’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

‘  డాక్టర్ కొలచల సీతారామయ్య గారి జీవితం ,పరిశోధనలు పై  రష్యన్ భాషలో మొదట  సీతారామయ్య గారి పెద్దకూతురు లీలావతి భర్త Ghen Shangin –Berezovsky  రాశారు . దీనిని  ‘’A wreath for Doctor Ramayya ‘’పేరుతొ అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తా తోకలిసి ఇంగ్లీష్ లోకి అనువదించారు ఈ గ్రంధానికి సంపాదకులుగా ఎస్.పి.కే .గుప్తా వ్యవహరించారు .ఇప్పుడు సంపాదకుని మాటలలో మరింత సమాచారం తెలుసుకొందాం .

వెదక బోయిన తీగ

మొదటి సారిగా కొలచల సీతారామయ్య గారి గురించి 1959 లో బెంగుళూరు ఐ .టి. ఐ .మేగజైన్ ఎడిటర్ .డి.వి.ఏం.రావు తాను  తెలుగు భాగం’’ఐ .టి .ఐ. వాణి –అక్టోబర్ –నవంబర్ సంచిక ‘’లో రామయ్యగారిపై రాసిన వ్యాసం పంపగా గుప్తా తెలుసుకొన్నారు .  డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి గుప్తాను సమాచారం పమపమని కోరారు రావు గారు .ఇరవై మూడేళ్ళ తర్వాత 1982లో  ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరిగా మాస్కో వెళ్ళిన గుప్తా రామయ్యగారి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనిపించింది .అక్కడ చాలామంది భారతీయులు ఉన్నా ఎవరికీ రామయ్య గారి గురించిన పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు .1984లో తాష్కెంట్ లో జరిగిన  ఫిలిం ఫెస్టివల్  విశేషాలను రాయటానికి గుప్తా  వేసవిలో ఉజ్బెక్ రాజధానికి మేనెల 31 న వెడుతూంటే ఒక రష్యన్ రచయిత ‘’వ్లాడిమిర్ సుకలోవ్ ‘’గుప్తాను ఆపి కారులో లిఫ్ట్ ఇచ్చి దిగాల్సిన హోటల్ కు చేర్చాడు .ఇద్దరి మధ్య జరిగిన సంభాష ణలో  రామయ్య గారి గురించి ,సోవియట్ లో ఆయన కుటుంబాన్ని గురించి ప్రస్తావన వచ్చింది .సుకలోవ్ తనకు రామయ్య గారి కుటుంబ వివరాలు తెలుసునని ,పెద్దకుమార్తె లీలావతి బాగా పరిచయమేనని చెప్పి ఆమె మాస్కో అడ్రస్ ,ఫోన్ నంబర్ ఇచ్చాడు .వెదక బోయిన తీగ కాలికి తగిలింది గుప్తాకు .గుప్తా కు సుకలోవ్ తో అనుకోకుండా జరిగిన పరిచయం పరిచయం సత్ఫలితాలనిచ్చింది . .సుకలోవ్ తాను రాసిన చిన్ననవల ‘’బర్ఖాన్ ‘’గుప్తాకు కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు .                దర్శనమివ్వని లీలావతి –గుప్తంగా ఉన్న రామయ్య చరిత్ర ను వెలికి తీసిన గుప్తా

గుప్తా తనకు సుకలోవ్ ఇచ్చిన మాస్కో ఫోన్ నంబర్ కు లీలావతికి చాలా సార్లు ఫోన్ చేశాడు .అక్కడ గుప్తా ఉన్న నాలుగేళ్ళలో ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడో లెక్కే లేదు .లీలావతి ని రమ్మని, తండ్రి గురించి వివరాలు చెప్పమనీ చాలా  సార్లు  అర్ధించాడు  .నాలుగేళ్ళలో ఒక్కసారికూడా ఆమె వచ్చి గుప్తాను కలవలేదు .కానీ పోస్ట్ లో ఒక సారి ఒకే ఒక పేజీలో రామయ్య గారిపై ఉన్ననోట్ ను మాత్రం పంపింది .తర్వాత రష్యా మేగజైన్ ‘’Zvezda Vostaka’’కు చెందిన రెండు సంచికలు పంపింది .అందులో ‘’A wreath for  Lal Govind  Ramayya ‘’గురించి రాయబడి ఉంది .Ghen Shangin –Berezovsky తన భర్త అని కాని ,కారు లో తనను హోటల్ కు తీసుకొచ్చిన సుకలోవ్ ఈ  ఆర్టికల్స్ తాష్కెంట్ జర్నలో  ముద్రించటానికి ముఖ్య కారకుడనికాని గుప్తాకు తెలియ జేయక పోవటం ఆశ్చర్యంగా ఉంది.ఫోన్ లో గుప్తా రామయ్యగారి గురించి మరిన్ని వివరాలు అడిగితే, రామయ్య గారి అస్తికలు మాస్కో క్రేమేటోరియం చాపెల్ లో భద్రపరచబడి ఉన్నాయని మాత్రం చెప్పింది .గుప్తా కు రామయ్యగారి అస్తికల పాత్ర ను సందర్శించాలని మనసులో ఉండి లీలావతిని కూడా తనతో రమ్మని కోరగా వస్తానని చెప్పింది కాని మనసుమార్చుకొని ,రాలేదు ..మాట నిలబెట్టుకోలేక పోయింది రామయ్యగారి కన్న పెద్ద కూతురు లీలావతి

భారత్ చేరిన రామయ్య గారి పై ప్రచురిత సంచికలు –ప్రొఫైల్ రచన

1988 లో గుప్తా రష్యానుండి ఇండియా వస్తూ రామయ్యగారిపై ప్రచురింపబడిన సంచికలు తనతో ఇండియాకు తెచ్చాడు .సైన్స్ రిపోర్టర్ పత్రిక సంపాదకుడు  జి .పి .ఫోన్ డ్కే-గుప్తాను ‘’Un sung Hero of .Science ‘’ పేరుతొ  రామయ్య గారిపై  రాయమని కోరాడు .అప్పటికే గుప్తా అదే శీర్షిక తో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పై ‘’Subba Rao the Conquer of Plague ‘’ ప్రొఫైల్ రాసిఉన్నాడు  .చేతిలో రామయ్యగారి గురించిZvezda Vostoka’’ పత్రిక  ‘’వివరాలు ఉన్నాయి .అచలా జైన్ సహకారంతో గుప్తా బెరేజోవ్ స్కి  రచనను ఆంగ్లం లోకి అనువదించారు . గుప్తా  కుమారుడి మాస్కో క్లాస్ మేట్ అచల .పుష్కిన్ ఇన్ ష్టి ట్యూట్  లో గ్రాడ్యుయేషన్ చేసి ,ఢిల్లీ కి  తిరిగి వచ్చింది .రష్యన్ భాషకు ఇంటర్ ప్రీటర్ గా  ఉంటూ సోవియట్ ను దర్శించే బిజినెస్ గ్రూప్  మొదలైన డెలిగేషన్ వారికి సహాయకారిగా ఉంటోంది .రోజుకు ఒకటి లేక రెండుగంటలు గుప్తా కు సాయపడుతూ 57 సెషన్ లలో 1993 ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు పని చేసి రామయ్యగారి పుస్తకాన్ని ఆంగ్లం లో అనువాదం చేయటానికి సహకరించింది.చిత్తుప్రతిని ఢిల్లీ ‘’IIT’s ITMMEC ‘’ముఖ్యాధికారి (హెడ్)ప్రొఫెసర్ ఏ.సీతారామయ్య నిర్దుష్టంగా పరిశేలించి రామయ్య గారి కేమోటాలజి  మొదలైన విషయాలపై అనువాదం లో ప్రామాణికత ను  నిర్ధారించాడు  .

Kolachala Sitaramayya  ‘’   ‘’ జోరా పెట్రునిచేవ ‘’రష్యన్ భాషలో 1985 మార్చి –ఏప్రిల్ Asia and Africa today “’లో  రాసిన ‘సోవియట్ ఆంధ్రా ‘’ లోని విషయాలు రామయ్య గారి కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకోవటానికి గుప్తాకు సహకరించాయి .ఆసియా ఆఫ్రికా టు డే లో ప్రచురితమైన కొన్ని ఫోటోలు ,సోవియట్ లాండ్ మాస పత్రికలో వచ్చిన ఫోటోలు ‘’kolachala Sita Ramayya –Father of Chemmotology ‘’ప్రొఫైల్ రాయటానికి బాగా ఉపయోగ పడ్డాయి . అచలా తో గుప్తాకలిసి రాసిన ఈ ప్రొఫైల్  సైన్స్ రిపోర్టర్ లో 1993నవంబర్  లో ప్రచురితమైంది .విశేష స్పందన లభించింది .ఎడిటర్ డాక్టర్ ఫోన్ డ్కే  కు ఉత్సాహం రెట్టింపు అయి ‘’Achievements In Anonymity ‘’(Un sung Indian Scientists) పేరిట 12 మంది పై అత్యుత్తమ ప్రోఫైల్స్ రాయించాడు .అందులో ఒక హీరో ‘’రఫ్ రైడర్ ‘’మన సీతా  రామయ్య గారే .ఇవి బ్రహ్మాండంగా విజయవంతమైనాయి .అద్భుతమైన శీర్షిక ,అంతకన్నా అందులో అప్పటివరకు ఎవరికీ తెలియని విషయాల పొందిక ,విశ్లేషణ  విపరీతమైన క్రేజ్ ను తెచ్చి త్వరలోనే కాపీలన్నీ అమ్ముడై ఇప్పుడు ‘’అవుట్ ఆఫ్ ప్రింట్ ‘’గా ఉండిపోయాయి .

న్యు స్వతంత్ర టైమ్స్ లో పునర్ముద్రణ

‘’ ఘెన్ ‘’రాసిన దానికి చేసిన ఇంగ్లీష్ అనువాదం అలమరలలోనే ఉండిపోయింది .జన బాహుళ్యం లోకి రాలేదు .గుప్తా స్నేహితుడు వి .వామన రావు  సైన్స్ రిపోర్టర్ లో వచ్చిన ఆర్టికల్స్ 1997 ఏప్రిల్ –మే నెలలో’’ New Swatantra Times of Hyderabad ‘లో ’రి ప్రింట్ చేసిన తర్వాత  గుప్తాను కలవటానికి ఒక సారెప్పుడో వస్తే ,వాటిని చక్కగా ఎడిట్ చేసి సీరియల్ గా ప్రచురించి ఈతరం వారికి ,పాత తరం వారికీ కూడా ఆంధ్రులకు ,భారతదేశం లో ఇతర ప్రదేశాలలో ఉన్న తెలుగువారికీ తెలియ జేస్తే బాగుంటుంది అని సలహా చెప్పాడు. వామన రావు వెంటనే అంగీకరించాడు .అచల సహకారం తీసుకొని గుప్త మళ్ళీ పనిలో పడ్డాడు .ప్రతినెలా అచలా  ప్రింట్ చేయాల్సిన విషయాన్ని కంప్యూటర్ పేజీలలో పంపటం ,దాన్ని ప్రింటర్ కు పంపటం జరిగేది .కనుక ఇప్పుడు ఇంగ్లీష్ అనువాదం మొత్తం ‘’న్యు స్వంతర టైమ్స్ ‘’లో ప్రచురింపబడింది .1997నవంబర్ సంచికతో ప్రారంభమైన రామయ్యగారిపై ఈ ధారావాహిక 12 సంచికలుగా రూపు దాల్చి1998 నవంబర్ తో పూర్తయింది .

భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్య దర్శి డాక్టర్ వైద్యనాధఆయ్యర్  రామయ్య గారిపై వచ్చిన సీరియల్ ను ర చదివి మెచ్చి దాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషలలో పుస్తకం గా తీసుకు రావాలని ప్రోత్సహించాడు .మాస్కో లోని ‘’రాడుగా ‘’పబ్లిషింగ్ హౌస్ కు ఎన్నో తెలుగు అనువాదాలు చేసిన ప్రిన్సిపాల్   ఆర్. వి. రావు తెలుగులో అనువదించటానికి వెంటనే ఒప్పుకొన్నారు కూడా .

ఉయ్యూరులో సూరి శ్రీరామ మూర్తి నిర్వహించిన  రామయ్య గారి శతజయంతి

‘’న్యు స్వంతంత టైమ్స్’’ ప్రచురించిన రామయ్య సీరియల్  కొలచల వారి కుటుంబానికి  బాగా నచ్చింది .’హైదరాబాద్ లో ఉంటున్న ఉయ్యూరు  వాసి ,’హాం రేడియో’’ అధినేత సూరి శ్రీరామ మూర్తి (సూరి)భార్య కొలచలచల వారి ఆడబడుచు కావటం తో ఉత్సాహం బాగా వచ్చింది .గుప్తా సూచన ప్రకారం శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా లోని సూరి  స్వగ్రామం ఉయ్యూరు లో 1997 ఆగస్ట్ 17 నకోలాచల సీతారామయ్య గారి శత జయంతి ఉత్సవం (అసలైన జయంతి తర్వాత నెల రోజులకు )  నిర్వహించాడు .ఆనాటి పార్లమెంట్ సభ్యుడు శ్రీ దాసరి నాగ భూషణ రావు అధ్యక్షత వహించిన సభ కు విశేష సంఖ్యలో అభిమానులు వచ్చి పాల్గొన్నారు . విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్  వారి చేత రామయ్య గారి  సంక్షిప్త జీవిత చరిత్ర ను  ముద్రింప జేయిస్తానని నాగభూషణం గారు వాగ్దానం చేశారు సభలో .దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ .వి .రావు గారు సంక్షిప్త తెలుగు అనువాదమూ చేసి సిద్ధపరిచారు .కాని ఇంతవరకు ప్రచురితం కాకపోవటం ఆంధ్రులుగా మన అలసత్వానికి గొప్ప ఉదాహరణ .

డాక్టర్ రామయ్యకు ఒక  పుష్పహారం

రామయ్యగారి అల్లుడు ‘’  ఘెన్ బెరేజోవ్ స్కి’’ రష్యన్ భాషలో రామయ్యగారిపై రాసిన దానికి చక్కని శైలి తో రాజి నరసింహన్ ,అనస్తేషియా శాంఘినా బెజోవ్ స్క(రామయ్యగారి మనుమరాలు ) ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఇంగ్లీష్ అనువాదం ఇప్పుడు ‘’A wreath for Doctor Ramayya ‘’ గా ప్రచురింప బడింది .రష్యన్ ,ఇంగ్లీష్ భాషలలో ప్రతిభ ఉన్న ద్విభాషా విదుషీమణి అనస్తేషియా కోసం  ఈపుస్తకాన్ని ముద్రించ టానికి ముందు   గుప్తా ప్రయత్నించాడు .

తాతగారి మూలాల వెదుకులాటలో ‘’సీతారామయ్య గారి మనవరాలు ‘’

న్యు స్వతంత్ర టైమ్స్ లో వచ్చిన ధారావాహికలో గుప్తా తన తాతగారు రామయ్యగారి కుటుంబ మూలాలను వెదికి ,శోధించి రాసినందు వలన దాన్ని చదివి  చదివిన అనస్తేషియా తన తాతగారి  కుటుంబ మూలాలను  తెలుసుకో గలిగింది . ఆ మూలాలను , తాత గారుపుట్టిన ఊరు, బంధుగణం లను  సందర్శించి జీవితం ధన్యం చేసుకోవాలని భావించింది .గుప్తా కు మనసులోని కోరిక తెలియ జేసింది .ఆమెను  వెంట బెట్టుకొని   గుప్తా హైదరాబాద్ వచ్చాడు .ఆమెకు కొలచల ,సూరి కుటుంబా ల నుండి అపూర్వ హార్దిక స్వాగతం లభించింది .’’సీతారామయ్య గారి మనవరాలు ‘’వచ్చిందని సంబరపడ్డారు .మీడియా కూడా గొప్పగా స్పందించింది .ఆమెను చూసి తాతగారు రామయ్య గారి శాస్త్రీయ పరిశోధనను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొన్నది ఆంద్ర లోకం .1963 లో రామయ్యగారు 42 ఏళ్ళ తర్వాత 42 రోజుల పర్యటన కోసం రష్యానుండి ఉయ్యూరు రావటం గుర్తుకొచ్చింది .ఆమెను తమ అడపడుచుగా ఎంతో  అభిమానంగా ఆత్మీయం గా ఆపేక్షగా ఆహ్వానించి పసుపు కుంకుమ చీరా సారే అందజేసి పూలతో సత్కరించారు .ఆంద్ర సంప్రదాయ పద్ధతిలో అనస్తేషియా చీర జాకెట్ తో ,తలలో  పువ్వులతో చేతులనిండా గాజులతో నుదుట యెర్ర కుంకుమబొట్టు తో   ఉయ్యూరుకు రావటం అందర్నీ ఆశ్చర్య పరచింది .ఆమె యెడల అనిర్వచనీయమైన గౌరవం కలిగింది .స్వంత ఆడపదచును గౌరవించినట్లు గౌరవించింది ఉయ్యూరు గ్రామం .

ఢిల్లీ లో అనస్తేషియా గుప్తా ఇంటివద్ద ఎల్లా కాటేజ్ లో ఉంది .గుప్తా చేసిన అనువాదానికి మెరుగులు దిద్దింది తానూ రాసిన దానికి ఆమె సూచించిన విషయాలతో గొప్ప శోభ కలిగిందని సంతృప్తి చెందాడు గుప్త ..ఈ విష్యం లో రాజ్ నరసింహన్ అనస్తేశియాలకు తానూ ఎంతో   రుణ పడి ఉన్నానన్నాడు గుప్త .1963 లో చేసిన అనువాదానికి అచల సహకరించింది .ఇప్పుడు వచ్చిన పుస్తకానికి బాధ్యతా అంతా గుప్తాదే.

గుప్తా కృతజ్ఞతాభి షేకం

చికాగో యూనివర్సిటి ,కార్నెల్ యూని వర్సిటి ,అమెరికా పేటెంట్ ఆఫీస్ లకు రామయ్య గారి విషయం లో  విలువైన సమాచారాన్ని తనకు అందజేసినందుకు గుప్తా క్రుతజ్ఞతలు తెలియ జేశాడు .రామయ్యగారి కుమార్తె లీలావతి కి తాను అడిగిన ప్రశ్నలన్నిటికి ఓపికగా సమాధానాలు ఫోన్ లో చెప్పిందుకు  , ఫైల్ ఆల్బం నుండి ఫోటోలు తీసి ఇచ్చినందుకు ,రామయ్య గారి  సైంటిఫిక్ సర్వే  పై సూక్ష్మ వివరాలు ఇంగ్లీష్  అందజేసినందుకు క్రుతజ్ఞతలు చెప్పాడు గుప్తా .

1997లో ఐ .టి. ఐ.కి పి .ఆర్. వొ. గా ఉన్న ఆర్ .సుందర రాజన్ 1959 ‘’ఐటి ఐ వాణి’’సంచికలను వెతికి బయటికి తీసి అందజేసినందుకు ,సోవియట్ లాండ్ మంత్లీలో పడిన రామయ్యగారి ఫోటోల నెగటివ్ లను  బ్రోమైడ్లను  ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించాడు .గుప్తాకు ఆత్మీయ స్నేహితుడు ప్రముఖ ప్రతిభగల ఫోటో జర్నలిస్ట్  సి .నరసింహారావు లీలావతి పంపిన రామయ్యగారి ఫోటో నెగిటివ్ లను డెవలప్ చేసి ఉయ్యూరు లో ప్రదర్శన పెట్టటానికి సహకరించినందుకు కృతజ్ఞత తెలిపాడు .1959ఏ నెల 20 వ తేదీ సోవియట్ లాండ్ సంచికకోసం ఢిల్లీ  ,మద్రాస్ ,మాస్కో లలో యెంత ప్రయత్నించినా దొరకనిది ,గుల్మొహర్ పార్క్ దగ్గరుండే స్నేహితుడు సి. పి. ఐ. కార్యకర్త ఆనంద్ గుప్తా దగ్గర దొరకటం , ప్రపంచం లోనే అదొక్కటే గా ఉన్న ఆఅరుదైన , అపురూప సంచికను ను ఏంతో ఆనందంగా తన కివ్వటం తన అదృష్టం గా భావించాడు గుప్తా .భారత్ సోవియట్ సత్సంబంధాలకు అది స్పూర్తిదాయకం అంటాడు గుప్తా .

ఢిల్లీ ఐ .ఐ .టి. కి చెందిన డాక్టర్ ఏ సీతారామయ్య ,హైదరాబాద్ బి .హెచ్.ఇ .ఎల్ .కు సంబంధించిన డాక్టర్ హర ప్రసాద్ ,డేహ్రా డూన్ ఇండియన్  ఇన్ ష్టి ట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం ఉద్యోగి సుదీర్ సింఘాల్ ,ట్రైబాలజిస్ట్ ప్రముఖులు , ,ఇండియాలో  ట్రైబాలజి సొసైటీ ప్రెసిడెంట్ –డాక్టర్  ఏ.కే భట్ నగర్ ,  సెక్రెటరి వి .మార్టిన్ లు ఈగ్రందాన్ని పబ్లిష్ చేయటానికి కొంత బాధ్యత తీసుకొని గుప్తా భారాన్ని తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు . రామయ్య గారి సమీపబంధువు (నీస్)డాక్టర్ సూరి శ్రీమతి కు ,ఆమె సోదరులకు ఈ పుస్తకం ముద్రణ రూపం పొందటానికి గ్రాంట్ ను విడుదల చేసినందుకు గుప్తా కృతజ్ఞతా పూర్వక అభినందనలు చెప్పాడు .

కంప్యూటర్ ను ఉపయోగించి అచలా  స్క్రిప్ట్  లో చేసిన అనేక మార్పులను కూర్చి , అందంగా ఆకర్షణీయంగా పుస్తకం రూపు దిద్దుకోవటానికి చేసిన సహాయం మరువలేనిదన్నాడు .మొహమ్మద్ యాసిన్ ,సుమన్ కపూర్ ,నంద కిషోర్ సాపరా ,హరీష్ చతుర్వేది ,సుమీత్ సింఘాల్, మంగళం స్వామినాధన్ లు హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ లలతో చేసిన సహాయానికి కూడా కృతజ్ఞతలు ప్రకటించాడు .

ఢిల్లీ లోని పార్లమెంట్ లైబ్రరి స్టాఫ్ అందజేసిన సహకారం చిరస్మరణీయం అన్నాడు గుప్తా .’’నీలిమా వారెకర్’’ వేసిన పెయింటింగ్ ను ముఖ చిత్రంగా ఉపయోగించుకోవటానికి ఆమె అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు .ఇరవై ఏళ్ళ క్రితం గుప్తా పుస్తకానికి వేసిన పెయింటింగ్ ఇది .కాని అప్పటి ప్రింటర్ లకు ఈ పెయింటింగ్ ను ముద్రించే టెక్నాలజీ తెలియక న్యాయం చేయ లేక పోయారని గుప్తా చెప్పాడు .కార్టో లాబ్స్ వాళ్ళు శ్రమించి  నీలిమ వేసిన పెయింటింగ్ కు  గొప్ప డిజైనింగ్ చేసి ఆకర్షణీయం చేశారని చెప్పాడు .

అనస్తేషియా ,ఆమె పరివారం ఏవ్ జెని  శే,షేనిన్ ,యూరీ ఫ్రోలోవ్ ,ఒలేగ్ మావ్ లోవ్ లు   కాలిఫోర్నియా రాష్ట్రం లోని సాన్ ఫ్రాన్సిస్కో   లో ఉన్న  ‘’ఆస్టేరిక్ స్టూడియో’’ లో ఏంతో శ్రమించి ఈ పుస్తకానికి  ఇంకోక కొత్త అందమైన డిజైన్ ను రూపొందించి అందజేసినప్పటికీ దాన్ని వాడకుండా నీలిమ పెయింటింగ్ నే ముఖ చిత్రంగా వేయటానికి చెప్పలేని కారాణాలున్నాయన్నాడు గుప్తా .దీన్ని ద్వితీయ ముద్రణకు ఉపయోగిస్తానని తెలిపాడు .వారి డిజైన్ ,లే అవుట్ లు ఈ గ్రంధ ముద్రణకు గొప్ప ప్రభావం ,ప్రేరణ  కలిగించాయని ఒప్పుకొని ,అందుకు వారికి కృతజ్ఞతలను  వినయంగా గుప్తా ప్రకటించాడు .

ఇదీ ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’గారి చరిత్ర .ఇదే ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనే పేరుతోనూ ‘’,ఉయ్యూరునుండి మాస్కో దాకా ‘’శీర్షికతోను నేను రాశాను .దీనికి మూలం  రామయ్య గారి పెద్దల్లుడు ‘’ఘెన్ శాంఘిన్ –బెరేజోవ్ స్కి రష్యన్ భాషలో  రాసిన దానికి  ’’ ఎ రీత్ ఫర్ డాక్టర్ రామయ్య ‘’(రామయ్యగారికొక పుష్పహారం )అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తాలు అనువదించిన పుస్తకమే ఆధారం . మక్కీకి మక్కీకి అనువాదం కాదు .అను సరణ  అనుకోవచ్చు . అర్ధ వంతమైన శీర్షికలు పెట్టి విషయ ప్రాధాన్యంగా అందరికి తేలికగా అర్ధమయేట్లు రాశాను .దీనికి మా సరసభారతి కి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు గొప్పగా స్పందించారు చాల బాగా వస్తున్నాయి ఎపిసోడ్ లు అని అభినందించారు .సూరి శ్రీరామ మూర్తి (హాం రేడియో )ఆర్టికల్స్ చదివి గొప్ప ప్రయత్నం అన్నాడు .తెలుగులో ఇంతవరకు ఎవరూ సీతారామయ్య గారిపై ఇలా రాయలేదని మెచ్చుకొన్నాడు .అంటే ఆ అదృష్టం నాకే దక్కింది అన్నమాట .మా ఊరి వారైన శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి గురించి ఇలా 32 ఎపిసోడ్ లు రాయటం నాకు పరమానందంగా ఉంది .ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని నాకు అమెరికా నుండి పంపి నన్ను చదివింప జేసి,  ఇలా రాయటానికి కారణ భూతులైన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి శతాధిక కృతజ్ఞతలు .

రామయ్య గారి కుటుంబ ఫోటోలు జతచేశాను చూడండి –with young indian freiends 001 with wife 001 ramayya family 001 indian youth with ramayya 001 ramayya 001

సమాప్తం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-15- ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

3 Responses to ’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

  1. రామముని రమేష్ కుమార్ says:

    ఒక గొప్ప శాస్త్రవేత్త ఆంధ్రులు గూర్చిన అధ్భుత విషయాలు ఎంతో స్పూర్తిదాయకం , మా పాఠశాలలో విద్యార్థుల కు ఈ స్పూర్తిని అందజేశ్తా

  2. rasanablog says:

    sarasabhArati vaariki namakArAlu. nA pEru mandalaparti kishOr. nenu India Today mAjI sampAdakuDini. mA nAnnagAru -kIrtisEshulu MVN KapardI- kolachala sItArAmayya gAri mitrulu. neT lo vetukutunDagA Ayan pErU, sItArAmayya gAri pEru kalisi kanipinchAyi. link mI blog ki kalipindi. nEnu cUsinantalO ekkaDA mA nAnna gAri prastAvana kanipinca lEdu. I vishayam lO mIru sAyam ceyyagaligitE sahAyapaDagalaru.
    mandalaparti kishOr, hyderabad.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.