వేమన కు ముందున్న రెడ్డి కవులు -రచనలు -3(చివరి భాగం )
అన పోతా రెడ్డి -అన వేమా రెడ్డి
అన పోతా రెడ్డి 1336వరకు రాజ్య పాలన చేశాడు .అమరావతి లో తన మంత్రి ”అల్లయ వేమన ”తో అమరేశ్వర స్వామిని పునః ప్రతిష్ట చేయించాడు .అన వేమా రెడ్డి ధార్మికుడు .”ధర్మ వేమన ”అనే సార్ధక బిరుదాంకితుడు .’షట్కాల’ (ఆరువేళల )శివ పూజా దురంధరుడు .”సంతాన సాగరం ”వంటి తటాకాల నెన్నిటి నో త్రవ్వించాడు .ఇతని కాలం లోనే ”ఎల కూచి బాల సరస్వతి ”కవి విద్యాది కారి గా ఉండే వాడు .1381వరకు వేమన ఉన్నాడు .1427-48కాలం లో వీర భద్రా రెడ్డి రాజ్యాన్ని పాలించాడు .ఈయనకే శ్రీ నాధుడు కాశీ ఖండం అంకిత మిచ్చాడు .వీర భద్రా రెడ్డి మంత్రి అన్నయ్య కు ”భీమ ఖండం ”రాసి అంకితం చేశాడు .
కాటయ వేమారెడ్డి
అద్డంకిరాజ దానిగా తన బావ కొమరగిరి రెడ్డి ని రాజుగా చేసి ,కాటయవేముడు పాలించాడు .(1364-1386 ).తన బావ కుమార గిరి పేరుతో ,కాళిదాసు రాసిన మూడు నాటకాలకు ”కుమార గిరి రాజీయం ”అనే వ్యాఖ్యానం రాశాడు .కాటయ వేముడు శూరుడు ,విద్వద్గోష్టి ప్రియుడు గా ప్రసిద్ధుడు .ఇతని కాలం లోనే ”రాయని భాస్కరుడు ”మంత్రిగా ఉన్నట్లు ఒక చాటువు ప్రచారం లో ఉంది .”కలయ బసిండి గంటమున గాటయ వేమ సమక్ష మందు ,స –త్ఫలముగా ,”రాయన ప్రభుని బాచడు ”వ్రాసిన వ్రాల మ్రోతలున్ –గలు ,గలు ,గల్లు గల్లురన,గంటక మంత్రుల గుండె లన్నియున్ –జలు ,జలు,జల్లు జల్లురను,సత్కవి వర్యులు మేలు .మేలనన్”
ఈతని శాసనాలు పిఠాపురం ,పెద్దాపురం లలో ఉన్నట్లు తెలుస్తోంది .1416లో మరణించాడు .బావ గారిని గద్దె మీద కూర్చో బెట్టి రాజ్య పాలన సక్రమం గా నిర్వ హిస్తు ,కొమర గిరి కీర్తి ని శిఖా రాలకు చేర్చి ,సంగీత ,సాహిత్య ,నాట్య వైభవాలకు అగణుతకీర్తి సాధించి పెట్టాడు కాటయ వేమన .అధికారాన్ని దుర్విని యోగం చేయకుండా .రాజ ప్రతినిధి గా విదుక్త ధర్మాన్ని నేర వేర్చి న రాజు ,రచయిత వేమా రెడ్డి .ఈ నాటి రాజు గారి బామ్మర్డులకు పూర్తీ వ్యతి రేకం .
కొమరగిరి రెడ్డి
బావ మరది అండ దండ గా ,కొమర గిరి రెడ్డి హాయిగా ,చీకూ ,చింతా లేకుండా వైభవం గా రాజ్య పాలన చేశాడు .కవి పండితులను ,సంగీత నాట్య కోవిదులను పోషించాడు .”వసంత రాజీయం ”పేరుతో ,నాట్య శాస్త్ర గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .శాకుంతల వ్యాఖ్య లో దీన్ని గురించి గొప్ప ప్రశంశ ఉంది .–”మునీనాం ,భారతాదీనాం ,భోజాదీనాం ,చ భూజనం –శాస్త్రాణి,సంయగాలోచ్య ,నాట్య వేదార్ధ వేదినాం –ప్రోక్తం ,”వసంత రాజేన ”కుమారగిరి భూభుజా –నామ్నా ,”వసంత రాజీయం ”నాట్య శాస్త్ర యదుత్తమం ”
కొమరగిరి ఆస్థానం లో ”లకుమ ”అనే నాట్య కళా కారిణి ఉండేదట .ఆమె ఆయనకు వేశ్య అని అంటారు .”ఒక్క భావానికి వెయ్యి రకాల అభినయం ”చేసి చూపించేదట .ఆ విషయం కూడా ఒక శ్లోకం లో వర్ణించ బడింది –”జయతి మహిమాలోక తీతః ,కుమర గిరి ప్రభో–స్సదసి”లకుమా దేవీ ”యస్య ప్రియ సదృశీ ప్రియా –నవ మభినయం ,నాట్యార్దానాం తనోతి ,”సహస్రధా ”–వితరతి ,బహు నర్దా నర్ది వ్రజాయ సహస్రయః ”
కుమార రెడ్డి కాలం లో ”వసంతోత్స వాలు” నభూతో ,న భవిష్యతి అన్నట్లు గా జరిగేవి .అందుకే కుమారగిరి ని ”వసంత రాయలు ”అని పిలుస్తారు .ఇతని తో రెడ్డి రాజ్య ప్రభ దాదాపు అంత రించి నట్లే .
రెడ్డి రాజ్య పతనం
పెద కోమటి వేమా రెడ్డి కొడుకు తండ్రి తరువాత రాజ్యానికి వచ్చి ,నాలుగేళ్ళు పాలించాడు .కర్కోటకుడు ,దుష్టుడు .”పురిటి మంచం మీద కూడా పన్ను” వేసిన ఘనుడు .ఇతని బాధలు భరించ లేక ”సవరం ఎల్లయ్య ”అనే బలిజ నాయకుడు పొడిచి చంపేశాడు .1424-48కాలం లో పాలించిన వీరభద్రా రెడ్డి రాజమండ్రి నిఏలిన రాజుల్లో చివరి వాడు .1424లో కొండవీటి రాజ్యం అంతరించింది .అప్పుడు విజయ నగరం లో మైలా రెడ్డి ప్రముఖుడు గా ఉన్నాడు .ఇతడే శ్రీ నాద కవి సార్వ భౌముడిని ఆదరించి చేర దీశాడు .”దిన వెచ్చం ”ఇచ్చి పోషించాడు .కొండ వీడు ఆ తర్వాతా అందరిదీ అయింది .ఎవరెప్పుడు వచ్చి ,యేలి ,సోలి పోయారో తెలీదు .దీనినే శ్రీ నాధుడు ”పాములకుఎన్ని కన్నాలో ,పక్షులకు ఎన్ని ఆశ్రయ వ్రుక్షాలో ,ఏటికి ఎన్ని అలుగులో ,ఎలుగు బంటి కి ఎన్ని వెంట్రుకలో ,కొండ వీటి లో ఏలికలు (రాజులు )అందరు ”అని ఒక పద్యం లో చమత్కరించాడు .అంతే కాదు -రెడ్డి రాజుల కీర్తినీ అద్భుతం గా ప్రశంషించాడు .ఒకే ఒక పద్యం లో ఆ వైభవాన్ని అంతా కళ్ళ ముందు ప్రత్యక్షం చేశాడు .అందుకే” కవి సార్వ భౌముడు”అయాడు .”మహా నీయమ్బుగ ,నాంధ్ర భూవలయముం బాలించు చుం ,బ్రాజ్నులై –బహు కావ్యంబులు చెప్పుచున్ ,మరియు ,చేప్పంజేయు,చాముష్మిక –స్పృహలో ,ధర్మము లాచ రించుచును ,జగజ్జేగీయ మానంబుగా –నహముల్ పుచ్చిన ,రెడ్డి రాజుల సముద్యత్కీర్తి గీర్తిన్చేదన్ ”-ఇలా ఒక ”స్వర్ణ యుగం ”దాటి వెళ్లి పోయింది .
తెలంగాణా రెడ్డి కవులు
వీరి తర్వాత గుర్తుంచుకో దగిన కవిత్వం రాసిన వారు తెలంగాణా లోని రెడ్డి కవులు .అందు లో ఒకరు1550-1600 వరకు ఉన్న కామినేని ఎల్లా రెడ్డి .నిజాం రాష్ట్రం లో మెదక్ జిల్లా లో ”బిక్కన వోలు ”నివాసి .ఇతని సోదరుడు దోమ కొండ సంస్తానాది పతి మల్లా రెడ్డి ”లింగ పురాణం ”,వాశిష్టం ”రాసి నట్లు తెలుస్తోంది .ఇవి అలభ్యం .సోమనాధ కవి రాసిన ”బ్రహ్మోత్తరఖండ ”కావ్యాన్ని కూడా అంకితం పొందాడట .అదీ ఈతని ప్రత్యేకత .కావ్య కర్తా ,భర్తా కూడా .’
ఇతని తర్వాత గుర్తుంచుకో దగిన వాడు తూము పరశు రామి రెడ్డి .మహబూబ్ నగర జిల్లా వాడు .మామిడి మడ గ్రామస్తుడు .”అలవేలు మంగా పరిణయం ”,అనే ప్రబంధాన్ని రచించి నట్లు ‘గోల్కొండ కవుల సంచిక ”లో ఉంది 16.శతాబ్ది మొదటి భాగం లో ఉన్న మల్లా రెడ్డి దేశాయి అనే కవి ”గంగా పుర మహాత్యం ”అనే ప్రబంధాన్ని రాశాడు .ఈ గ్రామం హైదరాబాద్ ప్రాంతం లోనిదే .ఈ గ్రామానికి 1500సంవత్సరాల చరిత్ర ఉందట .అసలు పేరు రామాయపురం అనీ ,పశ్చిమ చాళుక్యుల శాసనం లో ఆ పేరు కానీ పిస్తుందని ,ఆరోరుద్రుడు ”ఆరుద్ర ”అన్నారు .స్కాంద పురాణం లోని” తీర్ధ ఖండం ”లో ఈ మహాత్మ్యం ఉందని ఆరుద్ర పరిశోధించి తెలియ జేశారు .ఈ కవిని ”రెడ్రేడ్డి”అని కూడా అంటారట .
హైదరాబాద్ రాష్ట్రం లోని ”దమ్మారావు పేట ”నివాసి ,చాడ రాఘవ రెడ్డి ”వెంకట రామణా” అనే మకుటం తో కంద పద్య శతకం రాశాడు .”విష్ణు సర్వోత్తమా ”అనే మరో మకుటం తో ఇంకో శతకమూ రాశాడు .”ద్విపద కావ్యం ”గా రామాయణాన్ని రాశాడు .కాచ రాజు కుమారుడు ”మల్లా రెడ్డి ”కవి ,గోల్కొండ నవాబు ‘మల్కిభరాం ”కాలం వాడు .బిక్కన వోలు రాజు కూడా .”షట్చక్ర వర్తుల చరిత్ర ”,,”పద్మ పురాణం ”,శివ ధరోత్తర ఖండం ”రాశాడు .వీటిలో మొదటిదానికి చాలా ప్రశస్తి లభించింది .ఎనిమిది ఆస్వాసాలు ,ఆరుగురు చక్ర వర్తుల కధ లక్షణం గా ,రస వత్తరం గా ఉండే కవిత్వం అని పండితాభి ప్రాయం .వీరి తర్వాతా యే రెడ్డి కవీ కావ్యం రాసి నట్లు కన బడదు .
ఇలా కావ్యాలు ,భక్తీ శతకాలతో సాహిత్యం అంతా నిండి పోయింది .ప్రజల విషయము ,సాంఘిక సమస్యలు యే రెడ్డి కవికీ పట్టలేదు .అంతా ఒక మూస విధానం గా సాగి పోతోంది .తెలంగాణా లో నైనా ,ఆంద్ర ప్రాంతం లో నైనా .అప్పుడు సమాజానికి ఒక ఝలక్ నిచ్చాడు వేమన .ఆయన సాహిత్యానికి ,సమా జానికిఅత్యంత అవసర మైన వాడు అయాడు . .”’వేమన సూర్యోదయం” అయింది .చీకటి పోయి వెలుగులు వచ్చాయి .’ ” వేమా రెడ్డి” అనే” యోగి వేమన ”జీవితం సాహిత్యం గురించి ”జన వేమన ‘‘పేర ధారావాహికం గా తెలుసు కొందాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,548 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


excellent articles. Meeru entha work chesaaro arthamu chesukogalaru. really gr8 sir. naa okka comment veyyi comments tho samanamu anukondi sir.. good work.
LikeLike
I love this work,some body told me that kapus of east and west godavari are also reddys up to 1930’s,still most of their surnames have reddy.Later they renounced reddy in their name ,reason I don’t know.Please clarify.
LikeLike