విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1

భారత దేశం అనాది నుంచీ శాస్త్రాలకు కళలకు పెట్టింది పేరు ఎందరో వీటిపైపై కృషి చేసి ప్రతిభ చాటి దేశ విదేశాల లో కీర్తి పొందారు .కాని చాలా మంది ఈ నాటి వారికి మన వాళ్ళు శాస్త్ర సాంకేతికాలలో కూడా గణ నీయ మైన అభి వృద్ధి సాధించారని తెలియదు ఇది నిజమా అనుకొనే స్తితి ఖగోళ,విజ్ఞాన శాస్త్ర ,గణిత ఆయుర్వేద,శస్త్ర ,భూ విజ్ఞానశాస్త్రాలలో అపార మైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి అన్నిటా తామే ప్రధములని పించుకొన్నారు ..ఆలాంటి పూర్వ శాస్త్రజ్ఞులను పరిచయం చేయటానికే ‘’విజ్ఞులైన అలనాటి మన శాస్ట్రజ్నులు’’శీర్షిక లో ధారా వాహిక గా అంద జేస్తున్నాను . ముందుగా గణిత శాస్త్రం దాని పై కృషి చేసి న వారిని గురించి వివరిస్తున్నాను

గణిత శాస్త్రం

ప్రాచీనుల దృష్టిలో గణిత శాస్త్రం అంటే అంక ,బీజ ,రేఖా ,ఖగోళ ,భూగోళ శాస్త్రాలన్నీ కలిసి ఉన్నదే .లెక్కలను ఇసుక మీద ,లేక బూడిద మీద చేసే అలవాటు అనాదిగా మనకు ఉంది .దీనికే  పట్టిక  లేక బల్ల మీద చేసే వారు అందుకని వీటికి ధూళి కర్మ అని పట్టిక గణితం అని పేర్లు ఉండేవి .ప్రాచీన గణిత శాస్త్రం లో రెండు దశలున్నాయి .క్రీ శ400-1200 వరకు వేద గణితమే మొదటి దశ ఏడవ శతాబ్దం లో వచ్చిన రేఖా గణితం రెండవ దశ .వేద గణిత కాలం లో అంక ,బీజ గణితాలు చాలా ప్రాధమిక దశ లోనే ఉండేవి .వేద కల్ప సూత్రాలలో సుల్బ సూత్రాలున్నాయి .ఇందులో యజ్న వేదికల్ని ఏ రూపం లో నిర్మించాలో ఉంది .త్రిభుజాలు ,వృత్తాలు దీర్ఘ చతురస్రాల వైశాల్యానికి సమానమైన వైశాల్యం తో చతురశ్రాలను నిర్మించే విధానం వివరించారు .చతురస్ర వైశాల్యాన్ని తేలిగ్గా లెక్క గట్టె వారు .క్రీ .పూ.కి చెందిన తైత్తిరీయ ,సత్పద బ్రాహ్మణాలలో ఈ లెక్కలన్నీ కనీ పిస్తాయి .గ్రీకు  గణిత  శాస్తజ్నుల కంటే ముందే మన వాళ్లకు ఈ గణితం కరతలామలకం అంటే ఆశ్చర్య మేస్తుంది .

క్రీ.శ.ఏడవ శతాబ్దానికి చెందిన బ్రహ్మ గుప్తుడు అనే భారతీయ రేఖా శాస్త్ర వేత్త రేఖా గణితం లో అద్వితీయ అభి వృద్ధిని సాధించాడు .చక్రీయ చతుర్భుజ వైశాల్యాన్ని వికర్నాన్ని కనుగొన్నాడు .ఇప్పుడే అంక ,బీజ గణితాలలో  కూడా మన వాళ్ళు ముందున్నారు .మన వాళ్ళు హిందూ –అరెబిక్ సంఖ్యా పధ్ధతి అని అందరు చెప్పే రేఖా గణితం తో సహా అన్ని గణిత శాస్త్ర విభాగాలలో అద్వితీయ ప్రతిభ చూపి మార్గ దర్శకులయ్యారు .ఒక్కొక్క అంకెకూ ఒక్కొక్క స్థానవిలువ నిచ్చి దాని అధ్యయ నానికి శిక్షణకు వీలు కల్పించారు సామాన్యులకూ గణితాన్ని చేరువ అయ్యేట్లు చేశారు .ప్రసిద్ధ రోమన్ సంఖ్యా పధ్ధతి కంటే ఇది చాల తేలిక పధ్ధతి అయింది .రోమన్ పద్ధతిలో హెచ్చవేత భాగహారాలు చేయాలంటే తాతలు దిగి వస్తారు .

‘’ సున్నా ‘’ను కనుక్కొని ప్రపంచానికే మన వాళ్ళు మహోపకారం చేశారు .వర్గ ,ఘన మూలాలను(స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ) మన వాళ్ళే అందరి కంటే ముందే కనుక్కున్నారు .దాదాపు అందరు ఇప్పుడు ఇదే పద్ధతిని ఉపయోగించటం మనకు తెలుసు .ప్రాచీన గణిత శాస్త్రాలలో కనిష్ట ,సామాన్య భిన్నాంకాలు ,సరళ వడ్డీ ,చక్ర వడ్డీ త్రివిధ నియమం .మిశ్రమాలు మొదలైన అనేక సమస్యలను చర్చించారు .త్రివిధ నియమం మన దేశం లోనే పుట్టింది .మొదటి ఆర్య భట్ గ్రందాలలో దీన్ని గురించి ఉంది .తొమ్మిది సంఖ్యలని తీసేసి లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకొనే పద్ధతి మన దేశం లోనే ప్రారంభ మైంది .

వ్యాపార ,వాణిజ్య రంగాలలో లెక్కల అవసరం పెరిగింది .కనుక గణితాన్ని అభి వృద్ధి చేయాల్సిన అవసరం ఎక్కు వైంది .చిక్కు లెక్కలు ,నోటి లెక్కలు పది మందీ కూర్చుని సరదాగా చేసే వారు .అలాగే పజిల్స్ ను కూడా చేదించే వారు .మన వారిలో గణితాన్ని బాగా అభి వృద్ధి చేసిన వారిలో మొదటి ఆర్య భట్టు ప్రధముడు .క్రీ.శ.499 లో ఆయన రాసిన ‘’ఆర్య భటీయం ‘’లో బీజ గణితానికి చెందిన అనేక సమస్యలను ఎలా పరిష్కరించాలో రాశాడు .సంసమ్మేషన్  ఆఫ్ సిరీస్ ,అరిత్ మెటికల్ ప్రోగ్రేషన్స్  ,చతురస్రాలు ఘనాలు ,పెర్ముటేషన్ ,కాంబి నేషన్స్ గురించి భట్టు విస్తృతం గా చర్చించాడు .ఇవే భావితర శాస్త్రజ్ఞులకు మార్గ దర్శకాలైనాయి .క్లిష్టమైన అనేక బీజ గణిత సమస్యలను ఆర్య భట్ పరిష్కరించాడు .ఏడవ శతాబ్దం వాడైన బ్రహ్మ గుప్త గణిత వేత్త మైనస్ లతో సున్నా లతో లెక్కలు ఏ విధం గా చేయ వచ్చో తెలియ జేసి సూత్రాలు రాశాడు .పన్నెండవ శతాబ్దికి చెందిన భాస్కరాచార్య ఒక ‘’రూట్ సెట్’’ తెలిస్తే ,మిగిలిన అంకెలని యెట్లా కనుక్కో వచ్చో కనీ పెట్టాడు

స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ లో ప్రాచీన మ్యూజియం ఉంది అందులో ‘’కోడెక్స్ విజి లెన్స్ ‘’అనే పురాతన గణిత గ్రంధం ఉంది .ఇది యూరప్ దేశస్తులకు పరమ ప్రామాణికం .అందులో మొదటి అధ్యాయం లోనే గణిత శాస్త్రం లో భారతీయ మేధా సంపత్తిని అనేక విధాలుగా ప్రస్తుతించారు .దీని వల్లనే ఆ తర్వా అందురూ మన గణిత విజ్ఞానాని ప్రశంశించటం ప్రారంభించారు .తొమ్మిది అంకెల గణనం ,సున్నా యొక్క సాంకేతిక అవసరం ,దశాంశ పద్ధతి ,వృత్త పరిధికి ,వ్యాసానికి నిష్పత్తిని తెలిపే ‘’పై ‘’(22/7 )విలువ ,మొదలైన విశేషాలను శతాబ్దాలకు పూర్వమే మన భారతీయ గణిత శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు .ఆర్య భట్ ‘’పై విలువ ‘’ను3.1416గా నిర్ణయించి చెప్పాడు .భాస్కరుడు గణితం లో ఉన్న ఎనిమిది మౌలిక భావాలను విస్తరించి చెప్పటం ,ఆపస్తంభుడు బోదాయనుడు ,బ్రహ్మ గుప్తుడు రెండవ భాస్కరాచార్య ‘’అవ్యక్త గణితం’’పేరుతోబీజ గణితాన్ని ఆవిష్కరించి విస్తరించటం మన వాళ్ళే చేశారని చెబితే నమ్మ లేని నిజాలను కొనే వారుండే వారు ఇప్పుడా పరిస్తితి లేదు అందరు గట్టిగా మనమే  దీని పురోగతికి మార్గ దర్శనం చేసింది అని ఊరూ వాడా ఎలుగెత్తి చాటు తున్నారు .

దీని తర్వాతరేపటి నుంచి  అలనాటి గణిత శాస్త్రజ్ఞుల గురించి వరుసగా తెలుసు కొందాం

ఈ ధారా వాహిక కు ఆధారం’’ శ్రీ వాసవ్య ‘’రాసిన ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’మరియు వీకీ పీడియా

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13-ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1

  1. మెరు వ్రాసింది తెలిసిందే.పాశ్చాత్యులు కూడా గణిత,ఖగోళ,వైద్య శాస్త్రాల్లో మన ప్రాచీనులు ప్రావీణ్యం గడించారని అంగీకరించారు.కాని కొంత పురోగతి తర్వాత శాస్త్రీయ అభివృద్ధి ఆగిపోయింది.16,17,18 శతాబ్దాల్లో వారు ముందుకు దూసుకుపోయారు.మన మేధావులు ,ప్రభువులు కళలను ఆదరించారుగాని,సైన్సుని పోషించలేదు.అందువలన మనం సాంకేతికంగా వెనుకబ్డిపోయాము.మళ్ళీ,19,20,శతాబ్దంలలో బ్రిటిష్వారి నూతన విద్యావిధానం వలన సైన్సులో పురోగమనం క్రమంగా సాగించగలుగుతున్నాము.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.