జోసెఫ్ కాన్రాడ్
1857 లో డిసెంబర్ మూడున రష్యా ఆక్రమిత పోలాండ్ లో జోసెఫ్ కాన్ రాడ్ జన్మించాడు . అసలు పేరు ‘’Jozef Teodor Konrad Nalicz Korzieniowski ‘’చిన్నప్పుడే తల్లి మరణించింది . తండ్రికి టి.బి. జబ్బుతో ఆరోగ్యం కోల్పోయాడు .తండ్రి కవి ,నాటక రచయితా . పన్నెండేళ్ళ వయసులో తండ్రి కూడా చని పోయాడు . 1874 లో ‘’ఫ్రెంచ్ మెర్కండైస్ ‘’లో ప్రవేశించాడు . మూడు సార్లు వెస్ట్ ఇండీస్ కు వెళ్ళాడు . ప్రేమ విఫలమై బాధ పడ్డాడు . ద్వంద్వ పోరాటం లో ఒక సారి బులెట్ దెబ్బ తగిలింది . 1886 లో షిప్ కు యజమాని అయ్యాడు .
బ్రిటన్ చేరాడు పౌరసత్వాన్ని పొందాడు . ‘’concord ‘’గా పేరు మార్చుకొన్నాడు . మలేరియా టో బాధ పడ్డాడు . కాంగోలో ఉద్యోగం లో చేరాడు 1894 .కాంగో ఉద్యోగానికి రాజీ నామా చేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు ..’’the black mate ‘’అనే మొదటి కద 1886 లోరాశాడు . మూడేళ్ళ తర్వాత ‘’an out cast of the island ‘’,’’the Nigger of the Narassus ‘’రాశాడు ..తర్వాత ‘’టేల్స్ ఆఫ్ అన్ రెస్ట్ ‘’ ,హార్ట్ ఆఫ్ డార్క్ నేస్’’పూర్తీ చేశాడు 1902 లో ‘’టైఫూన్ అండ్ ది యూత్ ‘’అనే చిన్న కదా సంపుటి వెలువరించాడు .
1904 లో ‘’nostroma ‘’,1907 లో ప్రసిద్ధ రచన అని పించుకొన్న ‘’the secret agent ‘’నవల రాశాడు ఇది చలన చిత్రం గా కూడా వచ్చింది . అతని ‘’మిర్రర్ ఆఫ్ ది సి ‘’కి కూడా పేరొచ్చింది . తర్వాత ‘’మెంటల్ బ్రేక్ డౌన్ ‘’వచ్చింది కాన్రాడ్ కు. ‘’చాన్స్ ‘’అనే నవల బాగా క్లిక్ అయింది . పాప్యులారిటి పెరిగింది .తర్వాత ‘’the shadow line ‘’,the arrow of gold ‘’రాసి ప్రచురించాడు . 1923 లో అమెరికా వెళ్ళాడు . అక్కడ న్యు యార్క్ లో ఘన స్వాగతం లభించింది .1923 లో చివరి నవల ‘’the rover ‘’విడుదల చేశాడు .1924 ఆగస్ట్ మూడు న ఇంగ్లాండ్ లో మరణించాడు
ఇరవయ్యవ శతాబ్దపు మానవ పతనాన్ని కాన్రాడ్ తన రచనల్లో నేపధ్యం గా చూపించాడు ..రాజకీయం ,నాగరకత ,మానసిక శాస్త్రం మొరాలిటి ,పరిణామం ,మనషి తనను తాను అర్ధం చేసుకొన్నవిధానం అనే వాటిపై ద్రుష్టి పెట్టి రాసిన రచనలు కాన్రాడ్ వి .’’హార్ట్ ఆఫ్ డార్క్ నేస్ లో తన భావాలను విస్పష్టం గా ప్రకటించు కొన్నాడు . .బుద్ధుని లాగా కూర్చుని స్పష్టం గా కద చెప్పి నట్లు కాన్ రాడ్ చెప్పేవాడు అని ప్రసిద్ధి చెందాడు .రచనల్లో సింబాలిజం ,మేలో డ్రామా ఎక్కువ . ‘’going up that river was like traveling back to the earliest beginning of the world ‘’లాగా అని పిస్తుందని భలే తమాషా గా చెప్పాడు వేదాంతాన్ని మిళితం చేసి .
కద చెబుతూ ‘’it was not my strength that wanted nursing ,it was my imagination that wanted soothing ‘’అంటాడు కాన్రాడ్’’మార్లో ‘’అనే కద చెబుతూ . ‘’marlo’s and concord’s journey up the ‘’congo ‘’is one sense ,a journey back into time ,beginning with Marlo’s apprehenshion that England too was once one of the dark places of the earth and moving to consideration of the fascination of the abomination –the fascination of civilized man for his primitive atavistic roots ‘’.the voice of the surf heard now and then was a positive pleasure –like the speech of a brother ‘’ఇందులో ‘’the horror ,the horror ‘’అని పించటం లో ప్రపంచం లో మానవుడి దుష్టత్వ భావానికి పరా కాస్ట కన్పిస్తుంది .
హార్ట్ ఆ ఫ డార్క్ నేస్ లో సంప్రాదాయ వైవిధ్యత కన్పిస్తుంది . రాజకీయ వ్యంగ్య వైభవం ఉంటుంది .అందుకే దీన్ని‘’సైకలాజికల్ ఒడిస్సీ ‘’అంటారు . కాన్రాడ్ జీవిత చరిత్రే ఇది .ఎన్నో ఐరనీలతో సింబాలిక్ గా పెసిమిజం తో నిండి ఉంటుంది .అతని ‘’షాడో లైన్ ‘’ను మాస్టర్ పీస్ ‘’అంటారుగొప్ప స్టైలిస్ట్ రచయిత అని ముద్ర పొందాడు . .ఆయన వాణ్ణి అంటి హీరోయిక్ పాత్రలే .ది హెచ్ .లారెన్స్ ,హెమింగ్ వె , ఫాక్ నర్,ఫిట్జెరాల్డ్ ,ఆర్వెల్ వంటి ప్రముఖ రచయితా లేందరి పైనో కాన్రాడ్ ప్రభావంఉంది స్వీయ జీవితాన్ని ,మాతృదేశం పోలాండ్ భావనలను కలబోసి రచన చేశాడు

