షోభం పెరిగి జనం ఇతర దేశాలకు వలస పోవటం జరిగింది .
అమెరికా ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ,ఇంగ్లాండ్ ప్రధాని చామర్లేన్ ,లు ముసోలిని అంటే వీర అభిమానం పెంచు కొన్నారు .గాంధీ మహాత్ముడు ముసోలిని ని ‘’సూపర్ మాన్ ‘’అన్నాడు .కాంటర్ బేరి చర్చి ఆర్చి బిషప్ ‘’యూరపు లీడర్ల లో ముసోలిని అత్యున్నతుడు ‘’అన్నాడు .greatest genius of modern times ‘ ’ అన్నాడు థామస్ ఎడిసన్ ‘అన్నిటా చితికి పోయిన ఇటాలి దేశాన్ని పేదరికం నుండి ఒద్దే క్కించిన మహానాయకుడు అన్నాడు అమెరికన్ బాంకర్ ఆటో కాం.. ‘’చర్చిల్ కు ముసోలిని ముందు చుట్ట కాల్చే ధైర్యం లేక పోయింది .అతను ముసోలిని సంతకం చేసిన ఫోటో తనకు ఇమ్మని కోరితే తిరస్కరించాడు ముసోలిని .హిట్లర్ కు ముసోలిని అంటే వీరాభి మానం .ముసోలిని తనకు దేశ విదేశాలనుండి రెండు మిలియన్ల ప్రజలు ఉత్తరాలు రాస్తే అందరికి సమాధానం రాసి హృదయాలను గెల్చు కొన్నాడు .ప్రపంచం మొత్తం మీద35 వేళ గ్రీటింగ్ కార్డులను క్రిస్మస్ పండుగ రోజు అందు కొన్న ఏకైక నాయకుడని పించు కొన్నాడు .1920-30 కాలం లో ప్రపంచం మొత్తం మీద ‘’సర్వోత్తమ నాయకుడు’’ అని పించు కొన్నాడు ముసోలిని .
వెనిస్ ను దేశం ప్రధాన వాహిని కి కలిపే బృహత్తర కృషి చేశాడు .నాలుగు వేళ మైళ్ళ రోడ్ల నిర్మాణం చేశాడు .అనేక ఆక్విడేక్ట్ లు కట్టించాడు .అపూలియా భూములకు నీటి పారుదల సౌకర్యం కల్పించాడు ..నాలుగు వందల బ్రిడ్జి లను నిర్మింప జేశాడు .సకాలం లో రైళ్ళు నడిచే టట్లు చేశాడు .టెలిఫోన్ వ్యవస్థను ఆధునీ కరణం చేశాడు .పోస్టాఫీసులు ,గవర్న మెంట్ ఆఫీసులకు లెక్కే లేదు .అయిదేళ్ళలో రోమన్ సామ్రాజ్యం ‘’marvel to nations of the world ‘’అవాలని ముసోలిని ధృఢ వాంచ.అదే అతని నినాదం .పూర్వపు ఆగస్టస్ సామ్రాజ్యం లా అతి విశాల ,క్రమశిక్షణ గల శక్తి వంత మైన సామ్రాజ్య నిర్మాణమే తన ధ్యేయం అని పదే పదే ముసోలిని చెప్పే వాడు .ప్రజలను జాగృతం చేసి ప్రేరణ కల్గించే వాడు .దీని కోసం తనకు సర్వాధి కారాలు కావాలను కొన్నాడు .పొందాడు .దాని తర్వాతే ఇటలీ పునర్నిర్మాణం ప్రారంభించి విజయం సాధించాడు
ముసోలిని కి ముందున్న పార్ల మెంట రి ప్రభుత్వం మాఫియా గ్రూపులను అదుపు లో పెట్ట లేక పోయింది .ముసోలిని కాలం లో హత్యలు 278 నుండి కేవలం ఇరవై అయిదు కు తగ్గాయి అంటే ఎంత కఠినం గా రౌడీ షీటర్ల విషయం లో వ్యవహరించాడో తెలుస్తోంది .ముసోలిని తర్వాతా మళ్ళీ ఎవరు వాళ్ళను నియంత్రించ లేక పోవటం వల్ల మాఫియా గాంగ్ చేల రేగి పోయింది .1వేల ప్రభుత్వ ప్రాధమిక విద్యాలయాలు నేల కోల్పాడు ముసోలిని .నగరాలలో ని పిల్లలకు ‘’సమ్మర్ కాంప్ పు ‘’లు ఏర్పాటు చేశాడు . 1930 నాటికి ఇటాలి ప్రజలు అత్యంత సంపన్నులయారు .ఇరవై వ శతాబ్దం లో ఇటాలి ప్రజల జీవితం అన్ని విధాల మెరుగైంది .ఆ కాలాన్ని ‘’the halcyon years ‘’ అంటే మన భాష లో స్వర్ణ యుగం అని ప్రపంచం అంతా భావించింది .
పార్లమెంటరి సాంప్రదాయం లేక పోయేసరికి ,ఏక వ్యక్తీ పాలన రావటం వల్ల హింసా కాండ తగ్గ్గింది .ముసోలిని ప్రపంచ ప్రసిద్ధ రాజ కీయ వేత్తగా ప్రశంసలు పొందాడు .ఇతర దేశాల నుండి నాయకులు ఇటలీ వచ్చి ,ఇక్కడి అభి వృద్ధి చూసి మెచ్చు కొన్నారు .కాని ముసోలిని యే ఇతర దేశాన్ని ఇంత వరకు సందర్శించక పోవటం ఆశ్చర్యం .mussolini does not want advice-he only wants applause ‘’అని ఒక అందర్ సెక్రెటరి అన్నది .అదీ ముస్సోలిని అంటే .ముసోలిని మహా వేగం గా కారు నడపటం అంటే ఇష్టం .ఆ నాడు ప్రతి స్కూల్ లో ప్రతి క్లాస్ రూం లో ముస్సోలిని ఫోటో లున్దేవి .ఉదయం జరిగే స్కూల్ ప్రార్ధన లో ముందు ముసోలిని ,ఆ తర్వాతే జీసస్ ప్రార్ధన పిల్లలు చేసే వారట .
ఇంత గొప్ప ప్రజా పాలకుడు అయిన ముసోలిని రెండవ ప్రపంచ యుద్ధం లో అనవసరం గా ఇటలి ని యుద్ధం లో దూర్చి ఓడి పోయి ప్రజా పరాభవం పొంది ,నిర్దాక్షిణ్యం గా కొత్త గా అధికారం లోకి వచ్చిన సోషలిస్టుల చేత కాల్చి చంప బడటం విధి లీల.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-5-12. కాంప్—అమెరికా

