రాబర్ట్ బ్రౌనింగ్ -1
యేవో కొద్ది పద్యాలు మాత్రమె సామాన్యులకు కొరుకుడు పదనివి అన్న వాటిని రాసిన విశ్వ నాద ను ”పాషాణ పాక ప్రభూ ”అని జోక్ చేశాడు జరుక్ శాస్త్రి . ఆంగ్ల కవిత్వం లో అర్ధం కాని కవి అని ”అ యః పిండ కవి ”అని పించుకొన్న వాడు రాబర్ట్ బ్రౌనింగ్ . మనకాశీ ఖండానికి ,నైష ధా నికి ఆ పేరుంది . బ్రౌనింగ్ ను అందరు తక్కువగా అంచనా వేసిన ఆంగ్ల సాహిత్య మహా కవి అనీ బ్లూమ్ అనే విమర్శకుడు తేల్చాడు . బ్రౌనింగ్ ను పాశ్చాత్య యోని వేర్సితీ లలో పూర్తిగా మర్చి పోయారని బాధ పడ్డాడు అంటే బ్రౌనింగ్ కవిత్వం మీద వాటిలో బోధనా ,అధ్యయనం పూర్తిగా నెగ్లెక్ట్ చేశారన్న మాట . ఆ కాలం లో టెన్నిసన్ మహా కవి బ్రౌనింగ్ కు ప్రత్యర్ధి కవి . బ్రౌనింగ్ లో”nihilistic self deception ” ఉందని భావించారు .
1812 may 7న బ్రౌనింగ్ లండన్ దగ్గరున్న ”కాంప్ బెల్ ”లో జన్మించాడు . తల్లికి మాట విశ్వాసం అధికం . తండ్రి వద్ద పెద్ద గొప్ప లైబ్రరి ఉంది . పదమూడేళ్ళ వయసులోనే”ఇంకాండిట ”పేరుతొ కవిత్వం రాశాడు బ్రౌనింగ్ . కాని ప్రచురించలేదు . అప్పటికే వోల్టైర్ ,షెల్లీ లను క్షున్నం గా చదివాడు . అది ”spiritual questioning time ”.తండ్రి లాటిన్ గ్రీక్ భాషలను నేర్పాడు .షెల్లీ అంటే వీరాభిమానం కలిగింది . సంగీతం కూడా నేర్చాడు . లండన్ యోని వర్సిటి లో చేరినా కవిత్వం రాయాలనే ఉద్దేశం తో మధ్యలోనే గంట కొట్టేశాడు . 1833లో ”పాలిన్ ” రాసి మేనత్త సహకారం తో అచ్చు వేశాడు . ఏమీ ప్రోత్సాహం రాలేదు . ”స్టూవార్ట్ మిల్ ”ఇచ్చిన సలహా తో ”dramatic monologue poet ”గా మారాడు . 1835లో రష్యా వెళ్లి వచ్చి ” paracelsus”రాశాడు . మంచి గుర్తింపే వచ్చింది . మేధావి వర్గం బాగా మెచ్చింది . కాని దాని వాళ్ళ ఆర్ధికం గా ఏమీ లాభం రాలేదు పాపం .
భార్యా భర్తలూ
అప్పుడు కవిత్వం నుంచి తన పాత్రను డ్రామాకు మార్చుకొన్నాడు . ఈ ఊపులో ”stafford ”నాటకం రాశాడు . దాన్ని అయిదు సార్లు మాత్రమె ప్రదర్శించటం తో నీరు కారిపోయాడు . 1840లో ”sordella” రాసి పబ్లిష్ చేశాడు . అప్పుడు ” a poet of conflicted thought ” అన్నారు . అప్పటి దాకా కాస్తో కూస్తో ఉన్న పేరు కాస్తా ఊడి పోయింది .1840వరకు పద్య నాటకాలు రాశాడు .” డ్రమాటిక్ లిరిక్స్” రాశాడు .1838 లో ఇటలి సందర్శించాడు . ఎలిజే బెత్ బార్రేట్ అనే ఆమె ఈయన కవిత్వాన్ని అభిమానించింది . 1846 లో ఇద్దరు పెళ్లి చేసుకొని పారిస్ వెళ్ళారు . ట్రాలోప్ ,టెన్నిసన్ లతో గాఢ పరిచయమేర్పడింది . 1850 బ్రౌనింగ్ భార్యకు కవిత్వం లో విశేష మైన ప్రాచుర్యం కలిగి గొప్ప పేరొచ్చింది . ఆమె రాసిన ” sonnets from the portugese ” అనే కవిత ఉర్రూత లూగించింది . అప్పుడామే ”one of the foremost English poets of that time ” అని గుర్తింప బడింది . బ్రౌనింగ్ రాసిన ”క్రిస్మస్ ఈవ్ ,ఈస్తర్ డే’అనే దీర్ఘ ‘కవితలు తుస్సుమన్నాయి .1855 లో బ్రౌనింగ్ రాసిన ”మెన్ అండ్ విమెన్ ”కవితకు గొప్ప పేరే వచ్చింది .ఇత్లా అదృష్టం ఆయన్ను కిందికీ పైకి ఉయ్యాల లూపుతోంది .1861 లో భార్య బారెట్ మరణించింది .
1864 లో”dramatic personae ” ను బ్రౌనింగ్ రాస్తే మంచి రికగ్నిషన్ వచ్చింది . ” తర్వాత” the ring and the book ” అనే ”epic length ”poem ”రాస్తే ఉత్తమ ఆంగ్ల కవుల సరసన స్తానం లభించింది . ”notable socialite ” అని పేరొచ్చింది .సమాజమ్ లో గౌరవం పెరిగింది . ”లూయిసా ”అనే అమ్మాయిని ప్రేమిస్తే ,ఆమె తిరస్కరించింది . అప్పటికి సృజనాత్మక కవి గా లాబ్ద ప్రతిస్టుడయ్యాడు బ్రౌనింగ్ .1889 లో చివరి రచన ”asolando ” పూర్తీ చేశాడు ఆయన శిష్యులు ,అభిమానులు అందరు కలిసి ”బ్రౌనింగ్ సొసైటీ ”ని1881 లో స్తాపించారు . అది ఆయన” స్టేటస్ కు సింబల్ ” నిలిచి పోయింది . ఆక్స్ ఫర్డ్ ,కేం బ్రిడ్జ్ యోని వేర్సితీలు ఇప్పుడు పోటీ పది బ్రౌనింగ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసి సత్కరించి గౌరవించాయి ”అసోలాండో ”పబ్లిష్ అయ్యాన సంవత్సరమే 77వ ఏట 1889 december 12 న రాబర్ట్ బ్రౌనింగ్ మహా కవి మరణించాడు . ఆయనను గౌరవ పురస్కారాం గా ”పోఎట్స్ కార్నర్ ”లో ఖననం చేసి అభిమానాన్ని చూపించారు .
బ్రౌనింగ్ కవితా విశేషాలు ఇంకో సారి
15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-7-13-కాంప్ –హైదరాబాద్

