గేటు దగ్గర
- – పి.శ్రీనివాస్ గౌడ్ 9949429449
- 26/01/2015

గేటు దగ్గర-
పొగ మంచులా
బతుకు భారం
గేటు పడాలని..
గేటు పడకూడదని
ఎవరి తొక్కిడి వారిది
ఒకడికి గేటు తీస్తే-
నోట్లో ముద్ద
నేల రాలినట్టు
ఒకడికి గేటు వేస్తే-
అందే ద్రాక్ష
పుల్లనవుతున్నట్టు
ఒకేపు చిరువ్యాపారులు-
మరోవైపు వాహనదారులు
జీవన ఘర్షణ
రైలెళ్లిపోతోంది-
తాపత్రయాలు
చప్పబడుతాయి
గమనం సాగుతుంది-
పిట్టలన్నీ
తలో దిక్కు
ఒక్కోసారి
గేటు పడుతుండాలి-
జీవితం కళ్ళబడుతుంది
ఒక్కోసారి
గేటు తీసుండాలి
జీవితం తుళ్లిపడుతుంది
గేటు ఒక ప్రతీక
హెచ్చరిక..
ఆగి, మెల్లిగా, సాగడానికి…
నిశ్శబ్ద రాత్రిలోకి..
- – బి.కళాగోపాల్, 9441631029
- 26/01/2015

అన్ని శబ్దాలు నిశ్శబ్దంలోకి ఆవాహన అయ్యాక..
దిగులు తరకలా ఒంటిమీదినుండి
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన కొత్త బొమ్మ నాదేమోనని
ఆయాస ప్రయాసలలో కాలం నన్ను
కొండ చిలువై మింగేస్తోంది!
మిగిలిన క్షణాలను బతికిన క్షణాల్లోకి ఒంపుకుంటూ,
ది థింకర్లా ఎనే్నళ్లని? ఎన్నాళ్లని
అట్టానే నిరీక్షించనూ?
చూశావా సోక్రటీసు నిర్భీతి ఆత్మపరాగం
మృత్యుకళికలోకి..
వివర్ణ వర్ణమేదో కన్నులముందు
అగరొత్తుల పొగను వెలిగించింది
ఇల్లు వాకిలి, ఆలుబిడ్డలను వదలి
బుద్ధుని జ్ఞాన సమాధిలోకి..
అత్తరు పరిమళాల్లో నిద్రిస్తున్న
మరో మెహంజదారో
కుటీర వాటికలోకి పయనమవుతున్నా!
ఏం జరుగుతుంది పిమ్మట?
రోములస్ శకమేదైనా
ప్రారంభమవుతుందనుకున్నావా?
వెర్రివాని నవ్వులా జనం లోలోన
విరగబడి నవ్వుతూ…
పైకి మాత్రం ఉదాసీన ముఖాల ముసుగేసుకొని,
నాలుక చివరన వ్రేలాడే మాటల్లో
చివరి కన్నీటి చుక్కను జారుస్తారు
అయినా.. నేను మాత్రం అక్షర నక్షత్రమై
విశ్వమహాదర్పణంలో వెలిగిపోతాను!!
పునః పునః అంకురార్పణకై..
ఏ ఊదా
4అలల వాకిట్లో
- – కొమురవెల్లి అంజయ్య 9985411090
- 26/01/2015

సముద్రం వాకిట్లోకి వెళ్లా
సోపతి కలుపుకుందామని
కాళ్లకు పాలనురుగు నీళ్లు
కడుక్కోమన్న అలల హృదయం
నాలుగడుగులు ముందుకేశానా
ధైర్యం చాలని వెనకడుగు
అలల ప్రేమ వడి అందని దరి
నన్ను నేను పరిచయం చేసుకోకముందే
పరిచయ పత్రాలతో అందరి నిరీక్షణ
సముద్రుని ఆతిథ్యం గుండెల్లో ఉద్వేగం
***
కాళ్ల దగ్గర అంబాడుతున్న
చిన్నారులు అలలు
ఉయ్యాలలూగుతున్న బాల్యం కలలు
పొరలు పొరలుగా స్మృతులు, కథనాలు
విచ్చుకున్న తీపి చేదుల ప్రయాణం
తెప్పరిల్లితే కాళ్లకు ఉప్పద్దిన అలలు
కళ్లల్లోంచి జారే నీటి బొట్లు
నలుగురికి పంచడానికి ఉప్పస
దుమారం రేపితే ఉప్పెన
ఆనందాశృవుల ఉప్పందించడానికి
కళ్ల భాషల కదలికలు
కడుపులో కదలని సల్ల
కాయకష్టం తీపి తెల్వని వల
శ్రమ సంగీతం అలజడి రేపకముందే
చెమట జలల్ని ఒడ్డున పడేస్తున్న శరీరం
***
ఆందోళనల సుడిగుండాల్లో
కడుపు కల్లోల సముద్రం
నిద్రపట్టని రాత్రి ‘పగ’లు
ఊహలకందని ఉద్యమాల ధ్వనులు
కాళ్లు చేతులాడనివ్వని అలల జోరు
***
నలువైపులా సముద్రమే
నీటి నడుమ ఉప్పు ద్వీపంలా నేను
సాగర జలాల సమ్మోహన శక్తి
అందని సముద్రం లోతులు
మనిషి చేష్టలు