జన వేమన -7
సాంఘిక దురాచారాల పై వేమన్న
”హాస్యం పరమౌషధం ”దాన్ని అన్నిట్లో రంగ రించి ఇస్తే బాగా పని చేస్తుంది .అందుకే వేమన్న తాను నవ్వు కోవటమే కాదు ,లోకుల్నీ నవ్విస్తూ హితోప దేశం చేస్తాడు .సంఘం లో ఉన్న దురాచారాలను కడగ టానికి రేవు పెట్టాడు .మతా చారాలను ,అన్ని వర్ణాల వారినీ ,లోభుల్ని ,యోగుల్ని ఝడించివదిలాడు .”పాప మనగ వేరే పరదేశమున లేదు -తాను చేయు పనుల దగిలి యుండు ”అని పాపం ఎక్కడో లేదు మనం చేసే పనుల్లోనే దాగి ఉందని చెప్పాడు .”స్వార్ధ పరులను ఎదిరించ టానికి హాస్యాయుధా న్నే వాడాడు .మొదట్లో ముతగ్గా ,పనస తొక్కు అంత పెళుసు గా ఉన్నా ,రాను రాను ,నాజూగ్గా ,పనస తోన లంత తియ్యగా ,కమ్మగా మారింది ఆయన ధోరణి ” అన్న ఆరుద్ర మాట యదార్ధమని పిస్తుంది .బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకొంటేనే వేదాభ్యాసానికి అర్హుడు .బ్రాహ్మణ స్త్రీ లకు ఉపనయనార్హత లేదు .అందుకని వేమన్న ”తల్లి శూద్రు రాలు ,తానెట్లు బాపడో ”?అని ప్రశ్నించాడు .ఇతర కులాల వారికి వేద విద్య నిషేధం అన్నప్పుడు ,ఉపనయం లేని స్త్రీ శూద్రు రాలే కదా ?అని ఆయన అనుమానం .ఆమెకు పుట్టిన వాడు శూద్రుడే అవుతాడు కదా అని సమాధానం . అని ఆ వేలి తోనే ఆ కంటిని పొడిచాడు .”గుప్త విద్య ఒక్కటే కుల కాంత వంటిది ”అని భావించి ,దాని ప్రచారానికి దేశమంతా తిరిగాడు .పరి పక్వ మైన మనసున్న వారికి, కులం ,మతం ,స్థలం అక్కర్లేదని ఆయన భావం .పెరిగిన వాతా వరణమే మనిషిని తీర్చి దిద్దు తుందని ఆయన అభి ప్రాయం .
ఆడ పిల్ల ను అమ్ము కొనే ”కన్యా శుల్కం ”అనే దురాచారాన్ని ఖండించాడు .పిల్లను అమ్ము కోవటం అంటే కూతురి థో వ్యభిచారించటం అంత తప్పు అన్నాడు .”పేద వాడి నను పెంటి నిచ్చెద నని -పైడి నడుగ రాదు పరుసము గను –పైడి గొనుట పెంటి బట్టి నట్లయా ”అని చెప్పేశాడు .ఇచ్చి పుచ్చు కొనే వారిద్దరూ గతి లేని వారైతే ,ఇంత తిండి పెట్టి కన్యా దానం చేస్తే చాలు అన్నాడు .”కాడి వే దాన్న ము నిడకన్నె నీవలె గాని –పడుపు గూడు గుడువ వలదు ”అని హెచ్చరిక .చేత నై నంత వరకు వర దక్షిణ నిచ్చి ,పేద వానితో బంధుత్వం కలుపు కోవాలి .”కలిమి జూచి ఈయ ,కాయ మిచ్చిన యట్లు –సమున కీయ నదియు సరస తనము -పేదకిచ్చు మనువు పెన వేసి నట్లుండు ”అని ,బీదరికం లో ఉన్న వారితో వియ్యం అందు కొంటె ,బంధు లాభం ,ఆపేక్షలు పెరుగు తాయని పేద ల పాలిటి పెన్నిధి గా చెప్పాడు .”మనసు లేని మనువు పనికి రాదు ”అన్నాడు ”కలుగు వాడు ,లేమి కాన కిచ్చు మనువు –కలిమి లేము లటుల కలిసి యుండు -”అనటం లో ఆప్యాయతలు ఉండాలని ధనం అడ్డు కారాదు అని, కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలని ఆశించాడు .
చదువు, సంస్కారం తేవాలి .ఒట్టి చదువు వన్నె లేదు .”ఎంత చదువు చదివి యే నీతి ఎన్నను –హీను డవగుణంబు మాన లేడు–బొగ్గు ,పాల గడగ ,పోవునా మలి నంబు ”అని చక్కని ఉప మానం తో సంస్కారం యొక్క అవసరాన్ని చెప్పాడు .కుహనా మేధావుల వల్ల ,సమాజానికి కీడు అని ,చిత్తం విత్తం మీద ఉండి ,కలుషిత మనస్సు ఉన్న వాడు ఎంత చదివినా ,దాలి గుంట లోని కుక్క లాంటి వాడని నిందిస్తాడు .”చదువు లెన్ని చదివి ,చాల వివేకియై –కలుష చిత్తుడైన ఖలుని గుణము -దాలి గుంటకుక్క దలచిన చందము ”-విద్య నేర్పిన గురుని ఉచిత రీతి లో సత్క రించాలి .కాని ,రేవుదాట గానే ,తెప్పను తగ లేసి నట్లు ,విద్య నేరవ గానే ,గురుని గౌరవించటం మరువ రాదు .వేశ్య కివ్వ టానికి డబ్బు ఉంటుంది కాని ,గురువు కివ్వ టానికి సంకోచిస్తాడు మనిషి అని అసహ్యించు కొంటాడు .’ఎన్న గురుని కన్న నెక్కువ లేదయా” అని గురువు గారి గురుత్వాన్ని శ్లాఘించాడు .”తాళం చెవి లేకుండా ,తాళం యెట్లా రాదో ,గురుని శిక్ష లేకుండా గురుతు రాదు ”అంటాడు .గురువులు కూడా విద్యా గురువులు ,మిధ్యా గురువులు అని రెండు రకాలు .”కస్తూరి నల్లగా ఉన్నా ,దాని పరి మలం పరిధ విల్లి నట్లు మంచి గురువు లైన వారి గుణాలు ఉంటాయట .
”వైద్యో నారాయణోహరిహ్ ”అని భావిస్తాం .సాక్షాత్తు నారాయణ స్వరూపుడే వైద్యుడు .దేవుడు భవ రోగ నివారణ చేస్తే ,ఈయన ఇహ రోగాన్ని నివారణ చేస్తాడు .అందుకే వైద్యులను ”వ్యాధి నెరిగి నట్టి ,విశ్వోప కారులు ”అని కీర్తించాడు .వైద్యుడు ప్రాణ దానం చేస్తాడు .ఇది అన్ని దానాలలో మిన్న .రోగం ముదరక ముందే చికిత్స చేయాలని వైద్యులకూ బోధించాడు .అందుకే ”కూల బడిన నరుడు కుదురుట అరుదయా –”అన్నాడు .రోగం ఏమిటో తెలుసు కొ లేని వైద్యుడు శుద్ధ దండగ అన్న విషయాన్ని ”వ్యాధి నేరుగలేని వైద్యు డేల ?”అన్న పద్యం లో చెప్పాడు .
చిన్న వాడైనా తగి నట్లు ప్రవర్తించిన నా ,మాట్లాడినా ,అతన్ని ఆదరించి గౌర వించాలి .అక్కడ చిన్నా ,పెద్దా తేడా లేదు .చిన్న దీపం పెద్ద కాంతి నిస్తోంది కదా .”అంకిలేరిగి మాట లాడ నేర్చిన యపుడు –పిన్న తనము పేర్మి ఎల –పిన్న చేతి దివ్వె పెద్దగా వేలుగదా ?”అని ,ప్రతి భ కు పట్టం కట్ట మన్నాడు .కౌరవ సభ లో కర్ణుడి కుమారుడు ఇలానే మాట్లాడితే ప్రశంశించారు కదా అని గుర్తు చేస్తాడు .
వివాహాది శుభ కార్యాల కు జ్యోతిషం చూడటం ముహూర్త నిర్ణయం ,శకునాలు ,మొద లైన వాటి పై వేమన విమర్శలను సంధించాడు .ముహూర్తాన్ని మంచిది గా ఎన్ను కొని ,పెళ్లి చేసినా ,వైధవ్యం ఎందుకు వస్తోంది అని ప్రశ్నిస్తాడు .”విప్రు లెల్ల గూడి వెర్రి కూతలు కూసి –సతి ,పతుల గూర్చి సమ్మతమున-మును ,ముహూర్త ముంచ ,ముండేట్లు మోసేరా ? ”అని నిలదీస్తాడు .జ్యోతిషాన్ని అతి గా నమ్మద్దు అంటాడు .శాకునాలకు అవకాశం ఇవ్వద్దు అన్నాడు .పాల పక్షి మంచి శకునం అని నమ్ముతారు .శకున ఫలం దానికేం తెలుసు పొమ్మంటాడు .”తనదు మేలు ,కీడు ,తన లోనే యుండక ”దేన్నో చూసి మోస పోవద్దు అన్నాడు .శకునం మంచిది అయితే సరే ,లేక పోతే ”కాని పనులకు తన కర్మము ”అంటాడు మానవుడు .అన్ని వారాలు ,అన్ని రోజులూ మంచివే నని ఆయన ఉద్దేశ్యం .”న్యాయ శాస్త్ర మరయ నన్యాయ మొన రించు –ధర్మ శాస్త్ర మొసంగు దుర్మతంబు -జ్యోతిషంబు జునుల నీతుల దప్పించు ”అని ,మెత్తగా చివాట్లేశాడు .అతి గా దేనినీ నమ్మ వద్దు అని భావం .నీ మనస్సే నీకు మంచి చెడు తెలియ జేస్తుంది .దాన్ని నొక్కేసి ,ఇతరు ల పై ఆధార పడ వద్దు .వివేకం ,విజ్నా నం తో ప్రవర్తించు .దేనికోసమో ,ఎవరి కోసమో ఎదురు చూడ వద్దు .”రానిది ,కోరిన రాదది -రానున్నది కోరకున్న దానే వచ్చున్ -తానెంత చింత జేసిన ,-కానున్నది కాక పోదు గదరా వేమా ?” అని ఎంతో దార్శనికం గా తెలియ జేశాడు .దయతో ప్రవర్తించాలి .సాను భూతి చూపాలి .”ముష్టి వేప చెట్టు మొదలుగా ప్రజలకు –పరగ మూలికలకు పనికి వచ్చు –నిర్దయాత్మకుడు నీచు దేన్డునాను –పనికి రాదు ,గదర ,పరగ వేమా “”అని నిర్దయుడిని ,దయా హీనుడిని గూర్చి వాళ్ళు” ఒట్టివేష్టు కాండి డేట్లు” అన్నాడు .
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,419 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


చాలా బాగుందండి, ఎన్నో మంచి పద్యాలను ప్రస్తావించారు. ధన్యవాదాలు!
LikeLike