పోలాండ్ రచయిత జేస్లా మిలోజ్
పోలాండ్ లోని లితుయాన దగ్గర జేస్లా మిలోజ్ 1911 జూన్ ముప్ఫై న జన్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ప్రసిద్ధి చెందినా కవి కధకుడు ,వచన రచయితా .తన కవిత్వాన్ని ‘’ది వరల్డ్ ‘’పేరిట అతి సాధారణ కవితలు ఇరవయ్యింటిని రాసి ముద్రించాడు . పోలాండ్ రిపబ్లిక్ కు సాంస్కృతిక సంబందాదికారిగా పని చేశాడు . తర్వాత ‘’వెస్ట్’’కు చేరాడు .1953 లో ‘’ది కాప్తివ్ ‘’అనే స్టాలిన్ వ్యతిరేక పుస్తకం రాశాడు .
అమెరికా లోని కాలి ఫోర్నియా యూని వర్సిటి లో ‘’slavik languages and literature ‘’కు ప్రొఫెసర్ గా1961 నుండి 1998 వరకు పని చేశాడు . అమెరికా పౌరసత్వాన్ని పొందాడు .1978 లో ‘’ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిట రేచర్ ‘’ను అందుకొన్నాడు .1980 లో సాహిత్యం లో ‘’నోబెల్ పురస్కారం ‘’పొందాడు .ఆయన బహు భాషా పండితుడు .పోలిష్ ,లిథువేనియన్ ,రష్యన్ ,ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో అమోఘ పాండిత్యాన్ని సంపాదించాడు . కాధలిక్ మతం ను స్వీకరించాడు .
1960 లో అమెరికా కు చేరాడు . పోలాండ్ లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం మిలోజ్ పుస్తకాలను నిషేధించింది . రష్యాలో స్టాలిన్ నియంతృత్వం నశించిన తర్వాతా అంటే ‘’ఇనుప తేరా పగల కొత్త బడిన తర్వాత ‘’మళ్ళీ పోలాండ్ చేరాడు .ఇజ్రాయిల్ ప్రభుత్వం “Righteous among the Nationsఅవార్డ్ నిచ్చి గౌరవించింది .ఒక సారిరెండవ పాప్ జాన్ పాల్ టో భేటీ అయితే వారిద్దరి మధ్యా సంభాషణ ఈ రకం గా జరిగింది .. In an 1994 interview, Miłosz spoke of the difficulty of writing religious poetry in a largely postreligious world. He reported a recent conversation with his compatriot Pope John Paul II; the latter, commenting upon some of Miłosz’s work, in particular Six Lectures in Verse, said to him: “You make one step forward, one step back.” The poet answered: “Holy Father, how in the twentieth century can one write religious poetry differently?” The Pope smiled.[16] A few years later, in 2000, Miłosz dedicated a rather straightforward ode to John Paul II, on the occasion of the pope’s 80th birthday.[17]
93 ఏళ్ళ వయసులో 2004 ఆగస్ట్ 14 నస్వంత ఇంటిలో మిలోజ్ మరణించాడు .ఆయన కవితా సంపుటాలు ఇరవై కి పైనే ఉన్నాయి వచన సంపుటులు ఇరవైఆరు ఉన్నాయి . అనువాదం చేసినవీ ఎక్కువే ఽఅయన రచనలు అనేక భాషల్లోకి అనువదింప బడ్డాయి . తనను గురించి ఆయన ”i a faithful son of the black earth ,shall return to the black earth ” అని చెప్పుకొన్నాడు .ంఇలొజ్ కవిత్వం లో కొన్ని ఝలక్ లు
”the rose is only a sexual symbol
so what else is now ?i am not my own friend -time cuts me in two
but she too looked at me as if if i were a ring of saturn
the human heart holds more than speech does
జేస్లోక్ కు కమ్యూనిజం ,జాతీయ సోషలిజం తో సంబంధం ఉన్న వాడు ఱాజకీయ అవగాహన ను కవిత్వంరచన ల ద్వారా తెచ్చాడు .
17-9-2002 మంగళ వారం నాటి నా అమెరికన్ డైరీ నుండి
22-7-13-మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -ఉయ్యూరు

