అమెరికా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ –1
అమెరికా లో పాత దారిలో నడిచే నాటకాలకు కొత్త జవం ,ఉత్తేజితం చేసిన వాడు టెన్నిసీ విలియమ్స్ .అసలు పేరు థామస్ లేనియర్ విలియమ్స్ .1911 మార్చ్ ఇరవై ఆరున మిసిసిపి లోని కొలంబస్ లో పుట్టాడు .దీనినే ‘’హార్ట్ ఆఫ్ అమెరికన్ సౌత్ ‘’అంటారు . అతని గురించి ఒక్క మాటలో ‘’williams acquired a great taste for light ladies and a heavy drinker ‘’అని చెప్పేస్తారు . తల్లి ఎద్వినా .కుటుంబం అంతా ‘’ మెంటల్ నెర్వస్ డిసార్దర్ ‘’ తో బాధ పడిన వాళ్ళే . తల్లికీ అదే జబ్బు . చిన్నప్పుడే డిఫ్తీరియ ,కాళ్ళకు పక్ష వాతం వచ్చాయి విలియమ్స్ కు . తండ్రికి నికరాదాయం లేనందున పదేళ్ళలో పదహారు సార్లు కుటుంబం వేరు వేరు చోట్లకు మారాల్సి వచ్చింది
బాధలు మరవటానికి తాగుడు అలవాటై బానిసే అయి పోయాడు . చెల్లెలు రోజ్ గ్లాస్ తో చేసిన చిన్న జంతువుల బొమ్మలను సేకరించేది హాబీగా . హేజల్ అనే అమ్మాయి తో పరిచయమేర్పడింది . సినిమాలు కధలు ,కవితలు టో చదువు అటకెక్కింది . ‘’can a good wife be a good sport ‘’?అనే అంశం పై వ్యాసం రాస్తే మొదటి బహుమతి వచ్చింది ‘’.the vengeance of nitocris ‘’కధలు ‘’స్మార్ట్ ‘’పేపర్ కు రాశాడు ప్రచురితమైనాయి .1928 లో తాత తో కలిసి యూరప్ పర్య టిం చాడు .రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా ‘’he was struck with an overwhelming fear othat by his own account pushed him within a hair breadth of going quite mad ‘’అని పించింది అప్పుడే ఆలోచనలలో ఫోబియా వచ్చింది . భరించ లేని భయం ఆవహించింది . అనుకోకుండా మతం పై అచంచల విశ్వాసాం మిరకిల్ గా ఏర్పడి పోయింది .యేసు క్రీస్తు తన తలపై చెయ్యి వేసి ఒడార్చుతున్నట్లు గా అని పించింది . అందుకే విలియమ్స్ రచనలలో ఎస్స్తేతిక్ సెన్స్ ఎక్కువ గా కనీ పిస్తుంది .
1929 లో కొలంబియా యూని వర్సిటి లో చేరాడు జర్నలిజం తీసుకొన్నాడు .’’beaty is the word ‘’,’’hot milk at three in the morning ‘’అనే రెండు నాటకాలు రాశాడు . ఆదాయం ఏమీ లేదు .తర్వాతా చెప్పుల కంపెని లో పని చేశాడు .అక్కడి దుర్భర పరిస్తితి ‘’it was designed for insanity –it was a living death ‘’ అని పించింది . తనను ప్రేమించిన హేజేల్ వేరేవరినో పెళ్ళాడింది .దీంతో మెంటల్ వచ్చింది .ఉద్యోగం ఊడింది .మెంఫిస్ కు వెళ్లి కోలుకొన్నాడు ‘’. kairo shaanghai Bombay ‘’ అనే ఏకాంకిక రాశాడు 1936 లో సెయింట్ లూయిస్ చేరాడు .రచయిత కావాలనే సంకల్పం పెరిగింది . అక్కడ’’ Mc Burney ‘’అతని literary factory ‘’తో పరిచయ మేర్పడింది . యుద్ధ వ్యతిరేక భావజాలం తో ‘’హెడ్ లైన్స్ ‘’రాశాడు ‘’the fujitive kind ,’’candles to the sun ‘’నాటికలు రాస్తే మంచి పేరే వచ్చింది . విర్శకులు విలియమ్స్ ప్రతిభను గుర్తించారు . డిగ్రీ పూర్తీ చేయకుండానే యూని వర్సిటి నుండి బయటికి వచ్చేశాడు .
‘’Iowa university ‘’లో చేరాడు .బామ్మ డబ్బు సాయం చేసింది .మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటే ఆస్పత్రిలో చేరాడు .scizo phernia ‘’వచ్చి ‘’the frantal lo botomy ‘’ఆపెరేషన్ చేశారు 1938 లో డిగ్రీ పొందాడు .1939 లో డ్రామా పోటీలలో ‘’అమెరికన్ బ్లూస్ ‘’నాటిక రాశాడు పేరును ‘’Tennesse ‘’గా మార్చుకొన్నాడు . అప్పుడే ఆండ్రి వుడ్ తో పరిచయం కలిగింది .జీవితాంతం పెర్సనల్ మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చాడు రచనలు చేయటానికి సహాయం గా అమెరికా కోటీశ్వరుడు రాక్ ఫెల్లర్ నుండి వెయ్యి డాలర్లు అందాయి .1940 లో న్యూయార్క్ చేరాడు .’’battle of angels ‘’నాటకం రాశాడు .న్యూయార్క్ లో ప్రదర్శిస్తే ఫెయిల్ అయింది . ఎడమ కంటికి నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది పాపం . 1943 లో M.G.M. కు వారానికి రెండొందల యాభై డాలర్ల జీతం మీద పని చేశాడు అ తను రాసిన డైలాగ్స్ నచ్చక వదిలేశారు . అప్పుడే అతని ప్రసిద్ధ ‘’the glaas menagerie ‘’నాటకం రాయటం ప్రారంభించాడు
29-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –3-8-13- ఉయ్యూరు

