— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

This slideshow requires JavaScript.

— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

 ఇన్నాళ్ళకు ఈ నెల ఆరవ తేది ఆది వారం హైదరా బాద్ లో ఉషా మయూరి సినిమా హాల్లో సాయంత్రం ఆరు గంటల ఆట కు మా పెద్దబ్బాయి శాస్త్రి ‘’మా మిదునానికి ’’ ఈ మిధునం సినిమా చూపించాడు .అందులో కొన్ని సన్నీ వేశాలు అచ్చం గా నేను ఇంట్లో ప్రవర్తించే తీరు లో ఉన్నాయని ,అంత కట్టే కొట్టే లా ప్రవర్తించటం,కొడుకుల్నించి ఫోన్లు వస్తే వాళ్ళమ్మకు ఇచ్చేయటం తమకు అనుభవమే నని ,తనకు మా కోడలు సమత కు నచ్చిందని , మేము కూడా చూడాలని,తాను ఇప్పుడు రెండో సారి చూస్తున్నానని  పట్టు బట్టి సినిమా చూపించాడు ..అక్కడ అందరు వృద్ధ మిదునాలే కని పించాయి . .హాలంతా నిండి పోవటం నాకు మహా ఆశ్చర్యాన్ని కల్గించింది .కాదు ఆనందాన్ని కూడా పంచింది .ప్రేక్షకులు ఎంత మెచ్చుకోక పోతే ఇంత మంది వస్తారు ?అందుకని ప్రేక్షక దేవుళ్ళను  మనసారా అభి నందిస్తున్నాను .ఇది ప్రేక్షకులు అందించిన గొప్ప విజయమే నని పించింది .తెల్ల జుట్టు వాళ్లను  హాలుకు తీసుకొచ్చిన నల్ల జుట్టు వాళ్ళు కొందరు ఉండటం విశేషమే .ఇది ‘’మన అమ్మా నాన్నల సినిమా ‘’అని యువత ఎగబ డటం లేదు కాని ఇది మన సినిమా అని మాత్రం వృద్ధులు అనుకొని చూడ టానికి బాగానే వస్తున్నారు .ఇలా ఉన్నామని  అనుకొనే వారు ,ఇలా ఉంటె బాగుంటుందను కొనే వారు ,ఇలా ఉండ బోతున్నాం అనుకొనే వారు ,మన వాళ్ళందరూ ఇలా ఉంటె మహా బాగుంటుంది అను కొనే వారు ఈ సినిమా చూసే వాళ్ళల్లో ఉన్నారు .మూడో వారం లో ఇంత మంది జనం ఈ ఆర్ట్ ఫిలిం లాంటి సినిమాకు రావటం గొప్ప విషయమే నని పించింది .

          ఇప్పుడు సినిమా లోనిఅసలు విశేషాలను తెలియ జేసే ప్రయత్నం చేస్తాను .అసలు మిధునం కధను అత్యద్భుతం గా రాశారు శ్రీ రమణ .దాన్ని అంత అద్భుతం గా తెరకెక్కించాలని భరణి చేసిన ప్రయత్నమే ఇది .అంతా పూర్తి సంతృప్తి ని కల్గించక పోవటం నిరాశే మిగి లించింది ..కధలో ఎన్నో మార్పులు చేశాడు భరణి .అవి కధా గమనాన్ని పెంచేవి గా ఏమీ లేవు ..హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీద్దామని ,ఆర్ట్ ఫిలిం గా మలిచి సత్తా చూపించుకోవాలని అనుకొని తీరా  ‘’డిం షో ‘’గా నిలబెట్టాడు .అదే పెద్ద లోపం .ఫోటోగ్రఫీ మిధునం దంపతులు ఎంతో ఆశగా పెంచుకొన్న తోటలోని పువ్వులా గువ్వలా ,మొక్కలా, తీగెలాఅందాలను ఆర బోయాల్సింది పోయి చీకటి గుయ్యారం గా తయారు చేశాడు .ఆ సోయగాల సౌరు ఆనందించ లేక పోతాం . అదే బాధ కల్గిస్తుంది .చాయాగ్రహణం ఇషాన్ ఆర్యా ఫోటోగ్రఫీ లా ఉంటె కన్నుల నిండా వెన్నెలే ,ఆనందపు  విన్దులే గా ఉండేవి అది కోల్పోయాం..అదే విచారం నూటికి నూరు శాతం మార్కులు కొట్టేయ్యాల్సింది పోయి పాస్ మార్కులతో సంతృప్తి పడాల్సి వచ్చింది .బహుశా ఇంకా భరణి తాను తీసిన ‘’సిరా ‘’బాటిల్ లోనుంచి ,‘’,గ్రహణం ‘’నుంచి దూరం కాలేక పోయాడని పిస్తుంది .అడే తీరు లో తీసి ఫోటోగ్రఫికి మార్కులు తెచ్చుకోలేక పోయాడు .

          అయితే –శబ్ద గ్రహణం మాత్రం నూటికి ఇన్నూరు మార్కులు పొందింది .అద్భుతం అత్యద్భుతం అని పిస్తుంది .వీణా పాణి సంగీతం సమ కూర్చాడని పించలేదు .అసలు కధలో కలిసి పోయిందని పిస్తుంది .హాట్స్ ఆఫ్ టు’’సంగీతవాణి , పాణి –వీణా పాణి ‘’.జేసుదాస్ పాడిన మిధునం టైటిల్ సాంగ్ అర్ధ వంతం గా ,వీనుల విందుగా ,ఉన్నది .కొన్ని మాటలు శబ్దాలు వెనుక నుంచి విని పించటం మరి గొప్ప ప్రయోగం .నిజం గా అభి నందనీయ మైన విషయం ..జొన్న విత్తుల కాఫీ దండకం నాకేమి కొత్తకాదు ,ఆయన బానే పాడాడని పించింది ..

          నటన విషయానికి వస్తే లక్ష్మి నటన నిజం గా సూపర్బ్ .అవధులకు మించి నటించి ‘’నట లక్ష్మి ‘’అని పించింది .ఆంగ్ల మాధ్యమం లో చదూకున్న అమ్మాయి అచ్చ తెనుగుకు పట్టం కట్టింది ..హావ భావ ప్రకటనలు మహా ముచ్చటగా ఉన్నాయి .చిలిపితనం ,గడుసు తనం ,ఆరిందాతనం ,ఉత్తమా ఇల్లాలు లక్షణం ,అందమైన కాపురానికి అందమైన గోపుర శిఖరం గా ఆమె నటన ఉంది. .అయినా ఆమె పాత్ర చిత్రీకరణ లో ఇంకా లోపం ఉందని పించింది .ఇంకా చేయగల చెవ ఉన్న నటి లక్ష్మి .రా బట్టాల్సిన నటన చాలా ఉందని పిస్తుంది .నూటికి రెండొందల మార్కులు కొట్టేస్తుంది లక్ష్మి .

                బాలు విషయానికి వస్తే అంతా తెచ్చి పెట్టుకోన్నట్లుంది ..నటన కన్నా డైలాగ్ డెలివరి బాగుంది .ఆయన ముఖం చూడ కుండా సంభాషణలు వింటే బాగా ఉండేది అని పిస్తుంది .కష్టపడ్డాడు .పీపా లా ఉన్నా పాకాడు ,గెంతాడు ,పరిగెత్తాడు చిలిపి తనం చూపించాడు .,అంతా ఏదో లా ఉంది..నేను ఇచ్చే మార్కులు యాభై శాతమే .

              మొక్కలు ,పూయటం కాయటం ,తీగెలు పాకటం పిందే,,కాయా,ఫలం కని పించింది అని మీడియా ఊదర కొట్టింది కాని అదేమీ ఇందులో కన్పించవు .కాయలు చూపినంత మాత్రాన అవి ఆ చెట్టువే నని నమ్మేంత గా లేక పోవటం వింత .అసలు ఆ చెట్ల లో ఆ మిధునం ప్రతి చేట్టులోను తమ సంతానాన్ని చూసుకొని వారిని గురించి వాటిని గురించి చెప్పుకొంటూ హాయిని , ,నిండైనన సంతృప్తి కరమైన జీవితం సా గించారు  .ఆ అను భూతిని మనం కధ చదువుతుంటే కలిగిస్తారు చూస్తుంటే ఇంకా గొప్ప భావన రావాల్సి ఉంది .అది రాక పోవటం అసలు కధకే దెబ్బ అని పిస్తుంది .కధ చదివి సినిమా చూసిన వారికి కళ్ళు ఏ మాత్రం చమర్చవు .చివ్వర మూడు నిమిషాల్లో లక్ష్మి చూపిన నటన ను చూసి నప్పుడు తప్ప .అదే పెద్ద లోపం .ఆర్ద్రత తో నిండిన మనస్సు తో కన్నీళ్లు కారుస్తూ హృదయం ద్రవించి పోతుంది మనమందరం ఆ కధ లో లీన మై పోతాం .ఆ మమైకత్వం సినిమా లో లేక పోవటం పెద్ద లోపమే .ఇక్కడ శ్రీ రమణ కు పూర్తీ అన్యాయమే జరిగింది ..

                       మిధునం తో నా సంబంధం

           దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ‘’రచన ‘’మాస పత్రిక లోశ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ చదివి ,ఆనంద పరవశత్వమే పొందాను .మళ్ళీ మళ్ళీ చదివాను .మా శ్రీమతి తో చది వించాను .ఆమె కూడా చాలా అనుభూతి పొందింది .ఎంతో మెచ్చింది .ఆ చెట్ల వాతావరణం మన ఇంటి వద్ద లేదు కదా అని బాధ పడింది .కాని ఇప్పుడు అనేక రకాల చెట్ల  శోభ అంతా మా ఆ వరణ లో నిండి కళ్ళకు విందు చేస్తున్నందుకు మహా ఆనంద పడుతోంది .ఆ తర్వాతప్రముఖ చిత్ర కారుడు బాపు గారు ఈ కధను స్వహస్తాలతో రాయగా మళ్ళీ పుస్తక రూపం లో వస్తే ,ముచ్చట పడి మళ్ళీ చదివాను .శ్రీ కొమ్మూరి వేణు గోపాల రావు గారు మరణించటానికి కొద్ది రోజుల ముందు ఆయన మచిలీ పట్నం లో శ్రీ రావి రంగా రావు గారు నిర్వ హించిన కధా సదస్సులో పాల్గొన్నారు సభాధ్యక్షులు గా ప్రముఖ కధా రచయిత శ్రీ వీరాజీ వ్యవహరించారు .మరో ప్రముఖ కధా రచయిత శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు మొదలైన వారందరూ ఉన్నారు .నేనూ సదస్సులో పాల్గొన్నాను .కధ ల విషయం అంతా మాట్లాడిన తర్వాతా అధ్యక్షుడిని నాకు అయిదు నిముషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరాను .ఇచ్చారు .అయిదారు నిమిషాలలో శ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ గురించి హైలైట్ చేసి మాట్లాడాను .ఆ కధ ప్రతి తెలుగు వాడి కధ అని దాన్ని ముద్రించి ప్రతి తెలుగు వాడింట్లో పంచి,చదివించి  ఋణం తీర్చుకోవాలని చెప్పాను .అంత మంచి కధ ఆ మధ్య రాలేదని అన్నాను వీరాజీ ,కొమ్మూరి, త్రివిక్రమ్ గార్లు ఎంతో మెచ్చుకొన్నారు నన్ను .ఆ విషయాన్ని అక్కడే మర్చి పోయాను ..తర్వాతమూడు రోజుల కు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు నాకు .కొమ్మూరి గారు నేను మిధునం పై మాట్లాడి మెచ్చిన తీరు ను శ్రీ రమణ గారికి ఫోన్ లో తెలియ జేశారని .,ఆయన ఎంతో ఆనంద పడ్డారని త్రివిక్రమ్ గారికి తెలియ జేశారట .ఆయన నాతో ఫోన్ లో ఈ విషయం చెప్పి నన్ను అభి నందించారు .దాదాపు ఏడాది క్రితం తెన్నేరు వాసి  మాకు ఆత్మీయ మిత్రులు శ్రీ దేవి నేని మధు సూదన రావు గారు తమ స్నేహితుని వివాహ సందర్భం గా ‘’మిధునం ‘’కధ ను ముద్రించి వివాహానికి వచ్చిన వారందరికి ఉచితం గా పంచి పెడుతూ నాకొక కాపీ పంపారు .మేమిద్దరం మళ్ళీ మహదానందం గా చదివి చలించి పోయాం .ఆ మిదునాన్ని మనసారా అభి నందించాం . .ఆ కధను నేను చదువుతూ వాయిస్ రికార్డర్లో రికార్డు చేశాను .చివరి పది నిమిషాలు నా కళ్ళ వెంట దారా పాతం గా ఆనంద బాష్పాలు కారి పోతూనే న్నాయి కళ్ళు తుడుచుకుంటూ గద్గదం గా అలానే చదివి పూర్తీ చేశాను .దాన్ని mp3లో నిక్షిప్తం చేసి సాహితీ బంధువులందరికీ పంపాను ..అది విని చాలా మంది తమ పరిస్తితి నా లా నె ఉందని కన్నీళ్లు ఆపు కో లేక పోయామని మెయిల్స్ రాశారు .ఫోన్లూ చేశారు .అంతటి ప్రభావాన్ని కలిగించిన కధ శ్రీ రమణ కద – మిధునంమిధునం .ఇలా మనల్ని కది లించలేక పోయిందే సినిమా అని మాత్ర్తం బాధ ఎక్కువ గానే ఉంది.

                   మిధునం లో పద నిసలు

          చిన్న ధియేటర్లు ‘’లో బడ్జెట్’’ సినిమాలు ఆడటానికి సహకరించటం లేదని రామోజీ హాలు కనుక నె ఇక్కడ ఈ సినిమా ఇంత కాలం ఆడుతోందని ఈ క్రెడిట్ అంతా రామోజీ రావుదే నని నాతో చూసిన వారు అన్నారు .టికెట్ కూడా యాభై రూపాయలే అత్యధికం గా ఉండటం కూడా బాగా ఆడటానికి వీలవుతోందని అంత మాత్రం చేత సౌకర్యాల కేమీ లోపం లేదని అన్నారు ..ఈ విషయం లో శ్రీ రామోజీ రావు ను అభి నందిన్చాల్సిందే అందరం .నిర్మాత ఆనంద రావు గారికి కూడా ఈ సినీమా నడక ఆనందాన్ని కల్గించే ఉంటుందని అనుకొంటున్నాను .దర్శకుడు భరణి సాహసానికి ,ఒక మంచి తెలుగు సినిమా తీసి అంతర్జాతీయం గా తెలుగు వాడి సత్తా ను ప్రపంచానికి చాటాలి అన్న తపన ఫలించిందనే అనుకొంటున్నాను .భరణి తన శక్తి సామర్ధ్యాలన్ని ఒలక పోశాడు .స్వయానా రచయిత అవటం ,దర్శకుని గా రాణించటం తానూ గొప్ప కారెక్టర్ నటుడవటం కలిసి వచ్చింది .ఇలాంటి ఇంకో సినిమా తీసే ధైర్యం వచ్చి ఉంటుంది ..అయితే పేపర్ వాళ్ళు బాగా బూస్ట్ ఇస్తున్నారనే మాట కూడా విని పించింది ..

మిధునం పై మధనం  మిధునం మన తెలుగు సినీ బావుటా ను ఆకాశ మంత ఎత్తుకు ఎగరేయాలని  ఆశిస్తూ –సెలవ్ –

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు

                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

4 Responses to — వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

  1. రచనను దృశ్యబద్ధం చేయడంలో ఉండే పరిమితులు భరణికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. మూలకథకు సినిమాలో కొన్ని మార్పులు చేశారని విని నేనూ మెచ్చుకోలేకపోయాను. (శ్రీరమణగారే స్వయంగా చేసినా సరే…) బాలూ మీద నాకున్న అనుమానాలను మీరు మరింత పెంచారు. కాకపోతే.. తెలుగు సినిమా సాధారణ స్వరూప స్వభావాలతో పోలిస్తే… ఈ కథను చిత్రీకరించడం సాహసమే అనుకోవాలి.

    మిథునంతో మీ అనుభవాలు బాగున్నాయి.

    చిన్నచిన్న సవరణలు… శ్రీరమణీయ మిథునం మరీ ఇరవయ్యేళ్ళ నాటిది కాదనుకుంటా. మొదట ఆంధ్రభూమిలో నాలుగైదు వారాలు ప్రచురితమయ్యాక… దాన్ని రచనలో బాపూగారి చేతిరాతలో పునర్ముద్రించారు.
    గ్రహణం భరణి దర్శకత్వం కాదు.. ఇంద్రగంటి మోహనకృష్ణది.

    Like

    • gdurgaprasad's avatar gdurgaprasad says:

      సంతోషం ఫణి గారు -గ్రహణం లాంటి సినిమా భరణి చేసాడు పేరు లో పొరబాటు నాది .ఆ పేరు గుర్తుకు ఇప్పటికీ రావటం లేదు .నిజం గా భరణి చేసి నది సాహసమే నోడౌట్ అందుకు ఆయనమిక్కిలి అభి నందనీయుడే .-దుర్గాప్రసాద్

      Like

  2. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు's avatar గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు says:

    మిదునం కాదు మిథునం.

    Like

  3. gdurgaprasad's avatar gdurgaprasad says:

    సాహితీ బంధువులకు -శుభ కామనలు -శ్రీ తాడే పల్లి పతంజలి గారు నేను మిధునం అని రాస్తే కాదు”మిథునం ”అని తప్పు సవరించారు .వారు ”మేథతే సంగచ్చత ఇతి మిధునం ”అని వ్యుత్పత్తి ని చూపించారు .కూడి ఉండేది అని మంచి అర్ధమూ ఇచ్చారు .వారి సవరణకు కృతజ్ఞతలు కాని మేధ లో ధ కు ”పొట్టలో చుక్క రాశారు ”.నిఘంటువు తిరగేస్తే మేధ అనే ఉంది .చుక్క లేదు .”మిథం”అనే పొట్టలో చుక్క ఉన్న మాటకు అన్యోన్యం అని రహస్యం అని అర్ధాలున్నాయి తెలుగు అకాడెమి వారి నిఘంటువులో .కనుక మొత్తం మీద అర్ధం అన్యోన్యం గా ఉండే ఆలు మగల జంట అని .కాని మేధ తో దీనికేమీ సంబంధం ఉన్నట్లు లేదు .
    శ్రీ ఫణీంద్రగారు స్పందిస్తూ ,మిథునం ”కధ నేను అన్నట్లు మొదటి సారి ”రచన మాస పత్రిక ”లో రాలేదని ”ఆంద్ర భూమి ”లో వచ్చిందని తెలిపి సవరించారు .అంతేకాక నేను అన్నట్లు ”గ్రహణం ”సినిమాను డైరెక్ట్ చేసింది భరణి కాదని ఇంద్ర గంటి మోహన కృష్ణ అని తెలియ జెప్పారు .అయితే అలాంటి సినిమా ఒకటి భరణి తీశాడు .నాకు పేరు జ్ఞా పకం రాలేదని వారికి సంజాయిషీ ఇచ్చు కొన్నాను .
    నేను చేసిన ఈ మూడు తప్పిదాలకు చక్కగా స్పందించి ,నాకు మార్గ దర్శనం చేసిన వీరిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ ,మన్నించమని కోరుతున్నాను .మీ– దుర్గా ప్రసాద్

    Like

Leave a reply to gdurgaprasad Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.