లెసన్ బిఫోర్ డైయింగ్
ఎర్నెస్ట్ జే..గ్రైన్స్ రాసిన నవల ‘’ఏ లెసన్ బిఫోర్ డైయింగ్ ‘’.ఒక నల్ల జాతి కుర్రాడి మరణ శిక్ష మీద కదా .హత్య చేసినట్లు ఒప్పుకోడు . వర్జిన్ అనే ప్రొఫెసర్ వాడికి చాలా ధీమా గా గర్వం గా చావటం గురించి చాలా కాస్త పది నేర్పుతాడు . వాడిని మనిషి గా మార్చాలని తాపత్రయం .చివరికి సాధిస్తాడు ‘’simple heroism of resisting and defying ‘’నేర్పిస్తాడు .తనకు ఉరి శిక్ష పడే ముందు ఆ కుర్రాడు ప్రొఫెసర్ కు తనలో వచ్చిన మార్పు గురించి వివరం గా ఉత్తరం రాస్తాడు .ఈ పుస్తకం గురించి‘’the book will be read ,discussed and taught beyond the rest of the lives ‘’అని ఈ నవల గురించి చికాగో ట్రిబ్యూన్ కితాబు నిచ్చింది .చదివి తప్పక అర్ధం చేసుకోవాల్సిన పుస్తకం..
కేసు విచారణ లో అటార్నీ అనేక విషయాలు తెలుసు కొంటాడు .కుటుంబాన్ని విచారిస్తాడు .ఆఫ్రికన్ అమెరికన్లు చీకటి లో మగ్గుతున్నారని వారికి చదువు నేర్పాల్సిన అవసరం ఉందని గ్రహిస్తాడు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ,సివిల్ రైట్స్ పొందక ముందున్న ఈ జాతి వారి ని ఏంటో అభి వృద్ధి పరచాల్సిన అవసరం ఉందని తెలియ జేస్తాడు .కుటుంబం లోని వారి కోర్కెలను తీర్చటానికి ,వారి అసంబద్ధ కోర్కెలను నేర వేర్చతానికి ఈ కుర్రాడు తీసుకొన్న నిర్ణయాలు చేసిన అసాంఘిక కృత్యాలు వాడి మెడకు ఉరి తాళ్ళను పెనాయి అని నిర్ణయిస్తాడు .మానవ హృదయం టో వాడి నేపధ్యాన్ని గుర్తించాలని కోర్టుకు నివేదిస్తాడు .
జెఫర్సన్ ను మానవ మాత్రుడిగా మార్చటానికి గ్రాంట్ అనే మాస్టారు చేసిన ప్రయత్నం అంటా ఇందులో కనీ పిస్తుంది .అందుకే దీని శీర్షిక చాలా ప్రాముఖ్యత పొందింది . ఇందులో సింబాలిక్ గా చివర వచ్చే సీతా కోక చిలుక ఇద్దరిలో వచ్చే పరి వర్తనకు సాక్షయం .గా నిలుస్తుంది . జెఫర్సన్ చావుకు ముందు ఒక సత్యాన్ని గ్రహించాడని ఒక పాతం నేర్చుకోన్నాడని తెలుస్తుంది . జెఫర్సన్ లోని పిరికి తనం పోయిందని గ్రహిస్తాడు .తనతో బాటు సమాజం లో ఉన్న తెల్ల జాతి వారు నల్ల జాతికి చెందినా ఈ కుర్రాడి మరణం ఒక గుణ పాఠంగా గ్రహించి వారి హక్కుల కోసం ,వారి సౌకర్యాలకోసం విద్యకోసం సహకరించాలి అని ఒక కర్తవ్య బోధ ఉంది . అందరు చదివి తెలుసుకోవాల్సిన కద ఇది .
21-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-13 -ఉయ్యూరు

