గొల్లపూడి కదా మారుతం –2 పాలు విరిగి పోయాయి

గొల్లపూడి  కదా మారుతం –2

                                                                          పాలు విరిగి పోయాయి

మారుతీ రావు  కధల్లో ఆణి ముత్యం లాంటి అమ్మాయి కద.‘’పాలు విరిగి పోయాయి ‘’.వివాహం కాలేక పోయిన ఒక కన్య వ్యధ .అద్భుత రచనా శిల్పానికి నిదర్శనం.’’కదా ప్రారంభం ,,అంతం లోనీ వాక్యాలే మంచికదను నిర్ణయిస్తాయి‘’.అని విమర్శకుల అభి ప్రాయం .అలాంటి ఉత్తమ కద లెన్నో మన కదా రచయితల కలాల నుండి జాలు వారాయి .ఆద్యంతం తనదైన ధోరణీ ,మనస్తత్వ పరిశీలనా ,లోక వ్యవహారం శిల్పం కలగా పులగం గా ,పడుగు పెకల్లా అల్లిన కధ–కాదు చెక్కిన శిల్పమే .అమాయిక అయినా మధ్య తరగతి మంద భాగ్యురాలైన ఒక తెలుగింటి ఆడ పడుచు వివాహ ప్రయత్నం ,మనో లోకం లోనీ భావాలను సరిగ్గా వెల్లడించలేని ఆమె పరిస్తితి కలిసి ఆమె అంతస్సంఘర్షణ  గొప్పగా చూపే కదా .ఆమె పై మనకు చివరికి మిగిలేది సాను భూతి .మనోభావాలను వర్ణించటం లో గొల్లపూడి కొత్త పుంత ల్ని తొక్కి ,కొత్త మాటలతో సరసం గా దారి తీస్తాడు .శీర్షిక లోనే కదా లో ఏం జరుగుతుందో ప్రస్ఫుటం గా కనీ పిస్తుంది .శీర్షికను ఎన్ను కోవటం దగ్గర్నుంచి నిర్వహణ పూర్తీ ఆయె వరకు అతడు చూపిన నేర్పు నిరుప మానం .ఆ కదా విహారం చేద్దాం

       ‘’నాకు పెళ్ళే వద్దు బాబూ ‘’అనే ఫేషన్ అలవాటు చేసుకోంది సుశీల .ఆ మాటలంటున్నప్పుడు ఆమె ‘’రుషి లా మొహం పెట్టి ,పెళ్లి అనే సాంఘిక దురన్యాయం మీద చెప్ప లేని నైరాశ్యాన్ని ,కళ్ళ చికి లింతలు ప్రదర్శించటం నేర్చు కొన్నది .అయితే ఆమె మనసులో పెళ్లి అవ్వాలనే కొండంత కోరిక మాత్రం గాఢంగా ఉంది . .కారణం ఆమె కురీపి కాదు ,వయసు మల్లిందీ కాదు .అంతే కాదు ఆమె అందం ‘’బాపు బొమ్మ ‘’కే చందం గా ఉంటుంది ‘’-‘’పుట్టలు మరిచి పోయి కొండల్లో తచ్చాడుతున్న త్రాచుల్లా భుజాల మీంచి ముందుకు జారే రెపరెప లాడే రెండు జడల్నీ ,ఆక్వేరియం వెనక ఆహారం కోసం అటు ఇటు వేదుక్కొనే చేపల్లా గిలగిలలాడే కళల్లనీ ,చిరు నవ్వుకీ తిరస్కారానికి మధ్య సందేహపు రేఖ మీద నిలిచి పోయిన ఎర్రటి పెదాల్ని ,సినిమాల్లో ,నాటకాల్లో కనీ పించే త్యాగం లాగా ఉందా లేదా అని పించే నడుమునీ ,పాత జపానీ కీ రైలు వంటి నడుం మీద ఆధార పడిన ఆ శరీరాన్ని చూసినపుడు ‘’’’పెళ్లి వద్దు ‘’అనే కఠోర నిర్ణయానికి ఆమె ఎలా వచ్చిందనే సందేహం కలుగుతుంది అందరికి దిగులూ ఏర్పడుతుంది ఆమె ను చూసి .అందాన్ని వర్ణించటం లో కొత్తదనం ఉంది ఇలా కధను ప్రారంభిస్తాడు గొల్లపూడి అదీ అతని ప్రత్యేకత .

               పైకి వద్దు అంటున్నా ఆ భావాన్ని అమలు జరపటం సుశీల ఉద్దేశ్యం మాత్రం కాదు .ఒద్దు లో కావాలి అనే ఆకాంక్ష ప్రతి ఫలిస్తుందని ఆమె అనుభవం .దీనికి దోహదం చేయ టానికా అన్నట్లు ఆమె బామ్మ గారి ధోరణి కూడా కారణం అయింది .శని వారాలు ‘’పట్టెడు ఉప్పిడి పిండి అయితే రాత్రి గడిచి పోతుంది ‘’అని ఆవిడ పైకి అన్నా ,’’దస్తా గిన్నెడు ఉప్పుపిండి తినేది ‘’అలాగే సుశీల క్లాస్ మేట్ రాధ వైపు ముక్కు మేష్టారు ఆబగా చూస్తె ఒంటిమీద తేళ్ళు ,జెర్రులు పాకి నట్లున్తుంది అని సుశీల తో అన్న రాధ ఓ సాయం కాలం ఆ మేస్టారుతో సినిమా హాల్లో కనీ పిస్తే అందం గా తన కోరికను ‘’క్యామోఫ్లాగ్ ‘’చేయగలిగి నందుకు మనసు లో రాధను అభి నందిన్చింది .అందుకే ‘’నలుగురి లో కావాలి అని చెప్పటానికి సంస్కారి నేర్చుకొన్న పదమే ‘’వద్దు ‘’అని అర్ధం చేసుకొనే స్తితికి వచ్చి అల వాటు చేసు కొందిపాపం సుశీల ,అయితే అందరి విషయం లోను ఇవి నిజం కావుకదా .అలా అయితే కధే లేదు

                అయితే సుశీలకు తలిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు .ఆ తంతు మామూలే .ఒక రోజు మారుతీ రావు లాంటి బుగ్గలున్న పెళ్ళికొడుకు వచ్చి చూశాడు .పెళ్లి బృందం కాఫీ టిఫిన్లు కానిచ్చి చీకటి పడే దాకా చర్చించుకొని వెళ్ళిపోయారు .ఆ రాత్రి ఆమె వెన్నెల్లో పడుకొని ఠీవిగా ఉన్న పెళ్ళికొడుకును మనసులో ఊహించుకొంటు‘’ఏమండీ సినిమాకు వెళ్దా మండీ “’అంటే తీసుకొని వేల్తాడో లేదో భవిష్యత్తు లో అని ఆలోచిస్తోంది .తల్లి వచ్చి ‘’అబ్బాయి ఎలా ఉన్నాడే బుచ్చీ /’’అని అడిగింది .సిగ్గుతో వెయ్యి వంకర్లు పోయి ‘’అబ్బా  నాకు పెల్లెంటమ్మా ?’’అంది తల్లి ఒడిలో తల దాచుకొంటు .’’తనకు నచ్చాడు ‘’అని చెప్పటానికి ఇదే పద్ధతి ‘’అనుకోంది పిచ్చి శుశీల .కూతురికిస్టం లేని పనులు చేయటం తలిదంద్రులకిష్టం లేదు ‘’ఈ సారీ అమ్మాయి కి అబ్బాయికి నచ్చ లేదు కాబోలు ‘’అను కొంది తల్లి .ఆ తరాతెప్పుడో రాధ కన్పించి ‘’ఆ బుచ్చి సుందరరావు గార బ్బాయి –అంటే బుగ్గల పెళ్ళికొడుకు ను నువ్వు కాదన్నావటగా ?’’అని .’’నేవద్దన లేదే /’’అని ఆశ్చర్య పోయింది సుశీల .ఆ అబ్బాయే రాధకు కాబోయే మొగుడ్ని తెలుసుకొని సుశీల‘’ఆ! నాకు పెళ్ళే వద్దు బాబూ !’’అంది రాధ తో ఠీవిగా ఇందులో ‘’పెళ్లి ఎవరికక్కర్లేదనే ఆశా ,కావాలనే కోరికా కన్పిస్తాయి‘’అంటాడు గొల్ల పూడి .ఇక్కడా సుశీలకు భంగ పాటే .దురదృష్టం అలా కొందరిని వెంట బడి వేధిస్తూ ఉంటుంది .మనసులోని భావాన్ని సూటిగా బహిర్గతం చేయక పోతే వచ్చే అనర్ధమే ఇది ఆ పై జరిగే దానికి తానే బాధ్యత వహించాల్సి వస్తుంది .

                  అయితే వయసు ఆగాడు దాని ప్రభావం అది కల్పిస్తూనే ఉండి .కాలం మాత్రం జరిగి పోయింది .గోపాలం తో పరిచయం ఏర్పడి సినిమాలకు ,షికార్లకు  వెళ్ళింది .ఈ విషయం తలిదండ్రులకు తెలీదు కదా అని వాళ్ళ అజ్ఞానానికి జాలి పడింది .ఎదుటి వాళ్లకు తెలియని విషయం మనకు తెలియడం లో ఎంత గర్వం ఉందొ ఇన్నాళ్ళకు గ్రహించింది .’’గోపాలం కూడా సుశీలను ప్రేమించ కుండా ప్రేమిస్తున్నట్లు భ్రమింప జేస్తున్నాడనే గర్వాన్ని సంవత్సరం నుండి అనుభ విస్తున్నాడని సుశీలకు తెలియదు ‘’అని అంటాడు మారుతీ రావు .ఎంత గడుసు గా గడుసైన విషయాన్ని చెప్ప్పాడో .ఇంట్లో తెలీదని ఆమెకు ,సుశీలకు తెలీదని గోపాలానికి గర్వమే కొంప ముంచింది .వాళ్ళిద్దరూ కలిసి ఒకే రిక్షా లో వెళ్లటం చాలా మంది చూశారు .ఈ కారణం గా ఎవ రైనా ఆమె ను చూట్టానికి వస్తే ‘’పెళ్ళా ! నాకు వద్దు బాబూ !’’అంది .లైటు లేని రిక్షా వాలా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళ టానికి భయపడి నట్లు ..సెలవలిచ్చేశారు .గోపాలం సుశీలను పెళ్లి చేసుకొంటాను అనే మాటను విజయ వాడ లోనే వదిలేసి రైలెక్కి పోయాడు .కొన్నాళ్ళకు అతని పెళ్లి శుభ లేఖ వచ్చింది వెంకుమాంబ తో పెళ్లి ‘’వెంకు మాంబ ఎవరని కాదు కానీ తను కానందుకు దుఖం ముంచు కొచ్చి కొన్ని రాత్రులు ,పగళ్ళు రహస్యం గా ఏడ్చింది ‘’అనటం గొల్ల పూడి మార్కు రచన .చక్కని ఫినిషింగ్ .చాలా రోజులకు మళ్ళీ రాధ కన్పించి అడిగితే ‘’పెళ్ళా !అమ్మో ! నాకొద్దు బాబోయ్ ‘’అంది సుశీల .ఇందులో ‘’త్వరగా జరుగుతున్దందంటావా /జరిగితే బావున్ను ‘’అన్న ఆత్రుతా కన్పించింది .

            సుశీల కదా ఇంకా ఉంది –

                సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –25-11-12-ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.