మకర సంక్రాంతి
సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాసిలో ప్రవేశిస్తుంటాడు దాన్ని సంక్రమణం అంటారు .సూర్యుడు కర్కాటక రాశి లో కి ప్రవేశించినపుడు కటక లేక కర్కాటక సంక్రమణం అంటారు దీంతో దక్షిణాయణం ప్రారంభమైనట్లు .ఇది సాధారణం గా జూలైపదిహేడు న వస్తుంది .ఇది పితృ దేవతల కాలం . ఆరు నెలలు ఉంటుందని మనకుతెలుసు . .అలాగే రవి మకర రాసిలో ప్రవేశించినపుడు వచ్చేది మకర సంక్రమణం .రేపు అంటే ఈ నెల పద్నాలుగవ తేది సోమవారం మధ్యాహ్నం గం.12-10 కు సూర్యుడు మకర రాశి లో ప్రవేశించటం తో మకర సంక్రమణం ప్రారంభమవుతుంది .ఈ ఆరు నెలలు దేవయానం గా భావిస్తారు .ఉపనయనాలు ఉత్తరాయణం లోనే చేస్తారు .సంక్రాంతి పురుషుడు ఒక్కో సారి ఒక్కో రకం గ వస్తాడు . ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఎలా ఉన్నాడో ,యేవాహనం ఎక్కి వచ్చాడో , వేషదారణం ఏమిటో ఆ వివరాలు తెలుసుకొందాం .
రేపు వచ్చే సంక్రాంతి పురుషుని పేరు ‘’ద్వాం క్ష ‘’అందువల్ల వైశ్యులకు హాని అని తెలుస్తోంది .గజ వాహనం ఎక్కి రావటం వలన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారికి భోగ భాగ్యాలతో పాటు అకారణం గా కలహాలేర్పడతాయని సూచన .చందన ఉదకం తో స్నానం చేయటం వల్ల పాడి పంటలు సమృద్ది గా ఉంటాయి .యవాక్షత ధారణం వలన అలచంద పంటకు నష్టాలుండ వచ్చు .నీలి రంగు వస్త్రం కట్టుకొన్నందున ప్రజలలో భయాందోళనలు ఎక్కువవ గా ఉండచ్చు .గోరోచనాన్ని లేపనం గా పూసుకొన్నందున విలాస వస్తువుల ధరలు ఆకాశమంత ఎత్తున ఉంటాయి .జపా పుష్పాన్ని ధరించటం వల్ల యుద్ధ భయం జాస్తి .గోమేధికాన్ని ఆభారణం గా ధరించటం వలన నవ రత్నాలకు గిరాకీ పెరుగుతుంది .తగరపు పాత్ర లో భోజనం చేయటం వల్ల లోహాలన్నిటికి గిరాకీ ఉంటుంది .పాలను తాగటం వల్ల శూద్రులకు అరిష్టం గా భావిస్తారు .
రేగు పండ్ల ను తినటం వల్ల పండ్ల తోటలు జాస్తిగా పెరుగుతాయని అంటారు .కోదండాన్ని ఆయుధం గా వాడటం వలన పాలకులకు మనశ్శాంతి తక్కువ అని చెబుతారు .బంగారు గొడుగు వేసుకోవటం వలన ప్రజలకు ఆయురారోగ్యాలు ఉంటాయి .విస్మయం చేష్ట గా ఉన్నందున వర్షాలు అధికం గా కురుస్తాయని సూచన .సంక్రాంతి పురుషుడు కూర్చుని ఉన్నట్లు ఉండటం వలన అనారోగ్యాలు ఎక్కువే నని ఊహిస్తున్నారు .బల్లెం తో సంచరించటం వల్ల జంతు నష్టం ,దొంగలకు హాని .ఆగ్నేయ దిశలో ప్రయాణించటం –ఆగ్నేయ ప్రాంతాల వారికి అరిష్టం గా భావిస్తారు .శుక్ల పక్షం లో ప్రవేశించటం వలన అన్ని వస్తువుల ధరలూ పెరిగి పోతాయట .తదియ తిది వల్ల చిన్న వ్యాపారులకు లాభాలెక్కువ .సోమవారం నాడు రావటం –పంటలకు నష్టం ,చిన్న పరిశ్రమలకు వృద్ధి .మేష లగ్నం లో ప్రవేశం వలన స్త్రీలకూ ప్రాముఖ్యత పెరుగుతుంది .ధనిష్ఠా నక్షత్రం లో ప్రవేశం కనుక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఊహిస్తున్నారు .మధ్యాహ్న కాలం లో ప్రవేశించటం అధికారులతో మనస్పర్ధలు ఎర్పడేట్లు సూచన కని పిస్తోందని పంచాంగ కర్తలు చెబుతున్నారు .
సంక్రమణ సమయం లో జపం ,తపం చేయ గల వారు చేసుకో వచ్చు .సంక్రమణ ప్రవేశ సమయం లో దానాలు చేయాలి పితృదేవతలు సంతృప్తి పడతారు .బూడిద గుమ్మడి ని బ్రాహ్మణునికి వడ్ల తో దానం చేయాలి .పితృదేవతలకు తిలోదకాలు వదలాలి .ఇవన్నీ చేస్తే ఆయురారోగ్యాలు ,ఐశ్వర్యాలు ,పుత్రపౌత్రాభి వృద్ధి కలుగుతుంది ..
సంక్రాంతి శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు

