సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో

సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో

    ‘’all my work is meant to say ‘’you may encounter many defeats ,but you must not be defeated ‘’అనేదినల్ల జాతి  మహా రచయిత్రి మాయా  యాంజేలో నినాదం .ఆ స్పూర్తితోనే ధ్యేయం తోనే గడిపింది . అంతే కాదు అడ్డు అయ్యే ప్రతి సమస్య ఒక సవాలై ఒక అనుభవమై జీవిత పురోగతికి తోడ్పడుతుందని చెప్పింది .దీని వల్ల వైవిధ్య దృక్పధం కస్ట సహిష్ణత వస్తాయని నమ్మింది .తన జీవిత రేఖను ‘’fighting defeat ‘’గా అభి వర్ణించింది . ఆరడుగుల అందహీను రాలు యాంజేలో . కవి రచయిత్రి ,నాటక రచయితా ,ఎడిటర్ ,పెర్ఫార్మర్ ,సింగర్ ,ఫిలిం మేకర్ ,డాన్సేర్ ,టి.వి.పెర్సనాలిటి,విద్యా వేత్త ,ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన సకల కళా సరస్వతి . ఒక రకం గా కొంత వరకు మన భానుమతి అన వచ్చు 

250px-Angeloupoem

 

        అమెరికా లోని మిస్సోరి లో 1928 ఏప్రిల్ నాలుగున జన్మించింది . తండ్రి వదిలేసి పోయాడు .తల్లి ఇంకోడితో సంబంధం పెట్టుకోంది . అప్పుడు కు క్లు క్లాక్స్ ఉద్యమం తీవ్రం గా ఉండేది . నిరాశామయ జీవితం .అంతశ్శక్తితో గౌరవం గా జీవించాలని నిశ్చయించు కొంది..కాని విధి వంచిత అయింది .తల్లి బాయ్ ఫ్రెండే ఈమెను ఎనిమిదేళ్ళ వయసులో రేప్ చేశాడు .అది ఆమెకు దిక్కు తోచని స్తితి అవమానకరం . తాతమ్మ దగ్గరకు చేరింది గత్యంతరం లేక . జరిగిన చెడు అనుభవానికి నాలుగేళ్ళు మౌన వ్రతం పట్టింది . ‘’బెర్త్ ఫ్లవర్స్ అనే ఆమెతో పరిచయం కలిగింది . కధలు ,పుస్తకాలు చదవమని ఆమె చెప్పిన హిత బోధ పని చేసి నిరంతర పుస్తక వ్యాసంగం లో మునిగింది .

    1941 లో చెల్లెలి తో మళ్ళీ తల్లిని చేరింది . స్కూల్ లో చేరి డాన్స్ డ్రామా ప్రాక్టీస్ చేసేది . ఒక అనాధ శరణాలయం  లో కొంత కాలం ఉంది . ఇక్కడ ఉండటమే తన జీవితం లో సహనానికి నాంది పలికిందని గమ్యం ఎర్పరచుకోవటానికి మార్గమేర్పడిందని చెప్పింది . సిటి బస్ కండక్టర్ గా ఎంపికైంది ఈమెయే మొట్ట మొదటి లేడీ బస్ కండక్టర్ . తానూ పరిణతి చెందలేదని ,స్త్రీత్వం పూర్తిగా రాలేదని గ్రహించింది . ‘’లేస్బియాన్ ‘’గా ఉన్నానేమో అనే సందేహమూ కలిగింది . ఈ సందేహం తీర్చుకోవటానికి తనతో చదివే కుర్రాడిని పిలిచి సెక్స్ లో పాల్గొంది .కడుపోచ్చి పిల్లాడు పుట్టాడు . వాడికి గే జాన్సన్ అని పేరు పెట్టింది .

    .తల్లి దగ్గర తన కొడుకును వదిలి ఉద్యోగాన్వేషణ చేసింది మాయా . వంటపని వైట్రేస్స్ పని చేసింది . భుక్తి కోసం వేశ్యా వృత్తినీ చే బట్టింది . మళ్ళీ తల్లిని చేరింది మాదక ద్రవ్యాల అమ్మకమూ చేసింది . తానిన్ని పనులు చేస్తున్నా చంద్రుని కాంతి లా స్వచ్చమైన దానినే నని బతక టానికి చేసిన పనులే ఇవని అంటుంది . తర్వాత సేల్స్ క్లార్క్ గా పని చేసింది  శాన్ఫ్రాన్సిస్కో లో  అక్కడ తెల్ల జాతి వారితో పరిచయమేర్పడింది . తోష్ అనే అమెరికన్ గ్ర్గ్రీక్ తోపరిచయం, పెళ్లి అయ్యాయి .వాడు ఈమెను వంటింటికే పరిమితం కావాలని శాసించాడు.వాడికి దేవుడి పై నమ్మకమూ లేదు . ఈవిడ చర్చికి వెళ్తుంటే వద్దనే వాడు .కలహాల కాపురం . రెండేళ్ళ తర్వాత విడాకులు .

         నైట్ క్లబ్ లో డాన్సర్ గా,సింగర్ గా చేరింది . పేరును మాయా యాన్జేలూ నుంచి ‘’మాయా యాంజేలో ‘’గా మార్చుకోంది .ఈ పేరు క్లిక్ అయింది . కధలు రాయటం ప్రారంభించింది . న్యు యార్క్ చేరింది . అక్కడి రైటర్స్ గిల్డ్ లో చేరింది . ‘’the heart of a woman ‘’ రాసింది . వరుసగా ది. ఫైర్,నెక్స్ట్ టైం లు రాస్తే మంచి ప్రోత్సాహమే లభించింది . దియేటర్ లో పని చేసింది అక్కడే నల్ల జాతి హక్కుల పోరాట నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తోపరిచయ మేర్పడింది . ఆయన ఉద్యమం పై తీవ్ర ఆసక్తి చూపి దాని కోసం ఒక బెనిఫిట్ షో నిర్వహించింది . 1960 లో ‘’make ‘’ అనే సౌత్ ఆఫ్రికన్ తోపరిచయమై దక్షిణాఫ్రికా కు అతనితో వెళ్ళి,పెళ్లి చేసుకోంది . .అక్కడ నాటకాలలో వేషాలు వేసి మంచి పేరు ,ప్రఖ్యాతి పొందింది .ఇది వాడికి నచ్చలేదు . వాడు ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొన్నాడు . ఇదేమిటి అని ఈమె ప్రశ్నిస్తే అది తమ ఆచారం పొమ్మన్నాడు . పేచీలు , విడాకులు .

        ఈజిప్ట్ చేరుకొంది . ‘’ఆరబ్ అబ్సర్వర్ ‘’లో పని చేసింది . రేడియో లో ఉపన్యాసాలిచ్చింది . 1961 లో కొడుకు తో ఘనా చేరింది . నాలుగేళ్ళు అనేక పత్రికలకు ఆర్టికల్స్ రాసింది .గుర్తింపు లభించింది . ఘనా అధ్యక్షుడు ‘’నుక్రుమా ‘’తో పరిచయం కలిగింది . ఘనా వాళ్లకు బ్లాక్ అమెరికన్లు అంటే ఇష్టం లేదు . మళ్ళీ కాలిఫోర్నియా చేరింది . కధలు ,పాటలు పద్యాలు రాసింది . టి.వి.సిరీయల్స్  లో పాల్గొంది .1969 లో ‘’the poetry of Mayo ‘’ విడుదల చేసింది . కాన్సాస్ యూని వెర్సిటి లో ఫెలోషిప్ సాధించింది . ‘’I know how the caged bird sings ‘’ అనే తన స్వీయజీవిత  చరిత్ర రాసుకోంది .. మొదటి భాగాన్ని చదివిన బాల్డ్విన్ అనే విమర్శకుడు ‘’her portrait is biblical study of life in the midst of death ‘’అని గొప్ప గా ప్రశంషించాడు .

    1971 లో ‘’give me a cool drink before I die ‘’,కు పులిట్జర్ బహుమతి వచ్చింది .1972 లో ‘’జార్జియా జార్జియా‘’సినిమాకు స్క్రీన్ ప్లే రాసింది . అమెరికా సాహిత్య చరిత్రలో మొదటి నల్ల జాతి స్త్రీ రాసిన స్క్రిప్ట్ అది .మూడో సారి ‘’పాంట్ ‘’అనే వాడితో పెళ్లి . 1974 లో విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .1976 లో ‘’all day long ‘’రాసింది .,roots ‘’సినిమా లో ‘’కిటా కింటే‘’పాత్ర లో గ్రాండ్ మదర్ గా నటించింది ..1981 లో the heart of a woman ‘’కు మంచి పేరొచ్చింది . తన జీవిత చరిత్రలో అయిదవ భాగానికి ‘’all god’s children need traveling shoes ‘’అని పేరు పెట్టింది . ఇది బాగా క్లిక్ అయింది .

     1093  లో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ స్వీకర ప్రమాణం చేసినప్పుడు మాయా ను ఆహ్వానించి కవిత చదవమని కోరాడు . ‘’on the pulse of morning ‘’అనే కవితను చదివి సార్ధకత తెచ్చింది . ఇప్పటికీ ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప కవిగా మయా యాంజేలో కు గుర్తింపు ఉంది . ఆమె రచనలను విశ్లేషిస్తూ ‘’though Maya’s work is personal ,she aspires to be universal ‘’అని శ్లాఘిస్తారు . ఆఫ్రికన్ అమెరికన్ మహిళ గా జన్మించి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని జంకు లేకుండా ధైర్యం తో   తన ధ్యేయాన్ని సాధించి వివిధ రంగాలలో తన బహుముఖ ప్రావీణ్యతను నిరూపించిన నల్ల జాతి వజ్రం మాయా యాంజేలో .

   28-9-2002 శని వారం నాటి నా అమెరికా డైరీ నుండి

     మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-13- ఉయ్యూరు 

 
 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.