వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –2
మూడు రోజులు వెలిగే అగ్ని గుండం –తిరువన్నా మలై
— తిరువన్నామలై తమిళ నాడు లో ప్రసిద్ధ శివ క్షేత్రం .అరుణా చలేశ్వరుడు అగ్ని స్వరూప శివ లింగం .లింగోద్భవ కాలమ్ లో శివుని రూప రహశ్యం తెలుసు కోవాలని బ్రహ్మ ,విష్ణువు ,ప్రయత్నిస్తారు .వారికి అంతు దొరక లేదు .అప్పుడు శివుడు తన అగ్ని స్వరూపాన్ని ఉప సంహరించు కోని ,కొండ రూపం లో వారి ముందు వెలిశాడు .ఆలయానికి వెనుకగా ఈ కొండ ఉండటం మనం చూస్తాం .కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది భక్తులు అరుణా చలేశ్వరుని సందర్శించి తరిస్తారు .ఆ రోజూ కొండ చివరి శిఖరం పై,పెద్ద అగ్ని గుండాన్ని వెలిగిస్తారు
.అది మూడు రోజులు దాకా వెలుగుతూ చుట్టూ యాభై కిలో మీటర్ల దూరం వరకు కన బడుతుంది .

అరుణా చలం కొండ మీద ఒక గుహలో శ్రీ రమణ మహార్స్షి తపస్సు చేసి దివ్యాను భూతి పొందారు .కావ్య కంత వాసిష్ట గణ పతి గారు వీరికి ”శ్రీ రమణులు ”అని పేరు పెట్టారు .ఇక్కడి రమణాశ్రమం ప్రశాంత తకు
నిలయం .అందరు తప్పక సందర్శించ వలసినది .
అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి
కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది .ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు .సాధారణం గా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది .అయితె కంచిలో మాత్రం ,ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం లో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం .కామాక్షి ఆలయం లో ,అమ్మ వారి ఎదుట బీజాక్షరాల తో ఉన్న యంత్రం ప్రతిష్టించ బడి ఉంది .పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత .
ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది .విష్ణు కంచి లో వరద స్వామి ఆలయం ఉంది .ఇక్కడి వెండి బల్లి ని తాకితెపాపాలు పోతాయని భక్తుల నమ్మకం .కామ కోటి అంటే కామం తర్వాత వచ్చే మోక్ష దశ్శ .అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం .
రావణ బ్రహ్మ వాహనం పై ఊరేగే క్షీర లింగేశ్వరుడు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో క్షీర రామ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు .పాల తాతి స్పటిక లింగం .అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది .లింగం వెనుక వైపు మూడు గీత లుండటం ప్రత్యేకత .నారద ప్రతిష్ట గా ప్రసిద్ధి .శివుడు శూలం తో నేల మీద గుచ్చితే పాలు చిమ్మి కొలను గా ఏర్పడింది కనుక ”పాల కొలను ”అయి ,క్రమంగా ”పాల కొల్లు ”అయింది .దుగ్దోవన పురం ,ఉప మాన్యు పురం అనే పేర్లు కూడా ఉన్నాయి .
శివ రాత్రి ఉత్సవం లో శివుడు ”రావణ బ్రహ్మ వాహనం ”పై ఊరేగటం ఇక్కడి విశేషం .చైత్ర శుద్ధ దశమి నాడు ఒకే సమయం లో శ్రీ లక్ష్మీ జనార్దనుల ,పార్వతీ రామ లింగేశ్వారుల కల్యాణం జరగటం మరో విశేషం .జనార్దనుడు క్స్శేత్ర పాలకుడు .
శివ కల్యాణం జరిగిన మరు నాటి ఉదయం సూర్య కిర ణాలు క్షీర రామేశ్వర లింగం పై పడటం చిత్రాతి చిత్రం .
మత సామరస్యం తో వెలిగే వేముల వాడ
కరీం నగరం జిల్లా వేముల వాడ లో శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఉంది .ఇది ఒకప్పటి రాజ దాని .జైన ,బౌద్ధాలు విలసిల్లిన ప్రదేశం .ఒక ముస్లిం ముల్లా గారి స్మారక చిహ్నం ఈ ఆలయం లో ఉండటం ఇక్కడి ప్రత్యేకత .రాజా రాజేశ్వర లింగం ”నీల మాణిక్య లింగం. ”పాన వట్టం కింద బ్రహ్మ ,మధ్య విష్ణువు ,పైన శివుడు ఉంటారు .
అమ్మ వారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి .ఆమె వాహనం వ్యాఘ్రం కాదు ”వరాహం ”.ఇదీ ఇక్కడి విశేషం .వెయ్యి
బంగారు నాణాలతో శివుడికి అభి షేకం చేయటం ఇక్కడి మరో విచిత్ర విషయం .అంటే కాదు అన్నం తో కూడా స్వామికి అభిషేకం నిర్వహించటం మరో వింత .కోడె గిత్తలను స్వామికి సమర్పించటం మరో వింత .అవి రాత్రి పూట ఆలయం, లో నిద్రిస్తాయి .దీన్నే ”కోడె కట్టటం ”అంటారు .ఆలయం లో బౌద్ధ ,జైన విగ్రహాలు కూడా ఉండటం అబ్బుర పరుస్తుంది
.దీనికి దక్షిణ కాశి అని పేరుంది .నన్నయ గారి భారత రచనకు రాజ రాజ నరేంద్రుడు ప్రేరణ గా నిలిస్తే ,వేముల వాడ రాజు ”అరి కేసరి ”10 వ శతాబ్ది లోనే తన ఆస్తాన కవి ”పంప ”కవి ని ప్రేరేపించి కన్నడ భారతాన్ని రాయించి కృతిని అంకితం గా పొందటం విశేషం .
పంపకవి జైనుడు .అతని సోదరుడు జన వల్లభుడు ఇక్కడి వాడే .ఇతడు తెలుగు లో ”కంద పద్యాలు ”రాసిన మొదటి కవి గా ప్రసిద్ధి చెందాడు .”లేగల వాడ ”,వెంబుల వాడ అయి చివరికి వేముల వాడ అయిందని చెబుతారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -04 -12
కాంప్ -షార్లెట్ -నార్త్ కెరొలిన -యు.ఎస్.ఏ.
వీక్షకులు
- 1,146,861 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అమరజీవి డాక్టర్ బి. విజయ లక్ష్మి గారి జీవిత చరిత్ర.10 వ భాగం.7.5.26.
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.9 వ భాగం.7.5.26.
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.11 వ భాగం.7.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.191 వ భాగం.7.5.26.
- బేరార్(త్రివేణి)
- భారతదేశంలో బెర్నార్డ్ షా(త్రివేణి
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.10 వ భాగం.6.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.190 వ భాగం.6.5.26.
- సంస్కృతి – ఒక కుట్రా?(త్రివేణి)
- బెంగాలీ ఆశుకవి కవులు(త్రివేణి )
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,981)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
