జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్
జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై
యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని టోక్యో లో పెయింటర్ ,కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన తండ్రికి జన్మించింది.బాల్యం లో నే ఆమె తలిదండ్రులు విడాకులు పొందితే తండ్రే సర్వస్వం అయి పెంచాడు . తండ్రికున్న నాటక రంగ అనుభవానికి ప్రేరణ చెంది కూతురు నాగై కూడా అందులో తన ప్రతిభను చూపించాలనుకోన్నది .ఆమె అమ్మమ్మా తాతయ్యలు కూడా ప్రోత్సహించారు .అమ్మమ్మకున్న నాటక రంగానుభావాలను నాగై తరువాత రాసింది .
హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హైయూజా దియేటర్ కంపెనీ లో సభ్యురాలైంది .అక్కడ ప్రదర్శించే నాటకాలన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది .తోహో గాకేన్ కాలేజి లో దియేటర్ డిపార్ట్ మెంట్ లో చేరి నాలుగేళ్ళు చదివి డ్రామా ప్రోగ్రాం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది .ఇక్కడే ఎందరో నటులు శిక్షణ ఒంది రాటు దేలేవారు .ఈ దియేటర్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం ఆరాధనా ఏర్పడటానికి కారణం ప్రముఖ నటి హేత్సుకో హేచిహార అందులో మెంబర్ గా ఉండటమే .ఆమె ప్రభావం నాగై పై బాగా పడింది .ఆ రోజుల్లో ‘’అంగూరా’’అనే అండర్ గ్రౌండ్ దియేటర్లు ఉండేవి నాగై అందులో కూడా పని చేసింది .1974లో గ్రాడ్యుయేషన్ అయినతర్వాత దియేటర్ కంపెనీ యాజమాన్యం ఆహ్వానం తో అందులో చేరింది .
అందులో పనిచేస్తుండగా శిజుకా ఒషిమ తో పరిచయమేర్పడింది .దురద్రుస్టవశాత్తు రెండేళ్ళ తర్వాతా కంపెనీ మూసేశారు .ఒషీ తో కలిసి నాటకాలు రాసి ప్రదర్శించాలనుకోన్నది .
1981లో’’నితోషా ‘’అనే నాటక కంపెనీని ఇద్దరు ఏర్పాటు చేశారు .కంపెనీ కి ఆ పేరు పెట్టటానికి కారణం ఆ ఇద్దరు రాబిట్ నామ సంవత్సరం లోనే పుట్టారు ‘’నితోషా ‘’అంటే రెండు రాబిట్లు (కుందేళ్ళు ).నితోషా లో పనిచేస్తూ నాటకాలు రాశారిద్దరూ .త్వరలోనే వారి నాటకాలకు విశేషమైన ఆదరణ లభించింది .ఓషి నాగై నివదిలేసి టి వి కంపెనీలో చేరింది .తప్పని సరి పరిస్తితులలో నాగై స్వంత నాటకాలకు దర్శకత్వం చేసి మెప్పించింది .నితోషా దియేటర్ టోక్యో లో నేరిమా అనే చోట ఇంకా నడుస్తోంది .ప్రేక్షకుల కు కూడా నాటకం లో చోటుకల్పిస్తూ ప్రయోగాలు చ్సింది .
ఇప్పటికీ నాగై నితోషా తరఫున నాటకాలు రాస్తూ ,ప్రదర్శిస్తూ దర్శకత్వం వహిస్తూ ప్రజాభిమానాలను పొందుతోంది .న్యు నేషనల్ దియేటర్ వంటి సంస్థలకు కూడా నాగై నాటకాలు రాసింది .ఆమె కీర్తి బాగా వ్యాపించి ‘’జపాన్ నాటక రచయితల సంఘం ‘’కు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడి గొప్ప గౌరవం పొందింది .జాపాన్ లో మాత్రమే కాక అమెరికా కెనడా ,దక్షిణ కొరియా మొదలైన దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చి విశ్వవ్యాప్త కీర్తి నార్జించింది నాగై .2010ఫిబ్రవరిఇరవై రెండు న న్యూయార్క్ లోని జపాన్ సొసైటీ వారు నాగై రాసిన ’’వుమెన్ ఇన్ హోలీ మెస్ మొదలైన నాటకాలకు ఆంగ్లాను వాదాలను ‘’, ‘’స్టేజి రీడింగ్ ‘’ఏర్పాటు చేసి అరుదైన గౌరవం కలిపించారు.
‘’జపాన్ యుద్ధానంతర జీవితం ‘’పై ట్రయాలజి ‘’రాసి అందులో జపనీయులు అనుభవించిన కస్టాలు నవీన జపాన్ నిర్మాణం లో పోషించిన చిరస్మరణీయమైన పాత్రను తెలియ జేసింది .ఈ ట్రయలజీ లో లో మూడు నాటకాలు ‘’టైమ్స్ స్టోర్ స్టార్మ్’’’’టోకినో మోనో ఒకి ‘’ డాడీస్ డెమోక్రసీ ‘’ఉన్నాయి .వీఎతిలో రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం ,ఆ తర్వాతా జపాన్ పునర్వైభవం సాధించిన విదానం ఉంటాయి .లీగల్ ప్రాష్టి ట్యూ షన్ ‘’కు వ్యతిరేకం గా చట్టం తేవాలని ఉద్యమించింది నాగై .
చెకోవ్ రాసిన త్రీ సిస్టర్స్ ఆధారంగా నాగై దిత్రీ హాగి సిస్టర్స్ ‘’రాసింది ఏది చేసినా రాసినా దేశభక్తి ప్రబోధకంగా ఉండేది.ముందే చెప్పుకోన్నట్లు ఆమె రచనలలో వాస్తవికత ప్రతిఫలిస్తుంది .దాదాపు ఎనిమిది జాతీయ అవార్డులను అందుకొన్నది నాగై .ఆమె సంస్థ ‘’నితోషా ‘’కు మరిన్ని బహుమతులు వచ్చాయి .దాదాపు ఇరవై నాటకాలు రాసి ,ప్రదర్శించి దర్శకత్వం వహించి జపాన్ నాటకరంగానికి విశిష్ట సేవలు అంద జేస్తోంది ఆయ్ నాగై .
-గబ్బిటదుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

