వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -1
రెడ్డి పదం
ఏడవ శతాబ్దం లోనే” రెడ్డి ”పదం ఉన్నట్లు శాసనాదారాలున్నాయి .క్రీ.పూ.632లోని మొదటి విష్ణు వర్ధనుడి ”చీపురు పల్లి శాసనం ”లో ”రాష్ట్ర కూట ప్రముఖులు ”గా వీరిని పేర్కొన్నారు .రాష్ట్ర కూటమే రెడ్డి గా మారిందని చెప్తారు .సేద్యం చేయటం వల్ల ”పంట్ల రెడ్లు ”గా ప్రసిద్ధి చెందారు .కాకతీయుల కాలం నాటికి” కాడి వీరులు” కత్తివీరులైనారు .తెనాలి రామ లింగడు రెడ్లను ”కాపులు ”అన్నాడు .కడప ,నెల్లూరు జిల్లాల లోని రెడ్లను ”కాపులు ”అనే పిలుస్తారు .16 వ శతాబ్దం నాటికి రెడ్లలో 14శాఖలున్నట్లు తెలుస్తోంది .రెడ్డి కులాన్ని ”పంటాన్వయం ”అనే వారు .ఈ శాఖ లో పంట రెడ్లు ప్రముఖులు .వీళ్ళను దేచట ,దేసటి,దేష్టిఅని కూడా అనే వారట .కాశీ ఖండం లో శ్రీ నాధ కవి ,వీర భద్రా రెడ్డి రాజును ”శ్రీ మద్దేశటి వంశ శిఖా మణీ ”అని సంబోధించాడు .ఉత్తరాంధ్ర లో ”రెడ్డిక ”వాళ్ళు ,వెనక బడిన రెడ్లుగా భావింప బడుతున్నారు .
అసలు రెడ్డి అంటే నే ”గ్రామ పాలకుడు ”అని అర్ధం .గ్రామ పాలకుడు రచ్చ మీద కూర్చునె చోటును ”రెడ్డిగం ”అంటారట .”పెనుగాము రెడ్డి గంబును మించి ”అని ఉద్భటా రాధ్య చరిత్ర లో తెనాలి రామ కృష్ణ కవి వాడాడు .”ఒక కాలు మడిచి ,దాని పై మడిచిన ఇంకో కాలి పాదం మోపి ,ఆ కాలిని ,వీపును ,అంగ వస్త్రం తో గట్టిగా బిగించి కట్టు కోవటమే రెడ్డిగం ”అని ముత్తేవి రవీంద్రనాద్ వివరించారు అదేదో సినిమాలో కృష్ణం రాజు రాచ్చమీద కూర్చుని తీర్పు చెప్పిన పోజు అన్న మాట ..రాజు లైన రెడ్లు తండ్రి పేరు తర్వాత తమ పేరు వచ్చేట్లు పెట్టు కొన్నారు .ఇంకా తమాషా ఏమిటంటే ,ఇంటి పేరు ,అసలు పేరు ,కులం పేరు మూడూ కలిపి ”రెడ్డి రెడ్డి రెడ్డి ”అని పించు కొనే వారూ ఉన్నారట .ఇందులో మొదటిది ఇంటి పేరు ,రెండోది పేరు లో మొదటిది ,చివరిది రెడ్డి కులానికి సంబంధించినది .కడప జిల్లా లో పేద కల్లు ప్రాంతం నుండి ,రెడ్లు ,రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు వ్యాపించి నట్లు తెలుస్తోంది .అందులో ఒక శాఖ ”పెద కంటి రెడ్లు ”.వీరి భార్యలు” తాళి బోట్లు” ధరించరట ..పెండ్లిళ్ళ లో వధువు, మెడ లో ”నూలు పోగు మాత్రమెధరిస్తుందట . 16రోజుల పండుగ తర్వాత దాని బదులు ”బంగారు నాన్తాడు ”వేసుకొంటారట .దీనికి పిచ్చుక గుంటలు వాళ్ళు చెప్పే ఒక కధ ఆధారం గా కనీ పిస్తుంది .సీతా దేవి వన వాసం లో ఉన్నప్పుడు ,శ్రీ రాముడు యాగం చేయటానికి తన ప్రక్కన కూర్చోవటానికి ”స్వర్ణ సీత ”ను తయారు చేయించ టానికి కోశా గారం లోని బంగారాన్ని అంతా వాడినా చాల లేదట .అప్పుడు ”పెద కంటి రెడ్లస్త్రీలు ”,తమ నగలతో బాటు ,తాళి బోట్లను కూడా సమర్పించారట .అప్పుడు త్రాసు మొగ్గు చూపిందట .అప్పటి నుండి ,ఆ రెడ్డి స్త్రీలు తాళి బోట్లు ధరించే అలవాటు కు స్వస్తి చెప్పారట .ఇలా రెడ్లు వ్యవసాయం ,రాజకీయం లో ప్రవేశించి ,కవితా వ్యవ సాయం లోను గొప్ప ఫలితాలను సాధించారు .ఈ వైనాన్ని తెలియ జేయటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .
గోన బుద్ధారెడ్డి
రెడ్డి పేరు వ్యాప్తి లోకి వచ్చన సుమారు 600ఏళ్లవరకు రెడ్ల లో ఉన్న కవులు ,రచయితల పెర్లేవీ అందు బాటులో లభించ లేదు .వారు రాసిన పద్యాలు కాని ,పదాలు కాని చరిత్ర లో స్థానం పొందక పోవటం విచారకరం .కారణాలు తెలియదు .చరిత్ర లో మొదటి కవి ,రాజు గోన బుద్దా రెడ్డి .క్రీ.శ.1294 లో” వర్ధమాన పురం” లో రాజ్యం చేసి నట్లు తెలుస్తోంది .ఈయనకు ”కదన ప్రచండ ” ,”మీసర గండ ”,”ఉభయ బల గండ ”బిరుదులున్నాయట .తండ్రి” విథల రాజు” .బుద్దా రెడ్డి కాకతీయుల సామంత రాజు .ఇతను ”రంగ నాద రామాయణం ”ను ద్విపద కావ్యం గా రాశాడు .తండ్రి విథలుడే ,పాండు రంగ విథలుడని ,ఆయన పేరు మీదే కావ్యాన్ని రంగనాధ (విథల) రామాయణం గా పేరు వచ్చిందని చెబుతారు .తండ్రికి కూడా ”మీసర గండ ”బిరుదుఉండేదట .గోన రెడ్డి తన 75వ ఏట తన కొడుకు లైన కాచ భూపతి ,విథల రాజు లను రామాయణం లోని ఉత్తర కాండను వ్రాసి పూర్తీ చేయమని కోరాడట .ఇలా చేయమని దేవుడే కలలో కని పించి చెప్పాడట .గోన బుద్దా రెడ్డికి ”సర్వజ్ఞ ”బిరుదు కూడా ఉంది .కవి సార్వ భౌమ అనే ఛందస్సును కవి వాగ్బంధం అనీ పిలుస్తారు .వాల్మీకి రామాయణం లో లేని ఎన్నో కధలను కల్పించి జనరంజకం గా రాశాడు బుద్దా రెడ్డి .”పదాలు ,అర్ధాలు ,భావాలు ,గతులు ,పద శయ్యలు ,అర్ధ సౌభాగ్యాలు ,యతులు ,రసాలు ,గుమ్భనాలు ,ప్రాస ,సంగతి లతో వర్ధిల్లిన కావ్యం రంగ నాద రామాయణం ”అని విమర్శకులు కితాబు నిచ్చారు . .ఇతని కుమారులు ”పురాణ మర్మజ్నులు ”,బహు కళాద్యుతులు ,కవి రాజ భోజులు ”గా ప్రసిద్ధి చెందారు .కనుకనే తండ్రి కోరిక పై ఉత్తర కాండనూ రాసి ”తొలి జంట కవులు ”గా ప్రసిద్ధి చెందారు .కాచ భూపతి ,విథల రాజుల తండ్రికి తగ్గ కుమారులని పించుకొన్నారు .మనకు ఆది కావ్యం వాల్మీకి రామాయణం .దానినే రెడ్డి కవులూ తమ ఆది కావ్యం గా చేసి చరితార్దులయ్యారు .అక్కడి నుండి ,ఆ సాహితీ లహరి అవిచ్చిన్నం గా కోన సాగింది .పాడుకోవ టానికి వీలుగా ఉండే ద్విపద ఛందస్సు లో రాయటం వల్ల రంగ నాద రామాయణం బాగా ప్రాచుర్యం పొందింది .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-8-12–కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,548 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


reddy rajula history present chesinanduku meeku reddy jathi runapadi untundi
LikeLike