శ్రీ దేవి భండాసుర లో అంత రార్ధం -5
‘’భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షితా –నిత్యా పరాక్రమోపేతా నిరీక్షణ సముత్సుకా ‘’
భండాసుర వదకోసం శ్రీ దేవి ఏమీ చెయ్యాల్సిన పని లేదు ఆమె శక్తి సేనయే ఈ పని చేస్తుంది .వాడి వధకు బ్రహ్మాండ మంతటి సైన్యం పరమేశ్వరికి తోడ్పడుతుంది .
దేశ కాలాల అనంత విస్మృతి నుండే దేశ కాలాతీత శక్తిని సముపార్జిస్తుంది .అగ్ని కుండ మధ్యలో ఉండి సూర్య చంద్రుల ప్రకాశం నుండి పరాక్రమాన్ని పొందుతుంది పరమేశ్వరి .సూర్య ,చంద్ర గతి వల్లనే అనేక కళలు ఆవిర్భావ మవుతాయి .సూర్యుడు చంద్రుడి తో సమ రేఖ మీద ఉన్నప్పుడు చంద్రుడు సూర్య కాంతి లో దాక్కుని పోతాడు .ఇదే అమా వాస్య .తర్వాత చంద్రుడు నెమ్మదిగా సూర్యుడి నుండి వేరవుతూ తన కళలను చూపిస్తాడు .క్రమంగా వికసించి చంద్రుడు సూర్యుని ముందు చేరి తన కున్న పదహారు కళలను వ్యక్తం చేస్తాడు .దీనికే పూర్ణిమ అని పేరు .మానవ మెదడు మీద ,సముద్ర తరంగాల మీద చంద్ర కళల; ప్రభావాన్ని మనం అందరం గ్రహిస్తూనే ఉన్నాం .ప్రతి నెలలో పూర్ణిమ అమావాస్య వస్తాయి .ఈ రెండిటి మధ్య నిత్య దేవతలు మంజుల మంగళ రూపం తో మానవ మనస్సు ను అమృత మయం చేసి ఆనందాన్నిస్తూఉంటాయి .
యుద్ధ రంగం లో శ్రీ దేవి గొప్ప ఉత్సాహం తో యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది పరమేశ్వరి ముద్దుల కూతురు ‘’బాల ‘’కూడా యుద్ధ రంగానికి చేరుకొంటుంది .ఆమె భండాసురునికి ఉన్న 32 మంది కొడుకుల్ని వధించే సింది .వాడి సర్వ సైన్యం క్షణం లో రూపు మాసి పోతుంది .శ్రీ బాల చేసిన ఈ అద్భుత కార్యాన్ని మాత శ్రీ దేవి ప్రశంసించే లోపలే మంత్రిణీ , వారాహీలు భండాసుర మిత్రులైన విషంగ ,విశుక్రులను హత మారుస్తారు .ఈ భీషణ యుద్ధం లో తనకు అండగా నిలవ మని పరమేశ్వరి భర్త కామేశ్వరుని ముఖం నుండే ప్రేరణ పొందుతుంది .వెంటనే విఘ్నేశుడిని సృష్టిస్తుంది .పరమేశ్వరి పవిత్ర గాధకు శ్రీ గణేశుని తో శ్రీకారం జరుగుతుంది
‘’భండ పుత్రా వధోద్యుక్త బాలా విక్రమ నందితా –మంత్రిణ్యంబా విరచిత విషంగా వధ తోషితా ‘’
విశుక్ర ప్రాణ హరణ వారాహీ వీర్య నందితా –కామేశ్వర ముఖా లోక కల్పిత శ్రీ గణేశ్వరా’’
శ్రీ మాత విజయం ఆత్మ వైభవ గాధయే .భండాసుర వధ అంటే అజ్ఞాన ,అత్యాచార అహంకార నిర్మూలనమే .నశ్వరం అయింది నశించే దాకా అవినశ్వరం ఆవిర్భావం కాదు .శ్రీ మాత శక్తి ఆత్మ శక్తియే అనిశ్వరమైంది భండాసురుని శక్తి ,పరాక్రమాలు పార్దివమైనవి నశించేవి .శ్రీ మాత కుమార్తె శ్రీ బాల వాడి ముప్ఫై మంది పుత్రులని క్షణం లో భస్మం చేసే సింది .దీని తో ఆత్మ సేన కు ధైర్యం ప్రేరణా కలిగాయి . వాడి సంతానం నశిన్చాగానే మిత్రులైన విషంగ ,విశుక్రులు విజ్రుమ్భించారు .వీరిని మంత్రిణి ,వారాహి దేవతలు వధించేశారు దీనితో వాడి పరాజయం పరమేశ్వరి విజయం ప్రారంభ మైంది .
పరమాత్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి ఆత్మ వైభవం తెలియని విషంగ ,విశుక్రులు నిష్ప్రయత్నానికి ,నిర్వీర్యతకు ప్రతీకలు .విషంగుడు అంటే తనంతటి వాడు లేడని మదం తో అహంకరించే ప్రాణి .వాడికి ఆత్మ స్వరూపం తెలియదు .వాడికి సత్సంఘం అంటే తెలియదు అందుకే విషంగుడైనాడు .సాధారణం గా సంసార జీఎవితం పట్ల అనాసక్తి రెండు రకాల కారణాల వాళ్ళ కలుగుతుంది స్వార్ధం వల్ల ,పరమార్ధం వల్లా కూడా అనాస క్తి వస్తుంది ఇంద్రియా సక్తుడై విషయ లంపటం లో ఉన్న మనిషి ఈ శరీరాన్ని గురించే ఆలోచిస్తాడు .లౌకిక సుఖం కోసం డబ్బు కావాలని అర్రులు చాస్తాడు .ఇది వ్యక్తీ గత స్వార్ధం దీని వల్ల మనిషి విషంగుడ వుతాడు .సర్వ సంగ పరిత్యాగి అయినా యోగి ఆత్మానందం కోసమే అన్వేషిస్తాడు మిగిలిన వన్నీ అతనికి తుచ్చాలు నీచాలు ,.మొదటి వాడిది స్వీయ ఆనందం ఇతనిది విరాట్ భావం అంటే సర్వ ప్రపంచం ఈ యోగికి ఆనంద మయం గా కన్పిస్తుంది .మొదటి వాడిది అసంపూర్ణమే కాక ప్రమాదం కూడా .ఇదే విషంగుడి ఆనందం .ఇదే పరామేశ్వరికి ఇష్టం లేని విషయం .క్షుద్ర ఆనంద నిరాకరణమే విషంగ వధ లో అంత రార్ధం .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-13 ఉయ్యూరు

