అమెరికా డైరీ శ్రీ భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన వారం

        అమెరికా డైరీ –
శ్రీ  భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన  వారం 

     ఆగస్టు ఇరవై యేడు సోమ వారం నుంచి ,సెప్టెంబర్ రెండు ఆది వారం వరకు విశేషాలు 

ఆగస్టు ఇరవై యేడు సోమవారం నుంచి మా మన వళ్ళ కు బడులు ప్రారంభమయాయి .మళ్ళీ సందడి .నిన్న ఆదివారం నాడు మా అల్లుడి మేనత్తశ్రీ మతి లక్ష్మి గారు  ,భర్త, రాలీ నుండి వచ్చారు .ఆవిడను ఇక్కడ ఉంచి ఆయన వెంటనే వెళ్లి పోయారు . మంగళ వారం మా అమ్మాయి మామ గారు కోమలి సూర్య నారాయణ శాస్త్రి గారి అధిక భాద్ర పద మాస ఆబ్దికం .ఒక అరవ బ్రాహ్మణుడు వచ్చి మా అల్లుడితో కార్యక్రమం చేయించాడు .మా అమ్మాయి మడి కట్టుకొని యధావిధిగా అన్నీ చేసింది .మూడు పచ్చళ్ళు ,మూడు కూరలు ,పప్పు ,గారెలు ,పరవాన్నం చేసింది .పవన్ దంపతులు భోజనానికి వచ్చారు .వీళ్ళ మేనత్త గారు దీనికోసమే వచ్చి ఉన్నారు .కార్య క్రమం యదా విధి గా జరగటం అందరికి నచ్చింది .భోజనం తర్వాత ఆవిడను పవన్ వాళ్ళింటికి తీసుకొని వెళ్లారు .
బుధ వారం లైబ్రరీ లో పుస్తకాలు ఇచ్చి ,ఇరవై పుస్తకాలు తెచ్చుకోన్నాను .పిల్లలు జిమ్నాస్టిక్స్ నుండి రావటం ఆలస్య మవుతుందని లైబ్రరి లోనే ఉండి ఒకటి న్నర పుస్తకం చది వేశా .గురువారం ఉదయం శ్రీ మతి రమా రాచ కొండ వచ్చింది .ఆవిడను ,భర్తను ఇదివరకు రెండు సార్లు అంటే ఎల్లా వెంకటేశ్వర రావు ,కొమర వోలు శివ ప్రసాద్ గార్ల సభల్లో చూశాను .ఆమె ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు సెక్రెటరి .రమ తూర్పు గోదావరి జిల్లా అమలా పురం దగ్గర్లో ఉన్న ‘ముంగండ ”అమ్మాయి .ఆమె మా అల్లుడు మేనత్తకు దగ్గర బంధువు కూడా .వీల్లదీ, అంటే మా అమ్మాయి మామ గారిదీ ముంగండే .ఆ బంధుత్వం తో వీళ్ళకు రాక పోకలు బానే ఉన్నాయి .మర్నాడు శుక్ర వారం వాళ్ళింటికి భోజనానికి పిలవటానికి వచ్చింది రమ .
శుక్రవారం అందరం కలిసి రమా వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం .చాలా పెద్ద భవనం .ఇంగ్లీష వాళ్ళ భవనాల్లా గా ఉంది.వాళ్ళ ఆయన” శివ ”ఆఫీసుకు వెళ్లారు-ఇంట్లో లేరు .మంచి మర్యాద చేసింది .పప్పు ,కాబేజీ కూర ,దోస చట్ని ,మజ్జిగ పులుసు ,అన్నం ,చారు ,పెరుగు తో భోజనం పెట్టింది రమ .అన్నీ బానే ఉన్నాయి .రమా దంపతులకు ”ఆంద్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ”,శ్రీ హనుమ కధా  నిధీ  ”మా అక్కయ్య ” అనే సరస భారతి ప్రచురించిన మూడు పుస్తకాలనుఅందజేశాను . ఇంటికి తిరిగి వచ్చ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .

 రాలీ కి రాలీ 

శుక్ర వారం రాత్రి ఏడున్నరకు మేనత్త తో సహా అందరం కారు లో వాళ్ళ ఊరు రాలీకి బయల్దేరాం .పులిహార చేసింది మా అమ్మాయి .బయల్దేరే ముందు పెరుగుతో కలిపి కొంత అందరం తిన్నాం .సుమారు రాత్రి తొమ్మిదింటికి ఒక చోట ఆగాం .పిల్లలకు” పీజా” పెట్టించారు  .మేము మళ్ళీ” పులి మీద దండ యాత్ర ”చేసి దాన్ని పూర్తిగా సఫా చేశాం .మళ్ళీ బయల్దేరి రాత్రి పదకొండున్నర కు రాలీకి చేరి దానికి దగ్గర్లో ఉన్న” దర్హాం” లో వాళ్ళ ఇంటికి చేరుకోన్నాం .కాఫీతాగి పడుకున్నాం .

  శ్రీ భ్రమ రాంబా మల్లికార్జున స్వామి  దర్శనం 

శనివారం ఉదయం స్నానాలు పూర్తీ చేసి మేనత్త చేసిన ఉప్మా తిని ఆదంపతులతో కలిసి నేను ,మా అల్లుడువాళ్ళ  కారులో సుమారు పది హేను మైళ్ళ దూరం లో ఉన్న దేవాలయాలకు వెళ్ళాము .ముందుగా శ్రీ భ్రమ రాంబా సమేత మల్లికార్జున స్వామిని దర్శించాం . .అప్పుడే అభిషేకం ప్రారంభించారు .నేను పుస్తకాలు తీసుకొని వెళ్లాను .పూజారితో స్వరం కలిపి నమక ,చమకాలు పురుష సూక్తం  బిల్వా ష్టకంవగైరాలు చదివాను .బాగా చేశారు .తర్వాతా అష్టోత్తర నామాలు కూడా పూజారితో గొంతు కలిపాను .మంచి అలంకరణ కూడా చేశారు స్వామి వారలకు .గొప్ప అనుభూతి  చెందాము .పూజారి విజయ వాడకు చెందినగణపతి శాస్త్రి .కుర్రాడే .ఉయ్యూరు లో మా ఇంట్లో అద్దె కుంటున్న గణేష్ శర్మ అనే వేద పండితునికి స్నేహితుడే .ఇలా అమెరికా లో ఒక్కో సారి తమాషా గా కలుస్తూ ఉంటాము .తీర్ధ ప్రసాదాలను తీసుకొన్నాము .

This slideshow requires JavaScript.

 

 బాలాజీ స్వామి  దర్శనం 

ఈ దేవాలయానికి ప్రక్కనే విశాల మైన స్తలం లో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఉంది.చాలా ఎత్తు మీద కట్టారు .స్వామి విగ్రహం చాలా భారీ గా ఉంది .మేము వెళ్ళే సరికి అక్కడ కూడా అభిషేకం పూర్తీ అయి ,దర్శనం ఇస్తున్నారు .దర్శనం చేసుకొని బయటికి వచ్చాము .స్వామికి అలంకరణ చేసి పదకొండున్నరకు పూజా జరిపారు .గంట పట్టింది .ఈ లోపు ఒక కుటుంబం చక్కగా భక్తీ గీతాలు పాడుతున్నారు .అందులో ఒక అమ్మాయి చాలా శ్రావ్యమైన గొంతుతో పాడి రసానుభూతి కలిగించింది .బాలాజీ స్వామి కి వైభోగం బాగా ఉంది. .కనీసం ఎనిమిదిమంది  పూజారులు ,ప్రసాదాలు చేసే వారు ఉన్నారు .పెద్ద ఎస్టాబ్లిష్ మెంటే .జూన్ నేల చివర్లో బ్రహ్మోత్స వాలు నిర్వ హించారు .ప్రసాదాలు తయారు చేసి పాకెట్ల లో విక్ర యిస్తారు .మా అల్లుడి మేనత్త భర్త చీమల కొండ దుర్గా ప్రసాద రావు గారు రిటైర్ అయాక స్వామి సేవలో వారానికి నాలుగు రోజులు సోమ వారం నుండి శుక్ర వారం వరకు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తారు .మేనత్త కూడా వాలంటీర్ చేస్తారు .ఆయనకు సుమారుడెబ్భై రెండు , ఆవిడకు అరవై ఎనిమిది ఏళ్ళు  ఉంటాయి .జీవితాన్ని ధన్య వంతం చేసుకొంటున్నారు స్వామి సేవలో .స్వంత ఇల్లు ఉంది.పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లారు .ఇద్దరే ఉంటున్నారు .అమెరికా వచ్చి సుమారు యాభై ఏళ్ళు ,రాలీ వచ్చి పదహారేళ్ళు .పూజ తర్వాత తీర్ధ ప్రసాద విని యోగం .ఈ లోపు మా అమ్మాయి ,పిల్లలు ఇంటి నుంచి వచ్చారు .ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం ఒకటి దాటింది .మాకు మేడ మీద గదుల్లో వసతి కల్పించారు .సాయంత్రం వేమన పై ఆర్టికల్ వీళ్ళ కంప్యుటర్ నుంచే రాశాను .
రాత్రి వాళ్ళు ,మేము అందరం కలిసి ”ఉడిపి హోటల్ ”కు వెళ్ళాం .ఆది అనంత పురానికి చెందిన రెడ్డి గారిది ..ఆయనా వచ్చాడు కాసేపు మాట్లాడాం .మేము పూరీ ,పిల్లలు మషాలా దోసె ,చానా పూరీ ఎవరికి కావాల్సింది వాళ్ళు తిన్నాం .మాంగో లస్సీ తాగాం .ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .హాయిగా నిద్ర పోయాం .
ఇప్పుడు” రాలీ ”గురించి కొన్నివిశేషాలు –నార్త్ కేరోలీనా రాష్ట్రానికి రాలీ రాజధాని .రాష్ట్రం లో రెండవ పెద్ద నగరం .మొదటిది మేముంటున్న శార్లేట్ .రాలీలో” ఓక్ ”చెట్లు విపరీతం .అందుకని దీన్ని ”సిటీ ఆఫ్ వోక్సు ”అని ముద్దుగా పిలుస్తారు .సర్ వాల్టర్ రాలీ అనే అయన పేరు మీదుగా ఈ పట్టణం  ఏర్పడింది .ఇది టెక్నికల్ హబ్ .రాలీ ,దర్హాం ,చాపెల్ అనే మూడుపట్టణాలు  దగ్గర దగ్గర మూడు త్రిభుజ కొణాల్లా ఉంటాయి .దీనినే ”three primary cities of research triangle”అంటారు .1959లో రిసెర్చ్ ట్రైనింగ్ పార్కు ఏర్పడి నప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది .ఇక్కడ నార్త్ కెరొలినా స్టేట్ వర్సిటి ,డ్యూక్ వర్సిటి ,యూని వేర్సితి ఆఫ్ నార్త్ కెరొలినా -చాపెల్ హిల్స్ అనే మూడు ప్రసిద్ధ విశ్వ విద్యాలయాలున్నాయి .అమెరికా ఏడవ ప్రెసిడెంటు అయిన” ఆండ్రు జాన్సన్ ”రాలీ లోని ”కాస్సో ”లో జన్మించాడు  జీవన నాణ్యత విషయం లో ను ,వ్యాపార దృష్ట్యా అమెరికా నగరాలలో టాప్ టెన్ నగరాలలో రాలీ ఒకటి .ఇక్కడి రాలీ మెమోరియల్ మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందింది .ఇది ఈశాన్య ప్రదేశం లో ఉన్న నగరం .ఇక్కడికి అట్లాంటిక్ సముద్రం నూట ఎనభై మైళ్ళ దూరం లో ఉంది .ఇక్కడి కేరోలీనా హరికేన్సు అనే హాకీ జట్టు బాగా ప్రసిద్ధ మైంది .మన తెలుగు వాళ్ళు ఎక్కువ గా కనీ పిస్తారు .దేవాలయాలున్న ప్రాంతాన్ని ”కారీ ”అంటారు ..శార్లేట్ కు రాలీ రెండు వందల మైళ్ళ దూరం .సుమారు మూడు గంటలు ప్రయాణం .

                    ఆష్ విల్

ఆది వారం ఉదయం ఐదింటికే అందరం లేచి స్నాదికాలు పూర్తీ చేసుకొని కాఫీ లు తాగాం .మా ఇద్దరికీ రాలీ దంపతులు బట్టలు పెట్టారు .ఉదయం ఆరుమ్బావుకు కార్ లో మేము సోమా మౌంట్ లో ఉన్నశ్రీ ఉమా సోమ   శేఖర స్వామి దర్శనానికి బయల్దేరాం .రెండు గంటలు ప్రయాణం చేసి ఒక చోట ఆగి మాక్ డో నాల్ద్ లో రొట్టె టిని కాఫీ త్రాగాం .మళ్ళీ బయల్దేరి రెండుగంటలు ప్రయాణం చేసి ”ఆష్ విల్”చేరాం .ఈ పేరు నాకుతమాషా గా ఉంది .”బూడిద పల్లె ”అవుతుంది అనువాదం చేస్తే .ఇక్కడే ”ఆష్ వర్త్”కూడా ఉండి .దీన్ని తెలుగు లోకి మారి స్తే ”బూడిద భోగం ”అనచ్చు .”శ్వన్న నోవా” అనే నది ఉంది .దీన్ని” సువర్ణ ముఖి ”అని సుమారుగా అనచ్చు .పెద్ద పెద్ద  కొండలు బ్లూ మౌంటేన్ రిద్జి లో  శ్వన్న నోవా ,ఫ్రెంచ్ బ్రాడ్ రివర్ ల సంగమ స్తానం లో ఈ పట్టణం ఉంది .ఆష్ విల్  పూర్వం ”చెరోకీ నేషన్ ”లో ఉండేది .అమెరికా లో 25 ”art desti nations ”లో ఆష్ విల్ ఒకటి అదీ ఇక్కడి విశేషం .దీన్ని  ”happiest city of women ”అంటారు .దీనికే ”new age mecca”అని కూడా పేరు .అంతేనా ”eye of america ”అంటే అమెరికా ”చక్షువు ”(కన్ను)అన్న మాట .”best out side town ”అనీ పేరు తెచ్చు కొన్నది ఆష్ విల్ .చుట్టూ ప్రకృతి దృశ్యాలు  అందాల విన్దులే చేస్తాయి ముగ్ధ మనోహర ప్రకృతి మానసికా నందాన్ని ఇచ్చి మరోలోకపు అనుభూతినిస్తుంది .అందాల హరి విల్లు ఆష్ విల్ .ఇక్కడి ”బ్లూ రిడ్జి పార్క్ వే” తరగని సౌందర్యపు గని .ఇవన్నీ చూసుకొంటూ ఇంకోగంట ప్రయాణం చేసి ఉదయం పదకొండున్నరకు మౌంట్ సోమా చేరాం

 మౌంట్ సోమా –ఉమా సోమ శేఖర స్వామి దర్శనం .

కొండలు లోయలు దాటుకొంటూ ,ఎత్తైన వృక్షాల సౌందర్య దర్శనం చేస్తూ ,దాదాపు  ఊటీ లాగా ,కోడై కెనాల్ లాగా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ  ఇరుకు దారి లో జాగ్రత్త గా కారు నడుపు కొంటూ మొత్తం మీద ఎత్తైన మౌంట్ సోమా అంటే సోమా పర్వతం చేరాం .చుట్టూ లోయలు వృక్షాలతో నిండిన ఎత్తు కొండలు ,మబ్బులు తాకే అగ్రాలు, లోయల్లో జారి ప డుతున్న మబ్బులు భలే అందమైన ప్రకృతి సౌందర్యం మధ్య ఈ పర్వతం ఉంది  .ఎత్తు  మీద ఉమా సోమ శేఖర స్వామి దేవాలయం ఉంది. .సుమారు ఇరవై మెట్లు ఎక్కి వెళ్లి దర్శించాలి .లోపల లింగం సోమనాద్ దేవాలయ లింగం లా భాసించింది .పూజారి గారు విజయ వాడ కు చెందిన గార్లపాటి ప్రసాదావధాని గారు .చాలా శాస్త్రోక్తం గా అభిషేకం నిర్వ హించటం ప్రారంభించారు ..నేనూ వారితో స్వరం కలిపి నమక ,చమకాలు ,పురుష సూక్తం ,శ్రీ సూక్తం, దశ శాంతులు, పట్టాభి షేకం అష్టోత్తరం చివరికి మంత్ర పుష్పం పూర్తీ చేశాం .స్వామికి అలంకారం బాగా చేశారు ప్రసాద్ గారు .అపర కైలాసం గా ,ఆర సోమనాద్ లా మహత్తరం గా ఉంది .నిన్నా ఇవాళ కూడా స్వాముల అభిషేకం సమయం లో రావటం పూర్వ జన్మ సుకృతం   అని పించింది . మనస్సు ఎంతో ప్రశాంతమైంది .ఎందుకో నేల రోజులుగా తెలీనిచిరాకు మనసును కల్లోల పరుస్తోంది . ఈ శివ దర్శనా లతో కొత్త శాంతి లభించింది .కమ్మగా కన్నుల పండువు గా స్వాముల దివ్య దర్శనానుభవం పొంది ఎంతో సంతృప్తి చెందాం .తీర్ధం, ప్రసాదం గా మైసూర్ పాక్ అందరికి పెట్టారు .ఈ ఆలయాన్ని కట్టించిన వారు బ్రహ్మర్షి మహేశా నంద అనే అమెరికన్ స్వామి .ఆలయం కట్టి ఏడాది మాత్రమె అయింది .పూజారి వచ్చీ ఏడాదే అయింది .ప్రక్కన యాగ శాల ఉంది.పూజారిదంపతులకు  ప్రక్కనే ఉన్న మూడంతస్తుల భవనం లో కింద భాగం ఇచ్చారు .స్వామీజీ ఇక్కడే ఉంటారట .ఆయనకు అనేక మంది శిష్యులు .అందరు ఎంతో శ్రద్ధగా ఇక్కడి పనులను చేస్తుంటారు .ఆలయానికి ఇంకా ధ్వజ స్తంభం యేర్పడ లేదు  .ఇంకా అభి వృద్ధి లోకి రావాలి. భక్తులు అత్యంత భక్తీ విశ్వాసాలతో స్వామిని కోలుస్తున్నట్లు కనీ పిస్తోంది .ఆలయం చాల చిన్నదే .ఈ రోజు భక్తులతో ఆలయం  కిట కిట లాడింది .
మెట్లు దిగి కిందకు భోజన శాల కు వచ్చాం .అప్పుడే వర్షం ప్రారంభ మైంది .అద్భుతం గా అని పించింది ఆ వర్షం లో. ఆ అందాల సీమ మరింత అందాలను సంత రించుకోంది  .లోయల్లో మబ్బులు దోబూచు లాడుతున్నాయి.ఫోటోలు తీసుకొన్నాం .ఆశ్రమం వారే పది  డాలర్లకు భోజనం ఏర్పాటు చేశారు .ఆది లేక పోతే ఇక్కడ ఏమీ దొరకదు .భోజనం లో చపాతి, పులిహోర ,పప్పు ,మజ్జిగ పులుసు,అన్నం ఏర్పాటు చేశారు .అన్నీ బాగానే రుచిగా ఉన్నాయి అందరం కమ్మగా తిన్నాం .శివుడికి ఎదురుగా కొండ మీద పాలరాతి పెద్ద నందీశ్వరుడు చూపులకు అద్భుతం అని పిస్తాడు .భోజన శాల దగ్గర చిన్న శివ లింగం దానిపై అభిషేక పాత్ర వేలడ దీశారు . వర్షపు నీరు పాత్రలో పడి శివునికి అభిషేక చేస్తున్నట్లు ఉంటుంది .ప్రక్కనుంచి కారే నీటిని గోలుసులకు వ్రేలాడే పాత్రలను ఒక దానికింద ఒకటి ఉండేట్లు చేశారు .అందులో పై నుండి కిందకి పాత్రలలో పడుతూ భలేగా కనీ పిస్తుంది .శివుడికి ఎదురుగా చిన్న నందీశ్వరుడు వర్షపు నీటి తో హర్షాన్ని పొందు తున్నట్లు ఉంటాడు గొప్ప ఆలోచనా, దాని అమలు చేసిన తీరు బ్రహ్మానందాన్నిస్తుంది .అందరు తప్పక సందర్శించి తరించాల్సిన క్షేత్రం మౌంట్ సోమా .అమెరికా లో అద్భుతం .అపర కేదార నాద్అనీ అని పిస్తుంది .ఇంత గొప్ప దివ్య ధా మాన్ని సందర్శించిన మా జన్మ  ధన్యం .
భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కారు లో బయల్దేరి మళ్ళీ అందాలన్నీ చూసుకొంటూ ,ఆ అందాలను ఆరవేసుకొన్న ప్రకృతి సౌందర్యాన్ని తలచుకొంటూ ,అనుభ విస్తు .నాన్ స్టాప్ గా మూడు గంటలు ప్రయాణం చేసి సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి చేరాం .యాత్ర సంపూర్ణం .రాలీ నుంచి సోమా మౌంట్ సుమారు నాలుగు  వందల యాభై  మైళ్లకు తక్కువ ఉండదు .సోమా నుంచి శార్లేట్ సుమారు మూడు వందల యాభై మైళ్ళు ఉంటుంది .మొత్తం మీద రాను పోనువెయ్యి మైళ్ళు అంటే పది హేను వందల కిలో మీటర్లు . దాదాపు పదకొండు గంటల డ్రైవింగ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.