అమెరికా ఊసులు –15 మేధావి ప్రెసిడెంట్ మాడిసన్

  అమెరికా ఊసులు –15
                                     మేధావి ప్రెసిడెంట్ మాడిసన్ 

అమెరికా ఫౌండర్ ఫాదర్స్ లో ఒకరి డిక్లరేషన్ తయారీ లో ,రాజ్యాంగం తయారు చేయటం లో ముఖ్య పాత్ర వహిస్తూ ,అగ్ర నాయకుల మధ్య తీవ్ర భేదాలు వచ్చి నప్పుడు చాక చక్యం గా వారి తో చర్చలు జరిపి ,బాల్యా వస్త లో ఉన్న అమెరికా ప్రజా స్వామ్యానికి కాపు కాస్తూ వరుస క్రమం లో అమెరికా అధ్యక్షస్థానం అధిష్టించి ,”పొట్టి వాడైనా గట్టి వాడు” అని పించుకొని ,తన మాటకు అత్యంత విలువ ను సంత రించు కొన్న వారు అమెరికా నాల్గవ ప్రెసిడెంట్ జేమేస్ మాడిసన్ .ఎనభై అయిదేళ్ళు నిండు జీవితాన్ని అనుభ వించి ,చివరి దశ లో నరాల బల హీనత  (రుమేటిజం )తో మంచం లోంచి లేచే పరిస్తితి లేకుండా జీవితాన్ని ముగించిన వర్జీనియా వ్యవ సాయ దారుడు మాడిసన్ .
మాజీ ప్రెసిడెంట్ జెఫర్సన్ కు అత్యంత ఆత్మీయుడై ,ఆయన తర్వాత గద్దె నేక్కాడు .జెఫర్సన్ చేత ”ప్రపంచం లోనే గొప్ప వ్యవ సాయ దారుడు ”(the best farmer in the world ‘)అని పించుకొన్న రైతు బిడ్డ .నలభై ఏడవ ఏట తన కన్నా ఇరవై రెండేళ్ళ తక్కువ వయసున్న ”డాలీ ”అనే ఒక పిల్లాడికి తల్లి విధవ రాలు అయిన ఆమె ను వివాహం చేసుకొన్నాడు .ఈ జంట కు పిల్ల లు కలగా లేదు .ఆమె కొడుకే వీరి సంతానం .అతడు డబ్బు విపరీతం గా ఖర్చు చేసి ఈయన్ని చివరి దశ లో ఇబ్బందుల పాలు చేశాడు .మాడిసన్ గారు రెండు సార్లు అధ్యక్షులై పదవిని వదిలారు .స్వగ్రామం చేరి వ్యవ సాయం చేశారు .అప్పటికే ఆయనకు5000  ఎకరాల భూమి ఉంది .స్థానిక వ్యవ సాయ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నికయాడు .చివరికి వ్యవ సాయం గిట్టక ,గిట్టు బాటు ధర లభించక కొంత నష్ట పోయారు .సైంటిఫిక్ పద్ధతి లో వ్యవ సాయం చేసే వాడు .
తాను రాసిన విషయాలన్నీ భవిష్యత్ తరాలకు ఉప యోగా పడ తాయని ఆయన జాగ్రత్త చేశాడు .ఆయన మరణించిన తర్వాత జాన్ క్విన్సీ ఆడమ్స్ అనే మాజీ ప్రెసిడెంట్ ”maadison ‘s small voice still echoed through the country ”అని శ్రద్ధాంజలి ఘటించాడు .ఆయనకు వన్డ మంది బానిసలుందే వారు .వారిని పదవి దిగి పోగానే వదిలేశాడు .1814మళ్ళీ బ్రిటీష సైన్యం దాడి చేస్తే వారి మీద యుద్ధాన్ని ప్రకటించి ,గెలుపు సాధించి ”హీరో ”అని పించుకొన్న ధీరుడు ప్రెసిడెంట్ మాడిసన్ .
మాడిసన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బ్రిటీష వారు వాషింగ్ టన్ప  ట్టణం మీద విరుచుకు పడి భస్మీ పటలం చేశారు .అధ్యక్ష భవనాన్ని తగల బెట్టారు .విపరీతమైన వర్షం పడి అగ్ని చల్లారింది కాని ఎంతో ఘోరం జరిగి పోయేది .అప్పుడు వైట్ హౌస్ అనే పేరు లేదు .అధ్యక్ష భవనం అనే అనే వారు .పోస్టాఫీసు ,పేటెంటు ఆఫీసులను మీటింగు ల కోసం తాత్కాలికం గా వాడుకొన్నారు .మొదటి సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దేశ పరిస్తితులను చూసి వణుకు వచ్చింది .క్రమంగా మామూలు మనిషి అయాడు .
మాడిసన్ ఎప్పుడు నల్ల సూటు ధరించే వాడు .జెఫర్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన పదవి లోకి రాక ముందే జెఫర్సన్ భార్య మరణించింది .అందుకని అధ్యక్షుని ఇంట్లో విందులు వగైరా కార్య క్రమాలను సెక్రెటరి ఆఫ్ స్టేట్ అయిన మాడిసన్ భార్య డాలీ యే నిర్వ హించేది .మాడిసన్ నెపోలియన్ తో మంతనాలు జరిపి లూసియానా ప్రాంతాన్ని15 మిలియన్ డాలర్లిచ్చి అమెరికా లో కలిపే ఒప్పందాన్ని సాధించాడు  .యే రాజ కీయ పార్టీ వారైనా మాడిసన్ అంటే గౌరవం చూపే వారు ”though maadison ‘s short height made fun ,they could not challenge his advice or intellect ”
జార్జి వాషింగ్ టన్ రెం డో సారి ప్రెసిడెంట్ గా ఉండటానికి ఇష్ట పడ లేదు .వీడ్కోలు సందేశం రాసివ్వ మని మాడిసన్ ను కోరాడు .ఈయన వద్దన్నాడు మళ్ళీ ఆయనే ఉండి తీరాలి అని చెప్పాడు .బాలా రిష్టాలతో ఉన్న ప్రజా స్వామ్యాన్ని ఇప్పుడు అర్ధాంత రమ్ గా వది లేసి వెళ్ళద్దు అన్నాడు .చివరికి మాడిసన్ మాటే నెగ్గి రెండో సారి ప్రెసిడెంట్ అవటానికి ఒప్పుకున్నాడు ఆయన మొదటి స్పీచ్ నూ మాదిసనే రాశాడు . .వీళ్ళిద్దరూ తరచుగా కలిసి పొలిటికల్ ఫిలాసఫీ మాట్లాడు కొనే వారు .మాడిసన్ సూచించిన అనేక రాజ్యాంగ సవరణలు తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అయాయి .ఆయన భావనలన్నీ ఆ కాలా ని కంటే ముందున్నాయని అందరి అభి ప్రాయం .అందుకే ఆయన్ను ;;రాడికల్ ”అన్నారు .ఒక రకం గా ఆయన అమెరికా దార్శనికుడు .ప్రభుత్వ విధానాలను ప్రజల కు తెలియ జెప్ప టానికి ”national gazette ”ను ఏర్పాటు చేయించాడు 
మాడిసన్ బానిసత్వానికి వ్యతి రేకి .వోటు హక్కు ఎవరికి ఉండాలి అని సమస్య వచ్చింది మొదటి ఎన్నికల నాటికి .కనీసం యాభై వేల డాలర్ల ఆస్తి లేక డబ్బు ఉన్న వారికే ఓటు హక్కు ఉండాలని కొందరు వాదించారు .ఒక్కొక్క పోస్ట్ కు ఒక్కో విలువ కట్టారు .ఇవన్నీ విన్న మాడిసన్ తన భావాలను విస్పష్టం గా చెప్పాడు .”మనది ప్రజాస్వామ్యం .అరిస్టాక్రసి కాదు .ఇక్కడ సంపన్నులు కాదు ప్రభుత్వాన్ని నడి పేది”అని చెప్పి ”america must be governed by all ,rich and poor ”అని స్పష్టం గా తెలియ జేశాడు .బానిసలను ఎలా లెక్కించాలి అనే సందేహం వచ్చింది .వాళ్ళు ఆస్తి మాత్రమె కాని ,పౌరులు కాదన్నారు .అయినా వాళ్ళు ఎందరున్నారో లెక్క తెలియాలి కదా .అందుకని”to count  a slave  as three fifths of a person when basing representation on population ”అని రాజీ పడ్డారు .
మాడిసన్ చిన్నప్పుడే కవిత్వం రాశాడు .సరదా కవిత్వం ఆది బ్రిటీష దేశం లోని విగ్గులు ,టోరీల మీద కవిత చెప్పాడు విగ్గులు లిబరల్సు గా టోరీలు బాగా కన్సర్వేటివేస్ గా ప్రసిద్ధులు –”come noble whigs ,disdain these sons –of screech owls ,monkeys ,and baboons –keeep up your minds to humourous themes ”అని ఉతికే శాడు .ఈయనను చిన్నప్పుడు ”జేమ్మీ ”అని పిలిచే వారు .
మాడిసన్ 1751 మార్చి పద హారన వర్జీనియా లో పుట్టాడు న్యు జెర్సి కాలేజి అనే ప్రిన్ స్టన్కాలేజి లో చది వాడు .వర్జీనియా జెనెరల్ అసెంబ్లీ ,లో సభ్యుడయాడు .ఫిల దడేల్ఫియా లో కాంటి నేన్తల్ కాంగ్రెస్ లో .1780లో చేరాడు .రాజ్యాంగాన్ని తయారు చేశాడు దీనినే ”వర్జీనియా ప్లాన్ ”అంటారు .హామిల్టన్ తో కలిసి ”ఫెడరలిస్ట్ పేపర్స్ రాశాడు.1789 లో కాంగ్రెస్ సభ్యుడు అయాడు .జెఫర్సన్ ఎన్నిక కావటానికి సహాయ పడ్డాడు .ప్రెసిడెంట్ మాడిసన్ ను సెక్రెటరి ఆఫ్ స్టేట్ ను చేశాడు .1808లో మొదటి సారి అమెరికా అధ్యక్షుదయాడు మాడిసన్ .నాలుగేళ్ల తర్వాతా రెండో సారి ఎన్నిక అయాడు .1815లో బ్రిటన్ తో శాంతి ఒప్పందం చేసుకొన్నాడు .పదవీ విరమణ తర్వాత వర్జీనియా యూని వేర్సిటి”రెక్టార్ ”గా పని చేశాడు .1836జూన్ ఇరవై ఎనిమిది న మేధావి ప్రెసిడెంట్ మాడిసన్ మరణించాడు .వాక్ స్వాతంత్రం ,మత స్వాతంత్రం ప్రతి వారికి కావాలని కోరుకున్న స్వాతంత్ర ప్రియుడు మాడిసన్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా ఊసులు –15 మేధావి ప్రెసిడెంట్ మాడిసన్

  1. sasi's avatar sasi says:

    Nice Info.Also there is a book Invisible Man .Prasad garu if possible pls read that book.One of the best 50 books of US .

    Like

Leave a reply to sasi Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.