ప్రముఖ నాటక రచయితఆర్ధర్ మిల్లర్ -4
ఆ నాటి అమెరికా లో బీద వాడి స్తితి ఎలా ఉందంటే అందర్నీ వదిలి కుటుంబం లోను బయటా అందర్నీ గట్టుకోవాల్సిన స్తితి .అన్నీ ఫామిలీ కోసం చెయ్యాలి .భర్తగా కుటుంబం కోసం కష్టపడాలి .కుటుంబ పటిష్టత కు తోడ్పడాలి . అందుకని కుటుంబానికి బానిస గా ఉండి పోవాలి .అదే అతనికి తప్పని స్తితి ,అదీ సంతోషం గా చేస్తాడు .కాని అమెరికా బిజినెస్ మాన్ మాత్రం స్వార్ధ పరుడు కాదు . అతను తనను తానూ అర్పించుకొనే స్వయం సిద్ధుడు .ఈ త్యాగానికి ఎప్పుడైనా ఒక గుర్తింపు రావచ్చు రాక పోనూ వచ్చు .
అమెరికా లో కుటుంబ స్తితి –బలహీన బంధాలతో కుటుంబం ఉండేది .దానికి సాంఘిక చేయూత లేదు .కుటుంబానికి వ్యతిరేకం గా సంఘం ఉండేది .ఇద్దరు వ్యక్తుల సృష్టి యేవారి కుటుంబం ..వారికొకరు తెలియని వాళ్ళు . వేర్వేరు భౌగోళిక పరిస్తితులనుండి వచ్చి చేరిన వారు వారి సాంఘిక స్తితులు కూడా భిన్నమే . వేర్వేరు అభిప్రాయాల వాళ్ళు . పిల్లలు యేవో వేర్వేరు సిటీ లకు వలస వెళ్ళే వాళ్ళు . అంటే ప్రతి విషయం లోను ‘’కంటిన్యుటి’’ లేని స్తితి . ఇవే అమెరికా ఫామిలీ వ్యవస్తను శాసిస్తున్నాయి ఒక వేళ ఆ స్తితి అందుకోలేక పొతే వారిని క్షమించరు . .ఈ అపజయాలనే మిల్లర్ తన కధలకు వస్తువు గా వాడుకొన్నాడు .
అమెరికా అనుభవం అతని రచనకు భూమిక . అది తండ్రి ,కొడుకుల అను బంధం .బంధాలు సడలి పోయే సమయం లో కొడుకు దూరం అవటం ఉంటుంది .తండ్రి అనేక ఒడి దుడుకులతో సతమత మావుతూంటాడు . తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర మనస్పర్ధలు . తండ్రి అవి నీతి పఅరుడు .ఆ అవినీతిని కొడుకు అనేక సమయాల్లో బయట పెడతాడు .అవినీతి విలువలతో తండ్రి జీవితం సాగిస్తాడు .కారణం అదే అతనికి తెలిసిన విధానం . దీనికి ప్రత్యామ్నాయం తెలియని వాడు .
అమెరికా కల ఏమిటో ‘’డెత్ ఆఫ్ ది సేల్స్ మాన్ ‘’నాటకం లో అసలు సమస్య . రాజ్యాంగం ప్రజా రక్షణ చేస్తానని హామీ నిచ్చినా నిలుపుకోలేక పోయింది . వ్యాపారం దెబ్బతిని పోయింది . మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సేల్స్ మాన్ షిప్ పెరిగి పోయింది . .ఇదంతా అవినీతి మాయమై పోయింది .లాభమే పరమావధి గా బతుకులు గడుస్తున్నాయి మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం వస్తువులే అంటే ‘’commadities’’మాత్రమె . మనిషి మనిషిగా పూర్తిగా నశించాడు .ఆతను ‘’BECOMES A COMMADITY HIMSELF .,A SPIRITUAL CIPHER ‘’అయ్యాడు .అంటే పూజ్యం ,పనికి మాలిన వాడు అయి పోయాడు . ఇది మానవత్వానికే సిగ్గు చేటు .పతనానికి పరాకాష్ట . ‘’He sees his personality . this personality became the means to an end namely consummated sale .commercial face ,commercial smile ‘’తో బతుకు లాగుతారు . మనిషి ‘’oily cog in the machine of the sales apparatus ‘’వ్యాపార యంత్రం లో చక్రం యొక్క పన్ను అయి పోయాడు . . దీనితో ప్రవర్తనలో పెద్ద మార్పు వస్తుంది అన్నిటా వైఫల్యమే .కూలి పోతాడు .కుంగి పోతాడు .
కాని మనిషి యంత్రం కాదు .డెత్ ఆఫ్ దిసేల్స్ మాన్ లో సేల్స్మన్ చావు ‘’symbolic of the break down of the whole concept of salesmanship inherent in our society ‘’గా భావిస్తారు .ఇదే అ నాటి లక్షలాది మనుషుల నిస్సహాయ స్తితి .’’హిల్లీ లోమన్ ‘’ఇదులో హీరో .అతడు కింది మధ్యతరగతి యువకుడు.ఆ ప్రాయం వారికి ప్రతినిది .ఇతన్ని గురించి మిల్లర్ ‘’the lovable lower middle class mole to a type of living and thinking which really all of us-professionals as well as salesmen ‘’. అని చెప్పాడు . ఇందులో ‘’stream of consciousness ‘’ఉంది . స్పష్టమైన అ పూర్వక నైతికత కనీ పిస్తుంది .
దిక్రూసిబిల్ నాటిక లో మేకార్ధిజం పై తీవ్ర మైన విమర్శ ఉంది . అంటే ruisonous accusation without any basis in evidence ‘’మొత్తం మీద అమెరికా నాటక కర్తలలో ఓక అద్భుత ప్రయోగ శీల నాటక కర్త ,సమాజ దృక్పధాన్ని మలుపు తిప్పిన వాడు సాటి రచయితల అభ్యున్నతికి వారి నిర్బంధాలను ఎదిరించి పోరాడిన వాడు గా ఆర్ధర్ మిల్లర్ నిలిచి పోయాడు .మన ఆచార్య ఆత్రేయ తోమిల్లర్ ను పోల్చవచ్చు నని పించింది .
సమాప్తం
21-9-2002 శని వరం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-7-13 ఉయ్యూరు

