ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70
30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -2
షా లోని నాటక కర్త 1892 వరకు బయటపడలేదు .కానీ 18 8 5 లో 29 ఏళ్ల వయసులో విలియం ఆర్చర్ అనే తోటి విమర్శకుడు, స్నేహితునితో కలసి పారిషియన్ విధానంలో ఒక మంచి నాటకం రాసాడు. అది వినోద ప్రధానమైనదిగా ఉంది. అది సాంఘిక ప్రచారంగా సాంఘిక సంస్కరణగా భావించాడు. ఆర్చర్ తప్పుకున్నాడు. షా తనలోని భావాన్ని ఆపుకోలేదు. ఏడేళ్ళ తర్వాత అదే “Widows Houses”గా వచ్చింది. ‘’Plays Unpleasant ‘’అనే శీర్షికలో వచ్చిన మొదటి నాటకం ఇది. ఇందులో హాస్యం, వివాదం ఉన్నాయి. ఒక కొత్త రకపు విదూషకుని జీతానికి కుదుర్చుకుని అతనితో సాంఘిక విషయాలపై చర్చించేవాడు. ‘’విడోస్ హౌసెస్ ‘’నాటకం మధ్య తరగతి గౌరవాన్ని మురికివాడల వారి బీదతనాన్ని బహిర్గతం చేసింది. తెర దించేసిన తర్వాత నాటకంలోని పాత్రలు ప్రేక్షకులకు గుర్తుఉండిపోవాలని షా భావించాడు. ఒకే రకపు ప్రేక్షకులు౦ టారని అనుకోలేదు. ప్రతి మనిషి అతడు వెధవ అయినా మహర్షి అయినా ఒక దృక్పథం కలిగి ఉంటాడని అదే అతని తీరును సమర్తిస్తుందని ఇతరులకు కూడా అలాంటి అభిప్రాయలు ఉంటాయని నమ్మాడు. పుండాకోర్ కూడా అతని దృష్టిలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సంఘం ఈ పుండాకోర్ తనాన్ని అతను తనను తాను తెలుసుకునేదాకా పెకలిచలేదు. ఈ పనే సంఘానికి షా చేయాలనుకున్నాడు. ఈ పు౦డాకోర్లను అభిశంసించటం కాని పుండాకోర్లు కానివారిని పోగట టం వల్ల కాని మార్పు రాదు. వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు, చరిస్తూ ఉంటారు, తమను తాము గొప్పవారుగా చాటుకుంటారు.
విడోస్ హౌసెస్ నాటకం రాసిన మూడేళ్ళకు ఆరు విభిన్నమైన నాటకాలు షా రాసాడు. అందులో రెండు అసహ్యకరమైన నాటకాలు. ది ఫైలాండరర్స్ గొప్ప సటైర్ తో కూడిన నాటకం. “మిసెస్ వారెన్స్ ప్రొఫెషన్” నాటకం వ్యభిచారాన్ని వాణిజ్యపరం చేసింది. అది బూర్జువా సొసైటీ వాణిగా సాంఘిక నేరంగా దానికి సంఘం మొత్తం భాగస్వామ్యం అయ్యిందని నిరూపించాడు. ఇందులోని విషయం విక్టోరియన్ ఇంగ్లాండ్ భావాలకు విరుద్ధమైనవి. దీనికి పరిణామాలు తీవ్రం. ప్యూరిటన్ ధర్మంపై వ్యతిరేకమైనదని దీనిని ప్రదర్శన ఆపేయించారు . తర్వాత నిషేధించారు. అమెరికాలో కూడా నిషేధించబడింది. తర్వాత వచ్చిన నాలుగు నాటకాలు Arms and the Man, Candida, The man of destiny, You never can tell లు షా రాసిన గొప్ప ఆహ్లాదకరమైన ప్రసిద్ధి చెందిన కామెడీలు. ‘’మాన్ అండ్ సూపర్ మాన్ ‘’ లో స్త్రీ పురుషుల సెక్స్ విషయాన్ని చాలా మేదావంతంగా చిత్రీకరించాడు. ఈ ఏడు నాటకాలు ఒక సంపుటిగా వెలువడిన తర్వాత వీటిని అసంబద్ధమైన బాధ్యతా రాహిత్యంతోకూడిన విరక్త ఆడంబరంగా భావించారు. అమెరికా సమీక్షకులు అభ్యన్తకరమైనా భాషా నాటకాలుగా ముద్ర వేసారు. 1898 జూన్ 18 నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రిక షా యొక్క పనికిమాలిన ఫిలాసఫీ సొంత డబ్బా లపై విరుచుకుపడింది. ఈ సోషలిస్టును ‘’జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ‘’అని ముద్ర వేసింది. తన దృష్టి కోణాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని షా బాధపడ్డాడు. షాకు ఉన్న ఒకే లోపం కవిత్వ భాష తెలియకపోవటం. టైమ్స్ పత్రిక అతని అభిప్రాయాలను రచనలను చీదరించుకుని ఫోటో వేయటానికి కూడా నిరాకరించింది. ఈ రకమైన విమర్శలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. మరొక ఇరవై ఏళ్ల దాకా ఈ దాడి కొనసాగింది. విరుద్ధభావాల వ్యక్తిగా అతన్ని భావించారు. విన్ స్టన్ చర్చిల్ ‘’చాటర్ బాక్స్ ఆఫ్ సోషలిజం ‘’అన్నాడు. మైకేల్ ఆండర్సన్ “Shah is a ready philosopher but no dramatist. His characters are exaggerations his situations farcical “అన్నాడు. రెండేళ్ళ తర్వాత షా రాసిన’’ బ్యాక్ టు మేతుసేల్లా’’ నాటకంపై గిల్బర్ట్ సేల్డర్స్ సమీక్షిస్తూ షా ఒక కళాకారుడు కాదు కనక అతని సృజన బతకదు అని తేల్చి చెప్పాడు. వీటన్నిటికీ కారణం షా కు ఉన్న తీవ్ర స్వభావం, తన గురించి విరుద్ధ నిర్ణయాలు. తన రచనలకు తాను సిగ్గుపడటం లేదని ,రాసిన విధానం గురించి కూడా చింతించటం లేదని షా చెప్పేవాడు. తన రచనల బాగోగులను మెజారిటీ ప్రజలు చెప్పాలి కాని ఒకరిద్దరు విమర్శకులు కాదని అనే వాడు. తాను డ్రైడేన్ లాగా ఉపోద్ఘాతాలు రాసేవాడినని వాగ్నర్ లాగా గ్రంథాలు రాసానని ఇవన్నీ చేయగలసమర్దుడినని చెబుతూ “I would give half a dozen of Shakespeare’s plays for one of the preface he ought to have written” అని రాసుకున్నాడు. ‘’ఏన్శేంట్ మారినర్’’ లాగా తాను గుర్తుండి పోతానని తన కథను తాను వినోదాత్మకంగా చెప్పుకుంటూ పోతానని ఇతరులు తప్పు చేస్తుంటే తాను సరైన పద్ధతిలో నడవడం తన ప్రత్యేకత అని చెప్పుకున్నాడు. “Nobody likes me. Capable persons are never liked. I am not likeable but I am indispensible”అని గర్వంగా ప్రకటించుకున్నాడు. స్వంత డబ్బా కొట్టుకోడంపై షా స్పందిస్తూ “The spontaneous recognition of really original work begins with a mere handful of people and propagates itself so slowly that it has become a common place to say that genius demanding bread is a given a stone until after its possessor’s death. The remedy for this is sedulous advertisement. “అందుకనే తను గురించి తాను గొప్పలు చెప్పుకోవలసి వస్తుందని తానింకా మధ్య వయసులోనే ఉన్నానని తాను’’ ఫ్లయింగ్ డచ్ మాన్’’ లాగా ఒక లెజెండ్ నని దర్పంగా తెలియపరచాడు. తన నాటకాలలోని విదూషకునిలాగా అప్పుడప్పుడు బయటపడేవాడు. తాను సత్యాన్ని తెలియపరచటానికే ‘జోకుతూ’ ఉంటానని అన్నాడు. “The truth is the one thing that nobody will believe “అని ఘాటుగా చెప్పాడు. కనక తనను జనం వినాలంటే కొన్ని పిచ్చి ప్రవర్తనలు తప్పవని అన్నాడు. ఈ ఇబ్బందులన్నీ సరైన విషయాన్ని తెలియచేయటం దానిని అత్యంత ఉన్నత స్థాయిలో చెప్పటం తన లక్ష్యం అన్నాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15 –ఉయ్యూరు

