గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి
తిప్పాధ్వరి నరసంబ ల పుత్రుడు భారద్వాజ గోత్రీకుడు చొక్కా నాద కవి .అతనికి అయిదుగురు సోదరులు .అందులో యజ్నేశ్వరుడు రామభద్రకవికి గురువు .,నీలకంఠుని స్నేహితుడు .సహాజీ ఆస్థానం లో తంజావూర్ లో ఉండేవాడు .దక్షిణ కర్నాటక కు వెళ్లి రాజా బసవేశ్వరుని దర్శించాడు .ఇతను రాసిన ‘’సేవాన్తికా పరిణయం ‘’నాటకం బసవనికి సేవాన్తికకు జరిగిన వివాహ విషయమే .సేవాన్తిక మలబారు రాజు మిత్ర వర్మ కూతురే .మిత్రవర్మ కొచ్చిన్ రాజు గోదా వర్మతో యుద్ధం చేసి ఓడిపోతే ఉడిపి దగ్గరున్న మూకాంబికా దేవాలయం లో బందీగా ఉంచాడు .బసవేశ్వరుడు దయ చూపించి కొత్తభవనం కానుకలు అందజేశాడు ‘’.కాంతి మతీ పరిణయ’’నాటకం లో లో శహాజీ రాజుకు కాన్తిమతికి జరిగిన వివాహం వర్ణించాడు .ఇతని ‘’రసవిలాస భాణం’’చాలా విలక్షణమైనది .ఇతని కుమారుడు సదాశివ మఖి ‘’రామ వర్మ యశో భూషణం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .ఇది తిరువాన్కూర్ రాజు రామవర్మ పాలించిన 1758-1798కాలం లో రాశాడు .
204-రామభద్రుని శిష్యకవులు
రామభద్రుని శిష్యులలో వేంకటేశ్వరుడు పతంజలి చరిత్రకు భాష్యం రాస్తే,మరో శిష్యుడు భూమినాద అనే నల్ల దీక్షితులు షాహాజీ జీవితం పై ‘’ధర్మ విజయ చంపు ‘’రాశాడు .షాహాజీని కవి ‘’అభినవ భోజుడు’’అన్నాడు .వెంకటాద్రి మంగంబ ల కొడుకైన వెంకట కృష్ణ ఏడు కాండల ‘నటేశ విజయం ‘’కావ్యం రాశాడు .ఇతనిది వాదూలస గోత్రం .చిదంబరం లో శివుడు కాళి ని తరిమేసి ఆనంద తాండవం చేసిన కదా వస్తువు .శివాజీ రాజ్య పరగణాలలోచిదంబరం దగ్గర ఒక దాని ఏలిక అయిన గోపాలుడు ఈకవిని ఆదరించాడు .భోజుడు లక్ష్మణుడు రాసిన ఉత్తర చంపూ రామాయణానికి కొనసాగింపుగా ‘’రామ చంద్రోదయం ‘’రాసి రామాయణ కద అంతా చెప్పాడు .’’కుశలవ విజయ నాటకం ‘’కూడా రాశాడు .
205-శతకాలు రాసిన – శ్రీధర వేంకటేశకవి .
శ్రేఎధర వేంకటేశ అనే మరోకవి ‘’అయ్యవాల్ ‘’గా ప్రసిద్ధుడు .ఈయన పవిత్రతకు సదాచారానికి పేరెన్నిక గన్నవాడు .మత సంబందమై అనేక రచనలు చేశాడు వాటితో బాటు ‘’దయాశతకం ‘’మాత్రు భూత శతకం ,’’తారావళి శతకం ‘’,ఆర్తిహరస్తోత్రం ‘’కూడా రచించాడు .ఇతని ‘’సహేంద్ర విలాసం ‘’ఎనిమిది కాండల కావ్యం .ఇందులో తంజావూర్ ప్రభువు షాహాజీ జైత్రయాత్రలు దక్షిణ భారతం లో ఆయనచేసిన హైందవ ప్రచారం ఉన్నాయి .
206–కవి తార్కిక సార్వభౌమ -అప్పా దీక్షితులు లేక అప్పాశాస్త్రి లేక పెరియ అప్ప శాస్త్రి చిదంబర దీక్షితుని(అన్నన్ శాస్త్రి ) కుమారుడు .విశ్వనాధుని సోదరుడు భారద్వాజ గోత్రీకుడు .తంజావూర్ దగ్గర కిలయూర్ నివాసి .వేంకటపతి రాజాస్థానం లో కంపదేవుడిని వాదం లో ఓడించాడు .రాజు మెచ్చి బంగారు పల్లకిణి ఎరాకరన్ అనే అగ్రహారాన్ని కానుకగా ఇచ్చాడు .క్రిష్ణాన౦ దుని శిష్యుడైన ఇతను గురువునుచందశాస్త్ర ,భాషా శాస్త్రాలలో ప్రతిభ తో మెప్పించి ‘’కవి తార్కిక సార్వభౌమ ‘’బిరుదు పొందాడు .శాహాజీకి అమిత ఇష్టుడు .ఇతని ‘’శృంగార మంజరీ శాహజీయం నాటకం ‘’షాహాజీ రాజు జీవిత చరిత్ర .తిరువయ్యార్ లో దీనిని చైత్రమాసఉత్సవాలలో లో ప్రదర్శిం చారు .’’మదన భూషణ భాణం’’గౌరీ మయూర చంపు ‘’ఇతర రచనలు .
అద్భుత దర్పణం అనే పది అంకాల నాటకం లో కృష్ణ సూరి కొడుకు మహాదేవుడు రామాయణ కధలో అద్భుత రసాన్ని బాగా పండించాడని తెలిపాడు .
షాహాజీ శరభోజీల ఆస్థానం లో ఎందరో ప్రసిద్ద్ధ కవులున్నారు సుమతీంద్ర భిక్షు షాహాజీ ఆస్థాన కవి .యితడు వెంకట నారాయణ సుదీన్డ్రుల శిష్యుడు ‘’సుమతీంద్ర జయ ఘోషణం ‘’ను రాజుపై రచించాడు. త్రివిక్రమకవి ‘’ఉషా హరణం ‘’పై వ్యాఖ్య రాశాడు .’’షాహ విలాసం ‘’అనే సంగీత రూపకం ‘’అభినవ కాదంబరి ‘’కూడా రాశాడు .ముద్రారాక్షస నాటకం పై గొప్ప వ్యాఖ్యానాన్ని దుండిరాజ వ్యాస యజ్వ రాశాడు ఇతడు .కవిలక్ష్మణుని కుమారుడు .దీన్ని శరభోజి ప్రేరణ తో రాశాడు .జగన్నాధ కవి ‘’జనన విలాసం’’ అనే ఎనిమిది కాండల కావవ్యాన్ని భద్రపరచాడు .జగన్నాధ కవి నారాయణ ,అక్కా దేవి లకుమారుడు .ఇతడే’’ శరభ రాజ విలాసం ‘’ కర్త కూడా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-15 ఉయ్యూరు
–
,

